breaking news
Jalvihar
-
ఖైరతాబాద్ : జలవిహార్‌లో లో ఘనంగా లోహ్రి మేళా వేడుక (ఫొటోలు)
-
జలవిహార్‌లో యోగాతో అమ్మాయిల సందడి
-
'మీడియా లేని పోలీసింగ్‌ను ఊహించలేం'
హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో మీడియా లేకుండా పోలీసింగ్‌ను ఊహించలేమని నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. పోలీసులు తీసుకునే ప్రతి చర్యలోనూ మీడియా పాత్ర వెలకట్టలేనిదని అభిప్రాయపడ్డారు. ప్రతి దశలోనూ పోలీసులకు మీడియా అండగా నిలిచిందని కితాబిచ్చారు. రంజాన్, గణేష్ ఉత్సవాలు, బక్రీద్ పండుగల్ని ప్రశాంతంగా పూర్తి చేయడానికి పోలీసులకు సహకరించిన మీడియాకు కొత్వాల్ గురువారం ఆత్మీయ పూర్వక విందు ఇచ్చారు. జలవిహార్‌లోని వేదిక హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ... 'ప్రస్తుత సమాజంలో మీడియా పాత్ర ఎంతో కీలమైంది. అనేక సందర్భాల్లో పుకార్లను అరికట్టడంతోపాటు నిజానిజాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడంలో కీలకపాత్ర పోషిస్తోంది. బుధవారం నగరంలో అనేకచోట్ల బాంబులు ఉన్నాయంటూ పుకార్లు సోషల్ మీడియాలో చెలరేగాయి. దీనిపై నేను ఇచ్చిన వివరణను ప్రజల్లోకి మీడియా తీసుకువెళ్ళి సాధారణ జనజీవనం కొనసాగేలా చేసింది. నేరాల నిరోధం, కేసులు కొలిక్కి తీసుకురావడంతోపాటు పోలీసింగ్ కోసం పోలీసులు తీసుకుంటున్న ప్రతి చర్యనూ మీడియా ప్రజలకు వివరిస్తోంది. లండన్ నగరం ప్రపంచంలోనే సేఫ్ సిటీగా మారడానికి కారణం అక్కడ దాదాపు పదేళ్ల క్రితం అమలులోకి వచ్చి, నేటికీ కొనసాగుతున్న కమ్యూనిటీ సీసీ కెమెరా ప్రాజెక్టు. హైదరాబాద్‌లోనూ దాన్ని అమలు చేస్తున్నాం. సిటీలో ఇంతగా సక్సెస్ కావడానికి మీడియా ఇచ్చిన సహకారమే ప్రధాన కారణం. భవిష్యత్తులోనూ మీడియా ఇదే విధమైన సహాయసహకారాలను అందిస్తుందని ఆశిస్తున్నాం' అని అన్నారు. -
జలవిహార్ వద్ద మృతదేహం కలకలం
హైదరాబాద్: నగరంలోని నక్లెస్ రోడ్డుకు దగ్గరలోని జలవిహార్ వద్ద బుధవారం గోనెసంచి కలకలం సృష్టించింది. రైల్వే లైనుకు పక్కనే ఉన్న పొదల్లో పడేసి ఉన్న గొనేసంచి నుంచి దుర్వాసన రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు గోనె సంచి మీద ఉన్న రక్తపు మరకలను చూసి.. మృతదేహం ఉన్నట్లుగా అనుమానించారు. కొద్దిసేపటికి సంచి నుంచి బీప్ శబ్దం వస్తుండటంతో డాగ్, బాంబ్ స్క్వాడ్ లకు సమాచారం అందించారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న డాగ్, బాంబ్ స్క్వాడ్ లు తనిఖీలు నిర్వహించి సంచిలో చుట్టి పడేసిన కుక్క మృతదేహాన్ని గోనెసంచి నుంచి బయటకు తీశాయి. గుర్తుతెలియని వ్యక్తులు రాట్ విలర్ జాతికి చెందిన ఆడ కుక్కను చంపి పొదల్లో పడేసినట్లు చెప్పారు. కాగా, రాట్ విలర్ జాతికి చెందిన కుక్కల విలువ రూ.10వేల నుంచి రూ. 1.35 లక్షల వరకు కూడా ఉంటుంది. ఈ కుక్కను ఎవరో కిడ్నాప్ చేసి, తీసుకొచ్చి చంపేసినట్లు తెలుస్తోంది. ఎవరో పెంచుకుంటున్న కుక్క అని స్పష్టంగా తెలుస్తోంది. మృతదేహం కనపడటంతో శునకాలతో పోలీసుల తనిఖీ జలవిహార్ ప్రాంతంలో బయటపడిన రాట్ వీలర్ శునకం కళేబరం -
హైదరాబాద్‌లో డెడ్‌బాడీ కలకలం