breaking news
jalsalu
-
జల్సాలకు అలవాటుపడి బైకుల చోరీ
సిద్దిపేట: వ్యసనాలకు అలవాటు పడిన ఇద్దరు వ్యక్తులు వ్యసనాల కోసం డబ్బుల సమకూర్చు కోవడానికి బైక్ దొంగతనాలకు పాల్పడ్డారు. సిద్దిపేట పట్టణం, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుస బైక్ల చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్ గురువారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిద్దిపేట టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడారు. బూర్గుపల్లి గ్రామానికి చెందిన దున్నపోతుల స్వామి(23), దున్నపోతుల సంతోష్(21) జల్సాలకు అలవాటుపడి కొంత కాలంగా ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కమిషనరేట్ పరిధిల్లో 22 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు పేర్కొన్నారు. గతంలో సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ద్విచక్ర వాహనాలను దొంగిలించి నిర్జన ప్రదేశంలో వదిలివెళ్లితే కోర్టులో డిపాజిట్ చేసి వాహన యజమానులకు అప్పగించామన్నారు. నిందితుల నుంచి బజాజ్ పల్సర్-4, హీరో హోండా ఫ్యాషన్ ప్రో-3, హీరో హోండా ఫ్యాషన్ ప్లస్-4, హీరో హోండా స్ప్లెండర్ ప్లస్-8, హోండాషైన్-1 చొప్పున బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. -
మద్యం ఆశ చూపి పది హత్యలు
జల్సాల కోసం హతమార్చిన కిరాతకుడు కేకే నగర్(చెన్నై): తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో కారు డ్రైవర్ హత్య కేసులో ఓ యువకుడిని పోలీసులు గురువారం అరెస్టు చేయగా నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. మద్యం ఆశ చూపించి పదిమందిని హత్య చేసినట్లు అతను వాంగ్మూలమిచ్చాడు. ఈ నెల 13న తిరువెరుంబూర్లోని కృష్ణసముద్రం ప్రాంతంలో మృతదేహం పూడ్చిపెట్టిన స్థితిలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాన్ని వెలికితీసిన పోలీసులు.. మృతుడిని తంగదురైగా గుర్తించారు. అతని సెల్ఫోన్ ఐఎంఈఐ నంబర్ ద్వారా విచారణ జరపగా చప్పాని(35) ఆ సెల్ఫోన్ ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. అతను, తంగదురై చిన్ననాటి స్నేహితులని, దొంగతనాలకు పాల్పడేవారని తెలిసింది. భార్య మోహనప్రియ వదలి వెళ్లిపోవడంతో విలాసాలకు డబ్బు లేక తంగదురై వద్ద చేరినట్టు చప్పాని తెలిపాడు. అతడికి మద్యం తాగిం చి చైన్, ఉంగరాలను తీసుకుని హత్య చేసి పూడ్చిపెట్టినట్లు ఒప్పుకున్నాడు. మద్యానికి బానిసలైన పదిమందికి పైగా వ్యక్తులను హత్య చేసి, వారి వద్ద ఉన్న బంగారం, నగదు దోచుకున్నట్లు తెలిపాడు.