breaking news
IRNSS-1B
-
నిప్పులు చిమ్ముతూ... గగనతలంలోకి...
-
'పీఎస్ఎల్వీ సీ-24 ప్రయోగం విజయవంతం'
-
పీఎస్ఎల్వీ-సీ 24 ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ 24 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టారు. భారత కాలమానం శుక్రవారం సాయంత్రం 5:14 నిమిషాలకు భూ ఉపరితలం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. ఆర్ఎన్ఎస్ఎస్-1 బీ ఉప్రగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతం కావడంపై షార్లో శాస్ర్రవేత్తలు ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. పీఎస్ఎల్వీ-సీ 24 ప్రయోగాన్ని నాలుగు దశలో చేపట్టారు. 44.4 మీటర్లు పొడవు, 320 టన్నుల బరువు ఉన్న ఉపగ్రహాన్ని దిగ్విజయంగా మోసుకెల్లింది. నారింజ రంగు జ్వాలలు ఎగజిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష పరిశోధక సంస్థ రాకెట్ మిషన్ కంట్రోల్ రూమ్ నుంచి శాస్త్రవేత్తులు ఉపగ్రహ ప్రయోగాన్ని వీక్షించారు. భారత్ ప్రయోగించిన రెండో నేవిగేషన్ ఉపగ్రహమిది. సమాచార వ్యవస్థకు ఉపయోగపడనుంది. ఐఆర్ఎన్ఎస్ఎస్ ఏడు ఉపగ్రహాల వ్యవస్థ అని ఇస్రో చైర్మన్ కే రాధాకృష్ణన్ చెప్పారు. ఈ ఏడాదిలో జూన్ తర్వాత మరో రెండు నేవిగేషన్ ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్టు తెలిపారు.