ఈ పెళ్లి క్యాన్సిల్ అంతే ... | Kanpur bride finds groom in drunken state, calls off the wedding | Sakshi
Sakshi News home page

ఈ పెళ్లి క్యాన్సిల్ అంతే ...

Dec 17 2015 1:32 PM | Updated on Sep 3 2017 2:09 PM

ఈ పెళ్లి క్యాన్సిల్ అంతే ...

ఈ పెళ్లి క్యాన్సిల్ అంతే ...

మరికాసేపట్లో పెళ్లి... ఇంతలో స్నేహితులతో కలసి పీకల్దాకా మందుకొట్టాడు.

లక్నో : మరికాసేపట్లో పెళ్లి... ఇంతలో స్నేహితులతో కలసి పీకల్దాకా మందుకొట్టాడు. ఇంతలో పెళ్లి ఉంది కదూ అంటూ ఎలాగోలా వివాహ వేడుక వద్దకు చేరుకుని... మండపంలో పెళ్లి పీటలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. కానీ వరుడు అడుగు తడబడుతుంది... పీటల వద్ద తూలాడు. అక్కడే ఉన్న స్నేహితులు సాయం చేసి... పీటల మీదకు వరుడిని కూర్చోబెట్టారు. అప్పటికే పీటల మీద ఉన్న వధువు సజేతికి కాబోయే వాడు 'మందుబాబు' అని అర్థమైంది. అంతే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నాకీ పెళ్లి వద్దని తేల్చి చెప్పేసింది. ఇంతలో అక్కడే ఉన్న వరుడి తల్లిదండ్రులు ఆ నవవధువుకు నచ్చజెప్పేందుకు యత్నించారు.

ఇలాంటి తాగుబోతుతో తాళీ కట్టించుకోనని సజేతీ తేల్చి చెప్పింది. ఎలాగైనా తమ కుమారుడిని వివాహం చేసుకోవాల్సిందే అని వరుడి తల్లిదండ్రులు పట్టుపట్టారు. దీంతో ఈ పంచాయితీ కాస్తా పోలీసుల వద్దకు చేరింది. ఇరు పక్షాల వారిని కూర్చోబెట్టి వధువుకు నచ్చ జెప్పెందుకు వారు ప్రయత్నించారు. కానీ వధువు మాత్రం పెళ్లి చేసుకోనంటే చేసుకోనని మొండికేసి కూర్చుంది. దాంతో సజాతీ మొండితనానికి పోలీసులు దిగిరాక తప్పలేదు. వరుడి తల్లిదండ్రులకు ఎలాగోలా నచ్చజెప్పి... ఎటువంటి ఘర్షణలు...కేసులు లేకుండా ఇరు పక్షాల వారిని పోలీసులు పంపించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ కాన్పూరులోని హమీర్పూర్ రోడ్డు సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement