breaking news
Installment method
-
కరోనా అనిశ్చితి: చేతిలో డబ్బున్నా.. వాయిదాల్లోనే!
చెన్నై: కరోనా వైరస్ మహమ్మారిపరమైన అనిశ్చితితో కొనుగోలుదారుల ఆలోచనా విధానాలు మారుతున్నాయి. ఆర్థిక అనిశ్చితి, ఉద్యోగాల్లో కోత, జీతాల్లో కటింగ్‌లు వంటి పరిస్థితుల కారణంగా ఎప్పుడు ఏం అవసరం వస్తుందోనని చేతిలో ఉన్న డబ్బును కొనుగోళ్లకు ఖర్చు చేయకుండా, దాచిపెట్టుకునేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. నగదు పెట్టి కొనుక్కునే స్తోమత ఉన్నప్పటికీ నెలవారీ వాయిదా చెల్లింపు (ఈఎంఐ) విధానాల్లో కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఫ్రిజ్‌లు, టీవీలు, ఫోన్లు మొదలుకుని ద్విచక్ర వాహనాలు దాకా అన్నీ ఈఎంఐల్లో లేదా ’బై నౌ పే లేటర్’ (ముందు కొనుక్కోవడం, తర్వాత చెల్లించడం–బీఎన్‌పీఎల్) మార్గాల్లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో బీఎన్‌పీఎల్ స్కీములకు ఆదరణ పెరుగుతోంది. చదవండి: పసిడి బాండ్ ధర @ రూ. 4,732 డిజిటల్ చెల్లింపుల సంస్థ ఈజీట్యాప్ ద్వారా జరిగే ఈఎంఐ లావాదేవీల పరిమాణం గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది జూలైలో 220 శాతం వృద్ధి చెందడం ఇందుకు నిదర్శనం. ‘‘క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, పాయింట్ ఆఫ్ సేల్, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ద్వారా కూడా ఈఎంఐలను ప్రాసెస్ చేసే సౌలభ్యం ఉండటం .. అలాగే యువతలో బీఎన్‌పీఎల్ స్కీములకు పెరుగుతున్న ప్రాధాన్యత తదితర అంశాలు నెలవారీ వాయిదాల మార్గంలో కొనుగోళ్లు జరగడానికి దోహదపడుతున్నాయి’’ అని ఈజీట్యాబ్ ప్రోడక్ట్స్ విభాగం హెడ్ భాస్కర్ చటర్జీ తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా పలు బీఎన్‌పీఎల్ పథకాలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ తమ యాప్‌లో పే–లేటర్ సర్వీసులను అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ తమ అనుబంధ సంస్థ ఫ్రీచార్జి ద్వారా కొత్త కస్టమర్ల కోసం బీఎన్‌పీఎల్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. డిజిటల్ లావాదేవీల జోరు.. కరోనా వైరస్ కట్టడి కోసం తొలిసారి లాక్డౌన్ అమలు చేసిన 250 రోజులతో పోలిస్తే (2020 మార్చి 25 నుంచి నవంబర్ 29 మధ్యకాలం), తర్వాతి 250 రోజుల్లో (2020 నవంబర్ 30 నుంచి 2021 ఆగస్టు 6 వరకూ) డిజిటల్ లావాదేవీలు ఏకంగా 80 శాతం పెరిగాయని ఫిన్‌టెక్ సంస్థ రేజర్‌పే వెల్లడించింది. వ్యాపార సంస్థలు ఆన్లైన్ చెల్లింపుల విధానాన్ని అమల్లోకి తెచ్చే కొద్దీ డిజిటల్ లావాదేవీల పరిమాణం సదరు 500 రోజుల్లో గణనీయంగా పెరిగినట్లు ఒక నివేదికలో వివరించింది. పే లేటర్, కార్డురహిత ఈఎంఐలు వంటి కొత్త విధానాల వినియోగం కూడా పెరిగినట్లు పేర్కొంది. పే లేటర్ లావాదేవీలు 220 శాతం, కార్డురహిత ఈఎంఐ లావాదేవీలు 207 శాతం వృద్ధి చెందినట్లు వివరించింది. చౌకైన చెల్లింపు విధానాలకు కొనుగోలుదారుల్లో పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనమని రేజర్‌పే తెలిపింది. మరోవైపు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) డిజిటల్ చెల్లింపుల గణాంకాల ప్రకారం.. తరచుగా జరిగే డెబిట్ లావాదేవీలు (ఈఎంఐలు, బీమా ప్రీమియం మొదలైనవి) 4.13 కోట్ల నుంచి 5.77 కోట్లకు పెరిగాయి. విలువపరంగా చూస్తే రూ. 35,351 కోట్ల నుంచి రూ. 61,303 కోట్లకు ఎగిశాయి. ‘‘కోవిడ్ కారణంగా దాదాపు అందరి ఆర్థిక పరిస్థితిపైనా ప్రభావం పడింది. దీంతో చాలా మంది వీలైనంత ఎక్కువగా డబ్బు చేతిలో ఉంచుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారని, ఈఎంఐల వైపు మొగ్గుచూపుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి’’ అని మొబైల్ ఆధారిత ఇన్స్టంట్ క్రెడిట్ కార్డుల సంస్థ గెలాక్సీకార్డ్ వ్యవస్థాపకుడు అమిత్ కుమార్ తెలిపారు. చదవండి:బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. -
ఈఎంఐ చెల్లింపుదారులకు 3 నెలలు ఊరట
-
బలవంతపు వసూళ్లు ఆపండి
- కరువు రైతులకు వెసులుబాటు కల్పించండి - రైతులకు పగటిపూటే విద్యుత్ ఇవ్వాలి - వాటర్‌షెడ్ పనులు పూర్తిస్థాయిలో చేపట్టాలి - ఎంపీ, విజిలెన్స్ మానిటరింగ్ సమావేశంలో కో-చైర్మన్ మిథున్‌రెడ్డి సాక్షి,చిత్తూరు: ‘ప్రభుత్వమేమో ప్రజలకు ఇవ్వాల్సిన రుణమాఫీ లాంటి వాటిని వాయిదాల పద్ధతిలో ఇస్తోంది. కరువు నేపథ్యంలో ప్రజలకు కూడా అదేవిధంగా వెసులుబాటు కల్పించి డబ్బులున్నపుడు విద్యుత్ బకాయిలు చెల్లించే అవకాశం ఇవ్వాలి. అప్పటివరకూ అధికారులు బలవంతపు వసూళ్లూ ఆపాలి’ అని రాజంపేట ఎంపీ, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ కోచైర్మన్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. తొలుత విద్యుత్‌పై జరిగిన సమావేశంలో పాల్గొన్న మిథున్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు రాత్రిపూట కాకుండా పగటిపూట పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ఇచ్చే కొద్దిపాటి విద్యుత్ పగటిపూట ఇస్తే కొంతైనా మేలు చేకూరుతుందన్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి ఏడుగంటల పాటు విద్యుత్ ఇస్తున్నామని ప్రకటించినా అది ఎక్కడా అమలు కావడంలేదన్నారు. ప్రజాప్రతినిధులు, విద్యుత్ అధికారుల మధ్య సమన్వయలోపం ఉందన్నారు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను విద్యుత్‌అధికారులు పరిగణనలోకి తీసుకోవడంలేదన్నారు. ఇది మంచి సంప్రదాయం కాదని, ప్రజాప్రతినిధులు ఇచ్చిన ప్రతిపాదనలు అమలు జరిగేలా చూడాలన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, మిగతా సామగ్రికోసం ప్రజలు ట్రాన్స్‌కో కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తోందన్నారు. ముందు రైతులను గౌరవించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఉన్న తాగునీటి పథకాలతో పాటు రైతులకు సంబంధించిన విద్యుత్ సమస్యలను అధికారులు తక్షణం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వాటర్‌షెడ్ పనులు సక్రమంగా జరగడం లేదన్నారు. వాటిని వేగవంతం చేయాలన్నారు. ప్రతిపంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్లను పెట్టాలన్నారు. గతంలో సస్పెన్షన్‌కు గురైన ఉపాధి ఉద్యోగుల ఈపీఎఫ్ * 26 కోట్ల మొత్తాన్ని ఉద్యోగులకు చెల్లించాలన్నారు. సమస్యలపై గత సమావేశాల్లో ఇచ్చిన వినతులకు పరిష్కారం లభించడం లేదన్నారు. అలాంటపుడు సమావేశాలెందుకని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో విజిలెన్స్అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ శివప్రసాద్, కమిటీ కన్వీనర్, కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, శాసన సభ్యులు నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, సునీల్‌కుమార్, సత్యప్రభ, సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.