breaking news
jk bharavi
-
ఒకే రోజు 15 సినిమాలు.. దర్శకులు వీళ్లే
ఒకే రోజు 15 సినిమాలకు శ్రీకారం చుడుతూ ప్రపంచ రికార్డు సాధించేందుకు సన్నాహాలు చేసుకుంటున్న భీమవరం టాకీస్ అధినేత - శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ వెనుక తాము ఉంటామని తెలిపారు... ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, సీనియర్ హీరో సుమన్, ప్రఖ్యాత రచయిత జె.కె.భారవి. ఈనెల (ఆగస్టు) 15న హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో ఒకేసారి ప్రారంభమై ప్రపంచ రికార్డు" నెలకొల్పనున్న 15 సినిమాలకు సంబంధించిన వివరాలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరంతా సంఘీభావం తెలిపారు.ఈ 15 చిత్రాల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సుమన్ ప్రకటించగా... ఈ 15 చిత్రాల్లో యండమూరి సినిమా మినహా... మిగతా సినిమాలకు తాను స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్ గా వ్యవహరించి తగిన సలహాలు, సూచనలు ఇస్తానని జె.కె.భారవి పేర్కొన్నారు. రామసత్యనారాయణను చూసి తాను గర్వపడుతుంటానని రేలంగి తెలిపారు. ఈ 15 చిత్రాలకు స్టూడియో పార్టనర్ గా ఉండే అవకాశం లభించడం గర్వంగా ఉందన్నారు కె.ఎల్. ఫిల్మ్ స్టూడియో అధినేత కొంతం లక్ష్మణ్. కెరీర్ బిగినింగ్ లొనే 12 నెలల్లో 13 సినిమాలు తీసి, విడుదల చేసి రికార్డు క్రియేట్ చేసిన తనకు...ఒకేసారి 15 సినిమాలు స్టార్ట్ చేసి, ఏడాదిలోపు పూర్తి చేసి విడుదల చేయడం ఎంతమాత్రం కష్టసాధ్యం కాదని తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. ఈ 15 సినిమాల్లో... యండమూరి వీరేంద్రనాధ్ వంటి మహా రచయిత చిత్రంతోపాటు... జె.కె.భారవి వంటి మహాజ్ఞాని చిత్రం... ప్రఖ్యాత దర్శకుడు ఓం సాయి ప్రకాష్ చిత్రం ఉండడం చాలా గర్వంగా ఉందని తుమ్మలపల్లి చెప్పారు. ఈ 15 చిత్రాల్లో కేవలం రెండుమూడు చిత్రాలు ప్రజాదరణకు నోచుకున్నా... తాను పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుందని ఆయన వివరించారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించే 15 సినిమాల దర్శకులు వీళ్లేయండమూరి వీరేంద్రనాథ్ సాయి ప్రకాష్జె.కె. భారవిఉదయ భాస్కర్తల్లాడ సాయి కృష్ణసంగ కుమార్శ్రీరాజ్ బళ్ళచిన్నిమోహన్ కాంత్హర్షఎకారి సత్యనారాయణకార్తిక్బి. శ్రీనివాసరావుప్రణయ్రాజ్ వంగరిసతీష్ (PhD) -
'తానా ప్రపంచ సాహిత్యవేదిక' గా 64 వ సాహిత్య సమావేశం
డాలస్, టెక్సాస్: తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 64 వ సాహిత్య సమావేశం మన సినారె “విశ్వంభర” సంబురం ఘనంగా జరిగింది. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు అతిథులందరినీ ఆహ్వానించి తన స్వాగతోపన్యాసంతో సభను ప్రారంభించారు. సభాప్రారంభకులుగా హాజరైన తెలంగాణా సారస్వత పరిషత్తు, సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి అయిన డా. జుర్రు చెన్నయ్య పద్మభూషణ్ ఆచార్య డా. సింగిరెడ్డి నారాయణ రెడ్డి జీవనరేఖలను ఆయన విద్యార్ధి దశ, సాహిత్య ప్రయాణం, నిర్వహించిన పదవులు, సాధించిన విజయాలు, చేసిన రచనలు, అందుకున్న సన్మాన సత్కారాలను సోదాహరణంగా ఒక విహంగ వీక్షణంలా నారాయణ రెడ్డి గారి ప్రతిభను గొప్పగా ఆవిష్కరించారు. తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రముఖ కవి, పూర్వ రాజ్యసభ సభ్యులు, పూర్వ ఉపకులపతి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, ప్రముఖ సినీగీత రచయిత, పద్మభూషణ్, ఆచార్య డా. సి. నారాయణ రెడ్డి గారు తన జీవితకాలంలో అలంకరించిన పదవులు, సమవర్ధవంతంగా నిర్వహించిన బాధ్యతలు, సాధించిన విజయాలు ఏ సాహితీవేత్తకు దక్కని గౌరవాలు అన్నారు. ఆయన కలం నుండి జాలువారిన దీర్ఘ కావ్యం ‘విశ్వంభర’ కు సాహిత్యంలో అత్యున్నత జ్ఞానపీఠ పురస్కారం దక్కడం ప్రతీ తెలుగువాడు గర్వించదగ్గ విషయం అన్నారు. ప్రస్తుతం అదే విశ్వంభర కావ్యాన్ని ఇప్పుడు ప్రముఖ సినీ కథారచయిత జే.కే భారవి అత్యున్నత ప్రమాణాలతో శ్రవణరూపంలో ముద్రించడం హర్షదాయకం” అన్నారు. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ “తెలుగు భాషాసాహిత్య వికాసాలకోసం తానా ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని, ప్రముఖ కవి డా. సినారె రాసిన విశ్వంభర కావ్యాన్ని ప్రముఖ సినీ కథారచయిత జే.కే భారవి తన విశిష్టగళంలో ఆడియో రూపంలో ముద్రించడం ముదావహమని, ఇప్పుడు దానిని సాహితీలోకానికి తానా ప్రపంచ సాహిత్యవేదికగా విడుదలజేయడం ఆనందదాయకం అన్నారు.” సుప్రసిద్ధ సినీ కథారచయిత చిన్నికృష్ణ మాట్లాడుతూ.. తాను పలుమార్లు జే.కే భారవి రూపొందించిన విశ్వంభర ఆడియో విన్నానని, చాలా శ్రవణానందకరంగా ఉన్నదని, దీన్నే వీడియో రూపంలో తన స్వంత ఖర్చులతో దృశ్యమాలికగా తీసుకువచ్చే ఆసక్తి ఉన్నదని, త్వరలోనే ఈ విషయంలో సినారె కుటుంబసభ్యులను సంప్రదిస్తానన్నారు. సుప్రసిద్ధ కథారచయిత జే.కే భారవి మాట్లాడుతూ.. డా. సినారె విరచిత విశ్వంభర కావ్యాన్ని ఒక పిచ్చి వ్యామోహంతో ఎన్నో సార్లు చదివానని, ఎంతో ఆసక్తితో ఎన్నో వ్యవ ప్రయాసలకోర్చి దీన్ని అత్యున్నత ప్రమాణాలతో నేను రూపొందించిన ఆడియోని ఇప్పుడు తానా ప్రపంచ సాహిత్యవేదికగా విడుదలజేయడం చాల సంతోషంగా ఉన్నదని చెప్పారు. అలాగే దీనికి కారకులైన తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, తానా పూర్వధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూరకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ప్రముఖ ప్రేరణాత్మక ప్రసంగకర్త ఆకెళ్ళ రాఘవేంద్ర విశ్వంభర కావ్యంలోని అనేక విషయాలను ఉటంకించి, ఆ కావ్య లోతుపాతుల్ని, కావ్య వైభవాన్ని ప్రతిభావంతంగా విశ్లేషించి సినారె సాహిత్య ప్రతిభను గొప్పగా ఆవిష్కరించారు. పద్మభూషణ్ డా. సినారె కలం నుండి వెలువడిన “విశ్వంభర” కావ్యం మొత్తాన్ని ప్రముఖ సినీ కథా రచయిత జే.కే భారవి గళంలో మీకోసం ప్రత్యేక కానుకగా ఈ క్రింది లింక్‌ను క్లిక్ చేసి వినవచ్చు. https://youtube.com/playlist?list=PL0GYHgMt2OQyx6qWv-kWt2bCxAl6GB5XO&si=D4SS-jzDXYhmqFQX -
ఆ సినిమాతో నా ఆస్తి అంతా పోయింది
-
'నేను సంపాదించిందంతా ఒక్క సినిమాతో పోయింది'
భక్తి చిత్రాల రచయితగా జేకే భారవి ఎంతో పేరుప్రఖ్యాతలు సంపాదించాడు. అన్నమయ్య, రామదాసు, ఓం నమో వెంకటేశాయ, శ్రీ మంజునాథ వంటి ఎన్నో ఆధ్యాత్మిక చిత్రాలకు ప్రాణప్రతిష్ట చేసిన ఘనత ఆయనది. తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలు తీసిన ఆయన ఒక్క సినిమాతో కుదేలయిపోయాడు. ప్రస్తుతం ఆయన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కెరీర్లో ఎన్నో కార్లు చూసిన నేను ఇప్పుడు బైక్ బుక్ చేసుకుని ఇంటర్వ్యూకి వచ్చాను. ఎన్నోఏళ్లుగా సంపాదించిందంతా ఒకే ఒక్క సినిమా జగద్గురు ఆదిశంకరతో పోయింది. తెలుగు, కన్నడ భాషల్లో నా కథలు ఓకే అయ్యాయి. కానీ కరోనా వల్ల డబ్బులు రావడం ఆలస్యమవుతోంది. నా ఆర్థిక పరిస్థితి బాగోలేదంటే నాగార్జున నాకు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు, కానీ చేయి చాచి అడగడం నాకిష్టముండదు అని చెప్పుకొచ్చారు. -
భారవికి కాళోజీ పురస్కారం
హైదరాబాద్: తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణరావు గొప్ప దార్శనికుడని, దమ్మున్న ప్రజాకవి అని పలువురు ప్రముఖులు కొనియాడారు. కాళోజీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో తెలుగు టెలివిజన్ రచయితల సంఘం ఆధ్వర్యంలో సినీ రచయిత జె.కె.భారవికి కాళోజీ స్మారక పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, అవధాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు మాడుగుల నాగఫణిశర్మ, సంఖ్యా శాస్త్రజ్ఞులు దైవజ్ఞశర్మ, తెలుగు టెలివిజన్ రచయితల సంఘం అధ్యక్షుడు నాగబాల సురేష్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రాజేంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.