breaking news
International Seminar
-
రేపటి నుంచి అంతర్జాతీయ సదస్సు
గుణదల (రామవరప్పాడు ) : అంతర్జాతీయ సదస్సు ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు లయోలా కళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ జీఏపీ కిషోర్ తెలిపారు. కళాశాలలో సదస్సు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కిషోర్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి, 2016ను అంతర్జాతీయ పప్పు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో సదస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వ్యవసాయం, ఆహారం, పర్యావరణ శాస్త్ర రంగాల్లో నూతన విధానాలు అనే అంశంపై మూడు రోజుల పాటు సదస్సు ఉంటుందని చెప్పారు. పోగ్రాం కన్వీనర్ శివకుమారి మాట్లాడుతూ మెట్ట పంటలైన కంది, మినుము, పెసర వంటి పలు పప్పు ధాన్యాల సమగ్ర యాజమాన్య పద్ధతులు, పలు రకాల కొత్త వంగడాల గురించి అవగాహన ఉంటుందన్నారు. ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమావేశంలో కరస్పాండెంట్ ఫాదర్ రాజు, వైస్ ప్రిన్సిపాల్ మిల్కియార్, హెచ్వోడీలు పీ శ్రీనివాసరావు, కవిత, గ్లోరి పాల్గొన్నారు. -
పరిశోధనలతోనే మంచి ఫలితాలు
కానూరు(పెనమలూరు) : పరిశోధనలతోనే మంచి ఫలితాలు సాధించవచ్చని జేఎన్టీయూ కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ ఎ.కృష్ణమోహన్ అన్నారు. కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో మంగళవారం ఆయన పాల్గొని ప్రసంగించారు. కంప్యూటర్స్, ఐటీ రంగాల్లో నూతన ఆవిష్కరణలు చేయాలని సూచించారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో కంప్యూటర్ పాత్ర కీలకంగా ఉందన్నారు. నూతన ఆవిష్కరణలు చేయడం వలన అభివృద్ధి మరింత వేగవంతంగా చేయవచ్చని వివరించారు. డేటా ఎనలటిక్స్ టెక్నిక్స్‌ను ఆయన వివరించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ రత్నప్రసాద్, కంప్యూటర్ విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాసరావు, ఐటీ విభాగాధిపతి డాక్టర్ సునీత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అమెరికాలో భారత్ విద్యార్థులకు గుర్తింపు అమెరికాలో ఇంజినీరింగ్ చదివే భారత్ విద్యార్థులకు మంచి గుర్తింపు ఉందని మిచిగాన్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఎన్‌బింగ్‌లిన్ అన్నారు. పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో ఐటీ విభాగం ఆ«ధ్వర్యంలో ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు అంశం పై ప్రసంగించారు. అమెరికాలో భారత్ విద్యార్థులు ఉత్తమ ప్రతి¿¶ కనబరిచి ఉన్నత స్థానాల్లో ఉన్నారని వివరించారు. అమెరికాకు వచ్చే విద్యార్థులు ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శివాజీబాబు, ఐటీ విభాగాధిపతి డాక్టర్ జె.రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సింగపూర్ సదస్సుకు ‘తాళ్ల పద్మావతి’ విద్యార్థిని ఎంపిక
అభినందించిన కళాశాల చైర్మన్ తాళ్ల మల్లేశం కరీమాబాద్ : సింగపూర్‌లో సెప్టెంబర్ 3 నుంచి 6 వరకు జరుగనున్న ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ ఫార్మా కో ఎకనామిక్స్ అండ్ అవుట్‌కమ్ రిసెర్చ్(ఇస్పార్) అం తర్జాతీయ సదస్సుకు విద్యార్థిని కేతిరెడ్డి కిరణ్మయి ఎంపికైంది. ఆమె వరంగల్‌లోని తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాలలో ఫార్మా–డీ కోర్సు చదువుతున్నారు. ఈ విషయాన్ని కళాశాల చైర్మన్ తాళ్ల మ ల్లేశం, ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్రా వు ఆదివారం విలేకరులకు తెలి పారు. విద్యార్థిని కిరణ్మయి ‘డెవలప్మెంట్ వ్యాలిడేషన్ అండ్ పైలట్ టెస్టిం గ్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వశ్చనీర్’ అంశంపై రూపొందించిన పరిశోధనా పత్రాన్ని ఇస్పార్ పరిశీలించి, సదస్సుకు ఎంపిక చేసిందన్నారు. వివిధ దేశాలకు చెందిన 600 మంది విద్యార్థులు ఇస్పార్కు ప్రజెంటేషన్లు సమర్పించగా, వారిలో 20 మంది సదస్సులో పాల్గొనేందుకు అర్హత సాధించారని, ఇందులో భారత్ నుంచి ముగ్గురు ఉండగా.. కిరణ్మయి ఒకరని పేర్కొన్నారు. ఐర్లాండ్ సదస్సుకు మరో ఇద్దరు విద్యార్థులు.. ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఫార్మా కో ఎపిడెమాలజీ అండ్ థెరపిటిక్ రిస్క్ మేనేజ్మెంట్’ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి 28 వరకు ఐర్లాండ్‌లో జరుగనున్న సదస్సుకు తమ కళాశాలకు చెందిన ఫార్మా–డీ విద్యార్థులు జి.ప్రదీప్, శైలా షర్మిన్ హాజరవుతున్నట్లు కళాశాల చైర్మన్ తాళ్ల మల్లేశం తెలిపారు. సదస్సులో భారత దేశం నుంచి ఎంపికైన 15 మందిలో ఇద్దరు తమ కళాశాల విద్యార్థులే కావడం విశేషమన్నారు. వీరికి గైడ్లుగా తాళ్ల వరుణ్, విశ్వాస్, డాక్టర్ వెంకటేశ్వర్రావు వ్యవహరించనున్నారు. సమావేశంలో ఏఓ మధుసూదన్ పాల్గొన్నారు. -
సిమ్స్‌లో ముగిసిన ఆర్థోపెడిక్ సదస్సు
పుట్టపర్తి అర్బన్: సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్(సిమ్స్) ప్రశాంతి గ్రాంలో రెండు రోజులు అంతర్జాతీయ ఆర్థోపెడిక్ సదస్సు ఆదివారం ఘనంగా ముగిసింది. సదస్సులో దేశ, విదేశాలకు చెందిన 100 మంది ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు పాల్గొన్నారు. తుంటె ఎముకల మార్పిడి, పిన్న వయస్కుల్లో వాటి పునర్నిర్మాణం, సత్యసాయి ఆదర్శాల మేరకు వైద్య విధానం, వైద్యరంగంలో మానవతా విలువలు, ఆధ్యాత్మికత అన్న అంశాలపై సదస్సు సాగింది. సదస్సులో ప్రత్యక్ష శస్త్రచికిత్సల ప్రదర్శన, విశ్లేషణ, వర్క్‌షాప్‌లు, మేధావుల ఉపన్యాసాలు సాగాయి. సదస్సులో ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్.జిమ్ సులివన్,చండీగఢ్‌కు చెందిన డాక్టర్ రమేష్‌సెన్, హర్యాణాకు చెందిన మగు, బెంగళూరుకు చెందిన మధుకేష్ ఉపన్యసించారు. సదస్సు ముగిసిన అనంతరం నిపుణులు ప్రశాంతి నిలయంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
అంతర్జాతీయ సదస్సుకు హరిప్రసాద్
కేయూ క్యాంపస్ : పోలెండ్ దేశంలోని పోప్‌నాన్‌లో ఈనెల 23 నుంచి 28వ తేదీ వరకు ప్రపంచ రాజనీతి శాస్త్ర సంస్థ నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సుకు కాకతీయ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.హరిప్రసాద్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన సదస్సులో ‘పంచాయతీరాజ్ సిస్టమ్ అండ్ డెమోక్రటిక్ డిసెంట్రలైజేషన్ ఇన్ ఇండియా’ అంశంపై పరిశోధనాపత్రం సమర్పించనున్నారు. ‘ప్రపంచంలో–అసమానతలు’ అంశంపై పోప్‌నాన్‌లో సదస్సు జరుగుతున్నట్లు హరిప్రసాద్ పేర్కొన్నారు. -
పటేల్ గిరీ!... పావురంపై గురి?
సాంఘిక శాస్త్రం నెహ్రూ 125వ జయంతి పేరుతో కాంగ్రెస్ పార్టీ ఒక అంతర్జాతీయ సెమినార్‌ను ప్రకటించింది. ఈ సెమినార్లో పాల్గొనడానికి దేశ, విదేశాలలోని ఎందరెందరో ప్రముఖులకు ఆహ్వానాలందాయి. కానీ, ఈ దేశ ప్రధానమంత్రిని మాత్రం పిలవలేదు. ఎందుకంటే, ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ వ్యక్తి. నెహ్రూను కాంగ్రెస్ పార్టీ ఆస్తిగా భావిస్తున్నారు, కనుక పిలవలేదు. ఒక ప్రపంచ స్థాయి నాయకునికి, విశ్వమానవ ప్రేమికునికి ఇంత సంకుచితంగా నివాళి ఘటిస్తారా? ‘‘పటేల్.... ఈ మాట తెలుగువాళ్లకు చిరపరిచితం. తెలంగాణ ప్రాంతంలోని గ్రామాధికారి. ఆంధ్ర ప్రాంతంలో మునసబుకు సమాంతరం. తెలంగాణ ప్రాం తం చిరకాలం రాచరికవ్యవస్థలో మగ్గిన కారణంగా, ఫ్యూడల్ దోపిడీకి, పెత్తనా నికి, దాష్టీకానికి ప్రతీకగా పటేల్ అనేమాట నిలిచిపోయింది. అందుకే ఈ వ్యవస్థ రద్దయినప్పుడు ప్రజల నుంచి హర్షామోదాలు వ్యక్తమైనాయి. ఈ దేశా న్ని కాంగ్రెస్‌పార్టీ పరిపాలించిన కాలంలో కొంత నిర్లక్ష్యానికి గురైన జాతీయో ద్యమ నాయకుడు సర్దార్ పటేల్ స్మృతికి ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం విశేషంగా ప్రాధాన్యమిస్తున్నది. ఈ విషయంపై ప్రచార మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ కూడా నడుస్తున్నది. ఈ సందర్భంగా సర్దార్ పటేల్ పేరు వింటున్నప్పుడు మన పాత పటేల్ కూడా గుర్తుకొస్తున్నాడు. అంతమాత్రాన ఆ పటేల్‌కూ, ఈ పటేల్‌కూ ఏదో సంబంధం ఉన్నట్టు కాదు. అస్సలు లేదు. ఉండకూడదు. పావురం... అంటే కపోతం, శాంతికి చిహ్నం. దేశ తొలిప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూకు, పావురానికీ ఎంతో అనుబంధం. చిత్రకారులు గీసిన నెహ్రూ చిత్తరువుల్లో ఆయన ఎదపై ఎర్రగులాబీ ఎంత స్ఫుటంగా ఉంటుందో ఆయన చేతుల్లో ఎగరబోతున్న పావురం కూడా అంతే ప్రస్ఫుటంగా ఉంటుంది. శాంతిదూతగా పేరుగాంచిన నెహ్రూకు బ్రాండ్ అంబాసిడర్ పావురం. పావురం అంటే ప్రేమ అనే అర్థం కూడా ఉంది. జయంతి సందర్భంగా మళ్లీ నెహ్రూ మీద సాగుతున్న చర్చను చూస్తూవుంటే ఈ దేశంమీద, ప్రజలమీద, ప్రజాస్వామ్యం మీద, లౌకికభావనమీద ఆయనకున్న పావురం(ప్రేమ) కూడా గుర్తుకొస్తున్నది. పటేల్‌కూ, పావురానికి ఏమైనా పోలికవుందా? ఏమీ లేదు. ఫ్యూడల్ పటేల్‌కు, శాంతికపోతానికి వైరుధ్యం ఉంది. ఫ్యూడల్ పటేల్ అణచివేతకు గుర్తు, శాంతికపోతం స్వేచ్ఛకు సంకేతం. సర్దార్ పటేల్‌కూ, జవహర్లాల్ నెహ్రూకు ఏమైనా వైరుధ్యం ఉందా? ఏమీలేదు. పోలిక ఉంది. ఇద్దరూ శిఖర సమానులైన జాతీయోద్యమనేతలు. నవభారత నిర్మాణానికి పునాదులు వేయ డంలో ఒకరికొకరు చేదోడువాదోడుగా కలసి పనిచేసినవారు. అభిప్రాయాల్లో భేదాలున్నాయి. ఆలోచనల్లో తేడాలున్నాయి. నెహ్రూ ఉదారవాది, పటేల్ మిత వాది. నెహ్రూ సంపూర్ణ లౌకికవాది. పటేల్‌కు మెజారిటీ హిందువులపట్ల కొంత సానుభూతి. నెహ్రూ సౌమ్యుడు, సంప్రదింపుల ద్వారా సమస్యల పరిష్కారాన్ని కోరుకునేవాడు. అవసరమైతే కఠినంగా వ్యవహరించడానికి వెనుకాడనితత్వం పటేల్‌ది. ఈ మాత్రం భిన్నాభిప్రాయాలు, భిన్న ఆలోచనలు కాంగ్రెస్‌పార్టీలో స్వాతంత్య్ర పోరాటకాలం నుంచీ ఉన్నాయి. మితవాద ధోరణుల నుంచి, మార్క్సిస్టు ఆలోచనా స్రవంతుల వరకూ ఎన్నో పాయలు కలసి ప్రవహించిన గంగానదిలా సాగింది కాంగ్రెస్ ప్రయాణం. ఉమ్మడి లక్ష్యాలను సమష్టిగానే కాంగ్రెస్‌పార్టీ సాధించింది. భిన్నాభిప్రాయాలు ఏనాడూ శత్రువైరుధ్యాలుగా మారలేదు. నెహ్రూ చనిపోయి యాభయ్యేళ్లయింది. సర్దార్ పటేల్ అంతకుముందే చని పోయారు. ఇంతకాలానికి ఇప్పుడు నెహ్రూ వర్సెస్ పటేల్ అనే రచ్చ బయ ల్దేరింది. ప్రస్తుత రాజకీయపార్టీల స్వార్థప్రయోజనాలకోసం ఈ రచ్చ అవసర మైంది. సర్దార్ పటేల్‌ను భారతీయ జనతాపార్టీ బహిరంగంగా కబ్జా చేసింది. నెహ్రూను ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వం కుటుంబ ఆస్తిగా ప్రకటించుకుంటోం ది. నెహ్రూ 125వ జయంతి పేరుతో కాంగ్రెస్‌పార్టీ ఒక అంతర్జాతీయ సెమినా ర్ను ప్రకటించింది. ఈ సెమినార్లో పాల్గొనడానికి దేశ, విదేశాలలోని ఎంద రెందరో ప్రముఖులకు ఆహ్వానాలందాయి. కానీ, ఈ దేశ ప్రధానమంత్రిని మాత్రం పిలవలేదు. ఎందుకంటే, ప్రధానమంత్రి భారతీయ జనతాపార్టీ వ్యక్తి. నెహ్రూను కాంగ్రెస్ పార్టీ ఆస్తిగా భావిస్తున్నారు, కనుక పిలవలేదు. ఒక ప్రపంచ స్థాయి నాయకునికి, విశ్వమానవ ప్రేమికునికి ఇంత సంకుచితంగా నివాళి ఘటి స్తారా? బీజేపీ-ఆరెస్సెస్‌లతో కూడిన సంఘ్ పరివార్ భావజాలానికీ, నెహ్రూ భావజాలానికీ సాపత్యం కుదరదు. నెహ్రూ లౌకికవాదం, ఉదారవాదం, సోష లిస్టు స్నేహం వగైరాల పొడ సంఘ్ పరివార్‌కు గిట్టదు. దేశంలో బీజేపీ ప్రధాన రాజకీయపక్షంగా ఎదిగిన నేపథ్యంలో సంఘ్ పరివార్‌కు ఒక జాతీయహీరో కావాలి. జాతీయోద్యమంలో దాని భావజాలానికి ఒక ప్రతీక కావాలి. ఒక మస్కట్ కావాలి. నెహ్రూ కాంగ్రెస్ మస్కట్‌గా మారాడు. మహాత్మాగాంధీని కబ్జా చేయడం సాధ్యంకాదు. ఆయన భావజాలం కూడా సంఘ్ పరివార్‌కు సరి పడేది కాదు. అలాగని విస్మరించనూలేదు. అందుకే ఆయన బోధించిన అనేకా నేక అంశాల్లో ఒకటైన పారిశుధ్యాన్ని తీసుకొని ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇంతటితో పారిశుధ్య ప్రచారక్ పాత్రకు మహాత్ముడు పరిమితం. జాతీయోద్యమం నుంచి తమకు కావలసిన హీరోను సర్దార్‌పటేల్ రూపంలో సంఘ్ పరివార్ చాలాకాలం కిందటే కనిపెట్టింది. నెహ్రూ భావజాలాన్నీ, తద్వారా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం కోసం దశాబ్దం క్రితం నుంచే పటేల్‌ను పక్కకు తీసే కార్యక్రమాన్ని పరివార్ చేపట్టింది. నెహ్రూ స్థానంలో పటేల్ తొలి ప్రధాని అయివున్నట్లయితే దేశ భవిష్యత్తు గొప్పగా ఉండేదనే అభిప్రాయాన్ని అది ప్రచారంలో పెట్టింది. బాబ్రీమసీదు విధ్వంసం అనంతరం బీజేపీ నాయ కుడు అద్వానీకి అభినవ సర్దార్ అనే బిరుదును కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఏకంగా గుజరాత్లో 200 మీటర్ల ఎత్తయిన పటేల్ విగ్రహాన్ని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారు. తప్పేమీలేదు. ఒక జాతీయోద్యమ నాయకునికి ఘనమైన స్మృతి చిహ్నాన్ని నెలకొల్పడం స్వాగతించదగ్గదే. కానీ ఒక పెద్దగీతను చిన్న బుచ్చడం కోసం మరో పెద్ద గీత గీయాలన్న సూత్రం స్ఫూర్తితో ఈ భారీ విగ్ర హం ద్వారా నెహ్రూ స్థాయిని తగ్గిస్తామనుకుంటే మాత్రం జనం నవ్వుకుం టారు. ఒకటి రెండు సందర్భాలలో పటేల్ హిందూ అనుకూలవైఖరి తీసుకు న్నారు. మహాత్మాగాంధీ హత్యతో ఆరెస్సెస్‌పై నిషేధం విధించిన పటేల్ ఆ సంస్థ ఇకనుంచి తాము సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితమవుతామని ప్రక టించిన వెంటనే నిషేధాన్ని ఎత్తివేశారు. కొన్ని సందర్భాల్లో నెహ్రూ ఉదారవాద విధానాలను బహిరంగంగానే వ్యతిరేకించారు. ఇలాంటి కొన్ని సంఘటనలను భూతద్దంలో చూసుకున్న పరివార్ కాంగ్రెస్ పార్టీ పటేల్‌ను తమ హీరోగా క్రమ క్రమంగా తెరమీదకు తెచ్చింది. ఆ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఇక సర్దార్ పటేల్ కాషాయ హీరో. మస్కట్ మాత్రమే సర్దార్ పటేల్. మస్తిష్కం నిండా ఫ్యూడల్ పటేల్. పరిపాలనలో పటేల్గిరీ ఛాయలు కనబడుతున్నాయి. చరిత్ర పుస్తకాల్లో మతభావాలు ప్రవేశించబోతున్నాయి. ప్రత్యామ్నాయాలు లేకుండానే ప్రణాళికా సంఘాల్లాంటివి (నెహ్రూ ఛాయలు) రద్దయిపోతున్నాయి. మహా రాష్ర్ట ప్రభుత్వం బలనిరూపణ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన తీరు మనకు కనిపించింది. కశ్మీర్ వంటి సున్నిత రాష్ర్టంలో హిందువును ముఖ్యమంత్రిని చేయాలనే తెంపరితనం కనబడుతున్నది. ఆలోచనల మీద నిఘా వేస్తున్నారు. అభిప్రాయాలకు కాపలా కాస్తున్నారు. ఆడ-మగ స్నేహంపై ఆంక్షలు పెడుతున్నారు. ‘మోరల్ పోలీసింగ్‘ మొదలైంది. ఇదంతా ఏరకమైన పటేల్ గిరీ? సర్దార్ పటేల్ గిరీ మాత్రం కాదు. ఇప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇమేజ్‌పై పరోక్ష యుద్ధం జరుగు తున్నది. ఆ ఇమేజ్ మాటున ఉన్న అసలు వ్యక్తిని ఒక్కక్షణం స్ఫురణకు తెచ్చు కుందాం. నెహ్రూ తొలి భారత ప్రధాని. పదిహేడేళ్లపాటు ఆయన ప్రధానిగా ఉన్నారు. అంతకుముందు స్వాతంత్య్ర పోరాటంలో మరో పదిహేడేళ్లు జైల్లో ఉన్నారు. జైలు జీవితాన్ని ఆయన చరిత్ర పరిశోధనకు అంకితం చేశారు. భారత దేశచరిత్ర, సంస్కృతితో పాటు ప్రపంచదేశాలు- వాటి పరిణామాలను విస్తృ తంగా అధ్యయనం చేశారు. జైల్లో ఉండగానే ఆయన రాసిన గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, డిస్కవరీ ఆఫ్ ఇండియా వంటి గ్రంథాలు ప్రసిద్ధ చరిత్రకారులు రాసిన పాఠ్యపుస్తకాలకు దీటుగా గౌరవాన్ని పొందాయి. భారతదేశ చరిత్రను ప్రత్యేక శ్రద్ధాసక్తులతో ఆయన పరిశోధించారు. తొలినాటి షోడశ మహాజనపద గణరాజ్యాలనూ, వాటి ప్రజాస్వామిక లక్షణాలను సంభ్రమాశ్చర్యాలతో తిలకిం చాడు. రాజేంద్రచోళుడు ఆగ్నేయాసియాను జయించకముందే, కనిష్కుడు సెంట్రల్ ఆసియాను పాలించకముందే మనదేశంలో వర్ధిల్లిన బౌద్ధం యావత్తు ఆసియాఖండంలో గురుపీఠం సాధించిన వైనాన్ని ఆనందోద్వేగాలతో పరిశీలిం చాడు. అనేకజాతులు, అనేకభాషలు, అనేక సంస్కృతులు, అనేక తెగలు, పొంత నలేని ఆచారవ్యవహారాలు, ఎంత వైవిధ్యభరితమైన దేశం? అయినా, సహస్ర భిన్నాంశాలను కలుపుతూ ఏదో అంతర్వాహిని ప్రవహిస్తున్నది. ఆ అంతర్వా హినిలో భారతీయ ఆత్మను నెహ్రూ సందర్శించాడు. భిన్న జాతుల ప్రదేశంగా ఉన్న భారతదేశాన్ని ఒక భారతజాతిగా నిర్మించడానికి నెహ్రూకు చరిత్ర అధ్య యనం ఉపకరించింది. ఈ అధ్యయనం పర్యవసానమే నెహ్రూ ఉదారవాదం, లౌకికవాదం, ప్రాపంచిక దృక్పథం. నెహ్రూ పరిపాలనాకాలంలో కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు. చైనా యుద్ధం, షేక్ అబ్దుల్లా అరెస్ట్ వంటి కొన్ని తప్పిదాలకు నెహ్రూ కారకుడే. అయితే వాటన్నిటినీ మించి వెనుకబడిన ఈ వ్యవసాయక దేశాన్ని ఆధునిక భారత్‌గా అడుగులు వేయించిన వ్యక్తి నెహ్రూ. భారతదేశంతోపాటు వలస పాలన నుంచి విముక్తి పొందిన అనేక దేశాలు ప్రజాస్వామ్య ప్రయోగంలో విఫలమైనప్పటికీ భారత్ మాత్రం అగ్రశ్రేణి ప్రజాస్వామ్యంగా వర్ధిల్లగలిగిం దంటే అది నెహ్రూ చలవే. నాజర్, సుకర్ణో. టిటో వంటి నేతలను కలుపుకుని నెహ్రూ ప్రారంభించిన అలీనోద్యమం మరో ప్రపంచయుద్ధం జరగకుండా నిరోధించిందనడంలో సందేహంలేదు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో భార తీయ పెట్టుబడిదారి వర్గం రైల్వేలు, ఉక్కుపరిశ్రమలు వంటి భారీ పరిశ్రమలను స్థాపించేంత బలంగా లేదు. అందుకే భారీ పరిశ్రమలను ఆయన ప్రభుత్వ రంగంలో ప్రారంభిస్తూ మిశ్రమ ఆర్థికవ్యవస్థను నిర్మించారు. ఈ ప్రభుత్వరంగ సంస్థలే భవిష్యత్తులో ఒక బలమైన మధ్యతరగతి ఆవిర్భావానికి కారణమైన విషయం మరువరాదు. ఇప్పటికీ దేశంలో ప్రతిష్టాత్మక సంస్థలుగా వెలుగొందు తున్న ఐఐటీలు, ఐఐఎమ్‌లూ నెహ్రూ మానసపుత్రికలే. అణ్వస్త్ర రంగంలో, అంతరిక్ష రంగంలో దేశం సాధించిన విజయాలూ నెహ్రూ దూరదృష్టి ఫలితాలే. మతాలుగా, జాతులుగా, ప్రాంతాలుగా ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా ఒక భారతజాతిగా అజేయంగా నిలబడిందంటే అందుకు కారణం నెహ్రూ అవలంబించిన ఉదారవాద, లౌకిక విధానాలే. మేరు పర్వతం లాంటి నెహ్రూ వ్యక్తిత్వాన్ని మరుగుజ్జుగా చూపడం ఎవరికీ సాధ్యమయ్యే పనికాదు. -
ఆర్థిక అసమానతలతో ముప్పు
సాక్షి, హైదరాబాద్: సహజ వనరులను ఆక్రమించి పెంచుకున్న సంపదతో కొందరు వ్యక్తులు ప్రజాస్వామ్యంలోని అన్ని వ్యవస్థలను శాసిస్తున్నారని అంతర్జాతీయ సెమినార్లో వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ‘తెలంగాణ విద్యావంతుల వేదిక’, ‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్’, ‘డెమొక్రసీ డైలాగ్స్’ ఆధ్వర్యంలో నాలుగు రోజుల అంతర్జాతీయ సెమినార్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘ప్రజాస్వామ్యం - సామ్యవాదం - 21వ శతాబ్దపు నూతన దృక్పథాలు’ అనే అంశంపై మూడు సమాంతర సెమినార్లు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి ఈ సెమినార్‌ను ప్రారంభించారు. కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం, తెలంగాణ విద్యావంతుల వేదిక చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, ఎస్.వినయ్‌కుమార్, కె.శ్రీనివాస్‌రెడ్డి, ప్రొఫెసర్ రమా మెల్కొటే, శాంతా సిన్హా, సీడీఎస్ చైర్మన్ వై.బి.సత్యనారాయణ, దాదాపు 30 దేశాలకు చెందిన సామాజికవేత్తలు, ఆర్థికవేత్తలు, ఉద్యమకారులు, రాజకీయవేత్తలు హాజరయ్యారు. సంపన్నులే శాసిస్తే ప్రమాదం: ఈ సెమినార్లో కేంద్ర మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి మాట్లాడుతూ... ‘‘సహజ వనరులను ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు ప్రభుత్వమే ధారాదత్తం చేయడం వల్ల కొందరి సంపద హద్దుల్లేకుండా పెరిగిపోయింది. మరోవైపు ఆకలి, దారిద్య్రం వంటివి అంతకన్నా ఎక్కువగా పెరిగాయి. సంపన్నులు, పేదల మధ్య తీవ్రంగా పెరిగిన అంతరాలు సమాజంలో అశాంతిని, అసంతృప్తిని పెంచుతున్నాయి. తద్వారా పెరుగుతున్న అశాంతి సమాజ భద్రతకు మంచిది కాదు. రెండు వర్గాల మధ్య అసమానతలపై ప్రజాస్వామిక ఉద్యమాలు వస్తున్నాయి. ఇంతకన్నా ప్రమాదం అత్యంత సంపన్నుల నుంచి ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో దేశంలోని సహజ వనరులను ఉపయోగించుకుని కొందరు శతకోట్ల రూపాయల ఆస్తి ఉన్న సంపన్నులుగా ఎదిగారు. ఇలాంటివారు ప్రజాస్వామ్యంలోని అన్ని వ్యవస్థలనూ గుప్పిట్లో బంధించారు. రాజకీయాలనూ ఇలాంటివారే శాసిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను ప్రమాదం’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ శక్తులపై రాజ్యాంగ నియంత్రణ: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ప్రసంగిస్తూ... ‘‘ప్రభుత్వం ప్రోత్సహించే పెట్టుబడిదారీ విధానాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అత్యంత ప్రమాదకరం. జాతి సంపద సహజ వనరులను ఆక్రమించుకున్న మార్కెట్ శక్తులు అన్ని రాజ్య వ్యవస్థలతో పాటు మీడియా, విద్యా వ్యవస్థలనూ కబళిస్తున్నాయి. వాటి అడుగుజాడల్లో మైనింగ్ ఇతరత్రా మాఫియాలు సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. వాటిని నియంత్రించడానికి రాజ్యాంగాన్ని బలోపేతం చేయాలి’’ అని అభిప్రాయపడ్డారు. సామ్రాజ్యవాద శక్తులు అణచివేస్తున్నాయి: సీపీఎం నేత ప్రకాశ్ కారత్ మాట్లాడుతూ... ‘‘ఉత్పాతకత, మార్కెట్ రంగం ప్రభుత్వ నిర్వహణలోనే ఉండాలి. వ్యక్తుల భారీ పెట్టుబడులపై పరిమితులు విధించాలి. ఆర్థిక ప్రణాళిక ద్వారా వికేంద్రీకరణను ప్రయోగాత్మకంగా అమలుచేయాలి. బహుళ రాజకీయపార్టీల వ్యవస్థ ద్వారా వక్రీకరణలను నివారించొచ్చు. సామ్రాజ్యవాద శక్తులు విప్లవాత్మక మార్పులను నియంత్రిస్తున్నాయి. విప్లవోద్యమాలను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయ’’ని వివరించారు.