breaking news
jangireddypalem
-
కారు, లారీ ఢీ, ఆరుగురి దుర్మరణం
-
కారు, లారీ ఢీ, ఆరుగురి దుర్మరణం
చిత్తూరు : చిత్తూరు జిల్లా ఏర్పేడు మండల కేంద్రం సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. సీతారాంపేట గ్రామం సమీపంలో కారు, లారీ ఢీకొనటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు గుంటూరు జిల్లా మాచవరం మండలం గంగిరెడ్డి పాలెంకు చెందినవారుగా గుర్తించారు. వీరంతా కారులో తిరుమల వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. మృతులు కోటేశ్వరమ్మ, తిరుపాలు, భార్గవి, వెంకటేశ్వర్లు, నాగరాజు, డ్రైవర్గా గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.