breaking news
Jammu police station
-
శ్రీనగర్‌లో ఎన్కౌంటర్.. ఉగ్రవాదుల్లో స్థానికులు!
జమ్ము కశ్మీర్ శ్రీనగర్‌లోని దాన్మర్ ప్రాంతం శుక్రవారం ఉదయం తుపాకుల మోతతో దద్దరిల్లింది. భద్రతా దళాలకు మిలిటెంట్లకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఇద్దరు సీఆర్పీఎఫ్ భద్రతా సిబ్బంది గాయపడగా.. ఆస్పత్రికి తరలించారు. పక్కా సమాచారంతో జమ్ము పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాలు ఆల్మదార్ కాలనీలో కార్డాన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాగా, మృతి చెందిన ఉగ్రవాదులిద్దరూ స్థానికులేనని, వీళ్లు లష్కరే తాయిబా ఉగ్రసంస్థకు చెందిన వాళ్లని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ ధృవీకరించారు. ఎన్కౌంటర్ ముగిసినట్లు ప్రకటించకపోవడంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో తనిఖీలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 78 మంది ఉగ్రవాదులని మట్టుబెట్టినట్లు విజయ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే పుల్వామాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తాయిబా కమాండర్ అయిజాజ్‌తో పాటు గుర్తు తెలియని మరో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరు ఉగ్రవాదుల ఐడెంటిటీ తెలియాల్సి ఉంది. #Srinagar witnessed another encounter in the wee hours of July 16. 2 unidentified militants were neutralised in this process. Visuals show The #encounter house being on fire. pic.twitter.com/Ah5NCvjL3G — Sandeep Dhar (@sandeepdhar10) July 16, 2021 -
పోలీస్ స్టేషన్‌పై తీవ్రవాదుల దాడి: ఒకరు మృతి
జమ్మూ: జమ్మూలో తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కత్వా జిల్లాలోని రాజ్‌బాగ్ పోలీస్ స్టేషన్‌పై తీవ్రవాదులు శుక్రవారం తెల్లవారుజామున గ్రానేడ్లతో దాడి చేశారు. అనంతరం పోలీసు స్టేషన్‌పై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ పోలీసు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వెంటనే స్పందించి తీవ్రవాదులపై కాల్పులు జరిపారు. ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయి. జమ్మూ -పఠాన్‌కోట్ జాతీయరహదారికి సమీపంలోని పోలీసు స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. 2013, సెప్టెంబర్ 26న కత్వా జిల్లాలోని హీరానగర్ పోలీసుస్టేషన్‌పై గెరిల్లాలు దాడి చేశారు. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. అనంతరం జమ్ము -పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై ఉన్న ఆర్మీ శిబిరంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.