breaking news
Kalpataru
-
బడా ఐపీవోలు వస్తున్నాయ్..!
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అనుబంధ సంస్థ.. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 25న ప్రారంభంకానుంది. 27న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 2,500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 10,000 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఇష్యూ ద్వారా ఎన్బీఎఫ్సీ మొత్తం రూ. 12,500 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 24న షేర్లను కేటాయించనుంది. ప్రస్తుతం హెచ్డీబీ ఫైనాన్షియల్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 94.36 శాతం వాటా కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను టైర్–1 మూలధన పటిష్టతకు కేటాయించనుంది. తద్వారా బిజినెస్ వృద్ధికి వీలుగా రుణాల విడుదల తదితర భవిష్యత్ పెట్టుబడి అవసరాలకు వినియోగించనుంది. అప్పర్ లేయర్లో ఉన్న ఎన్బీఎఫ్సీలు మూడేళ్లలోగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కావలసి ఉన్నట్లు 2022 అక్టోబర్‌లో ఆర్బీఐ నిబంధనలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో కంపెనీ ఐపీవోకు వస్తోంది. కాగా.. గతేడాది ఇందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోర్డు ఆమోదముద్ర వేసింది. కల్పతరు @ రూ. 387–414 ఈ నెల 24–26 మధ్య రియల్టీ కంపెనీ ఐపీవోముంబై, హైదరాబాద్, నోయిడాలో ప్రాజెక్టులురియల్టీ రంగ కంపెనీ కల్పతరు లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 24న ప్రారంభంకానుంది. 26న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 387–414 చొప్పున ప్రకటించింది. దీనిలో భాగంగా రూ. 1,590 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా విద్యుత్ ప్రసారం, పంపిణీ దిగ్గజం కల్పతరు గ్రూప్ కంపెనీ రూ. 1,590 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 23న షేర్లను కేటాయించనుంది. ఇష్యూ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. లిస్టింగ్ తదుపరి కంపెనీ విలువ రూ. 8,500 కోట్లుగా నమోదయ్యే వీలుంది. ప్రధానంగా ముంబై మెట్రోపాలిటన్ రీజన్(ఎంఎంఆర్)తో కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ పుణే(మహారాష్ట్ర), హైదరాబాద్(తెలంగాణ), నోయిడా(ఉత్తరప్రదేశ్)లోనూ ప్రాజెక్టులు చేపడుతోంది. లగ్జరీ, ప్రీమియం, మధ్యాదాయ రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 36 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.ఎలెన్‌బరీ @ రూ. 380–400 ఈ నెల 24–26 మధ్య పబ్లిక్ ఇష్యూ రూ. 853 కోట్ల సమీకరణకు రెడీవిభిన్న తరహా గ్యాస్‌ల తయారీ కంపెనీ ఎలెన్‌బరీ ఇండ్రస్టియల్ గ్యాసెస్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 24న ప్రారంభంకానుంది. 26న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 380–400 చొప్పున ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు దాదాపు రూ. 453 కోట్ల విలువైన 1.13 కోట్ల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. తద్వారా కంపెనీ మొత్తం రూ. 853 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 23న షేర్లను కేటాయించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 37 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ నిధులలో రూ. 210 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 105 కోట్లు పశి్చమబెంగాల్‌లోని ఉలుబేరియా–2 ప్లాంటులో సెపరేషన్ యూనిట్ ఏర్పాటుకు, మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. కంపెనీ విభిన్న ఇండస్ట్రియల్ గ్యాస్‌ల తయారీ, సరఫరాలను చేపడుతోంది. డ్రై ఐస్, సింథటిక్ ఎయిర్, ఫైర్‌ఫైటింగ్ గ్యాస్, మెడికల్ ఆక్సిజన్, ఎల్పీజీ, వెల్డింగ్ మిక్సర్స్సహా పలు స్పెషాలిటీ గ్యాస్‌లను అందిస్తోంది. గతేడాది(2024–25) కంపెనీ ఆదాయం 16 శాతం ఎగసి రూ. 312 కోట్లను అధిగమించగా.. నికర లాభం 84 శాతం జంప్‌చేసి రూ. 83 కోట్లను తాకింది. -
కల్పతరులో జేఎంసీ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: మౌలిక రంగ దిగ్గజం కల్పతరు పవర్ ట్రాన్స్‌మిషన్‌లో నిర్మాణ రంగ అనుబంధ సంస్థ జేఎంసీ ప్రాజెక్టŠస్ విలీనానికి దారి ఏర్పడింది. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) తాజాగా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సంయుక్త సంస్థ దేశీయంగా అతిపెద్ద లిస్టెడ్ ఇంజినీరింగ్, కన్స్ట్రక్షన్ కంపెనీలలో ఒకటిగా ఆవిర్భవించనున్నట్లు కల్పతరు పేర్కొంది. ఎన్సీఎల్టీ అహ్మదాబాద్ బెంచ్ జేఎంసీ విలీనానికి అనుమతించినట్లు వెల్లడించింది. సంయుక్త సంస్థ దేశీయంగా భారీ కార్యకలాపాలు కలిగి ఉండగా.. 67 దేశాలలోనూ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. విద్యుత్ ప్రసారం, పంపిణీ, బిల్డింగులు, ఫ్యాక్టరీలు, వాటర్, రైల్వేలు, ఆయిల్ అండ్ గ్యాస్ తదితర పలు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించనున్నట్లు వివరించింది. ఆర్డర్ బుక్ రూ. 43,000 కోట్లకు చేరనున్నట్లు తెలియజేసింది. కాగా.. 2022 ఫిబ్రవరిలో కల్పతరు, జేఎంసీ బోర్డులు విలీనానికి ఆమోదముద్ర వేశాయి. దీనిలో భాగంగా జేఎంసీ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ 4 షేర్లకుగాను 1 కల్పతరు షేరుని కేటాయిస్తారు. -
పరిశ్రమల ఆటోమేషన్‌కు ‘కల్పతరువు’
సాక్షి, అమరావతి: రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్), సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) సంయుక్తంగా నాలుగోతరం ఇండస్టీ–4 టెక్నాలజీ అభివృద్ధికి ‘కల్పతరువు’ పేరుతో విశాఖపట్నంలో ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీవోఈ) కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అనేక పారిశ్రామిక సంస్థలకు.. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల ఆటోమేషన్‌కు ‘కల్పతరువు’ అన్ని విధాలా ఉపయోగపడనుంది. మంగళవారం ఆర్ఐఎన్ఎల్ ప్రధాన కార్యాలయం నుంచి వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ సీఎండీ అతుల్ భట్, ఢిల్లీ నుంచి ఎస్టీపీఐ డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్ కలిసి కల్పతరువు ఓపెన్ ఛాలెంజ్ ప్రోగ్రాం – 1 (ఓసీపీ–1)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అతుల్ భట్ మాట్లాడుతూ ఆర్ఐఎన్ఎల్కు చెందిన ఆరు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ ఛాలెంజ్‌ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సమస్యలకు పరిష్కారం అందించే స్టార్టప్‌లు అంతర్జాతీయంగా ఉక్కు పరిశ్రమ ఎదుర్కొంటున్న కీలక సమస్యలకు పరిష్కారాన్ని కూడా అందించే అవకాశం లభిస్తుందన్నారు. విశాఖపట్నంలో ఉన్న ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్–హెచ్‌వీపీవీ, హెచ్ఎస్ఎల్, హెచ్‌పీసీఎల్, వీపీటీ, బీఏఆర్సీ వంటి సంస్థలు ఈ సీవోఈని వినియోగించుకోవాలని కోరారు. ఈ సీవోఈతో రాష్ట్రంలో స్టార్టప్‌లు పెరుగుతాయని, పారిశ్రామిక కార్యక్రమాలు వేగం పుంజుకుంటాయని తెలిపారు. అరవింద్ కుమార్ మాట్లాడుతూ ఎస్టీపీఐకి దేశవ్యాప్తంగా 20 సీవోఈలు ఉండగా కల్పతరువు 21వదని, కాని ఇది అన్ని సీవోఈలకు తల్లిగా అవతరించనుందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, ఎనలటిక్స్ వంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించుకొని స్మార్ట్ ఆటోమేషన్‌ను పెంచుకోవచ్చని చెప్పారు. ఆర్ఐఎన్ఎల్ లానే ఇతర పీఎస్‌యూలు కూడా వారి సమస్యల పరిష్కారానికి కల్పతరువును వినియోగించుకోవాలని కోరారు. ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కల్పతరువు రాకతో 2025 నాటికి రాష్ట్ర తయారీ రంగంలో 25 శాతం వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఓసీపీ–1 కార్యక్రమంలో పాల్గొనే స్టార్టప్‌లు అక్టోబర్ 19 వరకు www.kalpataru.stpi.in అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని ఎస్టీపీఐ విశాఖ అడిషనల్ డైరెక్టర్ సురేష్ బాతా తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థలకు చెందిన 1,032 మంది పాల్గొన్నారు. -
హైదరాబాద్ రియల్టీలోకి ‘కల్పతరు’
♦ కల్పతరు గ్రూప్ ఎండీ పరాగ్ మనోజ్ ♦ సనత్‌నగర్‌లో 5.5 ఎకరాల్లో తొలిదశ ♦ నెలరోజుల్లోగా వివరాలు ప్రకటిస్తాం ♦ కల్పతరు ప్రాజెక్ట్స్ లిస్టింగ్ ఆలోచన లేదు ♦ రియల్ ఎస్టేట్ బిల్లు చాలావరకూ మంచిదే హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ‘కల్పతరు’ గ్రూప్... హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ గ్రూప్ రూ.8,100 కోట్ల వార్షిక టర్నోవర్‌తో దేశంతో పాటు విదేశాల్లోనూ కార్యకలాపాలు సాగిస్తోంది. గ్రూప్‌కు చెందిన జేఎంసీ ప్రాజెక్ట్స్, కల్పతరు పవర్లు స్టాక్ మార్కెట్లో లిస్టయినవి కాగా... శుభమ్ లాజిస్టిక్స్, ప్రాపర్టీ సొల్యూషన్స్, రియల్టీ దిగ్గజం కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంకా లిస్ట్ కాలేదు. ప్రధానంగా ముంబైతో పాటు పుణె, బెంగళూరు వంటి చోట్ల 93 దాకా ప్రీమియం ప్రాజెక్టుల్ని పూర్తి చేసి ఒక బ్రాండ్ ఇమేజ్ సృష్టించుకున్న కల్పతరు ప్రాజెక్ట్స్... హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో తొలి ప్రాజెక్టు చేపడుతోంది. వచ్చేనెల్లో దీన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా గ్రూప్ ఎండీ పరాగ్ మనోజ్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలివీ... హైదరాబాద్ రియల్టీలోకి వస్తున్నట్లున్నారు? అవును! 2008లో మేం సనత్‌నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో వేలం వేసిన 9.5 ఎకరాల స్థలం కొన్నాం. దాన్నిపుడు డెవలప్ చేస్తున్నాం. తొలి దశలో 5.5 ఎకరాలను అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే పనులు ఆరంభమయ్యాయి. అక్షయ తృతీయకన్నా ముందే వివరాలు ప్రకటిస్తాం. హైదరాబాద్ రియల్టీ మార్కెట్ మీరు అంచనా వేస్తున్నంత బాగుందా? మార్కెట్లో మరీ బూమ్ ఉందని చెప్పలేం. కాకపోతే విశ్వసనీయత ఉన్న ప్రాజెక్టులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందులోనూ హైదరాబాద్‌కు ఉజ్వలమైన భవిష్యత్తుంది. ఈ నమ్మకంతోనే అడుగు పెడుతున్నాం. హైటెక్ సిటీ, ఔటర్ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను వదిలి సనత్‌నగర్‌లో ఆరంభిస్తున్నారేం? అది నగరానికి మధ్యలో ఉంది. మెట్రో, ఎంఎంటీఎస్ అన్నింటికీ దగ్గర. అలాంటిచోట 10 ఎకరాల స్థలం దొరకటమంటే మాటలు కాదు. మాకు అదృష్టంకొద్దీ దొరికింది. అందుకే ఆరంభిస్తున్నాం. కల్పతరు ప్రాజెక్ట్స్ ప్రీమియం సెగ్మెంట్లోనే ఉంది. హైదరాబాద్‌లోనూ ఇదే పంథా కొనసాగిస్తారా? ముంబైలో మా ప్రాజెక్టులు ప్రీమియంవే. కాదనను. ఇప్పుడైతే ఒకో ఫ్లాట్ కనీస ధర రూ.7-8 కోట్ల నుంచి గరిష్ఠంగా 35 కోట్ల వరకూ ఉంటోంది. కాకపోతే ముంబైలో మేం ప్రాజెక్టులు చేపడుతున్న ప్రాంతాలు, అక్కడి పరిస్థితులు ఈ ధరను డిమాండ్ చేస్తున్నాయి. అంతేతప్ప హైదరాబాద్‌లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని ఎందుకనుకోవాలి? అక్కడి పరిస్థితుల బట్టే అక్కడ ప్రాజెక్టులుంటాయి. ఇంకా హైదరాబాద్‌లో మీ గ్రూప్ కార్యకలాపాలేమైనా...? మా గ్రూప్‌కు చెందిన ప్రాపర్టీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (పీఎస్‌పీఎల్) సంస్థ వివిధ రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టుల నిర్వహణను చూస్తుంది. మా ప్రాజెక్టుల నిర్వహణ మొత్తం దీనిదే. హైదరాబాద్‌లో ఇతరులకు చెందిన కొన్ని కమర్షియల్ ప్రాజెక్టుల నిర్వహణను కూడా మేం చూస్తున్నాం. కల్పతరు ప్రాజెక్ట్ ఐపీఓ ప్రయత్నాలేమైనా చేస్తోందా? అలాంటిదేమీ లేదు. అసలు ఆ ఆలోచనే లేదు. గ్రూప్ కంపెనీలన్నీ చక్కని దారిలో వెళుతున్నాయి. ఇప్పుడైతే మిగతా కంపెనీల లిస్టింగ్ గురించి ఏ ఆలోచనలూ చేయటం లేదు. రియల్ ఎస్టేట్ బిల్లు బిల్డర్లకు లాభమా? నష్టమా? అది ప్రధానంగా బిల్డర్ల కోసం తెచ్చిన బిల్లు కాదు. కష్టపడి ఇల్లు కొనుక్కునే వారికి భద్రత కలిగించాలని. అందులోని కొన్ని అంశాలు మాకూ నచ్చలేదు. కానీ మొత్తమ్మీద చూస్తే రియల్ ఎస్టేట్ డెవలపర్లందరినీ ఒక నియంత్రణలోకి తెచ్చే ప్రయత్నమిది. ఎవరు పడితే వారు బోర్డు పెట్టి వినియోగదారుల్ని నమ్మించి మోసం చేసే అవకాశం లేకుండా... కాస్త విశ్వసనీయత, స్తోమత ఉన్నవారినే ఈ రంగంలో నిలిచేలా చేస్తుందీ బిల్లు. హైదరాబాద్‌లో మరిన్ని ప్రాజెక్టులేమైనా చేపడతారా? కచ్చితంగా. ఎందుకంటే గూగుల్, ఉబెర్, అమెజాన్ వంటి దిగ్గజాలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న సిటీలో విస్తరించాలని ఎవరైనా అనుకుంటారు. కాకపోతే ఇప్పటికప్పుడు ఎలాంటి ఆలోచనా చేయటం లేదు.