breaking news
The inquest
-
ఎస్.ఐల మృతిపై న్యాయ విచారణ జరపాలి : నాగం
హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్.ఐల మృతులపై న్యాయవిచారణ జరపాలని బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ... ముడుపుల వేధింపులతో కుకునూరుపల్లి ఎస్.ఐ. రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఎస్.ఐ సూసైడ్ నోట్లోని డీఎస్పీ, సీఐని విధుల్లోంచి తొలగించాలన్నారు. కుకునూరుపల్లి ఎస్.ఐ ఆత్మహత్యతో పాటు తాండూరు, పెద్దపల్లి ఎస్.ఐల మృతిపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని నాగం కోరారు. -
మెదక్ ‘లాఠీచార్జీ’పై విచారణ జరిపించాలి
భూ నిర్వాసితుల పోరాట కమిటీ డిమాండ్ బహిరంగ చర్చకు మంత్రి హరీశ్ సిద్ధమా?: జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్: మెదక్ జిల్లాలో భూ నిర్వాసితులపై జరిగిన లాఠీచార్జీ ఘటన, పూర్వాపరాలపై న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భూ నిర్వాసితుల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. బయటి నుంచి వచ్చిన వారు రెచ్చగొట్టడం వల్లనే లాఠీచార్జీ జరిగిందని మంత్రి హరీశ్‌రావు చెబుతున్నారని.. లాఠీచార్జీలో గాయపడిన 175 మంది వివరాలు తమ వద్ద ఉన్నాయని, ఘటన వివరాలను వారి ద్వారా తెలుసుకోవచ్చని తెలిపింది. ప్రాజెక్టుల కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారని ప్రభుత్వం చెబుతున్నందున, నిర్వాసితులకు పరిహారంపై ముంపు ప్రాంతాల్లో స్వతంత్ర కమిటీల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేసింది. బుధవారం హైదరాబాద్‌లో కమిటీ గౌరవాధ్యక్షుడు జస్టిస్ బి.చంద్రకుమార్ విలేకరులతో మాట్లాడుతూ, నిర్వాసితుల సమస్యలపై సమావేశాలు పెట్టే వాళ్లను, ఉద్యమాలకు నాయకత్వం వహించే వాళ్లను జైళ్లలో వేస్తామని హెచ్చరించడానికి హరీశ్‌రావు ఎవరని ప్రశ్నించారు. భూములిచ్చేం దుకు రైతులు అంగీకారంతో ఉన్నారని హరీశ్ చెబుతున్నారని, దీనిపై బహిరంగచర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ప్రాజెక్టులకు భూసేకరణపై సీఎం జోక్యం చేసుకుని, వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని కమిటీ కన్వీనర్ బి.వెంకట్ డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వం వారంలోగా రెఫరెండం నిర్వహించకపోతే తామే దానిని నిర్వహిస్తామన్నారు. భూ సేకరణలో రెవెన్యూ యంత్రాం గం టీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నదని ధ్వజమెత్తారు. సమావేశంలో కమిటీ నాయకులు బొంతల చంద్రారెడ్డి, మచ్చా వెంకటేశ్వర్లు, మూడ్ ధర్మానాయక్, బండారు రవికుమార్, టి.సాగర్, బి.ప్రసాద్, ఆర్.వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. -
కాల్‌మనీ దోషులకు ప్రభుత్వ అండ
ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఏసమ్మ గుంటూరు వెస్ట్ : కాల్‌మనీ వ్యవహారంలో దోషులకు సిఎం చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉంటూ, వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నదని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి శీలం ఏసమ్మ ఆరోపించారు. కాల్‌మనీ వ్యవహారంలో దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు రూరల్ మండలం లాల్పురం పంచాయతీ పరిధిలోని లింగాయపాలెం అల్లూరిసీతారామరాజు కాలనీలో మంగళవారం సభ జరిగింది. సభలో ఏసమ్మ మాట్లాడుతూ ఈ వ్యవహారంపై నిస్పక్షపాతంగా న్యాయవిచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాల్‌మనీ మాఫియాకు పోలీసు వ్యవస్థ అండగా ఉండటం వల్ల దురాగాతాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో సంఘం డివిజన్ కార్యదర్శి డి.శివపార్వతి, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎన్.బ్రహ్మయ్య, అఖిల భారత రైతుకూలీ సంఘం నాయకులు నక్కా పోతురాజు తదితరులు పాల్గొన్నారు.