కారు, లారీ ఢీ, ఆరుగురి దుర్మరణం | 6 die in road mishap in chittoor district | Sakshi
Sakshi News home page

కారు, లారీ ఢీ, ఆరుగురి దుర్మరణం

Feb 28 2015 8:23 AM | Updated on Aug 30 2018 3:56 PM

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండల కేంద్రం సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు.

చిత్తూరు :  చిత్తూరు జిల్లా ఏర్పేడు మండల కేంద్రం సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. సీతారాంపేట గ్రామం సమీపంలో కారు, లారీ ఢీకొనటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు గుంటూరు జిల్లా మాచవరం మండలం గంగిరెడ్డి పాలెంకు చెందినవారుగా గుర్తించారు.

వీరంతా కారులో తిరుమల వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. మృతులు కోటేశ్వరమ్మ, తిరుపాలు, భార్గవి, వెంకటేశ్వర్లు, నాగరాజు, డ్రైవర్గా గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement