breaking news
Installment
-
పీఎం కిసాన్ నిధి విడుదలకు డేట్ ఫిక్స్?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధుల కోసం ఎంతో మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు తదుపరి విడత పీఎం కిసాన్ నిధులను ఎకరాకు రూ.2,000 చొప్పున ఈ జులైలోనే విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పీఎం కిసాన్ నిధులను ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తారు. చివరి 19వ విడతను 2025 ఫిబ్రవరిలో విడుదల చేశారు. గతేడాది జూన్ వాయిదాను నెల ముగియకముందే విడుదల చేశారు. అయితే ఈసారి నిధుల విడుదలలో జాప్యం జరుగుతుంది.త్వరలోనే జూన్ వాయిదాలను ఈ జులైలో విడుదల చేయబోతున్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రైతులు తమ అర్హతను తెలుసుకోవాలని, ఈ-కేవైసీని అప్డేట్ చేయాలని సూచిస్తున్నారు. రైతుల చిరునామా కూడా వ్యాలిడేట్ అయ్యేలా చూసుకోవాలని చెప్పారు. కొందరి చిరునామా, లొకేషన్ రికార్డుల్లో తప్పుల కారణంగా అనర్హులుగా మిగిలిపోతున్నట్లు తెలిపారు. కాబట్టి చిరునామాను అప్డేట్ చేయాలని చెప్పారు.పీఎం కిసాన్ భూమి చిరునామా అప్డేట్ చేయడం ఎలా?1. పీఎం కిసాన్ వెబ్సైట్.. https://pmkisan.gov.inలోకి వెళ్లాలి.2. హోమ్ పేజీలోని ఫార్మర్స్ కార్నర్ కింద ‘స్టేట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్’పై క్లిక్ చేయాలి.3. ‘రిజిస్ట్రేషన్ నంబర్’ లేదా ‘ఆధార్ నంబర్’ ఎంటర్ చేయాలి.4. కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.5. గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.6. మొబైల్‌కు వచ్చిన ఓటీపీ అందులో ఫిల్ చేయాలి.7. మీ పేరు మీద సాగు భూమి రుజువు పత్రాలను అప్లోడ్ చేయాలి. (పట్టా పుస్తకాలు, భూ రికార్డులు..మొదలైనవి)8. మీరు చేసిన మార్పులను సమీక్షించి ఆన్లైన్లో ఫామ్ సబ్మిట్ చేయాలి.ఈ-కేవైసీ ఎలా పూర్తి చేయాలి?ఈ పథకం అధికారిక వెబ్సైట్ ప్రకారం పీఎం కిసాన్ రిజిస్టర్డ్ రైతులకు ఈకేవైసీ తప్పనిసరి. ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ, బయోమెట్రిక్ ఈ-కేవైసీ, ఫేషియల్ అథెంటికేషన్ అనే మూడు సులువైన మార్గాల్లో ఈ-కేవైసీని పూర్తి చేయవచ్చు.పీఎం-కిసాన్ ఇన్స్టాల్మెంట్ స్టేటస్‌ను ఎలా తనిఖీ చేయాలి?https://pmkisan.gov.in అధికారిక వెబ్సైట్ సందర్శించాలి.‘నో యువర్ స్టేటస్’పై క్లిక్ చేయాలి.మీ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా ఆధార్ నెంబరు ఎంటర్ చేయాలి.లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి.ఇదీ చదవండి: మరో 2,400 మంది ఉద్యోగాలు కట్!పీఎం కిసాన్ స్కీమ్2019లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించారు. తర్వాత పీఎం కిసాన్ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ పథకంగా నిలిచింది. దీని కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున ఏప్రిల్-జులై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి నెలల్లో ఏటా రూ.6,000 చొప్పున అందిస్తారు. -
తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మెలిక
సాక్షి,శ్రీకాకుళం జిల్లా: తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మరో మెలిక పెట్టారు. తల్లికి వందనాన్ని ఇన్స్టాల్మెంట్ స్కీంగా మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నారు. 15 వేలు ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నాం. ఒకే ఇన్‌స్టాల్‌మెంటా? లేక ఇంకెలా ఇవ్వాల్లో ఆలోచిస్తున్నామంటూ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో తల్లికి వందనంపై సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పటికే 2024-25 విద్యా సంవత్సరం ‘తల్లికి వందనం’ ఇవ్వలేదు...విద్యా సంవత్సరం ముగిసినా తల్లికి వందనం ఇవ్వకుండా పిల్లలు, తల్లులను చంద్రబాబు మోసం చేశారు. ఈ ఏడాది స్కూల్, ఇంటర్ ఫీజుల కోసం పేద విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారు. ఇన్నాళ్లు మే లో 15 వేలు ఒకేసారి ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు.. తాజాగా ఇన్స్టాల్మెంట్ మెలిక పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
17వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్న ప్రధాని మోదీ
-
జీతం+ఎరియర్స్= ఆగస్టు
న్యూఢిల్లీ: 7 వవేతన సంఘం కమిషన్ సిఫారసుల అమలుకు ఓకే చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఉద్యోగులకు మరో తీపి కబురు అందించింది. సవరించి వేతనాల ప్రకారం వేతన బకాయిలలో మొదటి విడత ఆగస్టు నెలలో చెల్లిస్తున్నట్టు ప్రకటించింది. సవరించిన వేతనంతో పాటుమొదటి ఎరియర్స్ ను అందుకోనున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సాయుధ బలగాల సిబ్బంది, పెన్షనర్లలో ఉత్సాహం నెలకోనుంది. జనవరి 1, 2016 నుంచి అమలవుతున్న 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు .... పెరిగిన జీత భత్యాల బకాయిలలోచెల్లింపుల ఆదేశాలు జారీ చేసినట్టుఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విట్ చేసింది. ఆగష్టు, 2016 నెల జీతం చెల్లింపు తో పాటు మొదటి విడత నగదు చెల్లించడానికి నిర్ణయించినట్టు శుక్రవారం ట్విట్ చేసింది. జీపీఎఫ్, ఎన్ పీఎస్ తదితర సర్దుబాట్ల తరువాత ఈ చెల్లింపులు చేస్తున్నట్టు పేర్కొంది. ముందు ప్రకటించినట్టుగా 125శాతం డీఎలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎపుడు ఉంటుందనేది త్వరలోనే పకటిస్తామని తెలిపింది. జనవరి 1, 2016 నుంచి అమలు చేస్తున్న సిసిఎస్ (ఆర్పీ) రూల్స్, 2016 ప్రకారం సవరించిన వేతనంతోపాటుబ మొదటి విడత ఎరియర్స్ నగదు రూపంలో చెల్లించనున్నట్టు ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దీనికి సంబంధించి ఒక సర్క్యులర్ జారీ చేసింది.జీతం , పెన్షన్ పెంపునకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రకారం 33 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 14 లక్షల సాయుధ బలగాలు, 52 లక్షల పెన్షనర్లు భారీ వేతనాలు పొందనున్నారు. కాగా ఈ ఏడాది జనవరి నుంచి జీతాల పెంపు వర్తిస్తుంది..దీనికి సంబంధించిన వేతన బకాయిలను వాయిదాల పద్దతిలో ఉద్యోగులకు చెల్లించనున్నట్టు ప్రభుత్వం గెజిట్ లో వెల్లడించిన ంగతి తెలిసిందే. Ministry of Finance issues instructions for the implementation of recommendations of 7th CPC - fixation of pay and payment of arrears — Ministry of Finance (@FinMinIndia) July 29, 2016 -
కష్టాల్లో ‘బంగారు తల్లి’
ఖమ్మం హవేలి: చిన్నారి బాలికల కోసం ఏర్పాటు చేసిన బంగారుతల్లి పథకం 2013 మే 1 నుంచి అమలవుతున్నప్పటికీ బాలారిష్టాలు తప్పడం లేదు. ఆడపిల్లలకు ఉన్నత విద్య అందించేందుకు ప్రోత్సాహకంగా ఈ పథకాన్ని రూపొం దించారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ పథకంలో నిత్యం ఎదురుచూపులే మిగిలాయి. 90శాతం మందికి ఇప్పటికీ బాండ్లు అందలేదు. లబ్ధిదారుల ఖాతాలో తక్షణం జమ కావాల్సిన రూ.2500 మొదటి విడత నగదు కూడా 60 శాతం మందికి పైగా జమ కాలేదు. జిల్లా నుంచి అధికారులు అన్ని వివరాలను ఆన్లైన్ చేసి పంపినప్పటికీ ప్రక్రియ ఏమాత్రం ముందుకు కదలడం లేదు. ఈ పథకం కొనసాగింపు విషయమై శాసనసభ సమావేశాల్లోనూ సభ్యులు ప్రశ్నించినప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన స్పష్టత రాలేదు. పథకాన్ని యథావిధిగా కొనసాగిస్తారో.. కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తారో కూడా ఏమాత్రం స్పష్టత లేదు. సంబంధిత శాఖ మంత్రి నుంచి తగిన సమాధానం రాకపోవడంతో పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. జిలా ్లవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 14,157 మంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 6,604 మందికి మాత్రమే మొదటి విడత ఇన్స్టాల్మెంట్ నగదు ఖాతాల్లో జమ అయింది. వీరిలో సింహభాగం మందికి ఇప్పటికీ బాండ్లు అందలేదు. 7,553 మంది లబ్ధిదారుల ఖాతాలో మొదటి విడత నగదు జమ కాలేదు. బాండ్లు రాలేదు. మరో 65 మంది దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరించబడ్డాయి. జిల్లా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ద్వారా 27మండలాల్లో ఈ పథకం అమలు అవుతోంది. ఈ మండలాల నుంచి 17 నెలల కాలంలో మొత్తం 9,214 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా 54 తిరస్కరణకు గురయ్యాయి. 4,409 మందికి మొదటి విడత నగదు జమ అయింది. మరో 4,805 మందికి ఇప్పటికీ మొదటి విడత నగదు ఖాతాలో పడలేదు. కాగా ఈ ఆర్థిక సవంత్సరం 2014-15కు సంబంధించి 3,656 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా అధికారులు 3,642మంది లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేశారు. నెలలు గడుస్తున్నప్పటికీ ఇందులో ఒక్కరికి కూడా తొలివిడత నగదు జమ కాలేదు. అదేవిధంగా మరో 19మండలాల్లో ట్రైబల్ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ద్వారా ఈ పథకం అమలు అవుతోంది. ఈ 19మండలాల నుంచి గత 17 నెలల కాలంలో మొత్తం 5,050 మంది దరఖాస్తు చేసుకోగా 11 తిరస్కరణకు గురయ్యాయి. 1,874మందికి మొదటి విడత నగదు ఖాతాల్లో జమ అయింది. 3,176 మంది లబ్ధిదారులకు ఇప్పటికీ నగదు ఖాతాలో జమ కాలేదు. 2014-15 సంవత్సరానికి సంబంధించి 2,069 దరఖాస్తులు రాగా అధికారులు 2,066 లబ్ధిదారుల వివరాలు అన్లైన్ ద్వారా అప్లోడ్ చేశారు. ఇందులో ఇక్కరికి కూడా తొలివిడత నగదు ఖాతాల్లో పడలేదు. లబ్ధిదారులు తమ దరఖాస్తు ప్రక్రియ వివరాలు తెలియక గగ్గోలు పెడుతున్నారు. నెలల తరబడి బాండ్లు రాకపోగా కనీసం మొదటి విడత నగదు కూడా ఖాతాల్లో చేరకపోవడంతో లబ్ధిదారులు మండలాల్లోని ఐకేపీ, ఖమ్మంలోని డీఆర్డీఏ, భద్రాచలంలోని ఐటీడీఏ చుట్టూ తిరగాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే ఖాతాల్లో నగదు జమ చేయడంతో పాటు బాండ్లు విడుదల చేస్తే ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. పథకం కొనసాగిస్తారో, లేదోనని అబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు అనేక సందేహాలతో సతమతం అవుతున్నారు. చివరకు బడ్జెట్లో సైతం ఇందుకు సంబంధించి సరైన ప్రస్తావన లేదు. బంగారుతల్లి పథకం కొనసాగింపు, మార్పులు, చేర్పుల విషయమై రాష్ట్ర ప్రభుత్వం తగిన స్పష్టత ఇవ్వాలని, భరోసా కల్పించాలని లబ్ధిదారులతో పాటు ప్రజలు కోరుతున్నారు.