breaking news
Jamaican sprinter
-
'కోహ్లి కెప్టెన్సీ అంటే చాలా ఇష్టం'
చెన్నై: జమైకా స్ర్పింటర్ యోహన్ బ్లేక్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ప్రశంసలతో ముంచెత్తాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఓటమి అనంతరం తమ తప్పులు, వైఫల్యాలు అంగీరిస్తున్నట్లు కోహ్లిచెప్పడం నచ్చిందని తెలిపాడు. ఈ సందర్భంగా యోహన్ బ్లేక్ ట్విటర్లో కోహ్లి కెప్టెన్సీ, టీమిండియా ఆటగాళ్ల గురించి ఆసక్తికరంగా రాసుకొచ్చాడు. 'టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగింది. కెప్టెన్‌గా రూట్ అద్భుత ప్రదర్శన చేయడమేగాక డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇక వయసులో సీనియర్ అయిన అండర్సన్ చివరిరోజు ఆటలో బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. టీమిండియా ఆటతీరు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కోహ్లి కెప్టెన్సీ ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. జట్టు సమిష్టిగా చేసే తప్పులు, వైఫల్యాలను ఏ మొహమాటం లేకుండా అంగీకరిస్తాడు. బౌలర్లు సరైన దిశలో బౌలింగ్ చేయలేదని.. బ్యాట్స్మెన్లు నిలకడగా పరుగులు సాధించడంలో విఫలమయ్యారని ఒప్పుకోవడం కోహ్లికి మాత్రమే చెల్లింది. టీమిండియాకు శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్ లాంటి యువ ఆటగాళ్లు ఉండడం అదృష్టం. భవిష్యత్తులో వీరిద్దరికి మంచి పేరు వస్తుంది. వాస్తవానికి గిల్ 50 పరగులుతో టీమిండియాకు మంచి ఆరంభం లభించినా దానిని నిలబెట్టుకోలేకపోవడం దురదృష్టం, మరోవైపు పంత్ 91 పరుగులతో అటాకింగ్ గేమ్ ఆడడం ఎంతో ఆకట్టుకుంది. పంత్ లాంటి దూకుడైన ఆటగాడు టీమిండియాలో కచ్చింతగా ఉండాల్సిందే. ఆసీస్ టూర్లో పుజారా గాయాలు తగిలినా తన పట్టును విడవకుండా టీమిండియా సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. పుజారా నుంచి మరోసారి అలాంటి ప్రదర్శన రావాలని కోరుకుంటున్నా. ఇప్పటికే నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0 తో ఇంగ్లండ్ లీడ్‌లో ఉంది. రానున్న టెస్టుల్లో పరిస్థితులు కఠినతరం కానున్న నేపథ్యంలో టీమిండియా మరింత మెరుగ్గా రాణిస్తుందని ఆశిస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య రెండో టెస్టు ఫిబ్రవరి13వ తేదీ నుంచి చెన్నై వేదికగా జరగనుంది. ఇక యోహన్ బ్లేక్ 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక 100 మీ, 200 మీటర్ల పరుగులో ఉసేన్ బోల్ట్ తర్వాత అత్యంత వేగవంతమైన పరుగుల వీరుడిగా రికార్డు సృష్టించాడు. చదవండి: సంజయ్ బంగర్‌కు ఆర్సీబీ కీలక పదవి ఆ బెయిల్ ఎలా కిందపడింది : ఇషాంత్ This is what test cricket 🏏 is all about. @BCCI @ECB_cricket @SkyCricket @MichaelVaughan @root66 @imVkohli @jimmy9 @RealShubmanGill @RishabhPant17 @cheteshwar1 #testcricket #Cricket #INDvsENG. pic.twitter.com/z6ZpbCQAh6 — Yohan Blake (@YohanBlake) February 9, 2021 -
బ్రెజిల్ అమ్మాయితో బోల్ట్ రాసలీలలు
జమైకా చిరుత ఉసేన్ బోల్ట్‌కు ట్రాక్‌పై ఎదురేలేదు. బోల్ట్ రిటైరయినట్టు ప్రకటించినా.. అతణ్ని ఓడించే మొనగాడు ఇంకా రాలేదు. బోల్ట్ వరుసగా మూడు ఒలింపిక్స్‌లోనూ స్ప్రింట్‌లో మూడేసి స్వర్ణాలు చొప్పున తొమ్మిది పతకాలు గెలిచి చరిత్ర సృష్టించాడు. బీజింగ్, లండన్, రియో ఒలింపిక్స్ ఈవెంట్లో బోల్ట్ స్టార్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ప్రపంచ స్టార్ స్ప్రింటర్‌గా బోల్ట్ సాధించిన ఘనతలు అందరికీ తెలుసు. ట్రాక్‌పై చిరుతలా పరుగెత్తే బోల్ట్ అమ్మాయిల విషయంలోనూ చాలా ఫాస్టే. జమైకాకు చెందిన గాళ్‌ఫ్రెండ్ కాసి బెనెట్‌తో రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. త్వరలోనే వీరద్దరూ వివాహం చేసుకోనున్నట్టు సమాచారం. గత ఆదివారం రియోలో 30వ బర్త్ డే పార్టీ చేసుకున్న బోల్ట్ ఓ అమ్మాయితో కలసి హుషారుగా డాన్స్ చేశాడు. ఈ ఫొటోలు బయటకు వచ్చాయి. బ్రెజిల్‌కు చెందిన 20 ఏళ్ల జేడీ డార్టె అనే విద్యార్థిని వాట్సాప్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు సంచలనం రేపాయి. బెడ్ మీద బోల్ట్ తో కలసి ఉన్నప్పటి ఫొటోలను కొన్నింటిని అప్లోడ్ చేసింది. ఒలింపిక్స్ సందర్భంగా రియోలో ఓ రాత్రి బోల్ట్‌తో గడిపినట్టు ఈ అమ్మడు బాంబు పేల్చింది. వెస్ట్ రియోలోని ఓ క్లబ్లో జమైకా స్ప్రింటర్‌ను కలిసినట్టు ట్వీట్ చేసింది. కాగా తన ఫ్రెండ్ చెప్పేంత వరకు బోల్ట్ స్టార్ అథ్లెట్ అన్న విషయం తెలియదని చెప్పింది. ఇది సాధారణ విషయమని, ఫేమస్ కావడం కోసం ఫొటోలను వాట్సప్‌లో షేర్ చేయలేదని వ్యాఖ్యానించింది. బోల్ట్ కూడా ఈ విషయాన్ని లైట్‌గా తీసుకున్నాడు. జమైకా సంస్కృతి విభిన్నంగా ఉంటుందని, మహిళలతో పోలిస్తే పురుషులకు ఒకరి కంటే ఎక్కువ భాగస్వాములుంటారని చెప్పాడు. ఓ సెలెబ్రిటీగా ఒకే మహిళతో కలసి ఉండటం కష్టమని అంగీకరించాడు. ఈ విషయంపై బోల్ట్ సోదరి క్రిస్టినె బోల్ట్ హైల్టన్ మాట్లాడుతూ.. తన సోదరుడు కాసి బెనెట్‌ను వివాహం చేసుకుంటాడని చెప్పింది. త్వరలో ఇద్దరికీ నిశ్చితార్థం జరుగుతుందని వెల్లడించింది.