breaking news
Kakatiya Thermal Power Station
-
కేటీపీపీలో భారీ అగ్నిప్రమాదం
గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం మొదటి దశ 500మెగావాట్ల ప్లాంట్‌లో సోమవారం రాత్రి భారీ ప్రమా దం సంభవించింది. ఈ ఘటనలో ఏడు గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వరంగల్‌లోని అజర ఆస్పత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కాకతీయ థర్మల్ విద్యుత్ 500 మెగావాట్ల ప్లాంట్‌లోని కోల్ మిల్లర్‌లో ఇనుప రాడ్డు రావడంతో కార్మికులు దానిని తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో డోర్‌ను తెరవడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో మంటలు చెలరేగి కార్మికులకు అంటుకున్నాయి. ప్రమాదంలో జేపీఏ వెంకటేష్, ఆర్జిజన్ కేశమల్ల వీరస్వామితోపాటు బ్రదర్స్ ఇంజనీరింగ్ కాంట్రాక్టు కార్మికులు సీతారాములు, జానకిరాములు, సాయికుమార్, రాజు, మహేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కేటీపీపీ ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అందులో ఆర్జిజన్ వీరస్వామి, జేపీఏ వెంకటేష్‌ల పరిస్థితి విషమంగా ఉండడంతో, ఏడుగురిని వరంగల్‌లోని అజర ఆస్పత్రికి తరలించారు. మిల్లర్‌లోకి ఇనుపరాడ్డు రావడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఆస్తినష్టంపై ఇంకా స్పష్టత రాలేదు. గాయపడిన కార్మికుల్లో ఐదుగురు విజయవాడనుంచి సోమవారమే కేటీపీపీకి వచ్చినట్లు తెలిసింది. కేటీపీపీ పవర్‌ప్లాంట్‌లో మొదటిసారి ప్రమాదం జరగడంతో ఇంజనీర్లు, కార్మికులు షాక్‌కు గురయ్యారు. -
600 మెగావాట్ల ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి పునఃప్రారంభం
గణపురం : మండలంలోని చెల్పూరు శివారులోని కాకతీయ ధర్మల్ విద్యుత్ కేంద్రంలోని 600 మెగావాట్ల ప్లాంట్‌లో బుధవారం తిరిగి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ప్లాంట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మంగళవారం విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన విషయం తెలిసిందే. కేవలం 24 గంటల్లో కేటీపీపీ ఇంజనీరింగ్ అధికారులు మరమ్మతులు పూర్తి చేసి సింక్రనైజేషన్ చేశారు. -
ఇప్పుడైతే ఆరు బస్తీలు
పేదలకుహామీలిస్తూ.. భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన బస్తీవాసులకు పింఛన్లు.. పట్టాలు ఇస్తాం.. భూపాలపల్లిని రెవెన్యూ డివిజన్‌గా.. పారిశ్రామిక హబ్‌గా మారుస్తాం.. రూ.75 కోట్లతో అభివృద్ధి చేస్తాం.. రూ.10 కోట్లతో బ్రాహ్మణ భవన్ నిర్మిస్తాం.. ధూపదీప నైవేధ్యాల ఖర్చు పెంచుతాం.. రెండో రోజు జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు, రేపు జిల్లాలో ఉండే అవకాశం వరంగల్ జిల్లాకు వరాల జల్లు కురిసింది. ఒకేఒక్కడుగా గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వస్తూవస్తూనే.. గురువారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని మూడు మురికివాడల్లో పర్యటించారు. తాజాగా శుక్రవారం హన్మకొండలోని నాలుగు బస్తీల్లో సందర్శించి ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల హామీలతోపాటు అర్హులకు పథకాలు అందుతాయని భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు. కేడీసీ ప్రాం గణంలో తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర తొలి సదస్సుకు హాజరయ్యూరు. భూపాలపల్లిని పారిశ్రామిక హబ్‌గా మారు స్తా. కేటీపీపీలో సమీక్ష నిర్వహించి అధికారులు, ప్రజాప్రతినిధులకు సర్కారుల లక్ష్యాన్ని వివరించారు. కేటీపీపీ స్థితిగతులపై ఏరియల్ సర్వే నిర్వహించి.. హన్మకొండకు వచ్చీరావడంతోనే అధికారులతో సమావేశమయ్యూరు. శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు బిజీబిజీగా గడిపారు. హన్మకొండ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం జిల్లాలో బిజీ బిజీగా గడిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మురికివాడల్లో పర్యటించారు. తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర సదస్సులో పాల్గొన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం చెల్పూరులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించారు. రాష్ట్ర, జిల్లా, స్థానిక అధికారులతో.. భూపాలపల్లి నియోజకవర్గ అభిృద్ధిపై సమీక్ష నిర్వహించారు. గురవారం రాత్రి హన్మకొండలోని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు గృహం లో బస చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఉదయమే లక్ష్మీకాంతారావు ఇం టికి వీరు చేరుకొని సీఎంను కలివారు. ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య, జెడ్పీ చైర్పర్సన్ జి.పద్మ, ఎంపీలు కడియం శ్రీహరి, ఆజ్మీర సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌బాస్కర్, ఆరూరి రమేష్, ము త్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్ళపల్లి రవీందర్రావు, టీఆర్ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, మర్రి యాదవరెడ్డి, గుడిమల్ల రవికుమార్, భీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, కె.వాసుదేవరెడ్డి, గద్దల నర్సింగరావు, సకినాల శోభన్ ప్రభుత్వ సలహాదారుడు కె.వి.రమణామూర్తి ముఖ్యమంత్రిని కలుసుకొన్నారు. ముఖ్యమంత్రితో పాటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం 9.15 లక్ష్మీకాంతరావు ఇంటిలో నుంచి బయటకు వచ్చారు. ఆవరణలో ఉన్న వారికి అభివాదం చేసి దీన్‌దయాల్‌నగర్‌కు 9.25 గంటలకు చేరుకొన్నారు. నేరుగా కాలనీ వాసులతో ముచ్చటించారు. సమస్యలు తెలుసుకొన్నారు. అనంతరం కాలనీ వాసులను ఉద్దేశించి మాట్లాడారు. 10.20 గంటలు దీన్‌దయాల్‌నగర్ నుంచి బయలు దేరారు. 10.42 గంటలకు ప్రగతినగర్‌కు చేరుకొన్నారు. ప్రగతినగర్‌లోని కాలనీ వాసులతో కొద్ది సేపు సంభాషించారు. అనంతరం కాలనీవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. 11.05 గంటలకు ప్రగతినగర్ నుంచి బయలు దేరి జితేందర్ నగర్‌కు 11.14 గంటలకు చేరుకొన్నారు. జితేందర్‌నగర్‌లో కాలనీలో పర్యటించారు. 11.30 గంటలకు ఇక్కడి నుంచి బయలు దేరి కాకతీయ డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన అర్చక సమాఖ్య సదస్సు వేదికకు 11.35 గంటలకు చేరుకున్నారు. ఈ సదస్సులో ప్రసంగించిన అనంతరం 12.25 గంటలకు భూపాలపల్లికి వెళ్లారు. భూపాలపల్లిలో సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి నుంచి బయలు దేరిన సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా హన్మకొండకు చేరుకున్నారు. సాయంత్రం 5.40 గంటలకు హన్మకొండ సహకార నగర్‌లోని విష్ణుప్రియ గార్డెన్లో జరిగిన టీఆర్ఎస్ చేరికల సమావేశంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా అశ్వరావు పల్లి ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో పాటు అతని అనుచరులను కేసీఆర్ టీఆర్ఎస్లోకి చేర్చుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఇక్కడ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలు దేరి కలెక్టరేట్‌కు చేరుకొని రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో జిల్లా అభిృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. లక్ష్మీకాంతారావు ఇంటికి చేరుకొని బస చేశారు. నేడు అధికారిక కార్యక్రమాలు లేవు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో అధికారుల పనితీరు పట్ల అసహానంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లా అధికారులపై ఆగ్రహంగా ఉన్న సీఎం శుక్రవారం వరంగల్ తూర్పు నియోజక వర్గంలో జరిపిన సర్వే నివేదిక ఇవ్వడంలో అధికారుల జాప్యం, ఇళ్ల నిర్మాణం విషయంలో వన్ ప్లస్ వన్‌కు ప్రజల నుంచి ప్రతికూల స్పందన రావడం వంటి కారణాలతో సీఎం కొంత అసహానంగా ఉన్నట్లు తెలిసింది. అందులో భాగంగానే శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజాప్రతినిధులు సమావేశంలో కూడా పాల్గొనకుండా నేరుగా కలెక్టర్ కార్యాలయంలో కూర్చుని ఉన్నారు. కేసీఆర్ దూకుడుకు దగ్గట్లు అధికారుల పనితీరు లేకపోవడం ముఖ్య కారణంగా కనిపిస్తోంది. ఇక శనివారం ముఖ్యమంత్రి కెప్టెన్ ఇంట్లో ఉంటారని సమాచారం ఇచ్చినా అధికారికంగా ఏలాంటి కార్యక్రమాలు ఖరారు కాలేదు. కేవలం ఇతర జిల్లాల నుంచి వచ్చేవారు. కొందరు ముఖ్యమైన శాఖల ఉన్నతాధికారులను మాత్రమే సీఎంను కలిసేందుకు అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి మనోగతం తెలిసిన అధికారులు మాత్రం వ్యవహారం ఎటునుంచి ఎటు వస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. వరంగల్‌లో 500 ఎకరాల్లో 160 మురికి వాడలు ఉన్నయ్.. నిన్న మూడు బస్తీలల్ల తిరిగిన.. ఇయ్యూల మూడు మురికివాడలు తిరుగుతున్నా.. ఇప్పుడైతే ఆరు బస్తీలను అభివృద్ధి చేస్తా.. మార్చి తర్వాత మరికొన్ని కాలనీలను తీసుకుందాం.. నేను నైట్ ఇక్కడే ఉంట. జాబితా ప్రకారం అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తం. ఎల్లుండి నేను వచ్చి కొత్త కాలనీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్త. ఐదు నెలల్లో పూర్తి చేసి ప్రారంభిస్తా.. - సీఎం కేసీఆర్