breaking news
Iscan
-
ప్రముఖ ఆలయాల్లో జన్మాష్టమి వేడుకలు..
మధుర, బృందావనం మొదలుకొని దేశవ్యాప్తంగా నేటి ఉదయం నుంచి పలు ఆలయాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకృష్ణుని విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు. శ్రీహరి అవతారాల్లో ఇది సంపూర్ణమైనదని చెబుతారు. ఈ సారి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రెండు రోజులు నిర్వహిస్తున్నారు. కొందరు సెప్టెంబరు 6న జన్మాష్టమి వేడుకలు చేసుకోగా, మరికొందరు నేడు (సెప్టెంబరు 7)న ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నేపద్యంలో ఆలయాలన్నీ ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. #WATCH | UP: Mangala aarti underway in Krishna Janmabhoomi temple in Mathura, on the occasion of #Janmashtami pic.twitter.com/DSV80e7mbD — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 7, 2023 శ్రీకృష్ణ జన్మభూమి మధురలో ఉదయం స్వామివారికి మంగళహారతి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆ సమయంలో ఆలయంలో శంఖనాదాలు చేశారు. ఆలయంలో కొలువైన రాధాకృష్ణులకు పసుపురంగు దుస్తులు ధరింపజేశారు. అలాగే పూలతో అలంకరించారు. #WATCH | West Bengal: Devotees celebrate & offer prayers at the Iskcon temple in Kolkata on the occasion of #Janmashtami pic.twitter.com/wEDQWVEs0D — ANI (@ANI) September 7, 2023 పశ్చిమబెంగాల్లోని ఇస్కాన్ ఆలయంలో ఉదయం నుంచే భక్తుల సందడి నెలకొంది. ఆలయంలో పూజలు, అర్చనలు విశేషరీతిలో జరిగాయి. కొందరు భక్తుల భగవానుని సమక్షంలో నృత్యాలు చేశారు. కొందరు శంఖనాదాలు చేశారు. #WATCH | Uttarakhand: Devotees throng Badrinath temple during the #Janmashtami celebrations pic.twitter.com/8bf3lhclIz — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 7, 2023 ఉత్తరాఖండ్‌లోని బదరీనాథ్ ఆలయంలో స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. జన్మాష్టమి సందర్భంగా ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు. ఆలయాన్ని ఎల్ఈడీ వెలుగులతో నింపేశారు. #WATCH | Delhi: Tulsi aarti underway in Iskcon temple on the occasion of #Janmashtami pic.twitter.com/TpCbF6tsJ7 — ANI (@ANI) September 6, 2023 ఢిల్లీలోని ఇస్కాన్ మందిరంలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం స్వామివారికి తులసి హారతి సమర్పించారు. ఆలయ పూజారులు, భక్తులు సంయుక్తంగా హారతి అందించారు. స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. #WATCH | UP: Mangala Aarti underway in Noida Iskcon temple, on the occasion of #Janmashtami pic.twitter.com/U0I5878Um9 — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 6, 2023 -
బృందావనం!
– నేత్రపర్వంగా రాధాష్టమి వేడుకలు – వైభవంగా ప్రత్యేక పూజలు తిరుపతి కల్చరల్ : ఇస్కాన్ మందిరంలో శుక్రవారం రాధాష్టమి వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. కృష్ణాష్టమి తర్వాత 15వ రోజు రాధాదేవి ఆవిర్భావ దినోత్సవం (రాధాష్టమి) నిర్వహించడం ఆనవాయితీ. ఏడాదిలో రెండు సార్లు రాధాదేవి అమ్మవారి దివ్య పాద దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. శ్రీ రాధాష్టమి నాడు, కార్తీక మాసంలో వచ్చే గోపాష్టమి నాడు భక్తులు రాధాదేవి దివ్యపాద దర్శనం చేసుకొని తరిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం కమల మందిరంలో రాధాకృష్ణులకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పాభిషేకం చేపట్టారు. బృందావనాన్ని తలపించేలా రాధాకృష్ణులతో పాటు గోపికలను వివిధ పుష్పాలు, ఫలాలతో సర్వాంగ సుందరంగా కొలువుదీర్చారు. శ్రీరాధా దేవిని ప్రత్యేకంగా ఫల, పుష్పాలు, పట్టుపితాంబర వస్త్రధారణలతో సుందరంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వందలాది మంది భక్తులు రాధాదేవి దివ్యపాద దర్శనం చేసుకొని భక్తిపారవశంతో పులకించారు. హరినామ సంకీర్తనలు, భజనలు మార్మోగాయి. ఇస్కాన్ అధ్యక్షుడు రేవతీ రమణదాస్ శ్రీరాధాష్టమి విశిష్టతను తెలియజేశారు. భక్తులకు ఇస్కాన్ నిర్వాహకులు ప్రసాద వితరణ చేశారు.