breaking news
Japan Pople
-
టోక్యో ఒలింపిక్స్ క్రీడలు సురక్షితం
టోక్యో: ఈ ఏడాది కూడా టోక్యో ఒలింపిక్స్ క్రీడల ను నిర్వహించొద్దంటూ ఆందోళనలు చేస్తున్న జపాన్ ప్రజలకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. ఒలింపిక్స్‌ను సురక్షితంగా నిర్వహిస్తామంటూ ఐఓసీ ఉపాధ్యక్షుడు జాన్ కోట్స్ జపాన్ ప్రజలకు తెలియజేశారు. మెగా ఈవెంట్ ఏర్పాట్లలో భాగంగా మూడు రోజులపాటు జరిగిన వర్చువల్ సమావేశం శుక్రవారం ముగిసింది. ఇందులో అధ్యక్ష హోదాలో పాల్గొన్న జాన్... ‘నేను మరోసారి స్పష్టంగా చెబు తున్నా... గేమ్స్ సురక్షితంగా జరుగుతాయి. అందు లో పాల్గొనే క్రీడాకారులతో పాటు జపాన్ వాసుల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ గేమ్స్‌ను నిర్వహిస్తాం’ అని స్పష్టం చేశారు. విశ్వ క్రీడలు ఆరంభమయ్యే సమయానికి టోక్యో ప్రజల్లో దాదాపు 80 శాతం మంది కోవిడ్–19 వ్యాక్సిన్‌ను వేసుకొని ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్‌కు మరో తొమ్మిది వారాల సమయం మాత్రమే ఉండగా... ఇటీవల ఐఓసీ సీనియర్ సభ్యుడు రిచర్డ్ పౌండ్ ఒక పత్రికా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఒలింపిక్స్ నిర్వహణపై తాము ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, జూన్ చివరి నాటికి క్రీడలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొనడం విశేషం. ఒకవేళ ఈ ఏడాది గేమ్స్ జరగకపోతే... అవి రద్దయినట్లుగా భావించాలని రిచర్డ్ తెలిపారు. -
పారిపోండి.. జపనీయులను వణికించిన కిమ్
టోక్యో : సాధ్యమైనంతమేరకు కేకలు, పెద్ద పెద్ద అరుపులు.. అంతకు మించి భారీ లౌడ్ స్పీకర్ల శబ్దాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి.. అణు క్షిపణి వస్తోంది.. అణు క్షిపణి వస్తోంది అంటూ అందులో హాహాకారాలు మాదిరి హెచ్చరికలు వినిపించాయి. వీలైతే భవనాల్లోకి వెళ్లండి లేదంటే అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోండి అంటూ సూచనలు వచ్చాయి. ఇవి సరిగ్గా ఉత్తర కొరియా మరోసారి ప్రపంచ హెచ్చరికలు లెక్కచేయకుండా ఖండాంతర అణు క్షిపణిని పరీక్షించినప్పుడు అది వెళ్లిన జపాన్‌లోని పలు ప్రాంతాల్లో ప్రజలు వ్యక్తం చేసిన భయాందోళనలు. ఉదయం నుంచే ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష చేస్తుందట అంటూ అత్యవసర ఫోన్ కాల్లు చేసుకోవడం, లౌడ్ స్పీకర్ల ద్వారా సమాచారం అందించుకోవడం చేసుకున్నారు. దాదాపు జపాన్‌లోని మిలియన్ల మంది వేకువ జామునే వణికి పోయారు. ప్రపంచ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ఉత్తర కొరియా మరోసారి ఖండాంతర అణు క్షిపణి ప్రయోగం చేసిన విషయం తెలిసిందే. తాజాగా చేసిన క్షిపణి లక్షిత దూరం 3,700 కిలోమీటర్లు. అంటే సరిగ్గా అమెరికాకు చెందిన భూభాగం గ్వామ్‌ను చేరి ధ్వంసం చేసేంత. అయితే, ఈ క్షిపణిని మరోసారి కూడా ఉత్తర కొరియా జపాన్ మీదుగానే ప్రయోగించింది. దీంతో అది ఎక్కడ తమపై కూలిపోతుందో అని జపాన్ ప్రజలు బెంబేలెత్తిపోయారు. వారి భయం ప్రకారమే అది నిజంగా పడితే జరిగే ధ్వంసం ఊహించలేం. ముఖ్యంగా ఎరిమో, హోక్కైడోవంటి నగరాల ప్రజలు మాత్రం దాదాపు ప్రాణాలు అరచేతబట్టుకున్నారంట, 'ఒక భారీ క్షిపణి తమ నగరంపై నుంచి ప్రయాణిస్తుందనే విషయం విని మేం నిలకడగా ఉండలేకపోయాం. అది వినడానికే భయంగా ఉంది' అని ఓ జపాన్ పౌరుడు చెప్పగా.. నిజంగా మేం చాలా భయపడ్డాం. అది 2000 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్‌లో పడుతుందని విన్నాను. సరిగ్గా అది వెళ్లే మార్గంలో పడిపోయే మార్గంలో నావి 16 నౌకలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా సురక్షితమైన భవనాల్లోకి వెళ్లండి అని చెప్పింది.. కానీ, మేం ఆ సమయంలో ఏం చేయలేకపోయాం. ఇప్పటకే రెండుసార్లు ఇలా జరిగింది. ఇక నుంచి మాకు విశ్రాంతి ఉండదేమో' అంటూ మరొకరు చెప్పారు. ఇలా ప్రతి ఒక్కరు ఉత్తర కొరియా క్షిపణితో దాదాపు వణికిపోయారు.