breaking news
Internet information system
-
‘గత విస్మృతి’తో గందరగోళం
తన గతం ప్రపంచం దృష్టి నుంచి చెరిగిపోవాలని ఈ హక్కు మేరకు వ్యక్తులు కోరవచ్చు. ఆ క్రమంలోనే ఇంటర్నెట్ నుంచి ఫొటోలు, వివరాలు, అందుకు సంబంధించిన లింకులను కూడా తొలగించమని సమాచార వ్యవస్థలను కోరే హక్కు వారికి సంక్రమిస్తుంది. వ్యక్తులు తమ తమ చేదు గతాన్ని సమాజం దృష్టి నుంచి మరుగుపరచాలని కోరుకోవచ్చున ని చెప్పే హక్కు గురించి ఇప్పుడు కొన్నిదేశాలు మాట్లాడుతున్నాయి. దీనికే ‘గత విస్మృతి హక్కు’ అని పేరు పెట్టారు. ఇందువల్ల ఒక వ్యక్తికి సంబంధించిన గతం, అందులోని చీకటికోణం మూడో కం టికి తెలియదన్నమాట. మనిషి తన గతాన్ని మరచిపోవడం ఎలాగూ సాధ్యం కాదు. కాబట్టి సమాజమే దానిని మరచిపో యేటట్టు చేయాలన్నదే ఈ హక్కు అసలు ఉద్దేశం. జీవితం స్వయం ప్రతిపత్తితో ముందుకు సాగేందుకు ఈ హక్కు అవ సరమని అనుకూలురు చెబుతున్నారు. తన గతం ప్రపంచం దృష్టి నుంచి చెరిగిపోవాలని ఈ హక్కు మేరకు వ్యక్తులు కోర వచ్చు. ఆ క్రమంలోనే ఇంటర్నెట్ నుంచి ఫొటోలు, వివ రాలు, అందుకు సంబంధించిన లింకులను కూడా తొలగిం చమని కోరే హక్కు వారికి సంక్రమిస్తుంది. కానీ ప్రైవసీ హక్కుకూ, గత విస్మృతి హక్కుకు చాలా తేడా ఉంది. యూరోపియన్ యూనియన్ ఆవిర్భవించిన తరువాత కొన్ని దేశాలలో, ప్రధానంగా ఫ్రాన్స్, అర్జెంటీనాలలో ఈ హక్కు గురించి ఎక్కువ చర్చ జరిగి, ప్రోత్సాహం కూడా లభించింది. కానీ దీనిని మానవ హక్కులలో భాగంగా పరిగణించడం గురించీ, ఒక హక్కుగా గుర్తించడం గురించీ కూడా ఈయూ దేశాల మధ్యనే ఏకాభిప్రాయం లేదు. నిజానికి ఈ హక్కు యాదృచ్ఛికంగా తెర మీదకు వచ్చిం ది. వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని విచ్చల విడిగా సేకరించే విధానాలను నిరోధించే ఉద్దేశంతో యూరోపియన్ యూనియన్ డేటా ప్రొటెక్షన్ డెరైక్టివ్ అనే చట్టాన్ని యూరో పియన్ యూనియన్ రూపొందించినపుడే గత విస్మృతి హక్కు అంశం వెలుగు చూసింది. దీనిని మానవహక్కుల చట్టంతో సమానంగా చూడాలన్న అభిప్రాయం కొన్ని దేశా లలో వ్యక్తమవుతోంది. ఫ్రాన్స్, అర్జెంటీనా కొంతవరకు అమెరికా ఈ హక్కును గౌరవిస్తున్నాయి కూడా. ఫ్రాన్స్ 2010లోనే దీనికి చట్టబద్ధత కల్పించింది. గత విస్మృతి హక్కు ఎలాంటి వారు కోరారు? ఎందుకు కోరారు? ఒక్క ఉదాహరణ: 2014 మే నెలలో స్పెయిన్‌లో జరిగిన ఉదంతమిది. దీనినే యూరోపియన్ యూనియన్ కోర్టు వర్సెస్ కోసెజా కేసు అంటారు. స్పెయిన్‌కు చెందిన మేరియా కోసెజా తన ఇల్లు వేలానికి సంబంధించి గూగుల్ లో పెట్టిన ఒక క్లిప్పింగ్ లింక్‌ను తొలగించమని ఆదేశించవ లసిందిగా యూరోపియన్ కోర్టును ఆశ్రయించారు. తీసు కున్న రుణం తిరిగి చెల్లించలేకపోవడంతో కోసెజా ఇల్లు వేలం వేసిన సంగతిని తెలియచేసే క్లిప్పింగ్ అది. తరువాత కోసెజా రుణం చెల్లించారు. దీనితో ఆ క్లిప్పింగ్ ఉన్న లింక్‌ను తొలగించాలని కోసెజా కోరుకుని న్యాయపోరాటం చేశారు. యూరోపియన్ కోర్టు ఆ విన్నపాన్ని ఆమోదించి, గూగుల్‌కు ఆదేశాలు ఇచ్చింది. ఇలా గత విస్మృతి హక్కును వినియోగించదలుచుకున్న వారు ఎవరైనా ఉంటే, అలాంటి వారు కూడా సంప్రదించవ లసిందని గూగుల్ ఒక ప్రకటన కూడా ఇచ్చింది. తరువాత చూడాలి! కేవలం 24 గంటలలోనే 12,000 విన్నపాలు ముం చెత్తాయి. మొదటి నాలుగు రోజులు గడిచేసరికి విన్నపాల సంఖ్య 40,000కు చేరింది. నెల తిరిగేసరికి 70,000 వేల విన్న పాలు గూగుల్ మీద వెల్లువెత్తాయి. వీటిలో ఫ్రాన్స్‌కు చెందినవే ఎక్కువ. దాదాపు 52 శాతం విన్నపాలను గూగుల్ గౌర వించింది. కొన్నింటిని తిరస్కరించ వలసి వచ్చింది. చివరికి ఇందుకోసం గూగుల్ ఓ సలహా మండలిని నియమించింది. కానీ గత విస్మృతి హక్కు మీద ఏకాభిప్రాయానికి రావ డం ఇప్పట్లో సాధ్యం కాదనే అనుకోవాలి. ఇందుకు ప్రధాన కారణం అందులోనే అస్పష్టత. గత విస్మృతి హక్కుకు పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పిస్తే వాక్ స్వాతంత్య్రానికి చేటు జరుగు తుందన్న అనుమానాలు ఉన్నాయి. సెన్సార్షిప్ కారణంగా ఇంటర్నెట్ సేవలలో నాణ్యత లోపిస్తుందనీ, చరిత్ర పునర్ని ర్మాణానికి ఆటంకంగా మారుతుందనీ కూడా విమర్శలు ఉన్నాయి. ఇలాంటి అనుమానాలు అమెరికాకు కూడా ఉన్నా యి. అయినా, ఒకసారి వెలుగుచూసిన వాస్తవిక సమాచారా న్ని అభ్యంతరాల రూపంతో ఉపసంహరించుకోవడమంటే, సెన్సార్‌షిప్‌కు తక్కువేమీ కాదని కొందరు విద్యావేత్తలు చెబుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా, యూరోపియన్ కోర్టు స్పెయిన్‌కు చెందిన కోసెజాకు అనుకూలంగా తీర్పు నిచ్చి, ఇల్లు వేలానికి సంబంధించిన క్లిప్పింగ్ లింక్‌ను తొల గించవలసిందని ఆదేశించింది. కానీ ఒకనాడు చట్టప్రకారం కోసెజా ఇల్లు వేలం వేసిన సంగతి వాస్తవం కాదా? దీనికి యూరోపియన్ కోర్టు సమాధానం చెప్పడం అవసరమని ఇంకొందరు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. - కల్హణ -
నెట్టింట్లో హార్ట్ బ్లీడ్!
వెబ్ వ్యవస్థకు వణుకు మొదలైంది. ఇంటర్నెట్ సెక్యూరిటీలో మరో పెద్ద సమస్య వచ్చి పడింది. వేలాది వెబ్సైట్లు, వందలాది సర్వర్ల, లక్షల సంఖ్యలోని స్మార్ట్ డివైజ్‌లు ఇప్పుడు ప్రమాదంలోపడ్డాయి. ‘హార్ట్‌బ్లీడ్’ బగ్‌తో అంతర్జాలం మొత్తం అతలాకుతలం అయ్యే పరిస్థితి నెలకొంది. ఇంటర్నెట్ రక్షణ వ్యవస్థలో అంతర్గతంగా మొదలైన ఈ సమస్య ఇప్పుడు హ్యాకర్ల పాలిట వరంగా మారింది. నెటిజన్ల పాలిట శాపంగా మారింది. ఇంటర్నెట్ గుండెకు గాయం అయ్యింది. ఆ గాయం పేరే ‘హార్ట్‌బ్లీడ్’. ఇంటర్నెట్ సమాచార వ్యవస్థను సవాల్‌గా మారిన బగ్(క్రిమి) ఇది. సెక్యూర్ సాకెట్ లేయర్(ఎస్ఎస్ఎల్)అనే ఇంటర్నెట్ సెక్యూరిటీ వ్యవస్థకు సోకిన చిన్న జబ్బు ఈ హార్ట్ బ్లీడ్. ప్రస్తుతం ఇంటర్నెట్లో సమాచార వాహినికి రక్షణగా ఉంటున్న ఎస్ఎస్ల్లో అంతర్గతంగా ఈ సమస్య మొదలైంది. పలితంగా వెబ్‌లోని సర్వర్లకు, ఆ సర్వర్లు దాచుకొన్న సమాచారానికి రక్షణ లేకుండా పోతోంది. హ్యాకర్లు అనుకోవాలే కానీ మొత్తంగా వెబ్వ్యవస్థను మొత్తంగా కబళించడానికి అవకాశం ఇస్తోంది ఈ బగ్. ఎస్ఎస్ఎల్ అంటే ఏంటి? ఏం చేస్తుంటుంది? వెబ్, ఈమెయిల్, ఇన్స్టంట్ మెసేజింగ్ సర్వీసులు విషయంలో భద్రతను, ప్రైవసీకి అవకాశం ఇచ్చేదే ఈ క్రైప్టోగ్రాపిక్ సాఫ్ట్ వేర్పని. సెక్యూర్ సాకెట్ లేయర్(ఎస్ఎస్ఎల్) అనే ఈ సాఫ్ట్వేర్ ఇంటర్నెట్లోని సమాచారం హ్యాకర్ల బారిన పడకుండా ఒక కవచంలా ఉపయోగపడుతుంది. ఒక రష్యన్ పత్రిక వెర్షన్ ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 60 శాతానికిపైగా సర్వర్లు ఈ సాఫ్ట్‌వేర్‌నే రక్షణ వ్యవస్థగా ఉపయోగిస్తున్నాయి. మనకొచ్చే ప్రమాదం ఏమిటి?! మనం ఉన్న అపార్ట్మెంట్ కు భద్రతా పరమైన సమస్యలు ఉన్నాయని ప్రపంచానికి అర్థం అయ్యింది. మరి ఇప్పుడు దాని వల్ల మనకు వ్యక్తిగతంగా నష్టం కలగొచ్చు, ఆర్థికంగా నష్టం కలగొచ్చు, మానసికంగా భయం ఉండొచ్చు... ఇప్పుడు ఈ బగ్ వల్ల ఉండే ప్రమాదం కూడా అదే. మనం ఉపయోగిస్తున్న సోషల్నెట్వర్కింగ్ సైట్ అయినా మన కంపెనీ వెబ్సైట్ అయినా ఎస్ఎస్ఎల్ రక్షణ వ్యవస్థను ఉపయోగిస్తున్నట్లు అయితే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనకు నష్టం ఉండవచ్చు. బగ్ బలహీనతను గమనించి హ్యాకర్లు సర్వర్ల మీదకు దాడికి పూనుకొనే అవకాశం ఉంది. ఒక్కసారి అవకాశం దొరికితే వారు ఏమైనా చేయగల అవకాశం ఉంది. మొత్తం సమాచారం అంతా తస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఇంటర్నెట్తో కనెక్ట్ అయిన మొబైల్ఫోన్లకు కూడా దీంతో ప్రమాదం ఉంది. అందరం బాధితులమేనా?! మూడింట రెండొంతుల వెబ్సైట్లు హార్ట్‌బ్లీడ్ బారిన పడ్డాయని ఒక అంచనా. తాజాగా యాంటీ వైరస్ జెయింట్ మెకాఫే ఒక టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాన్ని ఓపెన్ చేసుకొని వెబ్సైట్ డొమైన్ నేమ్‌ను పేస్ట్ చేస్తే సదరు వెబ్సైట్ హార్ట్‌బ్లీడ్ బారిన పడిందా? లేదా?అనే విషయం గురించి స్పష్టత వస్తుంది! మీ సోషల్నెట్వర్కింగ్ అకౌంట్ లాగిన్ పాస్‌వర్డ్‌ను తక్షణం మార్చేసుకోవడం సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు. పరిష్కారం ఎప్పుడు ఎలా?! ప్రస్తుతానికి వెబ్‌లో ఈ అంశం గురించే తెగ చర్చ జరుగుతోంది. ఎస్ఎస్ఎల్ నిపుణులు ఈ బగ్‌ను నశింపజేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి పరిష్కార మార్గం గురించి వారు చేసే ప్రకటన గురించి ఎదురు చూడటమే తప్ప మరో మార్గం ఏదీ లేకుండా పోయింది. సమస్య అయితే చాలా తీవ్రమైననదేనని అయినా పరిష్కార మార్గం మాత్రం కచ్చితంగా ఉందని వారు స్పష్టం చేస్తుండటం ఆశావహ పరిస్థితులకు కారణం అవుతోంది. - జీవన్ రెడ్డి .బి వైరస్‌కు బగ్ కూ తేడా ఇది... ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో లేదా ఒక ప్రత్యేకమైన వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని తయారు చేసే విచ్ఛిన్నకర సాఫ్ట్‌వేర్‌ను వైరస్ అంటాం. అయితే ‘బగ్’ అనేది భిన్నమైనది. ఒక సాఫ్ట్వేర్ తయారు చేసినప్పుడు అనుకోకుండా ఏర్పడే బలహీనతనే బగ్ అంటాం. అంటే దీన్ని ప్రత్యేకంగా హ్యాకర్లు తయారు చేసి వెబ్మీదకి వదల్లేదు. అనుకోకుండా ఏర్పడినది. సాఫ్ట్‌వేర్‌లోని ఈ బలహీనత హ్యాకర్లకు ఆయుధంగా మారుతుంది. కంప్యూటర్ నరకులు విజృంభించడానికి అవకాశం ఇస్తోంది.