breaking news
Judicial Revenge
-
ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి సీసీఎస్ కస్టడీ పూర్తి
జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు కేవలం పెట్టుబడులు పెట్టానంటూ వెల్లడి సాక్షి, హైదరాబాద్: భూకబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డితోపాటు న్యాయవాది శైలేష్ సక్సేన, శ్రీనివాస్‌ల పోలీసు కస్టడీ గడువు గురువారంతో ముగిసింది. దీంతో వీరికి వైద్య పరీక్షలు చేయించిన సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టు లో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు తరలించారు. సీసీఎస్ అధికారులు నిందితుల్ని మూడు రోజుల పాటు తమ కస్టడీలో విచారించారు. విచారణ చేస్తున్న సమయంలోనే అక్కడ నుంచి ఏసీపీ కార్యాల యానికి తరలించారు. భూ కబ్జాలు, బోగస్ డాక్యుమెం ట్లు, యజమానుల సృష్టిపై ఇతడిని ప్రశ్నించారు. స్థలా లు ఖరీదు చేస్తున్నామంటూ శైలేష్ చెప్పడంతో తాను కేవలం పెట్టుబడులు పెట్టానని విచారణలో చెప్పినట్టు తెలిసింది. విచారణలో కేసులకు సంబంధించిన కీలక సమాచారం పోలీసులు సేకరించా రు. బోగస్ డాక్యుమెంట్లు ఎక్కడ నుంచి సంగ్రహించారు.. స్టాంపులెలా తయారు చేశారు.. తదితర వివరాలు రాబట్టారు. విచారణలో దీపక్‌రెడ్డికి అన్ని విషయాలు తెలుసంటూ శైలేష్ చెప్పినట్లు తెలుస్తోంది. జీపీఏలు చేసుకునే సమయంలో ఆయనే స్వయంగా సంతకాలు చేశారని, కొన్ని స్థలాలకు సంబంధించి న్యాయస్థానం ఉత్తర్వులు వచ్చినప్పుడు అధీనంలోకి తీసుకోవడానికి దీపక్‌రెడ్డి సైతం వచ్చినట్లు తెలిపాడు. ఈ కేసులో నిందితుల్ని మరో ఐదు రోజుల పోలీసు కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. -
ఇద్దరికి జ్యుడీషియల్ రిమాండ్
నిజామాబాద్ లీగల్ (నిజామాబాద్ అర్బన్): బోధన్ వాణిజ్య పన్నుల శాఖలో పన్ను ఎగవేత కుంభకోణం కేసులో నిందితులైన ఇద్దరు అధికారులను ఈ నెల 15 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఏ2 నిందితుడు సింహాద్రి వెంకట సునీల్‌బాబు కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం మేరకు వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ ధరణి శ్రీనివాస్‌రావు, రిటైర్టు సీటీవో నారాయణదాస్ వెంకట కృష్ణమాచారిలను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ధరణి శ్రీనివాస్‌రావు హైదరాబాద్‌లో అప్పిలేట్ డిప్యూటి కమిషనర్‌గా పనిచేస్తుండగా, నారాయణదాస్ 2012 నుంచి 2016 వరకు నిజామాబాద్‌లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. ఈ సమయంలో బోధన్‌లో జరిగిన నకిలీ చాలన్లకు సహకరించాలని ఇందుకు నెలకు రూ. 5 లక్షలు ఇచ్చినట్లు సునీల్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. రిటైర్డు సీటీవోకు తమకు సహకరించాలని కారు కొనిచ్చినట్లు తెలిపాడు. శ్రీనివాస్‌రావు ఇంట్లో విలువైన ఫర్నిచర్ చేయించినట్లు సునీల్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఈ మేరకు సీఐడీ అధికారులు వారిని అరెస్టు చేసి సోమవారం నిజామాబాద్ మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ సరిత ఎదుట హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ వీరికి ఈ నెల 15 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు.