breaking news
ipl2018
-
కుల్దీప్ కూల్చేశాడు
మ్యాచ్‌కు ముందు ఇరు జట్లదీ దాదాపు ఒకే స్థితి. సమాన సంఖ్యలో విజయాలు, పాయింట్లు. నెట్‌రన్‌రేట్ కూడా సుమారుగా సమమే. ఎవరు గెలిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు అంత చేరువవుతుంది. ఇలాంటి సమయంలో సొంతగడ్డపై కోల్‌కతా సత్తా చాటుతూ రాజస్తాన్‌ను మట్టికరిపించింది. ముందు బౌలింగ్‌లో సత్తా చాటి రాయల్స్‌ను కట్టడి చేసిన నైట్‌రైడర్స్, ఆ తర్వాత సమష్టి బ్యాటింగ్ ప్రదర్శనతో విజయాన్ని అందుకుంది. కుల్దీప్ తెలివైన బౌలింగ్‌కు తోడు తమ స్వయంకృతం కలిపి రాయల్స్ లీగ్‌లో ముందుకెళ్లే అవకాశాలను క్లిష్టం చేసుకుంది. కోల్‌కతా: ఐపీఎల్ మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్లేఆఫ్స్ దిశగా కీలక విజయం దక్కింది. మంగళవారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 19 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. బట్లర్ (22 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, రాహుల్ త్రిపాఠి (15 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్), ఉనాద్కట్ (18 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. కుల్దీప్ యాదవ్ (4/20) ప్రత్యర్థిని పడగొట్టాడు. అనంతరం కోల్‌కతా 18 ఓవర్లలో 4 వికెట్లకు 145 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (42 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్), దినేశ్ కార్తీక్ (31 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. బట్లర్ ‘సిక్సర్’ మిస్... కోల్‌కతా బౌలర్ మావి ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను కట్టుదిట్టంగా వేయడంతో రాజస్తాన్ 2 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇందులో తొలి బంతికే స్లిప్‌లో త్రిపాఠి ఇచ్చిన క్యాచ్‌ను రాణా వదిలేశాడు కూడా. రెండో ఓవర్ వేసిన ప్రసి«ద్ కూడా తొలి రెండు బంతుల్లో ఒకటే పరుగిచ్చాడు. అయితే ఆ తర్వాతి పది బంతులు రాయల్స్ పరుగుల తుఫాన్‌ను ప్రదర్శించింది. అనంతరం నరైన్ వేసిన ఓవర్లో కూడా రెండు బౌండరీలతో 10 పరుగులు వచ్చాయి. అయితే రసెల్ బౌలింగ్‌తో రాజస్తాన్ ఇన్నింగ్స్ మలుపు తిరిగింది. పుల్ షాట్ ఆడబోయి త్రిపాఠి, కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో 63 పరుగుల (29 బంతుల్లో) తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం కుల్దీప్ అద్భుత స్పెల్ రాయల్స్ పతనాన్ని శాసించింది. కుల్దీప్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌కు ప్రయత్నించి రహానే (11) క్లీన్ బౌల్డ్ కాగా... అతని తర్వాతి ఓవర్లో మరో రివర్స్ స్వీప్‌కు బట్లర్ కూడా వెనుదిరిగాడు. జోరుగా ఆడే ప్రయత్నంలో థర్డ్‌మాన్‌లో క్యాచ్ ఇచ్చి ఔటైన బట్లర్, టి20ల్లో వరుసగా ఆరు ఇన్నింగ్స్‌లలో అర్ధసెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచే అవకాశం చేజార్చుకున్నాడు. బట్లర్ ఆట ముగిశాక రాజస్తాన్ టపటపా వికెట్లు కోల్పోయింది. అలవోకగా... క్రీజ్‌లో ఉన్నంత కొద్ది సేపు సునీల్ నరైన్ (7 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దడదడలాడించాడు. గౌతమ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో వరుసగా 6, 4, 6, 4 కొట్టి అతను కోల్‌కతాకు శుభారంభం అందించాడు. అయితే స్టోక్స్ తన రెండో బంతికే నరైన్‌ను వెనక్కి పంపించాడు. ఉతప్ప (4) విఫలం కాగా, మరో ఎండ్‌లో లిన్ సమయోచితంగా ఆడుతూ గెలిపించే బాధ్యతను తీసుకున్నాడు. అతనికి నితీశ్ రాణా (17 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) సహకరించాడు. లిన్‌ను స్టోక్స్ అవుట్ చేసినా... కార్తీక్, రసెల్ (5 బంతుల్లో 11 నాటౌట్; 2 ఫోర్లు) భాగస్వామ్యంతో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే కోల్‌కతా లక్ష్యం చేరుకుంది. ఆర్చర్ వేసిన 18వ ఓవర్లో కార్తీక్ ఫోర్, సిక్స్ బాది మ్యాచ్ ముగించాడు. ఆ పది బంతులు... 6, 4, 4, 4, 4, 6, 4, 4, 6, 4... ఒక దశలో వరుసగా 10 బంతుల్లో రాయల్స్ సాగించిన వీర విధ్వంసం ఇది. జట్టు ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్ మూడో బంతి నుంచి మూడో ఓవర్ చివరి బంతి వరకు సాగిన ఈ జోరే హైలైట్‌గా నిలిచింది. ఈ పది బంతుల్లో ఆ జట్టు 7 ఫోర్లు, 3 సిక్సర్లతో ఏకంగా 46 పరుగులు రాబట్టింది. ఇందులో ముందుగా రాహుల్ త్రిపాఠి చెలరేగితే, ఆ తర్వాత బట్లర్ తన మెరుపులు చూపించాడు. ప్రసి«ద్ కృష్ణ ఓవర్లో త్రిపాఠి వరుసగా సిక్స్, 3 ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత మావి ఓవర్లో బట్లర్ 2 సిక్సర్లు, 4 ఫోర్లతో తనదైన శైలిలో ఆడుకున్నాడు. షార్ట్ థర్డ్‌మాన్, ఫైన్‌లెగ్, పాయింట్, మిడ్‌వికెట్, ఫైన్‌లెగ్, బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆరు షాట్లను బట్లర్ బౌండరీ దాటించడంతో ఆ ఓవర్లో మొత్తం 28 పరుగులు వచ్చాయి. బట్లర్, స్టోక్స్ ఇంటికి... రాజస్తాన్ రాయల్స్ ప్రధాన ఆటగాళ్లు బట్లర్, బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ తిరిగి వెళ్లనున్నారు. పాక్‌తో తొలి టెస్టులో తలపడే జట్టులో సభ్యులైన వీరిద్దరు 17లోగా తమ జట్టుకు రిపోర్ట్ చేయాల్సి ఉంది. వీరిద్దరు రాయల్స్ బరిలోకి దిగిన 13 మ్యాచ్‌లు కూడా ఆడారు. వేలంలో రూ.4.4 కోట్లకు రాయల్స్ సొంతమైన బట్లర్... వరుసగా ఐదు అర్ధ సెంచరీలు సహా 155.24 స్ట్రయిక్ రేట్‌తో 548 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి తన విలువకు న్యాయం చేశాడు. అయితే 2017లో ‘అత్యంత విలువైన ఆటగాడి’గా నిలిచిన స్టోక్స్ ఈసారి పూర్తిగా నిరాశపర్చాడు. కేవలం 16.33 సగటుతో మొత్తం 196 పరుగులు మాత్రమే చేసిన అతను, 43 సగటుతో 7 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. వేలంలో రాజస్తాన్ స్టోక్స్ కోసం రూ. 12.5 వెచ్చించినా అది ప్రదర్శనలో ప్రతిబింబించలేదు. -
తడబడి నిలబడిన ఢిల్లీ డేర్‌డెవిల్స్
సాక్షి, న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా స్ధానిక ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు 182 పరుగుల లక్ష్యాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూర్(ఆర్సీబీ) ముందుంచింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి నమ్మకాన్ని నిలబెడుతూ యుజ్వేంద్ర చహల్ ఆరంభంలోనే ఢిలీ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపించాడు. పృథ్వీ షా(2), జాసన్ రాయ్(12) విఫలమవ్వడంతో ఆతిథ్య జట్టు కష్టాల్లో పడింది. దీంతో ఢిల్లీ కెప్టెన్ శ్రెయస్ అయ్యర్, రిషభ్ పంత్‌లు ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 93 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత రిషభ్ పంత్(61; 34 బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు)ను మొయిన్ అలీ ఔట్ చేయడంతో 109 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్‌ను కోల్పోయింది. వెనువెంటనే శ్రేయాస్ అయ్యర్ నిష్క్రమించటంతో ఢిల్లీ స్కోర్‌బోర్డ్ నెమ్మదించింది. చివర్లో ఢిలీ అరంగేట్ర ఆటగాడు అభిషేక్ శర్మ(46నాటౌట్; 19 బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సర్లు), విజయ్ శంకర్(21 నాటౌట్; 20 బంతుల్లో; 2 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో చహల్ రెండు వికెట్లు సాధించగా, సిరాజ్, మొయిన్ అలీ తలో వికెట్ దక్కించుకున్నారు. -
జడేజాలం
పుణే: బెంగళూరుకు ఇక చావోరేవో! ప్లే ఆఫ్‌కు చేరాలంటే ఆడబోయే అయిదు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు విజయం సాధించాల్సిందే. పేలవ బ్యాటింగ్‌కు తోడు కీలక సమయంలో క్యాచ్‌లు జారవిడిచిన రాయల్ చాలెంజర్స్ శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఓటమి మూటగట్టుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రవీంద్ర జడేజా (3/18) స్పిన్ మాయాజాలంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులే చేయగలిగింది. పూర్తి నిస్సారంగా సాగిన ఆ జట్టు ఇన్నింగ్స్‌లో ఓపెనర్ పార్థివ్ పటేల్ (41 బంతుల్లో 53; 5 ఫోర్లు 2 సిక్స్‌లు) మినహా ఏ ఒక్క ప్రధాన బ్యాట్స్‌మన్ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. చివర్లో టిమ్ సౌతీ (26 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాటంతో పరువు దక్కింది. ఛేదనలో రాయుడు (25 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) నిలకడ చూపగా, ధోని (23 బంతుల్లో 31 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) సిక్స్‌లతో చెన్నై మరో 12 బంతులు ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఆర్సీబీ... జడ్డూకు చిక్కి! అసలు బ్యాటింగ్ చేస్తున్నది బెంగళూరేనా! అన్నట్లు సాగింది ఆ జట్టు ఇన్నింగ్స్. మెకల్లమ్ (5) రెండో ఓవర్లోనే ఇన్‌గిడికి చిక్కాడు. డికాక్ స్వదేశానికి వెళ్లడంతో మ్యాచ్ అవకాశం దక్కిన పార్థీవ్ ఓ ఎండ్‌లో చక్కగా షాట్లు కొడుతున్నా... మిగతావారి నుంచి సహకారం కరువైంది. జడేజా తొలి బంతికే కోహ్లి (8) బౌల్డయ్యాడు. డివిలియర్స్ (1) హర్భజన్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. మన్దీప్ (7), గ్రాండ్‌హోమ్ (8) త్వరగానే వెనుదిరిగారు. అర్ధశతకం (37 బంతుల్లో) పూర్తయిన వెంటనే పార్థివ్... జడేజాకు రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. 15.1 ఓవర్‌కు ఆర్సీబీ స్కోరు 89/8. కనీసం వందైనా చేస్తుందా? అనే పరిస్థితి నుంచి ఆ జట్టు బయట పడిందంటే సౌతీ చలవే. చెన్నై నింపాదిగా... లక్ష్యం చిన్నదే అయినా చెన్నై ఛేదన మెరుపుల్లేకుండానే మొదలైంది. సౌతీ వేసిన మొదటి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి, చహల్ ఓవర్‌ను మెయిడిన్ ఆడిన వాట్సన్ (11) ఉమేశ్ అద్భుత యార్కర్‌కు నిలవలేకపోయాడు. అయితే... రాయుడు, రైనా (25) నింపాదిగా పరుగులు చేస్తూ పోయారు. సౌతీ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్ కొట్టిన రాయుడు రన్‌రేట్ మరీ తగ్గకుండా చూశాడు. రెండో వికెట్‌కు 44 పరుగులు జోడించాక ఉమేశ్ బౌలింగ్‌లో రైనా అవుటయ్యాడు. బంతులు, పరుగులు దాదాపు సమానంగా ఉన్న దశలో ధోని, బ్రేవో (14నాటౌట్) జత కలిశారు. వ్యక్తిగత స్కోర్లు 0, 1 వద్ద పార్థివ్, చహల్ క్యాచ్‌లు వదిలేయడంతో లైఫ్‌లు దక్కిన బ్రేవో కీలక సమయంలో మురగన్ అశ్విన్ బౌలింగ్‌లో సిక్స్ బాది పరిస్థితిని తేలిక చేశాడు. చహల్ వేసిన 18వ ఓవర్లో వరుసగా మూడు సిక్స్‌లు కొట్టి ధోని... తనదైన శైలిలో ఘనంగా ముగించాడు. -
సందడి చేసిన సన్‌రైజర్స్