breaking news
IPL 2021
-
కుంబ్లేకి చెప్పి ఏడ్చాను.. అయినా పట్టించుకోలేదు.. అతడేమో...: గేల్
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ (Chris Gayle) ఐపీఎల్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ (Punjab Kings) గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను అగౌరవపరిచారని.. యాజమాన్యం వ్యవహారశైలి కారణంగా తాను డిప్రెషన్లో కూరుకుపోయే పరిస్థితి తలెత్తిందని తెలిపాడు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 2008లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు.2021లో ఐపీఎల్‌కు వీడ్కోలు..క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తంగా 142 మ్యాచ్‌లు ఆడిన క్రిస్ గేల్.. ఆరు శతకాల సాయంతో 4965 పరుగులు సాధించాడు. పంజాబ్ కింగ్స్ తరఫున తన చివరి మ్యాచ్ ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 2021లో ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. పంజాబ్ ఫ్రాంఛైజీ (అప్పడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్)కి 2018- 2021 వరకు ప్రాతినిథ్యం వహించిన గేల్.. మొత్తంగా ఆ జట్టు తరఫున 41 మ్యాచ్‌లు ఆడి 1304 పరుగులు చేశాడు.ఇందులో ఓ సెంచరీ, పదకొండు అర్ధ శతకాలు కూడా ఉండటం విశేషం. ఇక పంజాబ్ తరఫున గేల్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 104. అయితే, జట్టు కోసం ఇంతచేసినా.. ఫ్రాంఛైజీ మాత్రం తనకు కనీస మర్యాద ఇవ్వలేదని గేల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.గౌరవం, మర్యాద ఇవ్వలేదు‘‘పంజాబ్ ఫ్రాంఛైజీ కారణంగా నా ఐపీఎల్ కెరీర్ ముందుగానే ముగిసిపోయింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో నన్ను అగౌరవపరిచారు. ఓ సీనియర్ ఆటగాడిగా నాకు ఇవ్వాల్సిన గౌరవం, మర్యాద ఇవ్వలేదు.జట్టుతో పాటు లీగ్‌కు కూడా విలువ తెచ్చిన నాలాంటి ఆటగాడి పట్ల అలా ఎవరూ వ్యవహరించరు. నన్నో చిన్నపిల్లాడిలా చూశారు. వారి వైఖరి వల్ల.. జీవితంలో తొలిసారి నేను డిప్రెషన్లోకి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది.కుంబ్లేకి చెప్పి ఏడ్చాను.. అయినా పట్టించుకోలేదునా మనసు బాగా గాయపడింది. ఇదే విషయాన్ని అనిల్ కుంబ్లేకు చెప్పాను. అతడితో మాట్లాడుతూ గట్టిగా ఏడ్చేశాను. కానీ అతడు కూడా నన్ను పూర్తిగా నిరాశపరిచాడు. ఫ్రాంఛైజీని యాజమాన్యం నడిపిస్తున్న తీరు నన్ను నిరాశకు గురిచేసింది.కేఎల్ రాహుల్ ఫోన్ చేసి..అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్ నాకు ఫోన్ చేసి.. ‘క్రిస్.. నువ్వు తదుపరి మ్యాచ్ ఆడబోతున్నావు’ అని చెప్పాడు. నేను మాత్రం.. ‘మీకు ఆల్ ది బెస్ట్’ అని చెప్పేసి బ్యాగ్ సర్దేసుకున్నాను. ఫ్రాంఛైజీ నుంచి బయటకు వచ్చేశాను’’ అని శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో గేల్ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించాడు.కాగా కేకేఆర్, పంజాబ్ జట్లతో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా గేల్ ప్రాతినిథ్యం వహించాడు. ఇటీవల ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఆర్సీబీ ట్రోఫీ గెలిచినప్పుడు విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌తో కలిసి మైదానమంతా కలియదిరుగుతూ సందడి చేశాడు. ఇదిలా ఉంటే.. పంజాబ్‌పైన గేల్ 16 ఇన్నింగ్స్ ఆడి 797 పరుగులు చేయడం గమనార్హం.చదవండి: సెలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పాకిస్తాన్ కెప్టెన్ -
ఆసీస్ స్టార్ ఆటగాడిపై వేటు!
న్యూఢిల్లీ: కరోనా ప్రతిబంధకాలను దాటుకుని ఐపీఎల్ 13వ సీజన్‌ను విజయవంతం చేసుకుంది. 2021లో 14వ సీజన్‌కు రెడీ అవుతోంది. ఇక తాజా సీజన్లో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు సంబంధించి ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఈ ఏడాది వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్ అతన్ని వదులుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. గత సీజన్లో కెప్టెన్‌గా, ఆటగాడిగా పేలవ ప్రదర్శన కనబర్చినందుకుగాను స్మిత్‌పై వేటు వేయాలని ఆర్ఆర్ యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే స్మిత్ స్థానంలో జట్టు నాయకత్వ బాధ్యతలను కేరళ డాషింగ్ ప్లేయర్ సంజు శాంసన్ చేపట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా, జట్టులో కొనసాగే ఆటగాళ్ల జాబితాను ఈ నెల 20లోగా సమర్పించాల్సి ఉండటంతో ఆర్ఆర్ యాజమాన్యం త్వరలో తమ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా దుబాయ్, షార్జా వేదికలుగా జరిగిన గత ఐపీఎల్లో స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు చిట్ట చివరి స్థానంలో నిలిచింది. ఆ సీజన్‌లోని ఆరంభ మ్యాచ్‌ల్లో చెన్నై, పంజాబ్ జట్లపై వరుస అర్ధ శతకాలు సాధించి, జట్టును గెలిపించిన స్మిత్.. ఆతరువాతి మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయి ప్రదర్శనను కనబర్చలేకపోయాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా పూర్తిగా విఫలమై జట్టు వైఫల్యాలకు పరోక్షంగా బాధ్యుడయ్యాడు. ఇదే అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ఆర్ఆర్ యాజమాన్యం.. అతనిపై వేటు వేయాలని భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఐపీఎల్-2020 సీజన్లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన స్మిత్.. 131.22 స్ట్రైక్‌రేట్‌తో 311 పరుగులు సాధించాడు. ఇందులో 3 అర్ధ శతకాలు ఉన్నాయి. కాగా, బాల్ టాంపరింగ్ వివాదం ముగిసాక 2018 వేలానికి ముందు ఆర్ఆర్ జట్టు స్మిత్‌ను 12.5 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి తిరిగి దక్కించుకున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్ కొత్త ఫార్మాట్ ఎలా?
న్యూఢిల్లీ: వచ్చే ఐపీఎల్ సీజన్‌ను పది జట్లతో విస్తరించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భావిస్తోంది. ఈ నెల 24వ తేదీన జరుగనున్న బీసీసీఐ ఏజీఎం సమావేశంలో ఐపీఎల్-2021ని పది జట్లతో నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోవడానికి బోర్డు పెద్దలు ఇప్పటికే సిద్ధమైనట్లే కనబడుతోంది. పది జట్లతో ఐపీఎల్ నిర్వహణ బోర్డుకు కొత్తేం కాదు. తొమ్మిదేళ్ల క్రితమే పది జట్లు (పుణే వారియర్స్, కొచ్చి టస్కర్స్) ఐపీఎల్లో తలపడ్డాయి. అయితే ఈ పది జట్ల ముచ్చట 2013లోనే ముగిసింది. మళ్లీ ఏడేళ్ల తర్వాత విస్తరణ తెర మీదికొచ్చింది. దీనికి ప్రధాన కారణం అదానీ గ్రూప్. గుజరాత్‌కు చెందిన ఈ కార్పొరేట్ సంస్థ అహ్మదాబాద్ వేదికగా ఫ్రాంచైజీ కోసం ఆసక్తి కనబరుస్తోంది. ఇదివరకే రెండేళ్లు రైజింగ్ పుణే ఫ్రాంచైజీ ఉన్న సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్పీజీ సంస్థ కూడా తిరిగి వచ్చేందుకు తహతహలాడుతోంది. అయితే ఐపీఎల్ 2021 సీజన్లో ఒక జట్టే బరిలో దిగుతుందని.. ఆ తర్వాతి సీజన్లో పదో ఫ్రాంచైజీ బరిలో దిగుతుందని వార్తలొచ్చాయి. ఏదేమైనా ఈసారి అహ్మదాబాద్ ఫ్రాంచైజీ పేరు ఖాయమైందని సమాచారం. (అతనే నాకు స్ఫూర్తి.. ఆ అవార్డు నాకెందుకు?: హార్దిక్) ఇక ప్రస్తుతం పాల్గొనే ఎనిమిది జట్లు రౌండ్ రాబిన్ పద్దతిలో ఒక్కో జట్లతో రెండుసార్లు తలపడుతున్నాయి. దీంతో లీగ్ దశలో ఒక జట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది. ఐపీఎల్ 2021కి రెండు జట్లు వస్తే.. ఈ పద్దతి ప్రకారం మ్యాచ్‌ల సంఖ్య 18కి చేరుకుంటుంది. అప్పుడు సుదీర్ఘ ఐపీఎల్ సీజన్ అవుతునందేది కాదనలేని వాస్తవం. ఈ ఫార్మాట్ నిర్వహించడం కూడా బీసీసీఐకి పెద్ద తలనొప్పే. అందుకే బీసీసీఐ 2011 ఫార్మాట్‌ను పరిశీలించే అవకాశం ఉంది. 2011లో 10 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయాయి. లీగ్ దశలో అన్ని జట్లు 14 మ్యాచ్‌లే ఆడాయి. అలా కాకుండా కొత్త పద్ధతిపై కూడా బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది. అన్ని జట్లు లీగ్ దశలో 13 మ్యాచ్‌లకే పరిమితం చేయడంపై యోచిస్తోంది. పది జట్లను రెండు గ్రూపులు చేస్తారు. అంటే ఐదేసి జట్లతో ఒక గ్రూపు ఏర్పడుతుంది. ఇక్కడ ఒక్కో జట్టు తన బృందంలోని మరో జట్టుతో రెండు సార్లు తలపడుతుంది. ఆ రెండేసి మ్యాచ్‌లు హోమ్ గ్రౌండ్లో ఒకటి, బయట ఒకటి జరుగతాయి. అదే సమయంలో అవతలి గ్రూప్‌లోని జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అంటే లీగ్ దశలో ఒక్కో జట్టు 13 మ్యాచ్‌లు ఆడతుందన్నమాట. ఇన్ని అంశాలు పరిశీలనలో ఉండటంతో ఇదంతా గందరగోళంగానే కనిపిస్తోంది. మరి బీసీసీఐ అడుగు ఎలా ఉంటుందో అనేది ఆసక్తికరం. (ధావన్.. నేను ధోనిని కాదు: వేడ్)


