breaking news
kambalakonda
-
కూటమి ప్రభుత్వంపై బొలిశెట్టి ఫైర్
విశాఖపట్నం: ఏపీలో కూటమి ప్రభుత్వ విధానాలు తిరుగుబాటుకి దారి తీసేలా ఉన్నాయని జనసేన పార్టీ మాజీ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విశాఖలో ప్రకృతి విధ్వంసం చేస్తోందని విమర్శించారు. విశాఖలో జరిగే ప్రకృతి విధ్వంసంపై పోరాటం జరగబోతుందని తెలిపారు. రుషికొండ విషయంలో మాట్లాడిన వారే ఇప్పుడు తప్పులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుషికొండ విషయంలో మాట్లాడిన పెద్దలు ఇప్పుడు కూడా మాట్లాడాలని డిమాండ్ చేశారు.పర్వత ప్రాంతాల్లో డేటా సెంటర్ నిర్మాణం చెయ్యడానికి వీల్లేదని, పర్యావరణ చట్టం ప్రకారం 10 కిలోమీటర్ల దూరం ఉండాలని తెలిపారు. ప్రభుత్వం డేటా సెంటర్లకు కేటాయించిన భూములు కంబాల కొండ అడవులకు దగ్గరలో ఉన్నాయన్నారు. డేటా సెంటర్ నిర్మాణం కోసం సింహాచలం, తర్లువాడ కొండలను తవ్వెస్తున్నారని వాపోయారు. దేశంలో ఉన్న పర్యావరణ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా శంకుస్థాపన ఎలా చేశారని ప్రశ్నించారు. డేటా సెంటర్లు విధ్వంసానికి పాల్పడితే ప్రాణం ఉన్నంతవరకు పోరాటం చేస్తానని బొలిశెట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు.డేటా సెంటర్లపై ప్రజల్లో వ్యతిరేకతఅమెరికాలో డేటా సెంటర్లపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని ఎక్స్‌లో పేర్కొన్నారు. డేటా సెంటర్లకు అనుమతి నిలిపివేస్తూ టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ కీలక నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.''టెక్సాస్‌లో డేటా సెంటర్ల నిర్మాణంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో, గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ సోమవారం రాష్ట్ర విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం కోరుతున్న ప్రతిపాదిత డేటా సెంటర్లపై నియంత్రణ సంస్థలు ఆడిట్ పూర్తిచేసే వరకు వాటి అనుమతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆదేశం ప్రకారం, పబ్లిక్ యుటిలిటీ కమిషన్ ఆఫ్ టెక్సాస్ మరియు ఎలక్ట్రిక్ రిలయబిలిటీ కౌన్సిల్ ఆఫ్ టెక్సాస్ (ERCOT) డేటా సెంటర్లపై సమగ్ర తనిఖీ చేయాలి.ఆడిట్లో డెవలపర్లు పొందే పన్ను రాయితీలు, విద్యుత్ వినియోగం, విద్యుత్ ఉత్పత్తి, నీటి వినియోగం, కూలింగ్ విధానాలు, స్థానిక సమాజాలపై ప్రభావాన్ని చర్యలు, అలాగే ఆ సౌకర్యం యాజమాన్యం వంటి విషయాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఆడిట్లో అవసరమైన ప్రమాణాలు తీరని ఏ ప్రాజెక్టునైనా టెక్సాస్ గ్రిడ్‌కు అనుసంధానం చేయకూడదని అబ్బాట్ చెప్పార''ని బొలిశెట్టి సత్యనారాయణ (Bolisetty Satyanarayana) ఎక్స్‌లో పోస్ట్ చేశారు. చదవండి: చంద్రబాబుఉత్తరాంధ్ర జపం అంతా ఉత్తదే -
కంబాలకొండలో ప్రపంచబ్యాంక్ బృందం
ఆరిలోవ: నగరంలో ఎకో టూరిజం పార్కు కొంబాలకొండలో ప్రపంచబ్యాంక్ బందం గురువారం సాయంత్రం పర్యటించింది. కంబాలకొండ పార్కు అభివద్ధిపై అటవీశాఖ అధికారులు నగరంలో నవోటల్ హోటల్లో ఉదయం నిర్వహించిన సదస్సు అనంతరం సాయంత్రం ఈ బందంతో పాటు ఏయూ పర్యావరణ విభాగం అధ్యాపకులు, పలువురు పర్యావరణ శాస్త్రవేత్తలు కలసి సుమారు 60 మంది ప్రతినిధులు ఇక్కడ క్షేత్ర పర్యటనకు వచ్చారు. నేరుగా ఇక్కడ పరిస్థితిని గమనించారు. విశాలమైన పార్కులు, పచ్చదనం, వక్షాలు, కొలను, ఇక్కడ అందాలు తదితర వాటిని పరిశీలించారు. వాటి గురించి ఇక్కడ అధికారులు ఆయా ప్రతినిధులకు వివరించారు. ఈ ప్రాంతంలో ఎలాంటి వక్షాలు, మొక్కలు, ఔషదాలు, దీని విస్తీర్ణం తదితర వాటి గురించి వివరించారు.


