breaking news
Kahani
-
మాది త్రివేణీ సంగమం - సిరివెన్నెల
‘‘ఇలాంటి కథ, నిర్మాతలు, అన్ని సమయాల్లో దొరకరు. అందుకే ‘కహానీ’ తెలుగు రీమేక్ అవకాశం రాగానే వెంటనే ఒప్పుకున్నా. అయితే ‘కహానీ’లోలాగా ‘అనామిక’లో కథానాయికను గర్భవతిగా చూపించం. నాకిది కొత్త తరహా సినిమా. నేనెలా తీసినా కీరవాణి తన నేపథ్య సంగీతంతో ప్రేక్షకుల్ని కూర్చోబెట్టగలరని గట్టి నమ్మకం’’ అని శేఖర్ కమ్ముల చెప్పారు. ఆయన దర్శకత్వంలో వయాకామ్ 18-ఐడెంటిటీ మోషన్ పిక్చర్స్ - లాగ్‌లైన్ పిక్చర్స్ నిర్మించిన చిత్రం ‘అనామిక’. నయనతార, హర్షవర్థన్ రాణే, వైభవ్ ముఖ్యతారలుగా నటించిన ఈ సినిమా పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ‘ప్రసాద్స్’ సంస్థల అధినేత రమేశ్ ప్రసాద్ పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ -‘‘పాటలో ఈ పదాన్ని ఎందుకు వాడారని ప్రశ్నిస్తే కరెక్ట్‌గా చెప్పగలిగే సీతారామశాస్త్రిగారు మనకుండడం మన అదృష్టం. అందుకే ఆయన పాట రాసేవరకూ ఎంత కాలమైనా ఎదురు చూస్తాం’’ అని చెప్పారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మాట్లాడుతూ -‘‘నేను, శేఖర్ కమ్ముల, కీరవాణి కలిసి త్రివేణి సంగమంగా ఈ సినిమా వచ్చింది’’ అన్నారు. ఈ సినిమాకు పడినంత కష్టం ఎప్పుడూ పడలేదని యండమూరి వీరేంద్రనాథ్ చెప్పారు. శేఖర్‌తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉందని వైభవ్ తెలిపారు. ఈ వేడుకలో ఎ. కోదండరామిరెడ్డి, నరేష్ తదితరులు మాట్లాడారు. -
టీనేజ్ గాళ్‌కు తల్లిగా...!
చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లి పాత్రలు చేయడానికి కథానాయికలు దాదాపు ఇష్టపడరు. కంగనా రనౌత్ కూడా నిన్న మొన్నటి వరకు ఈ తరహా పాత్రలకు ‘నో’ చెప్పారు. కానీ, ఇప్పుడు ఆమె మనసు మారింది. ఆర్టిస్ట్ అన్న తర్వాత ఎలాంటి పాత్రైనా చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే తల్లి పాత్రకు పచ్చజెండా ఊపేశారు. పైగా, టీనేజ్ గాళ్‌కి తల్లిగా. కంగన వయసు 27 ఏళ్లు. ఈ చిత్రంలో ఆమె 35 ఏళ్ల మహిళగా కనిపించనున్నారు. అదొక సవాల్ అయితే, టీనేజ్ కూతురికి తల్లిగా ఒదిగిపోవడం మరో సవాల్ అని చెప్పాలి. ‘కహానీ’ దర్శకుడు సుజోయ్ ఘోష్ నిర్దేశకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ‘కహనీ’లో అద్భుతంగా నటించిన విద్యాబాలన్‌నే ఈ సినిమాకూ తీసుకోవాలనుకున్నారు. అయితే, ఆమె గర్భవతి అన్న వార్త రావడం కారణంగానో ఏమో, కంగనను ఎంపిక చేశారు. ఈ చిత్రానికి ‘దుర్గారాణీ సింగ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇటీవల విడుదలైన ‘క్వీన్’లో అద్భుతంగా నటించి, అందరి మన్ననలు పొందిన కంగన, ‘దుర్గా...’లో కూడా తన నట విశ్వరూపాన్ని చూపించాలనుకుంటున్నారట. త్వరలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.