చౌక ధరల్లో లావా డ్యుయల్ సిమ్ 3జీ ఫోన్లు
ముంబై: లావా కంపెనీ చౌక ధరల్లో (రూ.6,000 లోపు)రెండు డ్యుయల్ సిమ్ 3జీ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిలో ఐరిస్ 356(ధర రూ.4,499), ఐరిస్ 402(ధర రూ.5,499) ఫోన్లు ఉన్నాయి. బడ్జెట్ స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పెరుగుతుండడం, 3జీ సేవల విస్తరణ... ఈ అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో భాగంగా ఈ స్మార్ట్ఫోన్లను కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది. ఈ రెండు ఫోన్లలో ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఓఎస్, 32 జీబీ వరకూ ఎక్స్పాండబుల్ మెమెరీ, 1.2 గిగా హెర్ట్స్ డ్యుయల్కోర్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలున్నాయి.