breaking news
Indian two wheeler industry
-
టూవీలర్లకు ‘ఎల్‌నినో’ బ్రేక్ ..!
న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఎఫ్వై 2027) లో 3–5 శాతం పరిమిత హోల్‌సేల్ వృద్ధిని నమోదు చేయవచ్చని రేటింగ్స్ సంస్థ ‘ఇక్రా’ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఎల్‌నినో కారణంగా రుతుపవనాలు బలహీనపడే సూచనలు, ద్రవ్యోల్బణంతో వాహనాల ధరలు పెరగడం, గత ఆర్థిక సంవత్సరాల్లో నమోదైన అత్యధిక విక్రయాల ప్రభావం (హై బేస్ ఎఫెక్ట్) వంటి అంశాలు ఈ రంగానికి సవాళ్లుగా మారొచ్చని రేటింగ్ సంస్థ అభిప్రాయపడింది. సానుకూలతలున్నా.. అంతర్జాతీయ సవాళ్లు పెరుగుతున్న దేశీయ డిమాండ్, మెరుగైన రిటైల్ విక్రయాల జోరు, నిలకడైన ఎగుమతుల మద్దతుతో ద్విచక్ర వాహన రంగం తన నిలకడైన ప్రదర్శనను చాటుకుంటోందని ఇక్రా పేర్కొంది. ‘జీఎస్టీ 2.0’ సంస్కరణలతో వాహనాలు అందుబాటు ధరల్లోకి రావడం, పాత వాహనాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసే ధోరణి మార్కెట్ వృద్ధికి సానుకూలంగా మారనున్నాయి. అయితే, పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సప్లై చైన్‌ను దెబ్బతీసే అవకాశం ఉన్నందున, ఆ పరిణామాలను క్షుణ్ణంగా గమనించాల్సి ఉంటుందని తెలిపింది. మేలో విక్రయాల జోరు దేశీయ హోల్‌సేల్ విక్రయాలు 2026 మే నెలలో వార్షిక ప్రాతిపదికన 15.7 శాతం బలమైన వృద్ధితో 19 లక్షల యూనిట్లకు చేరాయని ఇక్రా నివేదిక తెలిపింది. జీఎస్టీ 2.0 సంస్కరణలు, వాహన తయారీ కంపెనీలు ధరలు పెంచుతారనే ముందస్తు అంచనాలతో వినియోగదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపడం ఇందుకు కారణమైంది. ఇక రిటైల్ విక్రయాలు కూడా మే నెలలో ఏడాది ప్రాతిపదికన 7.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. పెళ్లిళ్ల సీజన్, ఎంట్రీ–లెవెల్ నుంచి ప్రీమియం శ్రేణి వరకు విభిన్న మోడళ్లు అందుబాటులో ఉండటం మార్కెట్‌కు కలిసొచ్చింది. అయితే, దేశంలో నమోదైన విపరీతమైన ఎండల కారణంగా షోరూమ్‌లకు కస్టమర్ల రాక తగ్గడం, కొన్ని మోడళ్ల సరఫరాలో అంతరాయాలు వృద్ధి వేగాన్ని కొంతమేర నియంత్రించాయి. ఈ–టూ వీలర్స్ దూకుడు ఇక్రా నివేదికలో ఎలక్ట్రిక్ వాహన విభాగ ప్రదర్శన ఆకట్టుకుంది. 2026 మే నెలలో రిటైల్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు ఏకంగా 71.7 శాతం వార్షిక వృద్ధితో 1,72,148 యూనిట్లకు చేరాయి. మొత్తం ద్విచక్ర వాహన మార్కెట్లో ఈవీల వాటా ప్రస్తుతం 8.9 శాతానికి చేరింది. ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగదారుల నుంచి లభిస్తున్న ఆదరణకు, మారుతున్న పర్యావరణ వ్యవస్థకు ఇది నిదర్శనమని ఇక్రా స్పష్టం చేసింది. -
స్టాక్స్ వ్యూ
హీరో మోటొకార్ప్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.2,871 టార్గెట్ ధర: రూ.3,050 ఎందుకంటే: భారత టూవీలర్ల పరిశ్రమలో అగ్రస్థానంలో ఉంది. నెలకు సగటున 4 లక్షలకు పైగా టూవీలర్లను విక్రయిస్తోంది. జైపూర్ సమీపంలో ఇటీవలనే ఆర్ అండ్ డీ సెంటర్‌ను ప్రారంభించింది. రూ.850 కోట్ల పెట్టుబడులతో నిర్మించిన ఈ సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ(సీఐటీ) కారణంగా ఉత్పత్తుల పరిశోధనల్లో జాప్యం తగ్గి వ్యయాలు కలసివస్తాయి. రబీ, ఖరీఫ్ పంటలు అంతంత మాత్రంగానే ఉండటం వల్ల టూవీలర్ల పరిశ్రమ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో తక్కువ స్థాయిలోనే ఉండనున్నది. 100 సీసీ సెగ్మెంట్లో పోటీ కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను తేవడంతో పోటీ పెరిగి లాభాలు తగ్గాయి. ఇది హీరో మోటొకార్ప్ మార్జిన్లపై ఒత్తిడి పెంచుతోంది. గత రెండేళ్లలో ఒక్కటే కొత్త మోడల్‌ను తెచ్చిన ఈ కంపెనీ మూడేళ్లలో 35 కొత్త మోడళ్లను తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన మ్యాస్ట్రో ఎడ్జ్, డ్యుయట్ స్కూటర్లకు, స్ప్లెండర్ ఐ స్మార్ట్, తదితర మోడళ్లకు మంచి స్పందన లభిస్తోంది. ఎగుమతులకు అపార అవకాశాలున్నాయి. ఎగుమతిచేస్తున్న దేశాల సంఖ్యను ప్రస్తుతమున్న 20 నుంచి 40కు పెంచుకోవాలని యోచిస్తోంది. వ్యయ నియంత్రణ పద్ధతులను అమలు చేస్తోంది. గత మూడేళ్లలో అంతంత మాత్రం వృద్ధినే సాధించిన కంపెనీ అమ్మకాలు ఏడాది కాలంలో 11% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని భావిస్తున్నాం. అలాగే షేర్‌వారీ ఆర్జన 18% చొప్పున వృద్ధి సాధిస్తుందని అం చనా. ఈ ఏడాది వర్షాలు సాధారణంగానే ఉంటాయన్న అంచనాలు కంపెనీకి సానుకూలాంశం. ఐఓసీ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.2,871 టార్గెట్ ధర: రూ.3,050 ఎందుకంటే: భారత టూవీలర్ల పరిశ్రమలో అగ్రస్థానంలో ఉంది. నెలకు సగటున 4 లక్షలకు పైగా టూవీలర్లను విక్రయిస్తోంది. జైపూర్ సమీపంలో ఇటీవలనే ఆర్ అండ్ డీ సెంటర్‌ను ప్రారంభించింది. రూ.850 కోట్ల పెట్టుబడులతో నిర్మించిన ఈ సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ(సీఐటీ) కారణంగా ఉత్పత్తుల పరిశోధనల్లో జాప్యం తగ్గి వ్యయాలు కలసివస్తాయి. రబీ, ఖరీఫ్ పంటలు అంతంత మాత్రంగానే ఉండటం వల్ల టూవీలర్ల పరిశ్రమ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో తక్కువ స్థాయిలోనే ఉండనున్నది. 100 సీసీ సెగ్మెంట్లో పోటీ కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను తేవడంతో పోటీ పెరిగి లాభాలు తగ్గాయి. ఇది హీరో మోటొకార్ప్ మార్జిన్లపై ఒత్తిడి పెంచుతోంది. గత రెండేళ్లలో ఒక్కటే కొత్త మోడల్‌ను తెచ్చిన ఈ కంపెనీ మూడేళ్లలో 35 కొత్త మోడళ్లను తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన మ్యాస్ట్రో ఎడ్జ్, డ్యుయట్ స్కూటర్లకు, స్ప్లెండర్ ఐ స్మార్ట్, తదితర మోడళ్లకు మంచి స్పందన లభిస్తోంది. ఎగుమతులకు అపార అవకాశాలున్నాయి. ఎగుమతిచేస్తున్న దేశాల సంఖ్యను ప్రస్తుతమున్న 20 నుంచి 40కు పెంచుకోవాలని యోచిస్తోంది. వ్యయ నియంత్రణ పద్ధతులను అమలు చేస్తోంది. గత మూడేళ్లలో అంతంత మాత్రం వృద్ధినే సాధించిన కంపెనీ అమ్మకాలు ఏడాది కాలంలో 11% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని భావిస్తున్నాం. అలాగే షేర్‌వారీ ఆర్జన 18% చొప్పున వృద్ధి సాధిస్తుందని అం చనా. ఈ ఏడాది వర్షాలు సాధారణంగానే ఉంటాయన్న అంచనాలు కంపెనీకి సానుకూలాంశం. ఐఓసీ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్‌వేజ్ ప్రస్తుత ధర: రూ.393 టార్గెట్ ధర: రూ.442 ఎందుకంటే: భారత్‌లో అతి పెద్ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ. ఈ కంపెనీ మార్కెట్ వాటా 49 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 20వేల అవుట్లెట్లతో అతి పెద్ద రిటైల్ అవుట్లెట్ నెట్వర్క్ ఉన్న కంపెనీ ఇదేనని చెప్పవచ్చు. అంతేకాకుండా రెండో అతి పెద్ద రిఫైనింగ్ కెపాసిటీ ఉన్న కంపెనీ కూడా ఇదే. 15 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్న పారిదిప్ రిఫైనరీ త్వరలో అందుబాటులోకి రానున్నది. రిఫైనింగ్, మార్కెటింగ్ సెగ్మంట్లలలో ఒడిదుడుకులు వచ్చినా, పైప్లైన్ల ఆదాయం నిలక డగా ఉండడటం కంపెనీకి కలసివస్తోంది. జీడీపీ, జనాభా జోరుగా పెరుగుతుండటంతో తలసరి ఇంధన వినియోగం బాగా పెరగనున్నది. భారత ఇంధన రంగంలో చమురు ప్రాధాన్యత కనీసం మరో పాతికేళ్లు కొనసాగనున్నదని అంచనా. పారదీప్‌లోని రిఫైనరీ విస్తరణ తమ కంపెనీ సమర్థతను మరింత పెంచుతుందని ఐఓసీ భావిస్తోంది. భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన వినియోగం బాగా పెరుగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా విస్తరించి ఉన్నందువల్ల ఇది తమకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.15,600 కోట్ల చమురు ఇన్వెంటరీ నష్టాలు వచ్చాయి. అయితే స్థూల రిఫైనరీ మార్జిన్లు బ్యారెల్‌కు 6.5 డాలర్లు పెరగడం కంపెనీకి కలసివచ్చింది. దీర్ఘకాలానికి రూ.442 టార్గెట్ ధరగా ఈ షేర్‌ను ప్రస్తుత ధరలో కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తున్నాం. ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి క్షీణత,.. కీలకమైన ప్రతికూలాంశాలు.


