breaking news
Invijilesan
-
టెన్త్ పరీక్షలు ప్రారంభం
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 250 సెంటర్లలో తెలుగు-1 (జనరల్, కాంపోజిట్) సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించారు. దీనికి 50839 మంది విద్యార్థులు అలాట్‌కాగా 50290 మంది పరీక్ష రాశారు. 549 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల రాష్ట్ర పరిశీలకుడు నజీమొద్దీన్ 9 సెంటర్లలో, డీఈఓ మదన్మోహన్ 6 సెంటర్లలో తనిఖీ చేశారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 80 సెంటర్లలో తనిఖీలు నిర్వహించాయి. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. రిలీవ్ ఉండదు... ఏకంగా సస్పెన్షనే పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ఎక్కువగా మాల్‌ప్రాక్టీస్ కేసులు బుక్కావడం లాంటి విషయాల్లో ఇన్విజిలేటర్లను రిలీవ్ చేసే విధానం ఇకపై ఉండదు. ఇన్విజిలేషన్ విధుల పట్ల ఆసక్తిలేని వారు ఉద్దేశపూర్వకంగా పొరపాట్లు చేసి డ్యూటీ నుంచి రిలీవ్ అవుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తుండడంతో ఈ ఏడాది ప్రభుత్వం కొత్త నిబంధన విధించింది. విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఇన్విజిలేటర్లకు ఉన్నతాధికారులు మెమో జారీ చేస్తారు. వివరణ తీసుకుంటారు. సంతృప్తికరమైన కారణం లేకపోతే సస్పెన్షన్ వేటు వేసేస్థాయిలో చర్యలుంటాయని తెలిసింది. పరీక్షకు హాజరైన అంధవిద్యార్థులు నల్లగొండలోని అంధుల పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థులు స్క్రైబ్ (సహాయకుడు)తో పరీక్షకు హాజరయ్యారు. వారందరికీ విశ్వదీప్ పాఠశాల కేంద్రాన్ని కేటాయించారు. ఒకే పాఠశాల నుంచి 20 మంది అంధ విద్యార్థులు టెన్తపరీక్షలకు హాజరుకావడం రాష్ట్రంలో ఇదే ప్రథమం. గేట్లు తెరవని అధికారులు 10వ తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి 8.45 గంటలకే చేరుకోవాలని అధికారులు ఆదేశించడంతో విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే చేరుకున్నారు. కానీ చాలా సెంటర్లలో 9 గంటల వరకు ఆయా పాఠశాలల గేట్లు తెరవకపోవడంతో విద్యార్థులు రోడ్లపైనే వేచి చూడాల్సి వచ్చింది. తమ ఆదేశాలను ఆయా పరీక్ష కేంద్రాల నిర్వాహకులు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని ఉన్నతాధికారులు మర్చిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
సవాలే... అధిగమిస్తాం
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కోడ్ అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాం. బ్యానర్లు, గోడరాతలు తదితరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించా. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నాటి ఓటరు జాబితా ఆధారంగా వార్డులగా వారీగా ఓటర్ల విభజన కూడా పూర్తయింది. వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్లు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు తదితరాలపై కసరత్తు జరుగుతోంది. సుమారు రెండు వేల మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణకు అవసరమవుతారని అంచనా. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కోసం రెండు లేదా మూడు వార్డులకు ఒకరు వంతున ఎన్నికల అధికారిని నియమిస్తున్నాం. పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్‌లో ఉన్న సిబ్బందిని ఎన్నికల నిర్వహణ ప్రక్రియ నుంచి మినహాయిస్తున్నాం. ఎన్నికల కోడ్ పర్యవేక్షణ బాధ్యత తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లకు అప్పగించాం. ఆర్డీవోలు, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్లు ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. డీఆర్డీఏ పీడీ, జడ్పీ సీఈవోలు నాలుగేసి మున్సిపాలిటీల్లో ఎన్నికల ఏర్పాట్లను చూస్తున్నారు. బందోబస్తుపై ప్రత్యేక దృష్టి ఎన్నికలు నిష్పాక్షికంగా శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వర్తించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం జిల్లా ఎస్పీతో సమావేశం ఏర్పాటు చేశాం. మున్సిపల్ ఎన్నికల్లో సమీప గ్రామాల నుంచి ఓటర్ల తరలింపు, మద్యం, నగదు సరఫరా తదితరాలను అరికట్టేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తాం. సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి నాలుగు ప్రత్యేక తనిఖీ బృందాలు, నాలుగు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తాం. కోడ్ పర్యవేక్షణకు రెవెన్యూ, పోలీసు, ఫారెస్టు విభాగాల అధికారులకు బాధ్యతలు అప్పగించాం. మంగళవారం నుంచే వీరు బాధ్యత చేపట్టాల్సి ఉంటుంది. అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాల తరలింపు, నగదు, బహుమతులు తదితరాలపై మండల స్థాయిలో ఎంపీడీఓలు, గ్రామ స్థాయిలో వీఆర్వోలు, గ్రామ కార్యదర్శులు నిఘా వేస్తారు. గ్రామ స్థాయిలో ఎన్నికలకు సంబంధించి పార్టీలు, అభ్యర్థులు, ఇతరుల కదలికలను ఓ రిజిస్టర్లో ఎప్పటికప్పుడు పొందు పరిచేలా శిక్షణ ఇస్తున్నాం. సార్వత్రిక ఎన్నికలకూ... సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రెండు నెలలుగా ఏర్పాట్లపై చర్యలు తీసుకుంటున్నాం. అన్ని స్థాయిల్లో నోడల్ అధికారుల నియామకం పూర్తయింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సుమారు 30వేల మంది సిబ్బంది సమాచారం ఫోన్ నంబర్లతో సహా సేకరించాం. పోలింగ్ విధులకు వచ్చే పోలీసులు, వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు తదితరులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తాం. ఎన్నికల నిర్వహణలో కీలకమైన 15అంశాల పర్యవేక్షణకు ముఖ్యమైన ప్రభుత్వ శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేశాం. మీడియాలో ప్రచురితమయ్యే పెయిడ్ న్యూస్‌పైనా నిఘా వేసేందుకు కలెక్టర్ చైర్మన్‌గా కమిటీని నియమించాం. పరీక్షలపై ప్రత్యేక దృష్టి పది, ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో ఇటు విద్యార్థులకు, అటు ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ‘ప్రేరణ’ తరగతులు ప్రారంభించాం. పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్‌లో ఉన్న ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నాం. మున్సిపల్ పోలింగ్ బూత్‌లు వున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.