breaking news
justies
-
హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణం
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగింది. నూతన న్యాయమూర్తులతో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హోం మంత్రి తానేటి వనిత, మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా హరినాథ్ నూనెపల్లి, కనపర్తి కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఇటీవల ఈ నలుగురు అడ్వొకేట్లను ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. చదవండి: రాజకీయాల్లో చంద్రబాబు శకం ముగిసింది: మంత్రి చెల్లుబోయిన -
వైఎస్సార్ హయాంలోనే దళితులకు న్యాయం
వైఎస్సార్ సీపీ ఎస్సీ,ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగార్జున ఫిరంగిపురం (గుంటూరు): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాలోనే దళితులకు సముచిత న్యాయం జరిగిందని వైఎస్సార్ సీపీ ఎస్సీ, ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున అన్నారు. ఫిరంగిపురంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి నివాసంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలోని దళితులను పలు రకాల బెదిరింపులకు గురిచేసి పట్టా భూములను, ఎస్సైన్డ్ భూములను తక్కువ ధరలకు లాక్కుని, బినామీలకు అప్పగించారని ధ్వజమెత్తారు. దళిత ఎమ్మెల్యే అయి కూడా .. దళిత ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ కూడా అధికార పార్టీలో వుండి దళితులను మోసం చేసి వందల ఎకరాలను తనకుS అనుకూలమైన వ్యక్తులకు ఇప్పించిన మాట వాస్తవం కాదా అన్ని ప్రశ్నించారు. అమెరికాలో ఉంటున్న వ్యక్తులకు ఆయన భూములు ఇప్పించారని, శ్రావణ్‌కుమార్ ఆత్మ విమర్శ చేసుకొని బేషరతుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని దళితుల తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. మంత్రి రావెల కూడా వందల ఎకరాలను కొనుగోలు చేసి చివరకు ఓ ట్రస్ట్ పేరున వాటిని బదిలీ చేసి దళితులను మోసం చేయడంలో తానూ ఏం తీసిపోనన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పుష్కరాల ఖర్చు రూ.1600 కోట్లు ఎవరికి లబ్ధి..? పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో రెక్కాడితే గాని డొక్కాడని దళితులు ఎంతోమంది ఉన్నారని, ప్రస్తుతం వారి జీవనం దుర్భరంగా మారిందని చెప్పారు. అంకెల గారడీ చేస్తున్న చంద్రబాబు కష్ణా పుష్కరాల పేరుతో రూ.1600 కోట్లు ఖర్చు చేశారని, అవి ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడ్డాయో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అధికార కాంక్షను వీడి పరిపాలనను సక్రమంగా కొనసాగించక పోతే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా వున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి ప్రత్యేక హోదాను విస్మరించి చేస్తున్న తప్పుడు వాగ్దానాలను ప్రజలు నమ్మరని, రాబోవు ఎన్నికల్లో టీడీపీని సముద్రంలో కలిపేందుకు సిద్ధంగా వున్నారని హెచ్చరించారు. సమావేశంలో కత్తెర హెనీ క్రిస్టీనా, సురేష్‌కుమార్, జెడ్పీటీసీ నన్నం సునీత, కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.