breaking news
jublihills pilice station
-
పెళ్లి పేరిట సహచర కానిస్టేబుల్ మోసం
బంజారాహిల్స్: సహచర కానిస్టేబుల్ ప్రేమించినట్లు నటించి పెళ్లి చేసుకుంటానని మోసగించడంతో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు యత్నించింది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. పంజగుట్ట పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ విభేదాల కారణంగా భర్తతో వేరుగా ఉంటోంది. కోర్టులో విడాకుల ప్రక్రియ కొనసాగుతుంది. ఆమెకు నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. పంజగుట్ట పోలీస్స్టేషన్లోనే సహచర కానిస్టేబుల్ కప్షా స్వప్నిల్(27)తో 2024లో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సన్నిహితంగా మెలిగాడు. ఆమెకు రెండుసార్లు గర్భస్రావం చేయించాడు. కొద్దిరోజులుగా ఆమెను మతపరంగా అవమానించడం, దుర్భాషలాడటమే కాకుండా మరో యువతితో సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలిసిన బాధితురాలు ఈ నెల 14న శ్రీకృష్ణానగర్లోని తన గదిలో స్వప్నిల్తో గొడవ పడింది. పెళ్లి చేసుకునేది లేదని నిందితుడు తెగేసి చెప్పడమేకాకుండా నిద్రమాత్రలు వేసుకోవాలని ఒత్తిడి చేశాడు. దీంతో పెద్దమొత్తంలో నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితికి వెళ్లింది. ఈ నెల 16న ఆస్పత్రిలో చేర్చగా సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని స్వప్నిల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పీఎస్ ఎదుట ఆరోగ్యశ్రీ కార్యకర్తల ఆందోళన
హైదరాబాద్ : తమ వాళ్ల అరెస్టుకు నిరసనగా నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆరోగ్య శ్రీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఆరోగ్యశ్రీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తమకు జీతాలు పెంచాలని కోరుతూ గత మూడు రోజులుగా ఆరోగ్యశ్రీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. ఆందోళన చేపట్టిన కొందరు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పీఎస్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.


