breaking news
internationally
-
వృద్ధి అవకాశాలు పటిష్టం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నప్పటికీ దేశీ ఆర్థిక వృద్ధి మూలాలు 2025–26 ఆర్థిక సంవత్సరానికి బలంగానే ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సమీక్షా నివేదిక వెల్లడించింది. మెరుగైన వర్షపాతం, ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిలో ఉండడం, వడ్డీ రేట్లు తగ్గించడం, జీఎస్టీ సంస్కరణల సానుకూల ఫలితంతో దేశీ డిమాండ్ బలంగా ఉంటుందని పేర్కొంది. ‘‘అంతర్జాతీయంగా ఆర్థిక, వాణిజ్య అనిశ్చుతులు నెలకొన్నాయి. అయినప్పటికీ 2025–26 క్యూ2లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. ఆగస్ట్‌లో భారత ఉత్పత్తులపై అమెరికా అధిక టారిఫ్‌లు విధించిన తరుణంలోనూ ఈ స్థాయి పనితీరు చెప్పుకోతగినది’’అని ఆర్థిక శాఖ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. సరఫరాకు సంబంధించి కీలక కొలమానాలు మెరుగైన వృద్ధిని సూచిస్తున్నాయని.. జీఎస్టీ సంస్కరణలకు, పండుగల సెంటిమెంట్ తోడై వినియోగం మెరుగుపడుతుందని తెలిపింది. 2025–26పై భారత వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ 6.6 శాతానికి, ఆర్బీఐ 6.8 శాతానికి పెంచడాన్ని గుర్తు చేసింది. ముఖ్యంగా జీఎస్టీ రేట్ల క్రమబద్దీకరణతో ధరలు నియంత్రణల్లోనే ఉంటాయంటూ (ద్రవ్యోల్బణం), ఇది వినియోగ డిమాండ్‌కు ఊతమిస్తుందని అభిప్రాయపడింది. ధరలు తగ్గడం వల్ల వినియోగదారులకు, వ్యాపార సంస్థలకూ ప్రయోజనం లభిస్తుందని, పెట్టుబడులు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడం తెలిసిందే. అంచనాలకు మించి పనితీరు నమోదైంది. బలంగా సేవల ఎగుమతులు.. దేశ ఎగుమతులు బలంగా కొనసాగుతుండడాన్ని సైతం ఆర్థిక శాఖ తన సమీక్షలో ప్రస్తావించింది. బలమైన సేవల ఎగుమతులు వస్తు వాణిజ్య లోటును కొంత వరకు భర్తీ చేస్తున్నట్టు తెలిపింది. ఒకవైపు అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. మరోవైపు సెప్టెంబర్ నెలకు సంబంధించి ఎగుమతుల డేటాను పరిశీలిస్తే.. మరిన్ని దేశాలకు వైవిధ్యం అవుతుండడం కనిపిస్తోందని పేర్కొంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్థూలంగా పెరగడం పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయమైన కేంద్రంగా మారుతుండడాన్ని సూచిస్తున్నట్టు తెలిపింది. ఖరీఫ్ సీజన్లో రికార్డు స్థాయిలో పప్పు, ధాన్యాల సాగును ప్రస్తావించింది. అసాధారణ వతావరణ పరిస్థితుల్లో నూనె గింజల సాగు, మరికొన్ని పంటలపై ప్రభావం పడినప్పటికీ మొత్తం మీద ఆహారోత్పత్తి సానుకూలంగానే ఉన్నట్టు తెలిపింది. బ్యాంకుల రుణ వృద్ధి మోస్తరు స్థాయికి దిగొచి్చనప్పటికీ మొత్తం మీద వాణిజ్య రంగానికి నిధుల లభ్యత పరిస్థితులు మెరగుపడినట్టు పేర్కొంది. పరిశ్రమల్లో బలమైన పనితీరు సైతం ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. -
ఏఐ గ్లోబల్ మార్కెట్ @ 990 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్ల పాటు అంతర్జాతీయంగా కృత్రిమ మేథ (ఏఐ) ఉత్పత్తులు, సరీ్వసుల మార్కెట్ ఏటా 40–55% మేర వృద్ధి చెందనుంది. 2027 నాటికి 780 బిలియన్ డాలర్లు–990 బిలియన్ డాలర్ల స్థాయి వరకు చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలో సరఫరా, డిమాండ్‌పరమైన సమస్యల వల్ల ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ దీర్ఘకాలికంగా ఏఐ మార్కెట్ వృద్ధి పటిష్టంగానే ఉండనుంది. బెయిన్ అండ్ కంపెనీ విడుదల చేసిన 5వ వార్షిక గ్లోబల్ టెక్నాలజీ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఏఐకి విస్తృతంగా కంప్యూటింగ్ సామర్థ్యాలు అవసరమవుతాయి కాబ ట్టి వచ్చే ఐదు నుంచి పదేళ్లలో డేటా సెంటర్ల స్థాయి కూడా భారీగా పెరగనుంది. ప్రస్తుతమున్న 50–200 మెగావాట్ల సామర్థ్యం నుంచి గిగావాట్ స్థాయికి డేటా సెంటర్ల సామర్థ్యం పెరుగుతుందని నివేదిక వివరించింది. ప్రస్తుతం భారీ డేటా సెంటర్ల వ్యయం 1 బిలియన్ డాలర్ల నుంచి 4 బిలియన్ డాలర్ల వరకు ఉండగా ఏఐ కారణంగా అయిదేళ్ల తర్వాత ఇది 10 బిలియన్ డాలర్ల నుంచి 25 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని పేర్కొంది. అలాగే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్‌కి (జీపీయూ) సైతం డిమాండ్ 30 శాతానికి పైగా పెరుగుతుందని వివరించింది. సెమీకండక్టర్లకు కొరత: ఈ పరిణామాలన్నింటి వల్ల సెమీకండక్టర్లకు కొరత ఏర్పడవచ్చని నివేదిక తెలిపింది. ఒకవేళ జీపీయూలకు డిమాండ్ రెట్టింపైతే కీలక విడిభాగాలు సరఫరా చేసే సంస్థలు ఉత్పత్తిని రెట్టింపు చేస్తే సరిపోవచ్చు, కానీ సెమీకండక్టర్ల తయారీ సంస్థలు మాత్రం ఉత్పత్తి సామర్థ్యాలను మూడింతలు పెంచుకోవాల్సి వస్తుందని వివరించింది. భారీగా వృద్ధి చెందుతు న్న కృత్రిమ మేథ కారణంగా టెక్నాలజీ రంగంలో గణనీయంగా మార్పులు వస్తాయని పేర్కొంది. చిన్న స్థాయి క్లౌడ్ సరీ్వస్ ప్రొవైడర్లు, సాఫ్ట్వేర్ వెండార్లు తదితర విభాగాల్లోనూ కొత్త ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. ఏఐని వినియోగించుకోవడం, డేటా ఆధునీకరణ కోసం కస్టమర్లకు అంతగా అవసరమైన నైపుణ్యాలు, అనుభవం లేనందున మధ్యకాలికంగా టెక్ సర్వీసులకు డిమాండ్ భారీగా ఉంటుందని పేర్కొంది. అయితే, క్రమంగా చాలా మటుకు టెక్ సరీ్వసుల స్థానాన్ని సాఫ్ట్వేర్ భర్తీ చేస్తుందని వివరించింది. -
బీఎస్ఎన్ఎల్ ‘టాటా కామ్’ ఆఫర్
ముంబై: టెలికం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) శుక్రవారం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ చందాదారులకు అంతర్జాతీయంగా ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పిస్తోంది. తన వినియోగదారులకు అపూర్వమైన డాటా అనుభవాన్ని అందించే క్రమంలో టాటా కమ్యూనికేషన్స్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. హై క్వాలిటీ, వేగవంతమైన డాటా అందించేలా టాటా కమ్యూనికేషన్స్ తో వై ఫై, వైఫై క్లౌడ్ కమ్యూనికేషన్స్ కో్సం ఒక భాగస్వామ్యాన్ని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. దాదాపు 100కు పైగా దేశాల్లో 4.4 కోట్ల (44మిలియన్ల) వై ఫై హాట్ స్పాట్లను ఏర్పాటు చేయనుంది. అంతర్జాతీయ విమానాలు, రైల్వేలతో సహా ఈ సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్టు టాటా కమ్యూనికేషన్స్ బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. టాటా కామ్ బిఎస్ఎన్ఎల్ చందాదారులు భారతదేశం వెలుపల ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రపంచంలో వైఫై నెట్వర్కుకు అనుమతి ఉంటుందని తెలిపింది. అంతేకాదు వివిధ పాస్ వర్డ్ లను గుర్తుంచుకోవడంలో గజిబిజి లేకుండానే....వై ఫై హాట్ స్పాట్ కు ఒక్కసారి నమోదు అయితే చాలని చెప్పింది. దీంతో వారు వేరు వేరు నగరం, దేశం లేదా ఖండం ఎక్కడున్నా సమీపంలోని వైఫైకి ఆటోమేటిగ్గా కనెక్ట్ అవుతారని టాటా కామ్ వెల్లడించింది. ప్రపంచంలో్ ఎక్కడున్న బిఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదారుల బిల్లు షాక్ గురించి చింతలేకుండా ఇంటర్నెట్ అనుభూతిని అందించడమే తమలక్ష్యమని మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు.


