breaking news
Infiltration of the armed forces of China
-
ఎల్ఏసీ వద్ద శాంతియుత వాతావరణం:చైనా
ఎల్ఏసీ వద్ద శాంతియుత వాతావరణం:చైనా బీజింగ్: కాశ్మీర్లోని లఢక్ సెక్టార్లోని వాస్తవాధీనరేఖ (ఎల్ఏసీ) వద్ద ప్రస్తుతం శాంతియుత వాతావరణం నెలకొని ఉందని చైనా స్పష్టం చేసింది. చైనా సైనికులు చొరబాట్లకు పాల్పడుతూ, భారత భూభాగంలోకి చొచ్చుకువస్తున్నారన్నవార్తలతో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా తాజా పరిస్థితిపై వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఎల్ఏసీ వద్ద శాంతియుత వాతావరణం ఉందని తెలిపింది. అసలు ఎల్ఏసీ నిర్ధారణపై భారత్, చైనాల మధ్య విభిన్నమైన వాదనలున్నాయని, సరిహద్దు సమస్యలుంటే ఉభయపక్షాలు చర్చలతో పరిష్కరించుకోవచ్చని చైనా సైన్యం సోమవారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే,.. లఢక్ సెక్టార్లో తాజా ప్రతిష్టంభనపై చర్చ జరిగిందా? లేదా? అన్నది మాత్రం చైనా సైన్యం వివరించలేదు. లఢక్ వద్ద చుమర్ ప్రాంతంలో చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీకి, భారత సైన్యానికి మధ్య గత వారంగా కొనసాగుతున్న ప్రతిష్టంభనపై పీటీఐ అడిగిన ప్రశ్నలకు స్పందనగా చైనా జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఈ వ్యాఖ్య చేశారు. సరిహద్దులో ఇటీవలి పరిణామాలపై మీడియాలో వెలువడిన వార్తలను తాము గమనించామన్నారు. -
మళ్లీ చైనా చొరబాటు మళ్లీ చైనా చొరబాటు
న్యూఢిల్లీ: భారత భూభాగంలోకి చైనా సైనిక దళాల చొరబాటు సమస్య మరింత తీవ్రంగా పరిణ మించింది. లడక్ ప్రాంతంలో చుమర్ సెక్టార్ గత రెండు రోజుల్లోనే రెండవ సారి చైనా సైన్యం చొరబాటుకు పాల్పడింది. గురువారం చొరబాటు జరిపి వెనక్కు మళ్లిన ప్రాంతంలోనే మరో చోట చైనా దళాలు భారత భూభాగంలోకి చొరబడ్డాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)కి చెందిన దాదాపు 50మంది సైనికులు తొమ్మిది వాహనాల్లో వచ్చి, చుమర్ ప్రాంతంలో భారత్ పరిధిలోని ఒక చిన్న కొండపైకి చేరుకున్నారని, అంతకు ముందు అక్కడే మకాంవేసిన 35మంది సైనికులకు అదనంగా వారూ చేరారని అధికార వర్గాలు తెలిపాయి. సరిహద్దువద్ద భారతసైనికులకు వంద మీటర్ల దూరంలోనే వారి ముందే వాహనాలు దిగివెళ్లారని అధికార వర్గాలు తెలిపాయి. కొండపై ఉన్న చైనా సైనికుల కోసం చైనా హెలికాప్టర్లు ఆహారం పొట్లాలు జారవిడుస్తున్నాయని, అయితే, ెహ లికాప్టర్లు మాత్రం ఇప్పటివరకూ గ గనతల ంలో ఉల్లంఘనకు పాల్పడలేదని అధికారవర్గాలు తెలిపాయి.