breaking news
kadiyam area
-
తెలంగాణ అసెంబ్లీలో బీసీ కులగణన తీర్మానం
-
ఇన్నాళ్లు సేవ చేసినందుకు ఇదా ఫలితం?
-
దారుణం: రాత్రంతా వర్షంలోనే..
సాక్షి, తూర్పుగోదావరి: మహమ్మారి కరోనా భయం మానవత్వాన్ని మంటగలుపుతోంది. మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇందుకు అద్దం పట్టే ఘటన తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకలో చోటుచేసుకుంది. తన భర్తకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఓ ఏఎన్ఎం పడరాని పాట్లు పడ్డారు. రాత్రంతా వర్షంలోనే ఉండిపోయారు. వివరాలు.. బుర్రిలంకకు చెందిన ఓ మహిళ ఆరోగ్య కార్యకర్తగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త ఇటీవల కోవిడ్-19 బారిన పడటంతో అతడిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ఏఎన్ఎం కారణంగా తమకు కూడా కరోనా సోకుతుందనే భయంతో గ్రామస్తులు ఆమెను ఇంటికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె రాత్రంతా వర్షంలోనే గడిపారు. (కడసారి వీడ్కోలుకు కానరారే!) ఈ విషయం గురించి సదరు ఏఎన్ఎం మాట్లాడుతూ.. సొంత ఇంట్లోకి తనను అడుగుపెట్టనివ్వకుండా గ్రామస్తులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు గ్రామానికి సేవ చేసినందుకు ఇదేనా ఫలితం అంటూ వాపోయారు. కాగా మహమ్మారి సోకిందంటే చాలు సొంత వాళ్లను కూడా శత్రువులుగా భావించే రోజులు దాపురించిన తరుణంలో... సాధారణ ప్రజలతో పాటు ఫ్రంట్‌లైన్ వారియర్లకు కూడా చేదు అనుభవాలు తప్పడం లేదు. ఇక కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు సొంత కుటుంబ సభ్యులే నిరాకరిస్తున్న ఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. -
వన టూరిజానికి ప్రభుత్వం సిద్ధం
కడియం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం స్థానికుల సహకారం కూడా అవసరం అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రత్యేకాధికారి భీమశంకరం నర్సరీ రైతులతో అవగాహన సమావేశం కడియం : కడియం ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందాలంటే స్థానికుల సహకారం అవసరమని అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఎన్.భీమశంకరం అన్నారు. పర్యాటక రంగ అభివృద్ధిపై కడియపులంక పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ నర్సరీలు విస్తరించి ఉన్న కడియం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అందులో భాగంగా ఈ మండలంలోని పలు గ్రామాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చే స్తామని, పర్యాటకులను ఆకట్టుకునేలా వసతి సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. నర్సరీల్లో వ్యూ పాయింట్స్, ధవళేశ్వరం నుంచి కడియపులంక వరకు బోట్ షికార్ వంటì వి ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. పర్యాటకులు ఒకటì ,æరెండు రోజులు ఇక్కడే ఉండేలా వసతికి కూడా తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా అన్ని రోడ్లనూ ఆధునికీకరిస్తామని తెలిపారు. రోడ్ల వెంబడి ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని తహసీల్దార్ కె. రాజ్యలక్ష్మిని కోరారు. కడియపులంకలోని పర్యాటన అతిథి గృహానికి తక్షణం మరమ్మతులు చేయిస్తామన్నారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. కొంచెం ఎత్తులో వ్యూ∙పాయింట్లను నిర్మించాలని కలెక్టర్ చెప్పారన్నారు. వీలైనంత త్వరగా పది కాటేజీలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సమగ్ర ప్రణాళిక రూపొందించాలి హడావుడిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేకంటే సమగ్ర ప్రణాళికతో ముందుకెళితే మంచిదని నర్సరీ రైతు మార్గాని గోవింద్ సూచించారు. ఆర్అండ్బీ, పంచాయతీ, విద్యుత్ తదితర శాఖల సమన్వయంతో పనులు చేపట్టాలని సూచించారు. కడియపులంక గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వారా రాము, కడియం నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పుల్లా ఆంజనేయులు, పాటంశెట్టి సూర్యప్రకాశరావు, మార్గాని సత్యనారాయణ పలు సూచనలు చేశారు. ఎంపీడీవో ఎన్వీవీఎస్ మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీఎంఐపీ పీడీ వై. సుబ్బారావు, నర్సరీ రైతు పల్లవెంకన్న పాల్గొన్నారు. అనంతరం స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి టూరిజం గెస్ట్‌హౌస్, చెరువులను భీమశంకరం పరిశీలించారు.