breaking news
Kalyani Khani Open Cast
-
కేకే ఓపెన్‌కాస్ట్‌లో భారీగా కుంగిన నేల
సాక్షి, మంచిర్యాల: మందమర్రిలోని కల్యాణిఖని(కేకే) ఓపెన్‌కాస్ట్‌లో గురువారం నెల భారీగా కుంగిది. గతంలో ఈ ప్రాంతంలోనే ఉన్న కేకే-1 భూగర్భ గని మూతపడింది. భూగర్భ గనిని మూసివేసే సమయంలో భూమిలోనికి తవ్విన లోతైన గుంతలను ఇసుకతో నింపారు. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వహించడంతో.. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నెల భారీగా కుంగిపోయి, దెబ్బతింది. ఫలితంగా కల్యాణిఖని (కేకే) ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. -
సింగరేణికి షాక్
కేకే ఓసీ నిర్మాణంపై హైకోర్టు స్టే ఫలించిన ఎర్రగుంటపల్లి వాసుల పోరాటం హెచ్చరికలను పట్టించుకోని యాజమాన్యం పునరాలోచనలో అధికారులు మంచిర్యాల సిటీ (ఆదిలాబాద్) : బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని మందమర్రి ఏరియాలో సింగరేణి యాజమాన్యం నూతనంగా నిర్మించనున్న కేకే ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు నిర్మాణంపై సోమవారం రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో యాజమాన్యానికి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పవచ్చు. 2013 నుంచి కేకే ఓసీ సమీపంలోని మందమర్రి మునిసిపాలిటీ పరిధిలోని ఎర్రగుంటపల్లి వాసులు యాజమాన్యం నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టిన పోరాటం ఫలించింది. తెలంగాణ విద్యావంతుల వేదికతో పాటు ఇతర ప్రజా సంఘాలు సైతం దీనికి మద్దతుగా నిలిచారుు. అయితే ఓసీ ఏర్పాటు వద్దంటూ పలువురు హైకోర్టుకు వెళ్లడంతో సోమవారం కోర్టు స్టే ఇస్తూ తీర్పు ఇచ్చింది. స్టే వివరాలు బుధవారం అందే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురిజాల రవీందర్రావు తెలిపారు. సంస్థకు వ్యతిరేకంగా స్టే రావడంతో యాజమాన్యం పునరాలోచనలో పడింది. ఫలించిన పోరాటాలు.. కేకే ఓసీ సమీపంలో ఎర్రగుంటపల్లి వాసులు కొన్నేళ్లుగా నివసిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మా ణం పూర్తరుుతే ఆ పల్లె కనుమరుగు కాకతప్పదు. అంతే కాకుండా వారికి జీవనాధారంగా ఉన్న పచ్చని పొలాలు, పాడి సంపద నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో వారు యాజమాన్యానికి వ్యతిరేకంగా తెలం గాణ విద్యావంతుల వేదిక, ప్రజా సంఘా లు, కాంగ్రెస్, టీడీపీ అండతో దీర్ఘకాలిక పో రాటాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు వారి పోరాటానికి ఫలితం దక్కింది. పునరాలోచనలో యాజమాన్యం.. ఎర్రగుంటపల్లి సమీపంలోనే కేకే-2 భూగర్భ గని జీవిత కాలం ముగిసింది. ఆ గని ఉత్పత్తి తో ఇప్పటికే గ్రామస్తులు నష్టపోయారు. గని నిర్మాణ సమయంలో ఊరు మందమర్రి వాసులకు నష్టపరిహారం ఇవ్వడంలో యాజమాన్యం ఇబ్బందులకు గురిచేసింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని గమనిం చిన ఎర్రగుంటపల్లి వాసులు చేసిన పోరాటానికి సింగరేణి పునరాలోచనలో పడింది. భవిష్యత్‌పై ఆలోచన.. కేకే ఓసీ ఏర్పాటుపై హైకోర్టు స్టే ఇవ్వడంతో సింగరేణి యాజమాన్యం భవిష్యత్‌పై ఆలోచన చేయక తప్పడంలేదు. నలభై ఏళ్లుగా నాలుగు జిల్లాల్లో ఓపెకాస్ట్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగినప్పటికీ కోర్టు వరకు వెళ్లిన సంఘటనలు లేవు. విభజించు, పాలించు అనే సిద్ధాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ సింగరేణి యాజమాన్యం యథేచ్ఛగా ఓసీలను ప్రారంభించింది. అయితే కేకే ఓసీ విషయంలో కోర్టు స్టే రావడంతో భవిష్యత్‌లోనూ ఇలాంటి పరిస్థితులు రావొచ్చనే ఆలోచనలో పడింది. ఒంటెత్తు పోకడలకు ఫలితం.. కేకే ఓసీ ఏర్పాటు చేసి ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఉత్పత్తి చేపట్టి తీరాలనే పట్టుదలతో సింగరేణి సంస్థ నిధులు వెచ్చించింది. దీంతో నిర్మాణ పనులు వేగవంతమయ్యారుు. ఉత్పత్తి తీసి ఖర్చులు తగ్గించుకుని మరింత లాభాలను పెంచుకోవాలని ఆశించిన సింగరేణి యాజమాన్యానికి కోర్టు నిర్ణయం మింగుడు పడడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాధితులు కోర్టుకు వెళ్తున్నారనే విషయాన్ని ముందస్తుగా సింగరేణి నిఘా విభాగం పసిగట్టడం లో విఫలమైందని తెలుస్తోంది. చట్టపరమైన చర్యలు, నిర్వాసితులకు ఇచ్చే పరిహారం విషయమై ముందు నుంచి హెచ్చరికలు వస్తున్నప్పటికీ సింగరేణి యాజమాన్యం ఒంటెత్తు పోకడలకు వెళ్లడమే నేటి ఈ పరిస్థితులకు కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
మెగా ఓపెన్‌కాస్ట్ ఏర్పాటుపై హైకోర్టు స్టే
మందమర్రి(ఆదిలాబాద్ జిల్లా): కల్యాణిఖని మెగా ఓపెన్‌కాస్ట్ ఏర్పాటుపై మంగళవారం హైకోర్టు స్టే విధించింది. సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కల్యాణిఖని మెగా ఓపెన్ కాస్ట్ ఏర్పాటుపై నిలుపుదల చేయాలని ప్రభావిత గ్రామాల ప్రజలు రెండు రోజుల కిందట హైకోర్టును ఆశ్రయించారు. బాధితుల తరపున వాదనలు విన్న హైకోర్టు ఎలాంటి భూసేకరణ చేయొద్దంటూ స్టే ఇచ్చింది. మైనింగ్ కార్యకలాపాల వల్ల పర్యావరణం కూడా దెబ్బతింటున్నదని కోర్టుకు తెలిపారు. 123 జీవోను అమలు పర్యావరణానికి విఘాతం కలిగించేలా ఉన్నదని కోర్టుకు విన్నవించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురజాల రవీందర్రావు మాట్లాడుతూ.. అధికారులు, ప్రభుత్వాలు కోర్టు తీర్పును గౌరవించి ఓపెన్ కాస్ట్‌ను నిలిపి వేయాలన్నారు. కోర్టు తీర్పు కాపీని చూసిన తర్వాత స్పందిస్తామని కల్యాణిఖని మెగా ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు అధికారి ఒకరు చెప్పారు.