breaking news
Joshna cinappa
-
దీపిక vs జోష్నా
► ఆసియా స్క్వాష్ మహిళల టైటిల్ మనదే ► నేడు ఫైనల్లో అమీతుమీ చెన్నై: భారత స్క్వాష్ చరిత్రలో ఆదివారం కొత్త చరిత్ర లిఖించబడనుంది. ప్రతిష్టాత్మక ఆసియా వ్యక్తిగత స్క్వాష్ చాంపియన్‌షిప్ మహిళల వ్యక్తిగత విభాగంలో భారత్ నుంచి తొలి చాంపియన్ అవతరించనుంది. 31 ఏళ్ల ఈ మెగా ఈవెంట్ చరిత్రలో మొదటిసారి భారత్ నుంచి ఒకేసారి ఇద్దరు క్రీడాకారిణులు టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో నాలుగో సీడ్ దీపిక పళ్లికల్ 11–9, 7–11, 11–7, 11–9తో టాప్ సీడ్ ఆనీ అవు (హాంకాంగ్)ను బోల్తా కొట్టించగా... రెండో సీడ్ జోష్నా చినప్ప 11–6, 11–4, 11–8తో ఆరో సీడ్ తోంగ్ వింగ్ (హాంకాంగ్)పై గెలిచింది. 1996లో భారత్ నుంచి మిషా గ్రెవాల్ మాత్రమే ఏకైకసారి ఫైనల్‌కు చేరుకొని రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత ఈ పోటీల్లో భారత్ నుంచి ఎవరూ ఫైనల్‌కు చేరుకోలేదు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ క్రీడాకారుడిగా సౌరవ్ ఘోషాల్ ఘనత వహించాడు. సెమీఫైనల్లో రెండో సీడ్ సౌరవ్ 11–6, 11–7, 11–3తో ఐదో సీడ్ లియో అవు (హాంకాంగ్)పై గెలుపొందాడు. ఆదివారం జరిగే ఫైనల్లో టాప్ సీడ్ మాక్స్ లీ (హాంకాంగ్)తో సౌరవ్ తలపడతాడు. రెండో సెమీఫైనల్లో మాక్స్ లీ 12–10, 11–6, 11–5తో నఫీజ్వాన్ అద్నాన్ (మలేసియా)ను ఓడించాడు. -
క్వార్టర్స్‌లో జోష్నా
ఎల్ గౌనా (ఈజిప్టు): భారత అగ్రశ్రేణి స్క్వాష్ క్రీడాకారిణి జోష్నా చినప్ప పీఎస్ఏ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో జోష్నా 11–5, 7–11, 9–11, 11–8, 11–9తో తొమ్మిదో ర్యాంకర్ అలీసన్ వాటర్స్ (ఇంగ్లండ్)ను కంగుతినిపించింది. మరో భారత క్రీడాకారిణి దీపిక పల్లికల్ 9–11, 10–12, 6–11తో నికోల్ డేవిడ్ (మలేసియా) చేతిలో తొలి రౌండ్లోనే ఓడింది. టాప్–10లో సాక్షి, సందీప్ న్యూఢిల్లీ: యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్స్‌లో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్, సందీప్ తోమర్ టాప్–10లో చోటు సంపాదించారు. మహిళల 58 కేజీల విభాగంలో సాక్షి ఐదో స్థానాన్ని సంపాదించగా... పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో సందీప్ తోమర్ ఏడో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం వీరిద్దరూ న్యూఢిల్లీలో మేలో జరిగే ఆసియా చాంపియన్‌షిప్ పోటీలకు సిద్ధమవుతున్నారు.