breaking news
Indiana University scientists
-
అదే జరిగితే ఏసీలు కనుమరుగు అయినట్లే!
గ్లోబల్ వార్మింగ్, పర్యావరణపు ప్రతికూల మార్పుల వల్ల.. వాతావరణంలో విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీజన్‌తో సంబంధం లేకుండా అధిక వేడిమి సమస్య భూమిని పట్టి పీడిస్తోంది. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం సమ్మర్‌తో సంబంధం లేకుండా ఎయిర్ కండిషనర్ల వాడకం మన దేశంలోనూ పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఊరట ఇచ్చే వార్తను చెప్పారు సైంటిస్టులు. ఇండియానా(యూఎస్ స్టేట్స్)లోని పుర్డ్యూ యూనివర్సిటీ సైంటిస్టులు.. ప్రపంచంలోనే అత్యంత తెల్ల పెయింట్‌ను తయారు చేశారు. ఇది గనుక గోడలకు వేస్తే.. ఇంట్లో చల్లదనం కోసం కరెంట్‌ను కాల్చుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అంతేకాదు ఫ్రియాన్ విడుదల తప్పి.. గ్లోబల్ వార్మింగ్ సమస్య కూడా నివారించొచ్చని అంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత తెల్ల పెయింట్‌ను పుర్డ్యూ యూనివర్సిటీ సైంటిస్టులు రూపొందించారు. ఇది తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది కూడా. ఇది సూర్యకాంతికి రిఫ్లెక్షన్‌ను దూరం చేస్తుందని ప్రొఫెసర్ గ్జియూలిన్ రువాన్ చెప్తున్నారు. గ్లోబల్ వార్మింగ్‌పై ఫైట్.. గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించేదిశగా ఈ వైట్ పెయింట్ పరిశోధన కృషి చేయనుందని రువాన్ అంటున్నారు. అత్యంత తెల్లదనం కారణంగానే ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కిందని చెప్తున్నారాయన. ఈ పెయింట్‌ను గనుక వెయ్యి స్క్వేర్ ఫీట్ల మేర గోడకుగానీ, రూఫ్కుగానీ వేస్తే.. పది కిలోవాట్ల కరెంట్ అందించే చల్లదనాన్ని అందిస్తుందట. ఇది ఇళ్లలోని ఏసీలు అందించే చల్లదనం కంటే చాలా రెట్లు ఎక్కువని రువాన్ స్పష్టం చేశారు. తద్వారా ఎయిర్ కండిషనర్ల వాడకం తగ్గడంతో పాటు గ్లోబల్ వార్మింగ్ చాలావరకు తగ్గించినట్లే అవుతుందని అంటున్నారు. ఎలాగంటే.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పెయింట్స్ చల్లదనానికి బదులు.. వేడిని కలగజేస్తాయి. తెల్ల పెయింట్స్ 80 నుంచి 90 శాతం సూర్యకాంతిని రిఫ్లెక్ట్స్ చేస్తాయి. ఎలాంటి చల్లదనాన్ని అందించవు. కానీ, పుర్డ్యూ సైంటిస్టులు రూపొందించిన వైట్ పెయింట్ మాత్రం రివర్స్‌లో అతిచల్లదనాన్ని అందిస్తాయి. కాస్మోటిక్స్‌లో ఉపయోగించే కెమికల్ కాంపౌండ్, అధిక గాఢత బేరియం సల్ఫేట్ కలిపి ఈ పెయింట్‌ను డెవలప్ చేశారట. ధర కూడా తక్కువగా ఉండి.. ఎక్కువకాలం చెక్కుచెదరకుండా ఉంటుంది. ఇది మార్కెట్లోకి రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. ఒకవేళ ఈ పెయింట్ గనుక మార్కెట్లోకి వస్తే మాత్రం ఎయిర్ కండిషనర్స్ అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి: సెల్‌ఫోన్ టవర్లు, కేబుళ్లు కనుమరుగు కానున్నాయా..! -
బోడిగుండుపై వెంట్రుకలు మొలుస్తాయి!
బట్టతలతో చిక్కేమీ ఉండదుగానీ... చుట్టుపక్కల వాళ్లు ఏమనుకుంటారో అన్న బెంగే ఎక్కువ. అందుకే బట్టతలకు చికిత్స అంటే చాలు.. చాలామంది వేలకువేలు పోసి నూనెలు కొంటూంటారు. కష్టమైనా.. నొప్పి ఎక్కువ ఉన్నా... హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కూ సిద్ధమవుతూంటారు. ఇకపై ఈ బాదరబందీలేవీ వద్దంటున్నారు ఇండియానా యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు. శరీరంలో... ఏ కణంగానైనా మారగల సామర్థ్యమున్న మూలకణాలతో తాము పరిశోధనశాలలో వెంట్రుకలతో కూడిన ఎలుక చర్మాన్ని సృష్టించగలిగామని వారు ప్రకటించారు. మూలకణాలతో ఇది సాధ్యమేనని చాలాకాలంగా అనుకుంటున్నప్పటికీ వాస్తవంగా చేసి చూపింది మాత్రం వీరే. ప్రొఫెసర్ కార్ల్ కోహ్లెర్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనల లక్ష్యం బధిరత్వానికి చికిత్స కనుక్కోవడం అయినప్పటికీ ఈ క్రమంలో మూలకణాలు చర్మం తాలూకూ కణాలను కూడా ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించడంతో బట్టతల సమస్యకు పరిష్కారం దొరికింది. ప్రత్యేకమైన మూలకణాల సాయంతో అభివృద్ధి చేసిన ఒకే ఒక్క చర్మపు మొగ్గ (ఇంగ్లీషులో బడ్ అంటారు) అటు చర్మపు పైపొరతో పాటు లోపలి పొర అయిన డెర్మిస్‌ను కూడా సృష్టించగలదని, ఫలితంగా ఎలుకల శరీరంపై జరిగినట్లే వెంట్రుకలు మొలుస్తున్నట్లు వీరు గుర్తించారు. వేర్వేరు రకాల చర్మ కణ కుదుళ్లు (ఫోలికల్స్) తయారవుతూండటం ఇంకో విశేషం. మొత్తం మీద ఈ పద్ధతి బట్టతలకు మాత్రమే కాకుండా.. సూక్ష్మరూపంలో ఉండే అవయవాలను తయారు చేసేందుకూ ఉపయోగించవచ్చునని కోహ్లెర్ వివరించారు. -
పపంచంలోలక్ష కోట్ల జీవ జాతులు!
న్యూయార్క్: ప్రపంచంలో లక్ష కోట్ల జీవజాతులు ఉన్నాయి. అయితే వీటిలో మనం కనుగొన్నది చాలా తక్కువ. ఇంకా 99.999% జాతులను కనుగొనాల్సి ఉంది. ప్రభుత్వాలు, సంస్థలు, ప్రజల నుంచి సేకరించిన అనేక సూక్ష్మజీవ, వృక్ష, జంతు జీవజాలాల సమాచారాన్ని విశ్లేషించి ఈ విషయాన్ని జీవశాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఒక్క అంటార్కిటికా మినహా ప్రపంచంలోని 35 వేల ప్రాంతాల నుంచి 56 లక్షల సూక్ష్మజీవులు, ఇతర జీవజాతుల సమాచారాన్ని క్రోడీకరించి ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు ఇండియానా వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.