breaking news
JNU student Muthukrishnan
-
కేంద్ర మంత్రిపై చెప్పు విసిరాడు
-
కేంద్ర మంత్రిపై చెప్పు విసిరాడు
సేలం: కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ కు సొంత రాష్ట్రంలో చేదు అనుభవం ఎదురైంది. తమిళనాడులోని సేలంలో జేఎన్ యూ దళిత పరిశోధక విద్యార్థి ముత్తుకృష్ణన్ అంత్యక్రియలకు హాజరైన ఆయనపై ఆంగతకుడొకరు చెప్పు విసిరాడు. అది ఆయనకు కొంతదూరంలో పడింది. జేఎన్యూలో సమానత్వానికి చోటులేదని పేర్కొంటూ ముత్తుకృష్ణన్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుల వివక్షకు మరో విద్యార్థి బలయ్యాడన్న ప్రచారంతో తమిళనాట ఆగ్రహ జ్వాలలు రేగాయి. కుల వివక్షతో ఓ ప్రొఫెసర్ పెడుతున్న వేధింపులు తట్టుకోలేకే ముత్తుకృష్ణన్ బలవన్మరణానికి పాల్పడ్డాడని తమిళ అభిమాన సంఘాలు, పార్టీలు ఆరోపించాయి. ముత్తుకృష్ణన్ మృతిపై న్యాయ విచారణ జరపాలని సేలంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థి సంఘాలు చెన్నైలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించాయి.