breaking news
jobseeker
-
కొత్త జాబ్ బూమ్: ఆశలన్నీ ఈ ఉద్యోగాలపైనే!
ఏఐ విస్తృతంగా పెరుగుతున్నకొద్దీ అన్ని రంగాల్లోనూ ఉద్యోగాల కోతలు అధికమయ్యాయి. మరోవైపు చాలా రంగాల్లో ఉద్యోగ మార్పులు అనివార్యమయ్యాయి. ఈ నేపథ్యంలో జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్ నడుస్తోంది. కొత్త ఉద్యోగాలపై యువత చూస్తున్నారు. ఏ కొలువులకు డిమాండ్ ఉందో అన్వేషిస్తున్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ సేవల విస్తరణతో సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉద్యోగాలపై ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది. అయితే ఉద్యోగార్థుల ఆసక్తి పెరుగుతున్న స్థాయిలోనే కంపెనీల నియామకాలు మాత్రం జరగడం లేదు. దీంతో సైబర్ సెక్యూరిటీలో ఏ విభాగానికి డిమాండ్ ఎక్కువగా ఉంది? ఏ నైపుణ్యాలకు ప్రాధాన్యం లభిస్తోంది? అనే అంశాలు కీలకంగా మారుతున్నాయి.జాబ్స్ పోర్టల్ ఇన్‌డీడ్ ఇండియా (Indeed India) తాజా డేటా ప్రకారం.. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన నాలుగు ప్రధాన విభాగాల్లో ఉద్యోగార్థుల ఆసక్తి భారీగా పెరిగింది. ఎస్ఓసీ అనలిస్ట్ (Security Operations Centre) (SOC Analyst)ఉద్యోగాలపై క్లిక్‌లు ఏకంగా 225% పెరిగాయి. ప్రైవసీ/డేటా ప్రొటెక్షన్ పాత్రలపై ఆసక్తి 189%, సెక్యూరిటీ ఇంజనీర్ పోస్టులపై 176%, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఉద్యోగాలపై 175% పెరిగింది.కంపెనీల నియామకాల్లో మాత్రం భిన్న ధోరణిఉద్యోగార్థుల ఆసక్తికి, కంపెనీల నుంచి వస్తున్న ఉద్యోగ ప్రకటనలకు మధ్య గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ఇన్‌డీడ్ డేటా ప్రకారం.. ప్రైవసీ/డేటా ప్రొటెక్షన్ ఉద్యోగాల పోస్టింగ్స్ 18%, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ పోస్టింగ్స్ 9% పెరిగాయి. అదే సమయంలో సెక్యూరిటీ ఇంజనీర్ ఉద్యోగ ప్రకటనలు సుమారు 1%, SOC అనలిస్ట్ పోస్టింగ్స్ 8% తగ్గాయి. అంటే సైబర్ సెక్యూరిటీ రంగంపై ఆసక్తి విస్తృతంగా పెరుగుతున్నప్పటికీ, అన్ని స్పెషలైజేషన్లలో ఉద్యోగ అవకాశాలు ఒకే వేగంతో పెరగడం లేదని డేటా సూచిస్తోంది.ఈ స్కిల్స్ ఉంటే అవకాశాలుకంపెనీల సైబర్ సెక్యూరిటీ ఉద్యోగ ప్రకటనల్లో తరచుగా కనిపిస్తున్న నైపుణ్యాల్లో ‘ఫైర్‌వాల్’ ముందంజలో ఉంది. సంబంధిత ఉద్యోగ పోస్టింగ్స్‌లో ఇది 19.6% చోటుచేసుకుంది. ఆ తర్వాత ISO 27001 (17.5%), SIEM (15.2%), నెట్వర్క్ సెక్యూరిటీ (12%), వల్నరబిలిటీ అసెస్మెంట్ (11.6%) ఉన్నాయి.ఫైర్‌వాల్ నెట్వర్క్ ట్రాఫిక్‌ను నియంత్రించడంలో, SIEM వివిధ భద్రతా లాగ్‌లు, అలర్ట్‌లను విశ్లేషించడంలో, వల్నరబిలిటీ అసెస్మెంట్ వ్యవస్థల్లోని భద్రతా లోపాలను గుర్తించడంలో ఉపయోగపడతాయి. ISO 27001 మాత్రం సంస్థల సమాచార భద్రత నిర్వహణ వ్యవస్థలకు సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణం. దీంతో సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలు కేవలం హ్యాకింగ్ లేదా పెనెట్రేషన్ టెస్టింగ్‌కే పరిమితం కావడం లేదని స్పష్టమవుతోంది.AIతో కొత్త విభాగాలుAI, క్లౌడ్, API ఆధారిత వ్యవస్థలు, డిజిటల్ సేవల విస్తరణతో సైబర్ దాడులకు గురయ్యే పరిధి కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం మరింత విస్తరిస్తోంది. DSCI–SANS 2025-26 నివేదిక ప్రకారం.. 73% సంస్థలు, 68% సర్వీస్ ప్రొవైడర్లు నైపుణ్యం కలిగిన సైబర్ సెక్యూరిటీ అభ్యర్థుల కొరత ఉందని పేర్కొన్నాయి. అలాగే 83% సంస్థలు AI, GenAI సెక్యూరిటీ నైపుణ్యాలను కీలక అవసరంగా గుర్తించాయి.ఇదే సమయంలో డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడంలో కంపెనీలకు సహకారం అందించే గార్ట్నర్ సంస్థ అంచనా ప్రకారం.. భారత్‌లో సమాచార భద్రతపై సంస్థల వ్యయం 2026లో 11.7% పెరిగి 3.4 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. AI ఆధారిత సైబర్ ముప్పులు, గుర్తింపు ఆధారిత దాడులు, నియంత్రణ అవసరాలు ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.మొత్తంగా చూస్తే.. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉద్యోగార్థుల ఆసక్తి వేగంగా పెరుగుతున్నా, ఉద్యోగం సాధించేందుకు కేవలం సైబర్ సెక్యూరిటీపై ఆసక్తి సరిపోదు. ఫైర్‌వాల్, SIEM, నెట్వర్క్ సెక్యూరిటీ, ISO 27001తో పాటు క్లౌడ్ సెక్యూరిటీ, AI/GenAI సెక్యూరిటీ, ప్రాక్టికల్ హ్యాండ్స్-ఆన్ నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవడం అవకాశాలను మెరుగుపరచే అంశాలుగా కనిపిస్తున్నాయి.ఇదీ చదవండి: కొత్త ఫోన్, టీవీ.. 9 నుంచే ఆఫర్ల జాతర -
వామ్మో..! అలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా..?
చాలా విచిత్రమైన ఉద్యోగాలు గురించి విన్నాం. వాటి జీతభత్యాలు కూడా అంతే స్థాయిలో విచిత్రంగా ఉంటాయి. కానీ ఇలాంటి వెరైటీ జాబ్ రిక్రూట్మెంట్ చూసి ఉండరు. ఆ జాబ్ క్వాలిఫికేషన్ చూస్తే..వామ్మో ఇవేం అర్హత పరీక్షలని నోరెళ్లబెడతారు. ఏంటా ఉద్యోగం అంటే..చైనాలో ఒక శ్మశానవాటికకి సంబంధించిన రుషన్ మునిసిపల్ బ్యూరో ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ సోషల్ సెక్యూరిటీ ఒక ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. ఇది శ్మశానవాటికలోని మృతదేహాల నిర్వహణకు సంబంధించిన మేనేజర్ పోస్ట్. అందుకు సంబంధించిన క్యాలిఫికేషన్ గురించి చాలా వివరంగా పేర్కొంది. శ్మశానంలో ఉద్యోగం ఏంటి అనుకోకండి. చైనా వంటి దేశాల్లో అంత్యక్రియల నిర్వహణకు సంబంధించిన సిబ్బంది, ఉన్నతాధికారులు ఉంటారు. అక్కడ మృతదేహాలను మార్చురీలో భద్రపరచడం లేదా దహన సంస్కారాలు చేయడం వంటి కార్యకలాపాలు ఉంటాయి. ఈ జాబ్‌లో పనిచేసే పురుషులకు కనీస వయసు 45 ఏళ్లు. అలాగే జూనియర్ సెకండరీ స్కూల్ విద్యను పూర్తి చేసి ఉండాలి. ఇక అందుకోసం రూ.850లు పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇంటర్వ్యూ వివరాలు వింటే..మాటలు రావు. సుమారు పది నిమిషాల పాటు గడ్డకట్టే శీతల శవాగారంలో గడపాల్సి ఉంటుందట. ఈ పరీక్ష ఎందుకంటే ఇలాంటి చోట పనిచేస్తే వ్యక్తులో భయాన్ని, ఆందోళనల్ని నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. అందుకోసమని ఈ అర్హత పరీక్ష అని సదరు అంత్యక్రియల డిపార్ట్మెంట్ వెల్లడించింది. అలాగే అభ్యర్థి మానసిక పరిస్థితికి అనుగుణంగా ఇంటర్న్‌షిప్ వ్యవధి ఉంటుందని వెల్లడించింది. అంతేగాదు చైనాలో ఈ శ్మశానవాటిక సేవల మార్కెట్ 2015లో రూ.18 వేల కోట్ల ఉండగా, అది 2022 నాటికి రూ. 3 లక్షల కోట్లకు విస్తరించింది. వాస్తవానికి సాధారణ సిబ్బంది కంటే ఈ శ్మశాన వాటికలో పనిచేసే వారి జీత భత్యాలే ఎక్కువగా ఉంటాయి. కానీ చైనా శ్మశాన వాటిక మేనేజర్ ఉద్యోగానికి ఇచ్చే వేతనం చాలా తక్కువ. ఈ పోస్ట్ గురించి నెట్టింట తెగ వైరల్ అయ్యింది. అక్కడ అలాంటి ప్రదేశంలో ఉద్యోగం చేసేందుకు ముందుకు రాకుండా చేసేది భయం కాదు ఇచ్చే వేతనమేనని నెటిజన్లు మండిపడుతూ పోస్ట్‌లు పెట్టారు. అందుకోసం పెట్టే పరీక్ష కూడా అమానుషమైనదని తింటిపోస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: డెంటిస్ట్ కాస్త ఐఏఎస్ అధికారిగా..! కానీ ఏడేళ్ల తర్వాత..) -
భారత యువతిని పాక్ మేనేజర్ ఏం చేశాడంటే..
దుబాయి: తన అవసరాన్ని అవకాశంగా తీసుకొని ఓ 19ఏళ్ల భారతీయ యువతి (గృహిణి)పై పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తప్పుడుగా ప్రవర్తించాడు. ఈ ఘటన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్లారు. దుబాయ్‌లోని రషిదియా ప్రాంతంలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన పాకిస్థాన్ మేనేజర్ ఉన్నాడు. గృహిణిగా పనిచేస్తున్న భారతీయ యువతి తనకు కంప్యూటర్ ఓరియెంటెడ్ జాబ్ కోసం గత కొద్దికాలంగా ప్రయత్నిస్తోంది. అయితే, ఓ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడిన పాకిస్థాన్ మేనేజర్.. తన కంపెనీలో సెక్రటరీ ఉద్యోగం ఉందని ఇంటర్వ్యూకు హాజరుకావాలని, అక్కడే కంప్యూటర్‌కు సంబంధించిన శిక్షణ కూడా ఇస్తామని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన యువతి అతడు చెప్పిన అడ్రస్‌కు వెళ్లాక అది కార్యాలయం కాదని, అతడి ఇళ్లు అని తెలిసింది. ఆ వెంటనే ఏవో మాయమాటలు చెప్పి మెల్లగా ఆమెను తన బెడ్ రూంలోకి తీసుకెళ్లిన అతడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై మే 26న తీర్పు వెలువరించనున్నారు.


