2028 నాటికి దేశీయ 7 నానోమీటర్‌ చిప్‌ సిద్ధం | India first 7 nm processor Shakti to be ready by 2028 | Sakshi
Sakshi News home page

2028 నాటికి దేశీయ 7 నానోమీటర్‌ చిప్‌ సిద్ధం

Oct 19 2025 5:06 AM | Updated on Oct 19 2025 5:06 AM

India first 7 nm processor Shakti to be ready by 2028

న్యూఢిల్లీ:  కంప్యూటర్‌ చిప్‌లను దేశీయంగానే అభివృద్ధి చేసుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో డిజైన్‌ చేస్తున్న మొట్టమొదటి 7 నానోమీటర్‌ కంప్యూటర్‌ చిప్‌ ‘శక్తి’2028 నాటికి సిద్ధమవుతుందని ఐఐటీ–మద్రాసు బృందం శనివారం అశ్వినీ వైష్ణవ్‌కు తెలియజేసింది. 

ఈ మేరకు ఆయన ఒక వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. స్థానికంగా అభివృద్ధి చేయనున్న చిప్‌ ప్లాంట్‌లోనే ఈ నానోమీటర్‌ చిప్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలియజేశారు. ఐటీ సర్వర్లలో ఉపయోగించే నానో చిప్‌లను దేశీయంగానే తయారు చేసుకోవడానికి చర్యలు చేపట్టామని ఉద్ఘాటించారు. ఈ మేరకు ఐఐటీ–మద్రాసు బృందానికి అనుమతి ఇచి్చనట్లు పేర్కొన్నారు. 

ఆర్థిక, సమాచార, రక్షణ వంటి కీలక రంగాల్లో నానో చిప్‌ల ప్రాధాన్యత నానాటికీ పెరుగుతోందని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లు, సర్వర్లలో 3 నుంచి 7 నానోమీటర్ల చిప్‌లను ఉపయోగిస్తున్నారు. వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దేశీయంగానే ఉత్పత్తి చేసుకుంటే దిగుమతుల భారం తగ్గుతుందని ప్రభుత్వం నిర్ణయానికొచి్చంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement