breaking news
Indus civilization
-
900 ఏళ్ల నాడు అలా జరిగినందువల్లే..
ఖరగ్‌పూర్ : ప్రపంచంలోనే గొప్ప నాగరికతగా భాసిల్లిన సింధునాగరికత అంతరించడానికి గల కారణాన్ని ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 900 ఏళ్లపాటు కొనసాగిన కరువు కారణంగానే 4,350 ఏళ్లక్రితం సింధు నాగరికత తుడిచిపెట్టుకు పోయిందని తెలిపారు. రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల కరువు వచ్చిందని.. కొన్నేళ్ల తర్వాత తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు అక్కడి నుంచి మైదానాలకు వలస వెళ్లారని భౌగోళిక శాస్త్ర ప్రొఫెసర్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. వీరంతా గంగా యమునా లోయ గుండా ప్రయాణిస్తూ ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు బెంగాల్, దక్షిణ వింధ్యాచల్, దక్షిణ గుజరాత్‌కు చేరుకున్నారన్నారు. ఇందుకు గల ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. జియోలజీ, జియోఫిజిక్స్ డిపార్ట్మెంట్కు చెందిన పరిశోధకులు.. రుతుపవనాలు సకాలంలో రాకపోవడం వల్ల 5 వేల ఏళ్ల క్రితం వాయువ్య హియాలయాల్లో వర్షభావ పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దీని వల్ల నదులు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని క్రమంగా అది కరువుకు దారితీసిందని తెలిపారు. ఈ పరిస్థితి 9 వందల ఏళ్ల పాటు కొనసాగడం వల్ల అప్పటివరకు సిరిసంపదలతో వర్థిల్లిన సింధు నాగరికత వైభవం కోల్పోయిందని నివేదికలో పేర్కొన్నారు. వారి పరిశోధనకు ఆధారాలుగా లడఖ్‌లోని మోరిరి సరస్సుకు సంబంధించిన 5 వేల సంవత్సరాల రుతుపవన, శీతోష్ణస్థితి మార్పుల పట్టికను ఐఐటీ బృందం జతచేసింది. -
దేశంలో లిపిని ఉపయోగించిన తొలి ప్రజలు?
సింధూ నాగరికతకు సమకాలీన ప్రపంచ నాగరికతలకంటే విశాలమైన పరిధి ఉంది. ఇది భారతదేశంలో దాదాపు 1.3 మిలియన్ల చ.కి.మీ. ప్రాంతంలో విస్తరించింది. దీనికి సంబంధించి భారత్, పాకిస్థాన్‌లో 1400 స్థావరాలు బయటపడ్డాయి. ప్రధానంగా సింధూనది, దాని ఐదు ఉపనదులైన రావి, బియాస్, సట్లేజ్, జీలం, చీనాబ్ పరీవాహక ప్రాంతాల్లో విలసిల్లినందువల్ల దీన్ని సింధూ నాగరికత లేదా సింధూలోయ నాగరికతగా వ్యవహరిస్తారు. ఈ నాగరికత సరిహద్దులు తూర్పున-అలంఘీర్‌పూర్ నుంచి పశ్చిమాన - సుట్కజెండార్ వరకు, ఉత్తరాన - మాండా నుంచి దక్షిణాన - దాయిమాబాద్ వరకు విస్తరించాయి. పట్టణ నాగరికత ఈ నాగరికతా కాలాన్ని మొదటి నగరీకరణ యుగంగా పేర్కొంటారు. దీని తర్వాత మళ్లీ బుద్ధుని కాలం వరకూ నగరాలు కనిపించవు. సింధూ నాగరికతకు సంబంధించి దాదాపు 250 వరకు పట్టణాలను కనుగొన్నారు. వీటిలో ముఖ్యమైనవి.. హరప్పా: దయారాం సాహ్ని ఆధ్వర్యంలో తొలిసారిగా తవ్వకాలు చేసింది హరప్పాలోనే. ఇక్కడ బయటపడిన ప్రధాన నిర్మాణాలు.. ఒకే వరుసలో నిర్మితమైన ఆరు ధాన్యాగారాలు, హెచ్ ఆకారంలో ఉన్న శ్మశాన వాటిక, కోట మొదలైనవి. మొహెంజొదారో: ఈ పదానికి సింధీలో ‘మృతదేహాల మట్టిదిబ్బ’ అని అర్థం. ఇక్కడ తవ్వకాలకు నేతృత్వం వహించింది ఆర్.డి. బెనర్జీ. ఇక్కడ బయటపడిన ప్రధాన నిర్మాణం మహాస్నానవాటిక. దీంతోపాటు ధాన్యాగారం, పా లనా భవనం, అసెంబ్లీ హాలు వంటి కట్టడాలు వెలుగు చూశాయి. నాట్యగత్తె కాంస్య విగ్రహం, నేసిన వస్త్రం మొదలైనవి ఇక్కడ బయటపడిన ఇతర ముఖ్య అవశేషాలు. చన్హుదారో: ఇది మొహెంజొదారో లానే సింధూ తీరంలో వెలసిన మరో నగరం. ఇక్కడ మొదట ఎం.జి.మజుందార్ తర్వాత మాకే తవ్వకాలు నిర్వహించారు. దీనికి కళాకారుల నగరమని పేరు. అంతేకాకుండా ఇది కోట గోడలేని ఏకైక నగరం. లోథాల్: దీనికి కూడా మృతులదిబ్బ అని పేరు. ఇక్కడ తవ్వకాలు చేసింది ఎస్.ఆర్.రావు. ఇది భాగావో అనే నదీ పరీవాహక ప్రాంతంలో విలసిల్లింది. ఇక్కడ ఒకే సమాధిలో రెండు అస్థిపంజరాలు బయటపడినందువల్ల సతీ సహగమనం దురాచారం అమల్లో ఉండేదని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. సింధూ నాగరికతకు సంబంధించిన ఏకైక కృత్రిమ ఓడరేవు ఇక్కడ వెలుగుచూసింది. ఇంకా హోమగుండాలు, చదరంగం ఆటకు సంబంధించిన ఆధారాలు, కాంస్యపు కొలబద్ధలు, వస్త్రపు గుర్తును కలిగి ఉన్న ముద్రలు (సీల్స్) ఇక్కడ లభించాయి. కాలీబంగన్: రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో ఉంది. ఇది ఘగ్గర్ (ప్రాచీన సరస్వతి) నది ఒడ్డున వెలసింది. ఇక్కడ మొదట తవ్వకాలు చేసింది డాక్టర్ ఎ.కె.ఘోష్. కాలీబంగన్ అంటే ‘నల్లని గాజులు’ అని అర్థం. భూమిని నాగలితో దున్నినట్లుగా ఆధారాలు లభించిన ఏకైక నగరం కాలీబంగన్. బనావలి: హరప్పా నగరాలన్నింటిలోకి గ్రిడ్ పద్ధతిని పాటించని ఏకైక నగరమిదే. హర్యానాలోని హిస్సార్ జిల్లాలో ఉంది. తవ్వకాలు చేసింది ఆర్.ఎస్. బిష్త్. సింధూ ప్రజలు నాగలిని ఉపయోగించారనడానికి ఇక్కడ లభించిన మట్టితో చేసిన నాగలి బొమ్మను ప్రధాన ఆధారంగా పేర్కొంటారు. కోట్‌డిజి: పాకిస్థాన్‌లోని సింధూ రాష్ట్రంలో ఉంది. తవ్వకాలు నిర్వహించింది గురే.ఇక్కడ రాతితో చేసిన బాణాలు బయటపడ్డాయి. ధోలవీర: గుజరాత్లో ఉంది. తవ్వకాలు చేసినవారు ఆర్.ఎస్.బిష్త్, జె.పి.జోషి. ఈ నగరం వర్షాభావ ప్రాంతంలో ఉన్నందువల్ల ఇక్కడ కృత్రిమ రిజర్వాయర్ నిర్మాణం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ఒక స్టేడియం కూడా బయటపడింది. మిగిలిన సింధూ నగరాలకు భిన్నంగా ఈ నగరం రెండుకు బదులు 3 విభాగాలుగా విభజితమై ఉంది. సింధూ నాగరికత ముఖ్య లక్షణాలు పట్టణ ప్రణాళిక: సింధూ ప్రజలు ప్రధానంగా నగరవాసులు. ఈ నగరాలు అనేక ప్రాంతాల్లో విస్తరించి ఉన్నా వాటి నిర్మాణశైలి, నగర ప్రణాళిక మొదలైన అంశాల్లో ఏకరూపత కనిపించడం విశిష్ట లక్షణంగా చెప్పొచ్చు. ప్రతి నగరాన్ని రెండు భాగాలుగా విభజించారు. ఎగువభాగంలో ఉన్నత వర్గాలవారు నివసించేవారు. నగర నిర్మాణానికి గ్రిడ్ పద్ధతిని అనుసరించారు. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్మించారు. నిర్మాణాల్లో కాల్చిన ఇటుకలను ఉపయోగించేవారు. ఎగువ పట్ట ణం చుట్టూ పటిష్టమైన కోటగోడను నిర్మించారు. వీధులన్నీ సూటిగా 90ని లంబ కోణంలో ఉండి నగరాన్నంతా అనేక చతురస్ర బ్లాకులుగా విభజించేవి. సామాజిక వ్యవస్థ: సింధూ సమాజం భిన్న జాతుల కలయికతో ఏర్పడింది. మెడిటరేనియన్ జాతికి చెందినవారు అధిక సంఖ్యాకులు కాగా, మంగోలాయిడ్, ఆస్ట్రలాయిడ్, అల్పిన్నాయిడ్ జాతులకు చెందిన ప్రజలు కూడా ఇక్కడ నివసించారు. వైదిక యుగంలో ఉన్నట్లుగా కుల, వర్ణ వ్యవస్థలు ఈ కాలంలో ఇంకా ఏర్పడలేదు. అయినప్పటికీ ఆర్థికస్థాయిని బట్టి సమాజం వివిధ వర్గాలుగా విభజితమైంది. ఈ కాలంలో స్త్రీలు మంచి గౌరవ మర్యాదలు పొందినట్లుగా తెలుస్తోంది. నాటి సమాజం మాతృస్వామిక వ్యవస్థను అనుసరించినట్లు జాన్ మార్షల్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ: సింధూ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. పశుపోషణ, పరిశ్రమలు, వ్యా పార వాణిజ్యాలకు కూడా ప్రాధాన్యం ఉండేది. ప్రధాన పంటలు గోధుమ, బార్లీ. వరి కూడా పండించినట్లు లోథాల్, రంగపూర్‌లో ఆధారాలు లభించాయి. సింధూ పరీవాహక ప్రాంతం అత్యంత సారవంతంగా ఉండేది. పశుపోషణలో భాగంగా ఎద్దులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కుక్కలు, గాడిదలు, ఒంటెలు మొదలైన జంతువులను మచ్చిక చేసుకున్నట్లు ఆధారాలు లభించాయి. పట్టణాల్లో పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి. ఖేత్రి, బెలూచిస్థాన్ నుంచి రాగిని, అఫ్గానిస్తాన్ నుంచి తగరాన్ని, ఇతర ప్రాంతాల నుంచి వివిధ రకాల లోహాలను దిగుమతి చేసుకుని వాటితో ఆయుధాలు, ఆభరణాలు తయారు చేసేవారు. వస్త్ర పరిశ్రమ కూడా ప్రముఖంగానే ఉంది. వీరు నూలు, ఉన్ని వస్త్రాలు తయారు చేశారు. తవ్వకాల్లో చాలాచోట్ల రాట్నాలు బయటపడ్డాయి. ఇటుకలు, సీళ్లు, కుండలు, ఆటబొమ్మలు, పూసలు, గవ్వలతో ఆభరణాల తయారీ, నౌకల నిర్మాణం వంటివి ఇతర పరిశ్రమల్లో ముఖ్యమైనవి. వీరు దేశీయ, విదేశీ వాణిజ్యాన్ని కొనసాగించారు. మొహెంజొదారో ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉండేది. తవ్వకాల్లో బయటపడిన ధాన్యాగారాలు, సీళ్లు, తూనికలు, కొలతలు, ఎడ్లబండ్ల బొమ్మలు, నౌకల బొమ్మలు మొదలైనవి వాణిజ్యానికి సంబంధించిన ఆధారాలను అందిస్తున్నాయి. దేశీయ వ్యాపారానికి ఎడ్లబండ్లు, పడవలనూ, విదేశీ వ్యాపారానికి భారీ నౌకలనూ ఉపయోగించారు. వీరి విదేశీ వాణిజ్యం ప్రధానంగా మెసపటోమియాతో కొనసాగింది. అక్కడి శాసనాలు సింధూ ప్రాంతాన్ని ‘మెలూహ’అని పేర్కొన్నాయి. రాజకీయ వ్యవస్థ: సింధూ నాగరికత భౌగోళికంగా 1.3 మిలియన్ల చ.కి.మీ. విస్తీర్ణం కలిగి ఉంది. అయినా అనేక అంశాల్లో ఏకరూపత, సమగ్రత కనిపిస్తుంది. ఉదాహరణ: గ్రిడ్ పద్ధతిలో పట్టణాల నిర్మాణం, భూగర్భ మురుగు నీటిపారుదల వ్యవస్థ. ఇటుకల నిర్మాణంలో ప్రమాణాలు, 16 లేదా దాని గుణకాలను తూనికలు, కొలతలకు ప్రమాణంగా ఉపయోగించడం మొదలైన అంశాల్లో ఉన్న ఏకరూపత వల్ల కేంద్రీకృత పాలనా వ్యవస్థ ఉండేదని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. మరికొందరి ప్రకారం 4 లేదా 5 పాలనా కేంద్రాలతో ఈ నాగరికత వర్థిల్లింది. డి.డి. కౌశాంబి ఇది మతరాజ్యమనీ, మతాధిపతుల పాలన కొనసాగిందని అభిప్రాయపడ్డారు. ఆర్.ఎస్. శర్మ.. వ్యాపార, వాణిజ్యాలకు అమిత ప్రాధాన్యమిచ్చిన వ్యాపార వర్గాలే పాలకులుగా ఉం డేవారని అభిప్రాయం వ్యక్తం చేశారు. సింధూ ప్రజల రాజకీయ వ్యవస్థపై నిర్దిష్ట ఆధారాలు లభించడం లేదు. కాబట్టి చరిత్రకారుల మధ్య ఈ అంశంపై భిన్నాభిప్రాయాలున్నాయి. మత వ్యవస్థ: సింధూ ప్రజల ప్రధాన దైవం అమ్మతల్లి. మొహెంజొదారోలో ‘పశుపతి’ మహాదేవుడి ముద్ర లభించింది. ఈ దైవాన్నే జాన్ మార్షల్ తర్వాతి కాలపు పరమశివుడుగా పేర్కొన్నారు. సింధూ ప్రజలు జంతువులు, వృక్షాలను కూడా పూజించారు. మూపురము న్న ఎద్దు, రావిచెట్టు వీరికి పరమ పవిత్రమైనవి. మానవ జననేంద్రియాలనూ ఆరాధించారు. భూత ప్రేతాలు, మంత్రతంత్రాలపై వి శ్వాసం ఉంది. రక్షా రేకులు, తాయెత్తులను ఉపయోగించినట్లు ఆధారాలు లభించాయి. వీరి దహన సంస్కారాలు భిన్న రకాలు గా ఉండేవి. దహనం చేయడం, పూడ్చిపెట్టడం, కళేబరాలను పశుపక్ష్యాదులు తినగా మిగిలిన అవశేషాలను పూడ్చడం మొదలైన పద్ధతులుండేవి. సింధూ లిపి: భారతదేశంలో లిపిని ఉపయోగించిన తొలి ప్రజలు వీరే. ఇది నేటి లిపిలా అక్షర రూపంలో కాకుండా బొమ్మల రూపంలో ఉన్నందువల్ల నేటి వరకూ దీన్ని చదవడం సాధ్యపడలేదు. వీరి లిపిలో 400 దాకా చిత్రాలున్నాయి. ఇది ఎడమ నుంచి కుడికి, మళ్లీ కుడి నుంచి ఎడమకి రాసి ఉంది. ఎస్.ఆర్ రావు ఈ చిత్రలిపిని ఆర్యభాషకు మాతృకగా పేర్కొన్నారు. కంప్యూటర్ సహాయంతో ఈ లిపిని పరిశోధించిన మహదేవన్ మాత్రం ఇది ద్రావిడ భాషతోనే పోలికలు కలిగి ఉందని అభిప్రాయపడ్డారు. అధిక సంఖ్యాక చరిత్రకారుల అభిప్రాయం కూడా ఇదే. సింధూ ప్రజల సీళ్లు (ముద్రలు): సింధూ ప్రజల కళాభిరుచికి నిదర్శనం వారి సీళ్లు. తవ్వకాల్లో దాదాపు 2000కు పైగా సీళ్లు లభించాయి. వీటిలో అత్యధికం మొహెంజొదారోలోనే లభించాయి. 1-2.5. సెం.మీ. ఎత్తుతో వివిధ ఆకారాల్లో వీటిని తయారుచేశారు. ప్రతి సీలు పై ఏదో ఒక జంతు బొమ్మతోపాటు చిత్రలిపిలో శాసనం కూడా ఉండేది. పులి, ఎద్దు, గేదె, మేక, జింక, ఖడ్గమృగం, ఏనుగు వంటి జంతువుల బొమ్మలు సీళ్లపై ముద్రించారు. పతనానికి కారణం: ఈ నాగరికత క్రీ.పూ. 18వ శతాబ్దం నాటికి అంతమైంది. అయితే దీని పతనానికి నిర్దిష్ట ఆధారాలు లభించలేదు. ఇది చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలకు దారి తీసింది. విపరీతమైన వరదలు ఈ నాగరికత అంతానికి కారణమని కొందరి వాదన. నదుల ప్రవాహ దిశల్లో మార్పు వల్ల ఏర్పడిన నీటిఎద్దడి కారణమని మరికొందరు అభిప్రాయం. పక్కనున్న ఎడారి విస్తరించి, భూసా రం తగ్గడం వల్ల పతనమైందని మరికొందరి వాదన. ఆర్యుల దాడి ఈ నాగరికత ముగియడానికి ప్రధాన కారణమని ఎం.ఎం. వీలర్ అభిప్రాయం. భూకంపాల వల్ల ఈ నాగరితక అంతమైందని రైస్ వాదన. మాదిరి ప్రశ్నలు 1. వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన హరప్పా నగరం? (గ్రూప్-2, 2012) 1) మొహెంజొదారో 2) లోథాల్ 3) చన్హుదారో 4) బన్వాలి 2. హరప్పా ప్రజలు పూజించిన పక్షి?(గ్రూప్-2, 2011) 1) పావురం 2) నెమలి 3) కాకి 4) గద్ద 3. హరప్పా ప్రజలు ఏ దేశంతో అంతర్జాతీయ సంబంధాలను కలిగి ఉన్నారు? (గ్రూప్-1, 2010) 1) ఇరాన్ 2) ఈజిప్ట్ 3) బహ్రెయిన్ 4) మెసపటోమియా 4. కింద పేర్కొన్న 1, 2 జాబితాల నుంచి సరైనదాన్ని గుర్తించండి. జాబితా-1 జాబితా-2 ఎ) కాలీబంగన్ 1) కుండలు బి) లోథాల్ 2)టైట్ట బొమ్మలు సి) చన్హుదారో 3) పశుపతి ముద్రిక డి) మొహెంజొదారో 4) ఇటుకతో నిర్మించిన ప్రాంగణం ఎ బి సి డి 1) 1 3 4 2 2) 4 1 2 3 3) 3 2 4 1 4) 2 4 1 3 5. సింధూ లిపికి చిహ్నంగా ఇంకు పాత్ర లభించిన నగరం? 1)చన్హుదారో 2) అమ్రి 3) లోథాల్ 4) హరప్పా 6. గుర్రం ఆధారాలు లభించిన ప్రాంతం? 1) హరప్పా, లోథాల్ 2) లోథాల్, రంగపూర్ 3) సుర్కాటడా, బన్వాలి 4) సుర్కాటడా, లోథాల్ 7. సతీసహగమనం ఆచారాన్ని సూచించే సమాధి బయటపడిన సింధూ నగరం? 1) కాలీబంగన్ 2) హరప్పా 3) లోథాల్ 4) కోట్‌డిజి 8. సింధాన్ అంటే? 1) వరి 2) గోధుమ 3) బార్లీ 4) పత్తి 9. కిందివాటిలో సరికాని జత? సింధూ నగరాలు - ప్రస్తుత రాష్ట్రాలు 1) మొహెంజొదారో సింధూ రాష్ట్రం 2) రోపార్ పంజాబ్ 3) మాండ జమ్మూకాశ్మీర్ 4) దాయిమాబాద్ గుజరాత్ 10. హరప్పా సంస్కృతికి చెందిన వ్యవసాయ పద్ధతులకు సంబంధించిన ఆధారాలు లభిస్తున్న ప్రాంతం? (గ్రూప్-1, 2010) 1) కాలీబంగన్, రోపార్ 2) లోథాల్, రంగపూర్ 3) చన్హుదారో, ఖేత్రి 4) మొహెంజొదారో, హరప్పా సమాధానాలు 1) 4 2) 1 3) 4 4) 2 5) 1 6) 4 7) 3 8) 4 9) 4 10) 1 -
సివిల్స్ ప్రిలిమ్స్‌లో చరిత్రలో ఎక్కువ మార్కులు ఎలా?
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: ప్రశ్న: సివిల్స్ ప్రిలిమ్స్‌లో చరిత్రలో ఎక్కువ మార్కులు రావాలంటే ఏం చేయాలి? ఏయే అంశాలపై దృష్టి సారించాలి? - ఎస్.ప్రకాశ్‌రెడ్డి, ఎస్.ఆర్.నగర్ సివిల్స్ ప్రిలిమ్స్ చరిత్రలో ప్రాచీన భారతదేశం నుంచి మూడు నుంచి ఐదు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ప్రాచీన పురావస్తు ప్రాంతాలు, బయటపడిన కట్టడాలు, పరికరాలు, సింధూ నాగరికత, ఆర్యులు, మత ఉద్యమాలు, మౌర్యుల పరిపాలనాంశాలు, గుప్తుల సాంస్కృతిక సేవలు లాంటి అంశాలపై దృష్టి సారించాలి. మధ్య యుగంలో సూఫీ, భక్తి ఉద్యమకారుల ప్రభావం, ఢిల్లీ సుల్తానులు, మొగల్ చక్రవర్తుల సాహిత్య, సాంస్కృతిక సేవ, విజయనగర - బహమనీ రాజ్యాల ప్రభావం, దక్షిణ భారతంలో చోళ, పాండ్య రాజ్యాల ఆర్థిక, శిల్పకళా రంగాలు, దక్షిణ భారతదేశాన్ని సందర్శించిన యాత్రికులు, వారి రచనల్లోని అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశముంది. అదేవిధంగా బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ప్రభావం, సామాజిక సంస్కరణోద్యమాలు, స్వాతంత్య్రోద్యమంలోని దశలు, స్వాతంత్య్రం అనంతర పరిస్థితులపై పట్టు సాధించాలి. గత మూడు నుంచి నాలుగేళ్ల పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో అర్థం అవుతుంది. ఉదాహరణకు 2008 సివిల్స్‌లో అడిగిన కింది ప్రశ్నను గమనించండి. ప్రశ్న: కిందివాటిని జతపర్చండి. LIST - 1 LIST - 2 సూఫీమతం నాయకులు ఎ) చిస్తీ సిల్సిలా 1) షేక్ అహ్మద్ షేర్‌హింద్ బి) నక్షబంది సిల్సిలా 2) షేక్ బహ్రూద్దీన్ జకారియా సి) ఖాద్రీ సిల్సిలా 3) షేక్ హమీదుద్దీన్ డి) సౌహాద్రి సిల్సిలా 4) సయ్యద్ ముక్దుమ్ మహ్మద్ గిలానీ 1) ఎ-3, బి-4, సి-1, డి-2 2) ఎ-1, బి-4, సి-3, డి-2 3) ఎ-3, బి-1, సి-4, డి-2 4) ఎ-1, బి-3, సి-4, డి-2 సమాధానం: 3 1857 సిపాయిల తిరుగుబాటును ‘నాగరికత- అనాగరికతల’ తిరుగుబాటుగా పేర్కొన్న వారు ఎవరు? 1869లో కార్ల్‌మార్క్స్ ఈ తిరుగుబాటును ఏమని వ్యాఖ్యానించాడు? లాంటి ప్రశ్నలు అడిగే అవకాశముంది. అదేవిధంగా గాంధీయుగం నుంచి గాంధీ వ్యక్తిత్వం, పోరాట పద్ధతులు, సత్యాగ్రహం + అహింస ప్రాధాన్యత, 1942 క్విట్ ఇండియాలో ‘డూ ఆర్ డై’ అని ఎందుకు పిలుపునిచ్చారు?, దక్షిణాఫ్రికాలో గాంధీజీ ఆసియన్ల హక్కుల కోసం పోరాడటానికి కారణాలు, గాంధీజీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి. ఈ సమాచారమంతా ప్రామాణిక పాఠ్య పుస్తకాల్లో లభిస్తుంది. చదువుతున్నప్పుడే అర్థం చేసుకున్న అంశాలను నోట్స్‌గా రాసుకోవాలి. అప్పుడే సబ్జెక్టుపై ప్రాథమిక అవగాహన కలుగుతుంది. సివిల్ సర్వీసెస్; కాలేజ్ సర్వీస్ కమిషన్స్ నిర్వహించిన నెట్/స్లెట్ గత పరీక్షల ప్రశ్నపత్రాల్లోంచి 50 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. పాత విషయాలే కాకుండా, నూతన, సమకాలీన, సాంస్కృతిక పరమైన అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిలిమినరీ పరీక్ష జ్ఞానానికి సంబంధించిందే తప్ప, సబ్జెక్టుకు సంబంధించింది కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది కేవలం వడపోత (ఎలిమినేట్) చేయడానికి నిర్వహించేది మాత్రమే. ఇన్పుట్స్: డాక్టర్ పి.మురళి, సీనియర్ ఫ్యాకల్టీ, నిజాం కాలేజ్, హైదరాబాద్. జనరల్ నాలెడ్‌జ: అంతరిక్ష రంగంలో మైలురాళ్లు - మొదటి మానవ నిర్మిత ఉపగ్రహం - స్పుత్నిక్ -1 (1957లో రష్యా ప్రయోగించింది) - అంతరిక్షంలోకి పంపిన కుక్కపిల్ల పేరు -లైకా (1957, స్పుత్నిక్-2 నౌక ద్వారా) - అంతరిక్షంలోకి అమెరికా పంపిన మొదటి ఉపగ్రహం-ఎక్స్‌ప్లోరర్ (1958 అమెరికా) - నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)ను ఏర్పాటు చేసిన సం॥ - మొదటి అంతరిక్ష యాత్రికుడు-యూరి గగారిన్, రష్యా (1961లో వోస్తోక్-1 అంతరిక్ష నౌక ద్వారా ప్రయాణించాడు) మన జాతీయ పతాకం - తొలిసారిగా 1921లో విజయవాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పింగళి వెంకయ్య (విజయవాడ) రూపొందించిన జాతీయ పతాక నమూనాను ప్రదర్శించారు. - 3:2 (పొడవు: వెడల్పు) నిడివిగల జాతీయ పతాకంలో కాషాయం రంగు- ధైర్యానికి, త్యాగానికి; తెలుపు రంగు - శాంతి, సత్యానికి; ఆకుపచ్చ రంగు - విశ్వాసానికి చిహ్నాలుగా గుర్తించారు. - పతాకం మధ్యలో తెలుపు రంగుపై మొదట మహాత్మాగాంధీ సూచించిన చరఖా ఉండేది. తరువాత దీని స్థానంలో ముదురు నీలిరంగు (నేవీ బ్లూ)లో గల అశోకుని ధర్మచక్రం ఎంచుకున్నారు. దీన్ని సారనాథ్‌లోని అశోక స్తంభం నుంచి గ్రహించారు. ఈ అశోక చక్రం ప్రాచీన సంస్కృతికి చిహ్నం. - జాతీయ పతాకాన్ని 1947, జూలై 22న ఆమోదించారు. - జాతీయ పతాకాన్ని భారత పౌరులందరూ అన్ని రోజుల్లో ఎగురవేయడానికి వీలుగా జనవరి 26, 2002 నుంచి ‘ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా - 2002’ అమల్లోకి వచ్చింది. 12వ పంచవర్ష ప్రణాళిక (2012-17) - {పధాన లక్ష్యం: వేగవంతమైన, సుస్థిర, మరింత సమ్మిళిత వృద్ధి. వృద్ధి లక్ష్యాలు - సగటు వార్షిక వృద్ధి: - ఆర్థిక వ్యవస్థ: 8 శాతం - వ్యవసాయ రంగం: 4 శాతం - పారిశ్రామిక రంగం: 9 శాతం - సేవా రంగం: 10 శాతం - ఇతర లక్ష్యాలు/అంచనాలు: స్థూల దేశీయోత్పత్తిలో పెట్టుబడి 37 శాతం, స్థూల దేశీయోత్పత్తిలో పొదుపు 34.2 శాతం. - వనరులు: రూ. 80,50,123 కోట్లు.