breaking news
industrial permissions
-
అనుమతులపై అలా కాదు.. ఇలా
సింగిల్ డెస్క్ విధానంలో మార్పులు సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక అనుమతులు 21 రోజుల్లోగా ఇవ్వడం కుదిరేపని కాదని ప్రభుత్వం తాజాగా తేల్చిచెప్పింది. నిర్దిష్టమైన కారణం ఉంటే పారిశ్రామిక అనుమతులు 21 రోజుల్లోగా ఇవ్వకపోయినా సంబంధిత అధికారిపై జరిమానా విధించలేమని.. శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోలేమని స్పష్టీకరించింది. ఈ మేరకు సింగిల్ డెస్క్ విధానం-2015కు సవరణలు, మార్పులు చేస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు చేయడానికి దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోగా.. అన్ని అనుమతులు ఇచ్చేలా రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ సింగిల్ డెస్క్ విధానం-2015’ను ఏప్రిల్ 29న ప్రభుత్వం ప్రకటించింది. క్షేత్ర స్థాయిలో ఈ విధానం అమలుకు ఇబ్బందులు ఉన్నాయని అధికారవర్గాలు ప్రభుత్వానికి తేల్చిచెప్పాయి. దాంతో.. వెనక్కి తగ్గిన ప్రభుత్వం సింగిల్ డెస్క్ విధానంలో మార్పులు చేసింది. 21 రోజుల్లోగా అనుమతి ఇవ్వకపోతే.. సంబంధిత దరఖాస్తుదారుడు సాధికార కమిటీకి ఫిర్యాదు చేయాలని సూచించింది. ఈ ఫిర్యాదుపై సాధికార కమిటీ విచారణ చేసి.. 30 రోజుల్లోగా చర్యలు తీసుకుంటుంది. అనుమతి ఇవ్వకపోవడానికి సరైన కారణాన్ని సాధికార కమిటీకి సంబంధిత అధికారి చెబితే ఎలాంటి జరిమానా విధించమని.. శాఖపరమైన చర్యలు కూడా తీసుకోమని తాజాగా చేసిన సవరణలో ప్రభుత్వం పేర్కొంది. -
21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. సంప్రదాయేతర ఇంధన వనరులపై న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. 4 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తిపై ఏపీ సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. కొత్తగా పెట్టే పరిశ్రమలకు కేవలం 21 రోజుల్లోనే అన్నింటికీ అనుమతులు ఇస్తామని చంద్రబాబు చెప్పారు.