breaking news
Ji jinping
-
చైనా కీలక నిర్ణయం.. ఫుల్ పవర్ ఆయనకే..
బీజింగ్ : చైనా అనూహ్య నిర్ణయం తీసుకోబోతోంది. ప్రస్తుతం ఆ దేశానికి అధ్యక్షుడుగా పనిచేస్తున్న జీ జిన్‌పింగ్‌ను నిరవధికంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకుగానూ ఆ దేశ రాజ్యాంగంలో మార్పులు చేయబోతోంది. ఒక వ్యక్తి రెండు సార్లు మాత్రమే అధ్యక్షుడుగా కొనసాగాలనే నిబంధనను తొలగించాలని చైనా రూలింగ్ కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించినట్లు కీలక వర్గాల సమాచారం. 64 ఏళ్ల వయసున్న జీ జిన్‌పింగ్ తమ దేశ రాజ్యాంగం ప్రకారం రెండుసార్లు ఐదేళ్లపాటు పనిచేసిన తర్వాత దిగిపోవాలి. అయితే, ఇప్పటికే ఒక దఫాను పూర్తి చేసుకున్న ఆయనను రెండోసారి ఎన్నుకునేందుకు మార్చి 5న పార్లమెంటు సమావేశం కానుంది. ఇప్పటికే ఆయన పార్టీ, మిలిటరీ చీఫ్‌గా నిరవధికంగా కొనసాగుతున్నారు. గతేడాది అక్టోబర్‌లోనే ఈ ప్రతిపాదనను ఆమోదించింది. దేశ అధ్యక్ష, ఉపాధ్యక్షులు నిరవధికంగా కొనసాగేలా పార్టీ కేంద్ర కమిటీ ఓ కీలక ప్రతిపాదన చేసి చైనా అధికార మీడియా జినువా వెల్లడించింది. కాగా, చైనా ఆదర్శాలతో కూడిన సోషలిజంపై జీ జిన్‌పింగ్ ఆలోచనలను రాజ్యాంగంలో చేర్చాలనీ కూడా కేంద్ర కమిటీ ప్రతిపాదించినట్లు పేర్కొంది. ఈ మేరకు చేసిన రాజ్యాంగ సవరణను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. అయితే, చైనా పార్లమెంట్లో ఇది పెద్ద విషయం కాదు. ఎందుకంటే అందులో ఉన్నవారంతా కూడా పార్టీ విధేయులే. -
ప్రపంచ అగ్రనేతగా జీ జిన్‌పింగ్
బీజింగ్: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రపంచంలో అగ్రనేతగా అవతరించారని ఆ దేశ అధికార మీడియా పేర్కొంది. వేల కోట్ల విలువైన సిల్క్ రోడ్ ప్రాజెక్టు సహా అనేక కీలక ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారంది. ఆయన అధ్యక్షతన విదేశాలతో చైనా దౌత్య సంబంధాలు గణనీయంగా మెరుగుపడ్డాయంటూ ఒక సమగ్ర నివేదికను విడుదల చేసింది. సిల్క్‌రోడ్ ప్రాజెక్టు, ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు, వాతావరణ మార్పులపై పారిస్ ఒప్పందాన్ని సమర్థించడం తదితరాలను ఆయన విజయాలుగా వర్ణించింది.