breaking news
Indian Standard Hole Mark
-
వెండి ఆభరణాలకు హాల్ మార్కింగ్ తప్పనిసరి!
న్యూఢిల్లీ: వెండి ఆభరణాలు, వస్తువులకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి అమలు చేయడాన్ని ప్రభుత్వం ఆరు నెలల తర్వాత పరిశీలిస్తుందని భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. సెపె్టంబర్ 1 నుంచి వెండి ఆభరణాలు, వస్తువులకు స్వచ్ఛంద హాల్‌మార్కింగ్‌ను ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం తెలిసిందే. ‘‘దీని ఫలితాలను పరిశీలించేందుకు కనీసం ఆరు నెలల సమయం అవసరం. ప్రస్తుత ప్రక్రియను ఆరు నెల పాటు పరిశీలిస్తాం. ఆ తర్వాతే తప్పనిసరి చేయాలా? లేదా? అన్నది నిర్ణయిస్తాం’’అని ప్రమోద్ కుమార్ తివారీ చెప్పారు. చిన్న వర్తకులు వెండిని కరిగించి ఆభరణాలు తయారు చేస్తుంటారని, వారిని తప్పనిసరి హాల్‌మార్కింగ్ సర్టిఫికేషన్ కిందకు తీసుకురావడం సవాలుగా పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు ప్రజాదరణ పొందాలంటే పెట్రోల్ పంపుల మాదిరి మౌలిక వసతులు ఉండాలని తివారీ అభిప్రాయపడ్డారు. ఈవీ చార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్వాపింగ్‌కు సంబంధించి ప్రమాణాలను అభివృద్ధి చేశామని, అవి ముసాయిదా దశలో ఉన్నట్టు చెప్పారు. -
ఆన్లైన్ రివ్యూలకు భారత ప్రమాణాలు
న్యూఢిల్లీ: ఆన్లైన్లో నకిలీ రివ్యూల కట్టడి దిశగా భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) ‘ఇండియన్ స్టాండర్డ్ (ఐఎస్) 19000:2022’ను తీసుకొచ్చింది. ఆన్లైన్లో వినియోగదారుల నుంచి సేకరించే రివ్యూలు, ఆ రివ్యూల సేకరణకు అనుసరించే అవసరాలు, ప్రమాణాలు, వాటి ప్రచురణకు కచ్చితంగా బీఐఎస్ ప్రమాణాలను ఈ కామర్స్ సంస్థలు, ఇతర ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అనుసరించాల్సి ఉంటుంది. ఈ మేరకు బీఐఎస్ ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్ వేదికగా కస్టమర్ల రివ్యూలు (అభిప్రాయాలు, సమీక్ష) సమీకరించే అన్ని సంస్థలు, ఉత్పత్తులు, సేవలను విక్రయించే, సరఫరాచేసే సంస్థలు, రివ్యూలను సమీకరించేందుకు మూడో పార్టీని ఏర్పాటు చేసుకునే సరఫరాదారులు, విక్రయదారులు వీటిని పాటించాల్సి ఉంటుందని బీఐఎస్ తెలిపింది. ముఖ్యంగా రివ్యూ తీసుకునే విషయంలో అనుసరించాల్సిన ప్రమాణాలు, సూత్రాలను ఇండియన్ స్టాండర్డ్ సూచిస్తుంది. రివ్యూని రాసే, రివ్యూని సమీక్షించే వారిపై ఉండే బాధ్యతలను కూడా తెలియజేస్తుంది. ‘‘ఆన్లైన్లో వస్తువులను కొనుగోలు చేసే వారిలో ఇది విశ్వాసాన్ని కలిగిస్తుంది. మెరుగైన నిర్ణయాన్ని తీసుకోవడానికి సాయపడుతుంది. ఈ కామర్స్ ఎకోసిస్టమ్, వినియోగదారులు, ఈ కామర్స్ వేదికలు, విక్రేతలు ఇలా భాగస్వాములు అందరికీ ఇండియన్ స్టాండర్డ్ 19000:2022 ప్రయోజనం కలిగిస్తుంది’’అని బీఐఎస్ తెలిపింది. -
కొందామా.. వద్దా!
ప్రొద్దుటూరు కల్చరల్ : ఏదైనా వస్తువు ధర తగ్గిందంటే ప్రజలు కొనడానికి క్యూ కడతారు. అయితే బంగారం విషయంలో మాత్రం విచి త్రమైన పరిస్థితి నెలకొంది. రెండు వారాలుగా పుత్తడి ధరలు పతనమవుతున్నా కొనేవాళ్లు మాత్రం ముందుకు రావ డం లేదు. వీటి ధరలు మరింత తగ్గుతాయనే ఆశతో ఎదురు చూస్తున్నారని ఇక్కడి వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిన బంగారం ధరలు దిగివస్తుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శనివారం 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.2545, 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.2352, వెండి కిలో రూ.34300గా ఉంది. అంతర్జాతీయ కారణాల వల్ల బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఆశించిన రీతిలో కొనుగోళ్లు లేవని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత ధర తగ్గితే తాము భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది దాదాపు 2 నుంచి 3 వేలకు పైగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర 2010- 2011 మధ్య కాలంలో అత్యధికంగా దాదాపు రూ.7,900దాకా పెరిగింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.2660 ఉండగా జూన్ 1వ తేదీన రూ.2778, జూలై 1వ తేదీన రూ.2665 పలికి.. 11 రోజులుగా తగ్గుతూ వస్తోంది. ఈ నెల 13న 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.26350, 22 క్యారెట్ల ధర రూ.24,450, వెండి కిలో రూ.35700 పలికిన ధర 14వ తేదీన రూ.26330, రూ.24420, రూ.35500లకు చేరుకుంది. 24వ తేదీన 10 గ్రాములు బంగారం 24 క్యారెట్ల ధర రూ. 25200, 22 క్యారెట్లు రూ. 23240, వెండి రూ.34200 ఉంది. ధరలు మరింత తగ్గుతాయని మీడియాలో కథనాలు వస్తుండటంతో కొనుగోలుకు ముందుకు ఎవరూ రావడం లేదని వ్యాపారులు అంటున్నారు. అయితే మరింతగా ధర తగ్గే అవకాశాలు తక్కువని, కొనుగోలుకు ఇదే మంచి తరుణమని చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్లో మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. తక్కువ ధరకు వస్తున్నాయని ప్యూరిటి తక్కువ గల ఆభరణాలను కొనకుండా బ్యూరో ఇండియన్ స్టాండర్డ్ హోల్ మార్కు ఉన్న వాటినే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. కొనేందుకు మంచి అవకాశం : బుశెట్టి రామ్మెహన్ రావు, బులియన్ మార్కెట్ అసోసియేషన్ మెంబర్ అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు బాగా తగ్గాయి. పుత్తడి కొనేందుకు ఇది మంచి తరుణం. మరింత తగ్గుతుందా.. లేదా అనేది చెప్పలేం. మార్కెట్‌ను అంచనా వేయలేం : నిదీష్, రితి జ్యువెలర్స్ షోరూం మేనేజరు మార్కెట్‌ను అంచనా వేయలేము. బంగారం నిల్వలను విక్రయిస్తుండటం, పుత్తడిపై పెట్టుబడులను విరమించుకుంటుండటంతో ధరలు తగ్గుతున్నాయి. బంగారం ధరలు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. ధరల తగ్గుదల, పెరుగుదలపై కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. హాల్ మార్కుగల ఆభరణాలను కొనాలి : వెంకటేష్, మార్కెటింగ్ మేనేజర్ బ్యూరో ఇండియన్ స్టాండర్డ్ 916 హోల్ మార్కు (బిస్) గల ఆభరణాలను మాత్రమే కొనాలి. తక్కువ ప్యూరిటి గల ఆభరణాలను కొని నష్టపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. సంవత్సరం 10 గ్రాముల బంగారం ధర 2004 రూ.5850 2005 రూ.7000 2006 రూ.8400 2007 రూ.10,800 2008 రూ.12500 2009 రూ.14500 2010 రూ.18500 2011 రూ.26400 2012 రూ.29500 2013 రూ.31200 2014 రూ.27800