K. J. Yesudas
-
60 ఏళ్ల క్రితం తండ్రికి ఇచ్చిన మాట.. ఇప్పటికీ దాటని ఏసుదాస్
సినిమాకు ఆరో ప్రాణం పాట. ఆ పాటకు ఊపిరిగా గాన సరస్వతి ఏసుదాస్. ఈయన పేరుకు మాత్రమే మలయాళి. గాయకుడుగా సర్వభాషి. ఈయన పాడారంటే ఆ చిత్రం ప్రత్యేకత సంతరించుకుంటుంది. తన మధురమైన కంఠంతో ఇప్పటి వరకు 40వేలకు పైగా పాటలను పాడిన ఘనత ఏసుదాసుది. 1980 ప్రాంతంలో ఈయన అత్యధికంగా పాటలను పాడారు. ఒక సమయంలో ఏసుదాస్ పాడని చిత్రమే లేదంటే అతిశయోక్తి కాదు. 8 జాతీయ అవార్డులు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ బిరుదులకు పొందారు. బుధవారం తన 84వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో రాజకీయ రంగ ప్రవేశంపై వచ్చిన చర్చకు ఆయన స్పందించారు. ఎందరో సినీ ప్రముఖులు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారని ముఖ్యంగా సంగీత రంగానికి చెందిన ఇళయరాజా కూడా ఓ జాతీయ పార్టీలో చేరారని, అలాంటిది ఇన్నేళ్లుగా ప్రఖ్యాత గాయకుడిగా రాణిస్తున్న మీరు రాజకీయ రంగ ప్రవేశం చేరకుండా పోవడానికి కారణం ఏమిటి అన్న ప్రశ్నకు ఏసుదాస్ బదులిచ్చారు. నిజం చెప్పాలంటే పలు రాజకీయ పార్టీల నుంచి తనకు పిలుపు వచ్చిందని తెలిపారు. అయితే చిన్న వయసులోనే తన తండ్రి రాజకీయాల్లోకి వెళ్లవద్దని గట్టిగా చెప్పారన్నారు. అప్పుడే తాను ఆయనకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి వెళ్లనని మాట ఇచ్చానన్నారు. అలా తన తండ్రికి ఇచ్చిన మాటను మీర దలుచుకోలేదని చెప్పారు. అందుకే రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. కొందరు తన పేరుతో అభిమాన సంఘాన్ని ప్రారంభించమని సలహా ఇచ్చారని, తాను తోసిపుచ్చినట్లు చెప్పారు. ఇంకా చెప్పాలంటే తనకు ఇప్పటికే సోషల్ మీడియా ఖాతా కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. -
యేసుదాస్ కొడుకు ఇంట్లో చోరీ.. బంగారు, వజ్రాభరణాలు మాయం
ఇటీవలి కాలంలో సెలబ్రిటీల ఇళ్లలో వరుస దొంగతనాలు హాట్‌టాపిక్‌గా మారాయి. కొన్ని రోజుల క్రితం సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో సెలబ్రిటీ ఇంట్లో దొంగతనం జరిగింది. ప్రముఖ గాయకుడు యేసుదాస్ కుమారుడు, సింగర్ విజయ్ యేసుదాసు ఇంట్లో భారీగా చోరీ జరిగింది. చెన్నైలోని అభిరామపురంలోని విజయ్ నివాసంలో 60 సవర్ల బంగారు నగలు, వజ్రాభరణాలతో పాటు పలు డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయి. ఈ విషయంపై విజయ్ భార్య దర్శన పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ ఇంట్లో పని చేస్తున్నవారే దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా యేసుదాస్ కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన విజయ్ ప్రస్తుతం నేపథ్య గాయకుడిగా, నటుడిగా సత్తా చాటుతున్నారు. -
స్త్రీల కోసం సాగిన సుమధుర గీతం
‘దారి చూపిన దేవత... నీ చేయి ఎన్నడు వీడతా’....స్త్రీల సెంటిమెంట్‌ను మాట్లాడాల్సి వస్తే సగటు స్త్రీని శ్లాఘించాల్సి వస్తే సినిమాకు ఏసుదాస్ గొంతు కావాలి. ఏసుదాస్ వారిని పొగిడినా వారి వేదనను పాడినా ఎంతో స్థిమితం. సమాజం నిర్దేశించిన సాధారణ చట్రంలో ఉండే స్త్రీలు ఏసుదాస్ పాటతో ఊరడిల్లి కలెక్షన్లకు కారణమయ్యేవారు. ‘అపురూపమైనదమ్మ ఆడజన్మ’ అన్న ఏసుదాసే ‘తెల్లారే దాకా నువ్వు తలుపు మూసి తొంగుంటే’ ఎలా అని భార్య అలక తీర్చడానికి పూనుకుంటాడు. ‘అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచు’ను చూపిన ఏసుదాస్ గీతాలు ఆయన 82వ జన్మదినం సందర్భంగా... ‘చుక్కల్ని వొలిచి చక్కంగా మలిచి నీ కంఠహారాన్ని చేయించనా’ అని పాడతారు ఏసుదాస్ ‘ఎవ్వరిది ఈ పిలుపు’ పాటలో. ‘ప్రాణాలు ఐదు నీలోన ఖైదై ఆరోది నీవై జీవించనా’ అని కూడా అదే పాటలో అంటారు. ఏసుదాస్ గొంతులోని నిజాయితీ ప్రతి పురుషుడిలో ఉండాలని మహిళా ప్రేక్షకులు కోరుకుంటారు ఆయన పాడుతుంటే. ‘అంతులేని కథ’లో జయప్రద ఇంటి కూతురిగా మొత్తం కుటుంబాన్ని మోస్తూ ఉంటుంది. మోయాల్సిన కొడుకు రజనీకాంత్ నిర్బాధ్యతగా తిరుగుతుంటాడు. పైగా జయప్రదను పట్టుకొని ‘ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం’ అని నిలదీస్తాడు. ‘పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా... నారు పోసి నీరు పోసే నాథుడు వాడమ్మా’ అని బాధ్యత నుంచి తప్పించుకునే వాదన చేస్తాడు. బాధ్యత నుంచి తప్పించుకునే పురుషుడికి మించిన భారం ఏ స్త్రీకీ లేదు. బాధ్యతను పంచుకునేవాడినే స్త్రీ గౌరవిస్తుంది. ఏసుదాస్ పాడిన ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి’ ఇప్పటికీ హిట్. తెలుగు సినిమాల్లో గృహిణి పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఘనకార్యాలన్నీ హీరో చేయాలి. హీరోయిన్ గృహిణిగా ఉంటూ అతన్ని సపోర్ట్ చేయాలి. ఆమెకు కూడా ఘనకార్యాలు చేయగల శక్తి, ప్రతిభ ఉన్నా తెలుగు సినిమా ఇంటికే పరిమితం చేసి ఏసుదాస్ చేత ఆమెను శ్లాఘించేలా చేసి హౌస్‌ఫుల్స్ రాబట్టుకుంది. ‘కుంకుమ తిలకం’లో ‘ఆలనగా పాలనగా అలసిన వేళల అమ్మవుగా’ పాటలో హీరో మురళీమోహన్ హీరోయిన్ జయసుధతో ‘నీ చిరునవ్వే తోడై ఉంటే నే గెలిచేను లోకాలన్ని’... అంటాడు ఏసుదాస్ గొంతుతో. ‘భద్రకాళి’లోని ‘చిన్ని చిన్ని కన్నయ్యా’లో ఇదే మురళీమోహన్ ఏసుదాస్‌ను పలికిస్తూ ‘గాయత్రి మంత్రమును జపియించు భక్తుడినై కోరుకున్న వరములను ఇవ్వకున్న వదలనులే’ అని భార్య జయప్రదను ఆరాధనగా చూస్తాడు. ‘మేఘసందేశం’లో అక్కినేని భార్య జయసుధను చూస్తూ ‘సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో’.. ఆమె సౌందర్యాన్ని మెచ్చుకుంటాడు. ఇక ‘ప్రేమపక్షులు’ సినిమాలో అలకబూనిన భార్యను బుజ్జగిస్తూ ఏసుదాస్ పాడిన ‘తెల్లారే దాకా నువ్వు తలుపు మూసి తొంగొంటే’ ఎంత ముచ్చట గొలుపుతుందో. అంతేనా? ‘పెదరాయుడు’లో బంధువులందరూ వెలి వేసిన భార్య సౌందర్యకు భర్త మోహన్ బాబు ఏసుదాస్ పాట సాయంతో శ్రీమంతం చేస్తాడు. ‘కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా’ అనే పాట టికెట్లను తెగేలా చేసింది. ఇక ‘పెళ్లి చేసుకుందాం’ లో వెంకటేష్ కాంట్రాక్ట్ పెళ్లి చేసుకుని భార్య స్థానానికి విలువ ఇవ్వకుండా చులకన చేసి ఆ తర్వాత యాక్సిడెంట్ వల్ల మంచాన పడితే స్త్రీ/భార్య పురుషునికి ఎంత సపోర్ట్‌గా నిలుస్తుందో తెలుస్తుంది. ఏసుదాస్ పాట ఆ వివరణ ఇస్తుంది– ‘అపురూపమైనదమ్మ ఆడజన్మ’ అంటూ. ‘సతిని మించిన ఆప్తులు ఉండరు’ అని ఈ పాట చెబుతుంది. ‘గృహప్రవేశం’లో భార్య జయసుధ విలువ తెలుసుకున్న మోహన్‌బాబు ‘దారి చూపిన దేవత నీ చేయి ఎన్నడు వీడతా’ అని కన్నీరుతో పాడటం ఆ సినిమా హిట్‌కు కారణం. ‘మిథునం’ సినిమాలో దంపతుల గొప్పతనాన్ని ‘ఆదిదంపతులు అభిమానించే అచ్చ తెలుగు మిథునం’ పాటలో తెలియచేస్తారు ఏసుదాస్. తల్లి గొప్పతనం చెప్పే పాటలు ఏసుదాస్ పాడారు. ‘సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించింది అమ్మ’ పాట ‘అమ్మ రాజీనామా’లో పెద్ద హిట్. ‘అమ్మ మీద ఒట్టు’ సినిమాలో ‘అమ్మా నీకు వందనం కన్నతల్లి నీకు వందనం’ పాట గొప్ప భావగాఢతతో ఉంటుంది. అమ్మ గొప్పతనం గురించి చెబుతూనే అమ్మను ఎంతమంది కాపలా కాస్తారో చెబుతుంది ఈ పాట. అయితే అమ్మ లేనిచోట ఏసుదాస్ పాటే అమ్మ జోల అవుతుంది. ‘మా ఆయన బంగారం’లో ‘చిట్టికూన చిట్టికూన ఊరుకోరా చిన్నినాన్నా కొడుకో బంగారు మారాజా’ కూడా హిట్. ఇక విఫల ప్రేమికులు, ప్రేమ విరాగులు, విరహంలో ఉన్నవారు ఏసుదాస్ గొంతుతో ఎంతో సింపతీని మహిళా ప్రేక్షకుల నుంచి పొందారు. ‘గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం’ (స్వయంవరం), ‘ఆకాశ దేశాన ఆషాఢ మాసాన’ (మేఘసందేశం), ‘సుక్కల్లే తోచావే’ (నిరీక్షణ). ‘ఏ నావదేతీరమో’ (సంకీర్తన), ‘వెన్నెలైనా చీకటైనా’ (పచ్చని కాపురం)... ఎన్నో. తెలుగు ప్రేక్షకులు, అందునా మహిళా ప్రేక్షకులు సెంటిమెంట్ ప్రియులు. ఆ సెంటిమెంట్‌ను నిలబెడుతూ ఏసుదాస్ పాడిన పాటలు ఆయనను తెలుగువారికి మరింత దగ్గర చేశాయి. ఆయన గొంతులోని సెంటిమెంట్ అలాగే కొనసాగాలని కోరుకుందాం. – సాక్షి ఫ్యామిలీ -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - ఏసుదాసు
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - K. J. ఏసుదాస్
-
అజ్ఞాతవాసం: మాధవ సేవలో రాధమ్మ
ప్రస్తుతం ఆమె నివసించే ఇంటి అలంకరణ చూస్తే బాల్యంలోనే ఆధ్యాత్మికమార్గం పట్టిన వ్యక్తి అనుకుంటాం. అయితే ఈ గృహిణి... నిన్నా మొన్నటి దాకా రంగులలోకంలో రాణించిన తార. వందకుపైగా సినిమాల్లో, వేలాదిగా నాటకాల్లో పాత్రలు పోషించి, పురస్కారాలు దక్కించుకుని... ఇల్లే దేవాలయంగా మార్చుకుని ప్రశాంతంగా జీవిస్తున్న ఆమె పేరు... రాధా ప్రశాంతి. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని ఫిలిమ్నగర్లో ఉన్న ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ కాలింగ్‌బెల్ మోగించి, తలుపు తెరచుకోగానే ... ఒక్కసారిగా మనం వచ్చింది ఎక్కడికా అని అయోమయానికి గురవుతాం. హాలు మధ్యలో పెద్దగా అమర్చిన షిర్డి సాయిబాబా బొమ్మలు, గోడలకు నలువైపులా రాధాకృష్ణుల చిత్రపటాలు, నేపథ్యంలో కమనీయంగా జేసుదాస్ పాటలు మనం ఇంటికి వచ్చామా లేక ఏదైనా గుడికి వెళ్లామా అనే అనుమానం వచ్చేలా ఉంటుంది అలంకరణ తీరు. రాధలా ఉన్నావని... ‘‘నా పేరు కృష్ణవేణి అండీ. సినిమాల్లో ప్రశాంతిగా మారింది. నా ఫీచర్స్ అప్పటి టాప్ హీరోయిన్ రాధలా ఉన్నాయని జర్నలిస్ట్‌లే నా పేరుకు ముందు రాధ చేర్చారు’’ అంటూ పరిచయం చేసుకున్నారామె. ‘‘ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో గజపతిజిల్లాలోని పర్లాకిమిడి గ్రామం మాది. నృత్యప్రదర్శన లు ఇచ్చేదాన్ని. రంగస్థలంపైనా నాటకాలు ఆడేదాన్ని. అలా సినిమాల్లోకి వచ్చాను’’ అంటూ మొదలుపెట్టారామె. శ్రీదేవి నర్సింగ్‌హోం, మధ్యతరగతి మహాభారతం, పెళ్లిపందిరి, పెళ్లికానుక, ఎర్రసూరీడు వంటి సినిమాలలో రెండో హీరోయిన్‌గానూ, ప్రధానపాత్రలతో పాటు, మల యాళం సహా పలు భాషల్లో దాదాపు 100కుపైగా సినిమాలు, వేలాదిగా నాటకాల్లో నటించానని చెప్పారు. రంగస్థలనాయికగా, సినీనటిగా ఎన్నో పురస్కారాలనూ స్వంతం చేసుకున్నారు. అయినప్పటికీ ఎందుకు పూర్తిగా తెరమరుగయ్యారు? వివాహంతో... శుభం కార్డు... సినీజీవితానికి పెళ్లితో ముగింపు పలికానని కృష్ణవేణి చెప్పారు. తనను ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఉప్పుడి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇష్టం మేరకు వివాహానంతరం పూర్తిగా ఇంటికే పరిమితమయ్యానన్నారు. అనంతరం వ్యక్తిగత జీవితంలోని హడావిడి తగ్గి ఖాళీ దొరకగానే...చిన్నతనంలో ఊరి గుడిలో చేసిన పూజలు, నదిలో వదిలిన కార్తీకదీపాలు మదిలో మెదిలాయి. అప్పట్లో తానెంతో ఇష్టంగా పూజించిన కృష్ణుడి రూపం మనోహరంగా మెదిలింది. దాంతో ఈ ‘రాధా’ నివాసం... లో పందిరి మంచం నుంచి పడకగది దాకా, వరండా నుంచి వంటగది దాకా కృష్ణరూపం నిండిపోయింది. కృష్ణభక్తి ఆమెను మరింతగా ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లించింది. ‘‘కృష్ణమందిరం కట్టిన చోటే సమాధి అయిన షిర్డిసాయిబాబా అంటే నాకెంతో నమ్మకం. సమయం అదీ అని లేకుండా ఎప్పుడు అనిపిస్తే అప్పుడు షిర్డీ వెళ్లివస్తుంటాను’’ అని ఆమె చెప్పారు. దాంతో సాయిబాబా చిత్రపటాలు, విగ్రహాలకు కూడా ఆమె ఇల్లు కట్టని కోవెల అయింది. మాధవసేవలో పునీతమవుతున్న ఈ గృహిణి... మానవసేవను కూడా మరచిపోకపోవడం విశేషం. ప్రస్తుతం తను పుట్టిన ఊరిలో దేవాలయం కట్టించిన ఈ దైవభక్తురాలు... అంగవికలురులకు, అనాధలకు క్రమం తప్పని సేవలను అందిస్తున్నారు. భర్తకు చెందిన స్టెప్ అనే స్వఛ్చంద సంస్థ కార్యక్రమాలనూ పర్యవేక్షిస్తున్నారు. వస్తా... రమ్మంటే... సినిమాలకు గుడ్‌బై చెప్పాక చేసిన ఏకైక సినిమా కూడా ‘దేవుళ్లు’ కావడం ఆ యాదృచ్ఛికమే కావచ్చు. ప్రస్తుతం భర్త, ఇద్దరు పిల్లలతో పాటు ఇలవేల్పుల సేవలో కాలం గడిపేస్తున్న ఈ తెలుగింటి గృహిణి... మళ్లీ సినిమాల్లో నటించాలనుంది అంటున్నారు. సినిమాల్లో మంచి పాత్రలు పోషించే అవకాశం వస్తే అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న ఈమె ఆకాంక్ష నెరవేరితే... మరో మంచి క్యారెక్టర్ నటి తెలుగుతెరకు దొరికినట్టే. - ఎస్.సత్యబాబు -
గీత స్మరణం
నేడు కె.జె.ఏసుదాస్ పుట్టినరోజు పల్లవి : నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా (2) చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా మార్గం చూపే దీపం కాదా ధైర్యం ॥ చరణం : 1 జరిగింది ఓ ప్రమాదం ఏముంది నీ ప్రమేయం దేహానికైనా గాయం ఈ మందుతోను మాయం విలువైన నిండు ప్రాణం మిగిలుండటం ప్రధానం అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం స్త్రీల తనువులోనే శీలమున్నదంటే పురుష స్పర్శతోనే తొలగిపోవునంటే ఇల్లాళ్ల దేహాలలో శీలమే ఉండదనా భర్తన్న వాడెవ్వడూ పురుషుడే కాదు అనా శీలం అంటే గుణం అనే అర్థం ॥ చరణం : 2 గురివింద ఈ సమాజం పరనింద దాని నైజం తన కింద నలుపు తత్వం కనిపెట్టలేదు సహజం తన కళ్ల ముందు ఘోరం కాదనదు పిరికి లోకం అన్యాయమన్న నీపై మోపింది పాప భారం పడతి పరువు కాచే చేవలేని సంఘం సిగ్గు పడకపోగా నవ్వుతోంది చిత్రం ఆనాటి ద్రౌపదికి ఈనాటి నీ గతికి అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్లది అంతేగాని నీలో లేదే దోషం ॥ చిత్రం : పెళ్లి చేసుకుందాం (1997), రచన : సిరివెన్నెల సంగీతం : కోటి. గానం : కె.జె.ఏసుదాస్