breaking news
industrial carridor
-
హైదరాబాద్–బెంగళూరు.. డిఫెన్స్ కారిడార్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దేశంలో ఇప్పటివరకు రెండు డిఫెన్స్ కారిడార్లు (తమిళనాడు, ఉత్తరప్రదేశ్) ఉన్నాయి. రెండో కారిడార్‌కు సంబంధించి గతంలోనే రాష్ట్రానికి అవకాశం వచ్చినా చివరలో యూపీకి తరలిపోయింది. తాజాగా మూడో కారిడార్‌ను తెలంగాణలో ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాలమూరులో బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ ద్వారా హైదరాబాద్–బెంగళూరు డిఫెన్స్ కారిడార్‌కు మార్గం సుగమమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేవరకద్రలో ‘బ్రహ్మోస్’యూనిట్ ఏర్పాటుతో.. బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రం హైదరాబాద్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ యూనిట్‌ను విస్తరించాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నా అక్కడ భారీగా భూములు అందుబాటులో లేవు. బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్‌కు సుమారు 350 నుంచి 400 ఎకరాల వరకు స్థలం అవసరమవగా అందుకోసం అన్వేషణ కొనసాగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో డిఫెన్స్ రీసెర్చ్, డెవలప్మెంట్ లేబొరేటరీ (డీఆర్డీఎల్), బ్రహ్మోస్ శాస్త్రవేత్తల బృందం ఇటీవల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని భూములను పరిశీలించింది. దీంతో బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్‌తోపాటు హైదరాబాద్–బెంగళూరు డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. అంతా సానుకూలత.. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని చౌదర్పల్లి–బస్వాయిపల్లి మధ్య గతంలో విమానాశ్రయం కోసం ప్రణాళికలు రూపొందించారు. ఆ మ్యాప్ ప్రకారం 150 ఎకరాల మేర ప్రభుత్వ భూమి లభ్యమవగా మరో 150 ఎకరాల మేర ఆసైన్డ్ భూములు ఉన్నాయి. 197 ఎకరాల వరకు రైతుల నుంచి సేకరించాలని అధికారులు అప్పట్లో నిర్ణయించారు. డీఆర్డీఎల్ డైరెక్టర్ జీఏ శ్రీనివాసమూర్తి, జనరల్ ఆఫ్ బ్రహ్మోస్ డైరెక్టర్ జైతీర్థ్ జోషి, బ్రహ్మోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.సాంబశివప్రసాద్ ఇటీవల చౌదర్పల్లి–బస్వాయిపల్లి మధ్య స్థలాన్ని పరిశీలించారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, తహసీల్దార్లు అక్కడ 497 ఎకరాల వరకు భూమి లభ్యత ఉందని మ్యాప్ ఆధారంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 200 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని ఉచితంగా ఇస్తామని రాష్ట్ర పెద్దలు శాస్త్రవేత్తల బృందానికి వెల్లడించారు. మిగతా 200 ఎకరాలను కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో సేకరించి ఇస్తామని.. దీనికి సంబంధించి పరిహారం మాత్రం కేంద్రం భరించేలా ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. జాతీయ రహదారులు 167, 44కు మధ్య ఈ భూములు ఉండటం.. అటు హైదరాబాద్, ఇటు బెంగళూరుకు రైలు, విమాన మార్గాల కనెక్టివిటీ ఉండటంతో శాస్త్రవేత్తల బృందం అందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
12 కొత్త ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు.. తెలంగాణ, ఏపీలో ఇవే..
దేశవ్యాప్తంగా మరిన్ని ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల అభివృద్ధికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎన్ఐసీడీపీ) కింద కొత్తగా 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.28,602 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కేంద్రమంత్రి పీయూష్‌గోయల్ తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు.ఎన్ఐసీడీపీ ద్వారా ప్రభుత్వం ఖర్చు చేయబోతున్న నిధులతో మౌలిక సదుపాయాలు వృద్ధి చేస్తామని మంత్రి చెప్పారు. దాంతో ఆయా నగరాల్లో దాదాపు రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దాంతో ప్రత్యక్షంగా 10 లక్షల మంది, పరోక్షంగా మరో 30 లక్షల మంది ఉపాధి పొందుతారని పేర్కొన్నారు. కొత్తగా అభివృద్ధి చెయబోయే 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు దేశవ్యాప్తంగా పారిశ్రామిక హబ్‌లుగా మరుతాయన్నారు. 10 రాష్ట్రాలు, 6 ఇండస్ట్రీ కారిడార్లను కవర్ చేసేలా వీటిని ఎంచుకుంటున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: పదేళ్లలో ‘జన్‌ధన్’ విజయాలు.. సమస్యలు‘దేశవ్యాప్తంగా కొత్తగా తీసుకొస్తున్న 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలతో కలిపి మొత్తం వీటి సంఖ్య 20కు చేరింది. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఇప్పటివరకు నాలుగు ప్రాజెక్టులు అమలు చేశాం. మరో నాలుగు ప్రాజెక్టుల పనులు వేగంగా ప్రారంభమయ్యాయి. కొత్తగా ఈ విభాగంలో 12 సిటీలో చేరాయి. ప్రతి కారిడార్‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్‌లు, రవాణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ నగరాల్లో పెట్టుబడిదారులకు అత్యాధునిక సౌకర్యాలతో భూమిని కేటాయించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాజ్‌పురా, పాటియాలా-ఉత్తరాఖండ్, ఆగ్రా-ఉత్తరప్రదేశ్, గయా-బిహార్, డిగి పోర్ట్-మహారాష్ట్ర, జహీరాబాద్, కొప్పర్తి- తెలంగాణ, బోధ్పూర్-రాజస్థాన్, ఒర్వకల్లు-ఏపీ, పాలక్కాడ్-కేరళ, జమ్ముకశ్మీర్/ హరియాణాలోని నగరాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నాం. ఈ పారిశ్రామిక స్మార్ట్ సిటీల్లో రైలు, ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, ఓడరేవులతో పాటు నీరు, విద్యుత్, గ్యాస్, టెలికాం కనెక్టివిటీతో సహా స్థిరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు’ అని మంత్రి చెప్పారు. -
జిల్లా వైపు పారిశ్రామికవేత్తల చూపు!
జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేస్తూ పరిశ్రమలు స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పారిశ్రామికవేత్తలు సైతం పరిశ్రమల స్థాపననకు చిత్తూరు జిల్లా అనువైన ప్రాంతంగా గుర్తించారు. అందులో భాగంగా టెక్స్టైల్స్ పార్క్స్, వింగ్‌టెక్ ఎల్రక్టానిక్స్, ఇంటెలిజెంట్ సెజ్‌లు రానున్నాయి. ఆయా పారిశ్రామిక వాడల ద్వారా ప్రత్యక్షంగా 25వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. సాక్షి ప్రతినిధి, తిరుపతి: అవినీతి అక్రమాలకు తావు లేకుండా, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ నూతన పారిశ్రామిక కారిడార్‌కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా భూ సేకరణకు సిద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో భూ సేకరణలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటుచేసుకోవడంతో పాత విధానానికి స్వస్తి పలికి.. నూతన పారిశ్రామిక విధానానికి కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహం, పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రాంతం కావడంతో పారిశ్రామికవేత్తల చూపు జిల్లా వైపు పడింది. అరవింద్, రేమాండ్స్, బిన్ని మిల్స్ తదితర ఆరు టెక్స్టైల్స్ పార్కులు, వింగ్‌టెక్ ఎల్రక్టానిక్ యూనిట్, ఇంటెలిజెంట్ సెజ్‌లు రానున్నాయి. పరిశ్రమల స్థాపన కోసం జిల్లా వ్యాప్తంగా 24వేల ఎకరాలు భూసేకరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నీటి కొరతపై ప్రత్యేక దృష్టి పారిశ్రామికవాడలకు ఎలాంటి నీటి కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. కండలేరు జలాశయం నుంచి రూ.200కోట్ల వ్యయంతో 6 టీఎంసీల నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. పైగా తిరుపతి నుంచి వెళ్లే మురుగు నీటిని రూ.20కోట్లు వెచ్చించి శుద్ధి చేసిన జలాలను అందించే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టింది. అనువైన ప్రాంతం చెన్నై, బెంగళూరు మహా నగరాల్లో పరిశ్రమలు నెలకొల్పడం కష్టతరమైంది. అక్కడ భూముల ధరలు ఆకాశానికి చేరాయి. పరిశ్రమ నెలకొల్పేందుకు అనుమతులు తదితర విషయాలతో పోలిస్తే జిల్లా అనువైన ప్రాంతంగా పారిశ్రామికవేత్తలు గుర్తించారు. జిల్లాలో అవసరమైన భూములు, రహదారి సౌకర్యం, రైల్యే మార్గం, నీటి సౌకర్యం, ఆకాశ మార్గంలో రాకపోకలకు అనుకూలంగా రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం, జిల్లాకు అతి సమీపంలో సముద్రతీర ప్రాంతం ఉంది. దీంతో పెట్టుబడులకు పెట్టేందుకు ఇది అనువైన ప్రాంతంగా భావిస్తున్నారు. పైగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, మౌలిక వసతులు కలి్పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉండడంతో ఔత్సాహికులకు ఆసక్తి పెరిగిందని నిపుణులు వివరిస్తున్నారు. ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, బుచ్చినాయుడుకండ్రిగ మండలాల పరిధిలోని మొత్తం 34 గ్రామాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు అనుకూలమైన ప్రాంతంగా గుర్తించారు. అందుకు అవసరమైన భూములు సేకరించేందుకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త ఆదేశాల మేరకు తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి ఆధ్వర్యంలో 40 మందితో కూడిన బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఇందు కు ఉత్తర, దక్షిణ విభాగాలుగా విభజించారు. ఉత్తర విభాగంలో 11వేల ఎకరాలు, దక్షిణ వి భాగంలో 13వేల ఎకరాలను సేకరించనున్నారు. ఏపీఐఐసీ ప్రత్యేక చొరవ పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా, ఎక్కడా చెరువులు, కుంటల జోలికి వెళ్లకుండా ఏపీఐఐసీ ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. జిల్లా అధికారులతో పాటు వైజాగ్, కర్నూలు, విజయనగరం నుంచి 11 మంది అధికారులతో ప్రత్యేక కమీటీ ఏర్పాటుచేసి ఏపీఐఐసీ రోజువారి సమీక్షలు, నివేదికలను తీసుకుంటున్నట్లు సమాచారం. రెండు పంట లు పండే భూముల సేకరించరాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలను జారీచేసినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. పరిశ్రమలు ఏర్పాటుతో జనావాసానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రణాళికలు సిద్ధం చేసింది. పారిశ్రామికవాడగా ‘చిత్తూరు’ రేణిగుంట సమీపంలో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్లు, ఎల్రక్టానిక్ వస్తువుల తయారీ సంస్థ వింగ్‌టెక్ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందనీ అధికారులు వివరిస్తున్నారు. వింక్టెక్ ఎల్రక్టానిక్ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 10వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ఏడాదికి 40లక్షల మొబైల్ ఫోన్లు తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. హాంగ్‌కాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్ సెజ్ డెవెలప్మెంట్ సంస్థ శ్రీకాళహస్తి సమీపంలో పాదరక్షల తయారీ యూ నిట్‌ను ఏర్పాటుకు సంసిద్ధమైనట్లు సమాచారం. ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ ఆడిడాస్ పాదరక్షలను ఈ సంస్థ తయారీ చేయనుంది. రెండు దశల్లో ఏర్పాటు చేసే ఈ సంస్థలో 10వేల ఉద్యోగాలు దక్కనున్నాయి. పరిశ్రమల స్థాపనకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో అవసరమైన విద్యుత్, రహదారులు, మంచినీరు వంటి సౌకర్యాలు కలి్పంచడమే మా లక్ష్యం. స్థానికుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషిచేస్తాం. ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టర్‌ను సంప్రదించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. –కనకనరసారెడ్డి, ఆర్డీఓ, తిరుపతి. -
పారిశ్రామిక కారిడార్‌పై కదలిక
‘చెన్నై-వైజాగ్’పై నేడు ఏపీ సీఎంకు ఏడీబీ ప్రజెంటేషన్ సాక్షి, హైదరాబాద్: చెన్నై-విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ఆసియూ అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. బ్యాంకు ప్రతినిధులు శుక్రవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ ప్రతిపాదనల్లోని అంశాలను సీఎం చంద్రబాబుకు వివరించనున్నారు. ఎయిర్‌పోర్టులు, రైల్వే లైన్లు, పట్టణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రణాళిక (బ్లూ ప్రింట్) సిద్ధం చేసిన ఏడీబీ.. ఈ ప్రాజెక్టుకు ఎన్నేళ్ల సమయం పడుతుంది? తమ అభివృద్ధి విధానం, అవసరమైన నిధులు ఇతర అంశాలను సీఎంకు వివరించనుంది. దీంతో ఈ కారిడార్‌లోని ఓడరేవులు, ఎయిర్‌పోర్టులు, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, పట్టణ ప్రాంతాలపై ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమవుతోంది. ఈ ప్రాజెక్టులో రహదారుల శాఖ పాత్ర కీలకంగా మారనుంది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు కనీసం రెండేళ్ల సమయం పడుతుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి వివరించారు.