breaking news
Information Technology & Communications Minister
-
2028 నాటికి దేశీయ 7 నానోమీటర్ చిప్ సిద్ధం
న్యూఢిల్లీ: కంప్యూటర్ చిప్‌లను దేశీయంగానే అభివృద్ధి చేసుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో డిజైన్ చేస్తున్న మొట్టమొదటి 7 నానోమీటర్ కంప్యూటర్ చిప్ ‘శక్తి’2028 నాటికి సిద్ధమవుతుందని ఐఐటీ–మద్రాసు బృందం శనివారం అశ్వినీ వైష్ణవ్‌కు తెలియజేసింది. ఈ మేరకు ఆయన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. స్థానికంగా అభివృద్ధి చేయనున్న చిప్ ప్లాంట్‌లోనే ఈ నానోమీటర్ చిప్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలియజేశారు. ఐటీ సర్వర్లలో ఉపయోగించే నానో చిప్‌లను దేశీయంగానే తయారు చేసుకోవడానికి చర్యలు చేపట్టామని ఉద్ఘాటించారు. ఈ మేరకు ఐఐటీ–మద్రాసు బృందానికి అనుమతి ఇచి్చనట్లు పేర్కొన్నారు. ఆర్థిక, సమాచార, రక్షణ వంటి కీలక రంగాల్లో నానో చిప్‌ల ప్రాధాన్యత నానాటికీ పెరుగుతోందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, సర్వర్లలో 3 నుంచి 7 నానోమీటర్ల చిప్‌లను ఉపయోగిస్తున్నారు. వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దేశీయంగానే ఉత్పత్తి చేసుకుంటే దిగుమతుల భారం తగ్గుతుందని ప్రభుత్వం నిర్ణయానికొచి్చంది. -
'రఘువీరా నోరు అదుపులో పెట్టుకో'
విజయనగరం: పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని ఐటీ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హెచ్చరించారు. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర సంక్షేమం కోసం సాయం చేయండని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కోరితే అభినందించాల్సింది పోయి... అడుక్కునే ముఖ్యమంత్రి మనకు వద్దని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించడాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయబట్టే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదని ఆయన ఆరోపించారు. ఆంధ్ర ప్రజల శాపనార్థాలు ఆ పార్టీకి తగులుతాయని మండిపడ్డారు. జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే బంధువు మద్యం సిండికేట్ నడిపిస్తున్నారనే ఆరోపణల గురించి ఈ సందర్భంగా మంత్రి పల్లె రఘునాథరెడ్డిని విలేకర్లు ప్రశ్నించగా... బెల్టుషాపులపై చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు. ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయించాలని.. అలాగే సిండికేట్ బాస్‌లు ఎవరైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో మంత్రి కె. మృణాళిని, జెడ్పీ చైర్పర్సన్ శోభ స్వాతిరాణి, ఎమ్మెల్సీ శ్రీనివాసులు నాయుడు, ఎమ్మెల్యే నాయుడు తదితరులు పాల్గొన్నారు.