breaking news
Isidro
-
శ్రుతీహాసన్ ఇసిడ్రో
ఇసిడ్రో అంటే ఏంటి? విచిత్రంగా ఉందే అనుకుంటున్నారా? ఇదేమీ శ్రుతీహాసన్ కొత్త సినిమా టైటిల్ కాదు. ఈ పేరుతో శ్రుతి సొంతంగా బేనర్ మొదలుపెడుతున్నారు. షార్ట్ ఫిలింస్, డిజిటల్ ఫిలింస్ నిర్మించాలనుకుంటున్నారు. మ్యూజికల్‌గా కూడా ఏదైనా చేయాలనే ప్లాన్ ఆమెకు ఉంది. ‘సినిమా తప్ప మా కుటుంబానికి వేరే తెలియదు. సినిమా లేకపోతే మేం ఉండలేం’ అని శ్రుతి చెబుతుంటారు. అందుకే, నటిగా, గాయనిగా మిగిలిపోకుండా నిర్మాణ రంగంలోకి కూడా ప్రవేశించి ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముందు లఘు చిత్రాలు, డిజిటల్ మూవీస్‌తో మొదలుపెట్టి, ఆ తర్వాత వెండితెర కోసం కూడా సినిమాలు నిర్మిస్తారని ఊహించవచ్చు. వాస్తవానికి శ్రుతి చేతిలో ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి ఏడు సినిమాలు ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్నప్పటికీ నిర్మాతగా రంగంలోకి దిగాలనుకున్నారంటే పకడ్బందీగా ప్రణాళికలే వేసుకునే ఉంటారు. ఇంతకూ ‘ఇసిడ్రో’ అంటే అర్థం ఏంటంటే... ఆలోచనల పుట్ట. చూస్తుంటే శ్రుతి తన ఆలోచనలతో అద్భుతాలు సృష్టించేటట్టే కనిపిస్తున్నారు. -
సొంత నిర్మాణ సంస్థను లాంచ్ చేసిన భామ
ముంబై: మా డీఎన్ఎ లోనే సినిమా ఉందని ప్రకటించిన అగ్ర కథానాయిక, శృతిహాసన్ సినిమా ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మల్టీటాలెంటెడ్ ఆర్టిస్టుగా తన ప్రతిభను నిరూపించుకున్న ఈ అమ్మడు ఇపుడు కొత్తగా మరో రంగంలోకి అడుగుపెట్టింది. సొంతంగా ఒక ప్రొడక్షన్ సంస్థను స్థాపించి నిర్మాతగా అవతరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. టాలీవుడ్, బాలీవుడ్‌లలో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న శృతి ఇపుడు తన జోరు మరింత పెంచింది. తన సొంత నిర్మాణ సంస్థ ఇస్రిదోను లాంచ్ చేసింది. ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా షార్ట్ ఫిలిం, యానిమేషన్, డిజినల్, మల్టీమీడియా రంగంలోకి అడుగుపెట్టింది. మా రక్తంలోనే సినిమా ఉందని గర్వంగా చెప్పే ఈ జూనియర్ హాసన్ సినీ రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది. ఎంటర్టైన్మెంట్ రంగానికి మంచి భవిష్యత్తు ఉందంటూ ఆ రంగంలో దూసుకెళ్తోంది. తన సంస్థ ద్వారా వివిధ భాషల్లో వచ్చే షార్ట్ ఫిలింలను ప్రోత్సహించనున్నట్టు తెలుస్తోంది. ఈ వార్తలను శృతిహాసన్ ప్రతినిధి ధ్రువీకరిచారు. . తెలుగు, తమిళ భాషల్లో అగ్రహీరోల సరసన నటించే అవకాశాలను ఎగరేసుకుపోతున్న శృతి వరుస విజయాలతో తనకు ఎదురే లేదని నిరూపించుకుంటోంది. తన తండ్రి కమల్ హాసన్ కు సినీపరిశ్రమలో ఉన్న పేరు ప్రఖ్యాతులకు నిజమైన వారసురాలిగా నిలుస్తోంది. కమల్ కూడా దర్శకత్వం, రచన, స్క్రీన్ ప్లే.. ఇలా రకరకాల రంగాల్లో ఉన్న విషయం తెలిసిందే.