breaking news
Job loss fears
-
రూ.25 లక్షల జీతం.. రూ.50 లక్షలకు పెంపు! అయినా టెన్షన్..
భారీ జీతం పెంపు వస్తే ఎవరైనా ఆనందిస్తారు. కానీ ఓ టెక్ ఉద్యోగికి మాత్రం 100 శాతం జీతం పెరిగినా సంతోషం కంటే ఉద్యోగ భద్రతపై భయమే ఎక్కువైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ‘ఎక్స్’ పోస్టు ప్రకారం.. ఓ ఉద్యోగి వార్షిక ప్యాకేజీ రూ.25 లక్షల నుంచి ఏకంగా రూ.50 లక్షలకు పెరిగింది. అయితే, ఈ పెంపు కంపెనీలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపుల తర్వాత రావడం చర్చనీయాంశంగా మారింది.వైరల్ పోస్టు ప్రకారం.. కంపెనీలో సాధారణంగా జూన్‌లో ఉద్యోగుల పనితీరు మదింపు, జీతాల పెంపు ప్రక్రియ జరుగుతుంది. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. మొత్తం 150 మంది ఉద్యోగుల్లో 50 మందిని కంపెనీ తొలగించినట్లు పోస్టులో పేర్కొన్నారు. దీంతో మిగిలిన ఉద్యోగులు తమకు ఇంక ఎలాంటి జీతాల పెంపు ఉండదని భావించారట. ‘‘కనీసం ఉద్యోగం మిగిలింది.. అదే చాలు’’ అనే పరిస్థితికి వచ్చారని పోస్టు పేర్కొంది.అయితే, అదే సమయంలో ఓ ఉద్యోగికి మాత్రం ఊహించని ఈమెయిల్ వచ్చింది. ప్రమోషన్‌తో పాటు ఏకంగా 100 శాతం జీతం పెంపు ప్రకటించినట్లు పోస్టులో ఉంది. దీంతో అతని వార్షిక ప్యాకేజీ రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు చేరింది.ఈ భారీ పెంపునకు కారణం కూడా ఆసక్తికరంగా ఉంది. ఉద్యోగి వారాంతంలో స్వయంగా రూపొందించిన ఓ చిన్న AI చాట్‌బాట్ ఆ సంస్థకు గణనీయమైన విలువను తీసుకొచ్చినట్లు వైరల్ పోస్టు పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అతని సామర్థ్యాన్ని కంపెనీ గుర్తించి భారీగా పరిహారం పెంచినట్లు చెబుతోంది. అయితే, మేనేజర్ ఈ పెంపు సంస్థలోనే అత్యధికమైన వాటిలో ఒకటని చెప్పడంతో పాటు, తన జీతం గురించి ఇతర ఉద్యోగులతో మాట్లాడవద్దని సూచించినట్లు పోస్టులో ఉంది.అయితే ఇక్కడే ఉద్యోగికి ఆందోళన మొదలైంది. ఇప్పటికే కంపెనీ 50 మందిని తొలగించిన పరిస్థితిలో తన జీతం రెట్టింపు కావడం భవిష్యత్తులో తన ఉద్యోగానికి ప్రమాదంగా మారుతుందా? మరోసారి తొలగింపులు జరిగితే అధిక ప్యాకేజీ కారణంగా కొత్త ఉద్యోగం దొరకడం కష్టమవుతుందా? అనే సందేహాలు అతడిని వెంటాడుతున్నట్లు పోస్టు తెలిపింది.ముఖ్యంగా సిస్టమ్ డిజైన్ వంటి అంశాల్లో తనకు నైపుణ్యం ఉన్నప్పటికీ, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ (DSA) అంటే తనకు ఇష్టం లేదని, అదే సమయంలో రూ.50 లక్షల ప్యాకేజీ స్థాయి ఉద్యోగాలకు మారాలంటే ఇంటర్వ్యూల్లో డీఎస్ఏ నైపుణ్యాలు అవసరమవుతాయా అనే ఆందోళన కూడా అతడికి ఉందట.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఉద్యోగి ప్రస్తుత కంపెనీని వదిలి వెళ్లాలని అసలు కోరుకోవడం లేదు. తన మేనేజర్ అద్భుతమైన వ్యక్తి అని, మంచి వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌తో పాటు తన ఉద్యోగాన్ని నిజంగా ఇష్టపడుతున్నానని చెప్పినట్లు పోస్టులో ఉంది. అందుకే అతని అసలు ప్రశ్న ‘ఇప్పుడే ఉద్యోగం మారాలా?’ అనేది కాదు.. ‘రేపు ఉద్యోగం పోతే మరో అవకాశానికి నేను సిద్ధంగా ఉన్నానా?’ అనేదే.ఈ కథనంపై సోషల్ మీడియాలోనూ భిన్నమైన స్పందనలు వచ్చాయి. కొందరు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంపును గొప్ప అవకాశంగా అభివర్ణించగా, మరికొందరు ఉద్యోగ భద్రత, నైపుణ్యాల అప్డేట్, అత్యవసర పొదుపులపై దృష్టి పెట్టాలని సూచించారు.ఇదిలా ఉంటే, 2026లో టెక్ ఉద్యోగ మార్కెట్లో అధిక వేతనాలపై ఆకర్షణతో పాటు ఉద్యోగ భద్రతపై ఆందోళనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల రూ.25 లక్షల ఉద్యోగాన్ని వదిలి విదేశాల్లో మాస్టర్స్ చేసిన ఓ భారతీయ టెకీ.. తిరిగి వచ్చాక వందలాది దరఖాస్తులు చేసినా కేవలం కొన్ని ఇంటర్వ్యూ కాల్స్ మాత్రమే వచ్చాయని, రూ.40–50 లక్షల ప్యాకేజీ ఆశించిన చోట రూ.25 లక్షల ప్యాకేజీ ఆఫర్లు మాత్రమే లభించాయని వెల్లడించాడు.The company doubled a guy’s salary to ₹50 LPAbut instead of just happiness, the hike brought a whole new fear. Every year, appraisals happened in june. This time, instead of appraisals, the company suddenly laid off around 50 out of 150 employees.Those of them who…— Pooja (@poojaofficial5) August 8, 2026 -
బంగారం లాంటి సంపాదన.. అయినా ఐటీ జంట భయాందోళన!
చేతిలో మంచి ఆదాయం.. అప్పులు లేవు.. కోట్ల రూపాయల విలువైన బంగారం.. అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడులు.. అయినా భవిష్యత్తుపై భయం. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఓ యువ ఐటీ దంపతులు తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన తీరు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.‘హై ఎర్నర్.. కానీ ఇంకా రిచ్ కాదు’ అంటూ 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ రెడిట్‌లో తన ఆర్థిక పరిస్థితిని పంచుకున్నాడు. తనకు, 23 ఏళ్ల తన భార్యకు కలిపి నెలకు సుమారు రూ.5 లక్షల నికర ఆదాయం వస్తుందని తెలిపాడు. చిన్న పట్టణంలో రిమోట్‌గా పనిచేస్తున్నామని పేర్కొన్నాడు. తమకు ఎలాంటి రుణాలు లేవని, తల్లిదండ్రుల ఇల్లు, సొంత కారు ఉన్నాయని వివరించాడు.రూ.95 లక్షలకు పైగా ఆస్తులురెడిట్ పోస్ట్ ప్రకారం.. ఈ జంట వద్ద సుమారు రూ.15 లక్షల విలువైన బంగారు నాణేలు, రూ.7 లక్షల అమెరికా స్టాక్స్, రూ.3 లక్షల ఎఫ్డీలు ఉన్నాయి. వీటికి అదనంగా తనకు, తన భార్య వద్ద సుమారు రూ.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని చెప్పాడు. అంటే, పేర్కొన్న ఆస్తుల విలువే సుమారు రూ.95 లక్షలకు చేరుతుంది. దీనికి కారు, తల్లిదండ్రుల ఇల్లు వంటి అంశాలను కలిపితే వారి ఆర్థిక స్థితి మరింత బలంగా కనిపిస్తుంది. అంతేకాదు.. ఇద్దరికీ వ్యక్తిగత ఆరోగ్య బీమా కింద రూ.10 లక్షల చొప్పున, టర్మ్ ఇన్సూరెన్స్ కింద రూ.3 కోట్ల చొప్పున కవరేజీ ఉందని కూడా ఆ రెడిట్ పోస్ట్‌లో పేర్కొన్నాడు.ఐదేళ్లలో రూ.3–4 కోట్ల లక్ష్యంఇంత మంచి ఆదాయం, ఆస్తులు ఉన్నప్పటికీ ఈ యువకుడిని ప్రధానంగా వేధిస్తున్నది ఉద్యోగ భద్రత. AI వేగంగా అభివృద్ధి చెందుతున్నందున వచ్చే ఐదారు సంవత్సరాల్లో అనేక సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని అతను అభిప్రాయపడ్డాడు. అందుకే ప్రస్తుతం ఉన్న అధిక ఆదాయాన్ని ఉపయోగించుకుని రూ.3–4 కోట్ల సురక్షిత నికర సంపదను నిర్మించాలనుకుంటున్నట్లు తెలిపాడు.తన ప్రాథమిక పెట్టుబడి ప్రణాళికలో ప్రతి నెలా 10 గ్రాముల బంగారం కొనుగోలు చేయడం, రూ.2 లక్షలను ఎఫ్‌డీల్లో పెట్టడం, మిగిలిన మొత్తంలో సుమారు 1,500 డాలర్లను అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం వంటి అంశాలను ప్రస్తావించాడు. అయితే, తాము ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లమే కావడంతో తమ ప్రస్తుత ఉద్యోగాల స్థిరత్వంపై నమ్మకం తగ్గుతోందని అతను చెప్పాడు. కన్సల్టింగ్, సర్వీసెస్ ఆధారిత ఐటీ కంపెనీల భవిష్యత్తుపై కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు.ఈ రెడిట్ పోస్ట్‌పై స్పందించిన పలువురు నెటిజన్లు జంట ఆర్థిక పరిస్థితిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 27 ఏళ్ల వయసులో అప్పులు లేకుండా రూ.1 కోట్లకు దగ్గరగా ఆస్తులు కలిగి ఉండటం మంచి స్థితి అని కొందరు పేర్కొన్నారు. మరికొందరు మాత్రం పెట్టుబడుల్లో వైవిధ్యం అవసరమని సూచించారు. ఇంకొందరు ‘సంపాదన పెంచుకోవడం’పై దృష్టి పెట్టాలని, AI వల్ల ఉద్యోగాలు మారుతున్న సమయంలో కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలని సూచించారు. -
జ్యోతిష్యుల ముందుకు టెకీలు బారులు
బెంగళూరు : షీలా బజాజ్ డైరీ బెంగళూరులో ఓ ప్రముఖ న్యూమరాలజిస్ట్. న్యూమరాలజిస్ట్ అంటే సంఖ్యా జ్యోతిష్యశాస్త్రమన మాట. అదృష్టం కలిసి రానప్పుడు, లేదా ఏదైనా చికాకులు ఎదుర్కొంటున్నప్పడు పేర్లలో మార్పులు వంటి వాటిని వారు సూచిస్తుంటారు. ప్రస్తుతం కొరమంగలలో ఉన్న షీలా న్యూమరాలజిస్ట్ కన్సల్టేషన్ సంస్థకు టెకీలు బారులు తీరుతున్నారంట. దీనికి గల ప్రధాన కారణం ఐటీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులే. చాలామంది సాఫ్ట్వేర్ నిపుణుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుండటంతో వారు న్యూమరాలజిస్ట్‌లను ఆశ్రయిస్తున్నారని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. 95 శాతం తమ క్లయింట్స్ ఇటీవల ఐటీ రంగం వారేనని ప్రముఖ న్యూమరాలజిస్ట్ షీలా బజాజ్ చెప్పారు. వారిలో కూడా ఎక్కువగా 35-45 మధ్య వయస్కులేనని పేర్కొన్నారు. అంతకముందు ఐటీ ఉద్యోగులు ఎక్కువగా విదేశాల్లో ఉద్యోగం కోసం తమ దగ్గరకు వచ్చేవారని, కానీ ప్రస్తుతం ఉద్యోగ భద్రత ఎక్కువ ప్రాధాన్యతగా మారిందని తెలిపారు. షీలా బజాజ్‌కు ఎక్కువ క్లయింట్స్‌గా సిటీ నటులు, రాజకీయవేత్తలు ఉండటం విశేషం. తమను ఆశ్రయిస్తున్న ఐటీ నిపుణులు కూడా ఎక్కువగా అడిగే ప్రశ్నలు.. లేఆఫ్ ప్రమాదంలో ఉన్నామని, దాని నుంచి బయటపడాలంటే, ఆధ్యాత్మిక పరిష్కారమేమిటని అడుగుతున్నారని బజాబ్ చెప్పారు. లేఆఫ్స్ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఎంత ఖర్చుకైనా వీరు వెనుకాడటం లేదట. అత్యధిక మొత్తంలో కన్సల్టేషన్ ఫీజులను కూడా చెల్లిస్తున్నారని తెలిసింది. ఉద్యోగ కోతతో తమ కంపెనీ ఏప్రిల్-జూలై నెలలో 50 మంది తమ కొలీగ్స్‌ను తీసివేశారని, తనను ఎలాగైనా ఈ ప్రమాదం నుంచి బయటపడేయాలంటూ ఓ కంపెనీకి చెందిన ప్రొగ్రామ్ మేనేజర్ చంద్రు ఎం కోరినట్టు బజాజ్ తెలిపారు. ''నాకు నా భవిష్యత్తు తెలుసుకోవాలని ఉంది. దీంతో నా ఉద్యోగానికి భద్రత కల్పించుకోగలుగుతా. టారోట్ రీడర్ అంచనాల ప్రకారం నేను చేస్తున్న ఉద్యోగం కోల్పోనని తెలిసింది. ఈ వార్తతో నాలో ఉన్న భయాందోళనలు తొలిగిపోయి, ఎంతో నమ్మకంతో, ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోగలుగుతున్నా'' అని ఓ ఐటీ నిపుణుడు చెప్పాడు. ఇలా చాలామంది ఐటీ ఉద్యోగులు న్యూమరాలజిస్ట్‌లను ఆశ్రయిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్న వారు, కుటుంబసభ్యులు, వారితో సంబంధాలు, ఆరోగ్యం కంటే కూడా ఎక్కువగా ఉద్యోగానికే ప్రాధాన్యత ఇస్తున్నారని న్యూమరాలజిస్ట్‌లు చెబుతున్నారు. గత కొన్ని నెలలలుగా ఐటీ రంగం నుంచి తమకు క్లయింట్లు పెరుగుతున్నారని తెలిపారు.


