breaking news
Kamareddy Register Office
-
ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు
సాక్షి, కామారెడ్డి రూరల్: డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో ప్రజలను మభ్య పెట్టి ఓట్లు దండుకున్న టీఆర్ఎస్ నాయకులు ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీ అన్నారు. బుధవారం మండలంలోని అడ్లూర్ జీపీ పరిధిలోని డ్రైవర్స్, గుమాస్తా, బీడీ వర్కర్స్ కాలనీ, రామేశ్వర్‌పల్లిల్లో ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామాల ప్రజలు షబ్బీర్అలీకి బోనాలు, డప్పువాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. జెడ్పీటీసీ నిమ్మమోహన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పెరుమండ్ల రాములు, ఎంపీటీసీ నిమ్మ విజయ్‌కుమార్‌రెడ్డి, ఎంజీ వేణుగోపాల్‌గౌడ్, భూమని బాల్‌రాజు, మర్కంటి శంకర్, ఉరుదొండ నరేష్, గరిగె పద్మ నర్సాగౌడ్, సమద్, రవిపాటిల్, సుంకరి శ్రీనివాస్, బాలకిషన్, చింతల శ్రీనివాస్ పాల్గొన్నారు. టేకేదార్ల సమస్యలను పరిష్కరిస్తాం కామారెడ్డి : టీఆర్ఎస్ పాలనలో ప్రశ్నించే హక్కును ప్రభుత్వం, ఎమ్మెల్యేలు కాలరాశారని కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్హాల్లో బుధవారం నియోజకవర్గానికి చెందిన టేకేదార్లు కాంగ్రెస్‌లో చేరారు. షబ్బీర్‌అలీ మాట్లాడుతూ టేకేదార్ల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వంలో తీరనున్నాయన్నారు. వారి సమస్యలను మేనిఫెస్టోలో పెట్టామన్నారు. ఈసారి గెలిస్తే ఉన్నత పదవిలో ఉండడంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. కాంగ్రెస్‌లో చేరిన 13వ వార్డు యువకులు కామారెడ్డి టౌన్: పట్టణంలోని 13వ వార్డుకు చెందిన యువకులు బుధవారం కాంగ్రెస్ నాయకుడు రవీందర్‌గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ షబ్బీర్ అలీ యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే యూసూఫ్ అలీ, కౌన్సిలర్ నిమ్మ దామోదర్‌రెడ్డి, కారంగుల అశోక్‌రెడ్డి, నర్సింలు ఉన్నారు. కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం రాజంపేట: మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటా ప్రచారం చేశారు. షబ్బీర్‌అలీని గెలిపించాలని కోరుతూ కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో మోసపూరిత వాగ్దానాలతో కాలం వెళ్లదీసిందని, బూటకపు మాటలతో ప్రజలను మోసం చేసిన పార్టీకి తమ ఓటుతో గుణపాఠం చెప్పాలని కోరారు. పెద్దపల్లి వీరన్న, ఇంతియాజ్‌అలీ, అక్బర్, భీమయ్య, గంగయ్య పాల్గొన్నారు. -
ఉల్టాపల్టా.. తిరగబడిన ‘రియల్’ దందా
కామారెడ్డి, న్యూస్‌లైన్: రియల్ దందా తిరోగమనంలో నడుస్తోంది. కొనుగోళ్లు, అమ్మకాలు మందగించడంతో రిజిస్ట్రేషన్లు సగానికి సగం తగ్గిపోయాయి. ఇదే సమయంలో ప్రభుత్వాదాయం గణనీయంగా పడిపోతోంది. మూడు జిల్లాల కూడలి అయిన కామారెడ్డి పట్టణంలో గత మూడు, నాలుగేళ్లలో వందల కోట్ల రూపాయల విలువ చేసే భూముల క్రయవిక్రయాలు జరి గాయి. గత ఏడాదీ రియల్ దందా బాగానే సాగింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి భూముల విలువలు పెరుగుతాయని, రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా అదే స్థాయిలో ఉంటాయని ప్రభుత్వం ముందుగానే ప్రకటించడంతో పెద్ద ఎత్తున క్రయవిక్రయాలు జరిగాయి. తరువాత తగ్గుతూ వచ్చి రెం డు, మూడు నెలలుగా సగానికి సగం పడిపోయాయి. దీంతో రియల్ వ్యాపారంలో స్తబ్ధత ఏర్పడింది. కామారెడ్డిలో రిజిస్ట్రేషన్లు, ఆదాయం ఇలా కామారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ ఏడాది జనవరిలో 808 రిజిస్ట్రేషన్లు జరుగగా రూ. 75.22 లక్షల ఆదాయం సమకూరింది. ఫిబ్రవరిలో 839 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 91.30 లక్షలు, మార్చిలో 1276 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1.92 కోట్ల ఆదాయం వచ్చింది. ఏప్రిల్‌లో 674 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 82.65 లక్షలు, మే నెలలో 732 రిజిస్ట్రేషన్లకుగాను రూ. 82. 43 లక్ష లు, జూన్‌లో 665 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 76.83 లక్షలు, జూలైలో 527 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 70.33 లక్షలు, ఆగస్టు లో 442 రిజిస్ట్రే షన్ల ద్వారా రూ. 57.22 లక్షలు, సెప్టెంబర్‌లో 579 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 94.64 లక్షలు, అక్టోబర్‌లో 587 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 71.51 లక్షలు, నవంబర్నెలలో ఇ ప్ప టి దాకా 421 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 53.57 లక్షల ఆదాయం సమకూరింది. దీనిని బట్టి ఇక్కడ రియల్ వ్యాపారం ఎంతగా దెబ్బతిన్నదో అర్థం చేసుకోవచ్చు. అప్పులపాలైన వ్యాపారులు రియల్ దందాలో పెట్టుబడులు పెట్టిన వ్యాపారులు పరిస్థితులు తారుమారు కావడంతో ఆందోళనకు గురవుతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగి ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. గతంలో డబ్బులు సంపాదించిన వారు సర్దుకుపోగా, కొత్తగా వ్యాపారంలో ప్రవేశించిన వారు అప్పులు కట్టే పరిస్థితులు లేక తల్లడిల్లిపోతున్నారు. అడ్డ గోలు వడ్డీల కారణంగా తమ ఆస్తు లు అమ్ముకున్నా అప్పులు తీరేలా కనిపించడం లేదని కొం దరు ఆందోళన చెందుతున్నారు. ఫైనాన్సుల్లో ఖాళీ ఖజానా కామారెడ్డిలో కోట్ల రూపాయలు టర్నోవర్ చేసే ఫైనాన్సుల్లో సైతం ప్రస్తుతం డబ్బులు లేదని అంటున్నారు. చాలా మంది ఫైనాన్సుల నుంచి అప్పులు తీసుకుని భూములపై పెట్టుబడు లు పెట్టడం, అవి రికవరీ కాకపోవడంతో ఫైనాన్సుల్లో డబ్బు లు రికవరీ కావడం లేదని తెలుస్తోంది. కొన్ని ఫైనాన్సుల యజమానులు సైతం భూములపై పెట్టుబడులు పెట్టి ఇప్పు డు లబోదిబోమంటున్నారు. అత్యాశకు పోయి బోల్తాపడ్డామని ఓ ఫైనాన్స్ వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు. రియల్ బూమ్ తిరిగి ఎప్పుడు వస్తుందో, తమ పెట్టుబడులు ఎప్పు డు రికవరీ అవుతాయోనని చాలా మంది వ్యాపారులు ఆందోళనలో ఉన్నారు.


