breaking news
Indian Express paper
-
భార్య ఓడిపోయిందని.. ఆమె భర్తను చంపేశాడు!
న్యూఢిల్లీ: పంచాయతీ ఎన్నికల్లో తన భార్య ఓటమిని తట్టుకోలేని భర్త, గెలిచిన సర్పంచ్ అభ్యర్థి భర్తను చంపేసిన ఘటన మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. హతుడు బాలాసాహెబ్ సోపాన్ వాన్షివ్, హత్యకు పాల్పడ్డ అవినాష్ కాంబ్లేలు దగ్గరి బంధువులు. ఇద్దరి మధ్య చాలా రోజుల నుంచి రాజకీయ విభేదాలు, భూవివదాలూ ఉన్నట్టు సమాచారం. దీంతోపాటు ఈ మధ్యే అక్కడ జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంబ్లే భార్యపై వాన్షివ్ భార్య గెలుపొందారు. దీన్ని తట్టుకోలేని కాంబ్లే, వాన్షివ్‌ను కారుతో గుద్ది చంపాలని స్కెచ్ వేశాడు. వాన్షివ్‌కు మార్నింగ్ వాక్ అలవాటు ఉండటంతో అతడు ఎప్పటిలాగే వాకింగ్ (మార్చి 13న)కు వెళ్లాడు. ఆ సమయంలో పథకం ప్రకారం.. కాంబ్లే కారులో తన సహచరులతో కలసి అక్కడికి చేరుకున్నాడు. ప్రమాదాన్ని వాన్షివ్ గమనించేలోపే అతడ్ని ముందు నుంచి కారుతో ఢీకొట్టారు కాంబ్లే. అలా కొన్నిసార్లు కారుతో వాన్షివ్‌ను ఢీకొట్టిన.. కాంబ్లే, అతని సహచరులు అక్కడి నుంచి పరారయ్యారు. గాయాలతో ఉన్న వాన్షివ్‌ను గుర్తించిన కొందరు ఆసుపత్రిలో చేర్పించారు. కానీ కొన్ని రోజులకే అతడు మరణించాడు. హతుడు వాన్షివ్ భార్య, తన భర్తది సహజ మరణం కాదని.. కావాలనే ఎవరో పక్కా ప్లాన్‌తో చంపారని పోలీసలకు కంప్లైంట్ ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో తన గెలుపును సహించని కొందరు కక్ష కట్టి ఈ దారుణానికి పాల్పడి ఉంటారని ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారాలతో వాన్షివ్‌ది హత్యగా తేల్చారు. కారుతో అతడిపై దాడికి తెగబడిన కొందరిలో ప్రధాన నిందితుడు కాంబ్లే కూడా సీసీటీవీతో దొరికిపోయాడు. ఎన్నికల్లో గెలువడంతో తమకు ముప్పు పొంచి ఉందని వాన్షివ్ దంపతులు ముందే పోలీసులకు చెప్పారని, దాంతో ఆ ఎన్నికల్లో పోటీ చేసిన కాంబ్లే తదితరులపై నిఘా వేసి.. తగిన ఆధారాలు దొరకడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
అధికారం నిజాన్ని ఒప్పుకుంటుందా?
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా సొంత పార్టీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను కలకలం రేపుతున్నాయి. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక కోసం ఆయన రాసిన ఓ కథనం ఇప్పుడు చర్చకు దారితీసింది. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాల ద్వారా ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనం అయ్యిందంటూ ఆయన అందులో పేర్కొన్నారు. ‘ఐ నీడ్ టూ స్పీక్ అప్ నౌ’ పేరిట ఆయన రాసిన ఆర్టికల్‌లో కేంద్రం కీలకంగా భావించిన నోట్లరద్దు, జీఎస్టీలపైనే ప్రధానంగా విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థను తన ప్రభుత్వమే నట్టేట ముంచిందని చెప్పుకొచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన తప్పులపై ఇప్పటికీ కూడా తాను స్పందించకపోతే భారతీయుడిగా తన ప్రాథమిక విధిని విస్మరించినట్లేనన్నారు. ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల సమీప భవిష్యత్తులో కోలుకోలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు జీడీపీ తగ్గిపోవటానికి సాంకేతిక కారణాలే కారణమన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలను యశ్వంత్ తప్పుబట్టారు. గతంలో తాము ప్రతిపక్షంలో ఉండగా దర్యాప్తు సంస్థల దాడులను ఖండించే వాళ్లమని ఆయన గుర్తు చేశారు. అధికారం అండతో ప్రత్యర్థులపైకి ఉసిగొల్పటం సరికాదంటూ ఆయన పరోక్షంగా ప్రభుత్వానికి సూచించారు. వాజ్‌పేయి హయాంలో యశ్వంత్ సిన్హా ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక యశ్వంత్ రాసిన కథనంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక శాఖా మంత్రి పి. చిదంబరం ట్విట్టర్లో స్పందించారు. ‘ఆయన (యశ్వంత్) అధికారంలో ఉన్న వారి గురించి నిజం చెప్పారు. మరి ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారన్న ఆ నిజాన్ని అధికారం ఒప్పుకుంటుందా? అంటూ బీజేపీకి చురకలంటించారు. సొంత నేత చేసిన విమర్శలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. Yashwant Sinha speaks Truth to Power. Will Power now admit the Truth that economy is sinking? — P. Chidambaram (@PChidambaram_IN) September 27, 2017 ETERNAL TRUTH: No matter what Power does, ultimately Truth will prevail. — P. Chidambaram (@PChidambaram_IN) September 27, 2017 -
పనామా పార్ట్ 2
♦ పనామా పేపర్లలో మరిన్ని కొత్త పేర్లు.. ♦ రెండో జాబితా వెల్లడించిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు తమ దేశాలను వదిలి పన్ను స్వర్గాల్లాంటి విదేశాల్లో డమ్మీ కంపెనీలు పెట్టి, వాటిలోకి ఇన్వెస్ట్మెంట్లు తరలించిన వ్యవహారంలో భారతీయులకు సంబంధించి మంగళవారం మరో జాబితా బయట పడింది. ఈ దర్యాప్తు సాగించిన ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే)లో భాగంగా ఉన్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ఈ రెండో జాబితాను ప్రచురించింది. దీన్లో నగల వర్తకులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. వారి వివరాలు చూస్తే... అశ్వనీ కుమార్ మెహ్రా మెహ్రాసన్స్ జ్యుయలర్స్ సంస్థ ఓనరు. 1999 నుంచి బహమాస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ (బీవీఐ)లలో పీటీసీ గ్రూప్, మ్యాక్స్‌హిల్ హోల్డింగ్స్ తదితర ఏడు సంస్థలను ఆయన కుటుంబం రిజిస్టరు చేసింది. రెండు కంపెనీల్లో తమకు వాటాలున్నది వాస్తవమేనని, అయితే ఇవి చట్టబద్ధమేనని మెహ్రా కుటుంబం పేర్కొంది. అనురాగ్ కేజ్రీవాల్ లోక్‌సత్తా పార్టీ ఢిల్లీ విభాగం మాజీ అధ్యక్షుడు. స్టింగ్ ఆపరేషన్‌తో బహిష్కార వేటు పడింది. కేజ్రీవాల్ అనురాగ్ ఇంటెక్స్ తదితర తదితర మూడు సంస్థల్లో డెరైక్టరుగా ఉన్నారు. విదేశాల్లో బీవీఐ, పనామాల్లో 3 సంస్థల్లో ఈయన డెరైక్టరుగా ఉన్నారు. మరో 2 ప్రైవేట్ ఫౌండేషన్లు ఏర్పాటు చేశారు. అయితే, సమస్యలు తలెత్తవచ్చన్న ఆలోచనతో 3 సంస్థలను 2010లోను, ఫౌండేషన్లను ప్రారంభించిన కొన్నాళ్లకే మూసివేసినట్లు కేజ్రీవాల్ తెలిపారు. సతీష్ గోవింద్ సమ్తాని, విష్లవ్ బహాదుర్, హరీష్ మోహ్నాని బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లోనిరెండు విదేశీ సంస్థల్లో ఈ ముగ్గురూ డెరైక్టర్లు. వీటిలో ఒకటైన ట్రైలియోన్ను 2012లో తొలగించగా, మరొకటి డిజైన్ అండ్ క్వాలిటీని ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలగించనున్నారు. బహాదుర్ ప్రస్తుతం వీఎన్ఎస్ కార్పొరేషన్ సంస్థను నడిపిస్తుండగా, మోహ్నానీ... బీఎస్ఈలో లిస్టయిన ప్రొ అపారెల్ డివిజన్‌కు ఎండీగా ఉన్నారు. దుస్తుల ఎగుమతుల లావాదేవీల కోసం నిబంధనల ప్రకారమే రెండు విదేశీ సంస్థలు ప్రారంభించామని, కానీ తర్వాత వాటిని మూసివేశామని బహాదుర్ తెలిపారు. ముగ్గురూ విడిపోయి వేర్వేరు సంస్థల్లో ఉన్నామని పేర్కొన్నారు. గౌతమ్ సీన్గాల్ ఈయన ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, ఐటీ కన్సల్టెంటు. దాదాపు 400 మిలియన్ డాలర్ల ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌తో తనకు లింకు ఉందని ఆయన చెప్పినట్లు ఫోన్సెకా రికార్డులు చూపుతున్నాయి. ఈయన పేరిట బీవీఐలో రెండు సంస్థలు ప్రారంబించారు. ఈ కంపెనీలన్నీ తన తండ్రికి చెందినవేనని, కుటుంబ విభజన తర్వాత వాటితో తనకే సంబంధమూ లేదని గౌతమ్ పేర్కొన్నారు. తనకు గుర్గావ్, ఢిల్లీ, మొహాలీలో కార్యాలయాలు ఉన్నట్లు తెలిపారు. ప్రభాస్ సంఖ్లా ఈయన మధ్యప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగి. మూడేళ్ల క్రితం భార్య మరణం తర్వాత నుంచి ఇండోర్‌లో ఒంటరిగా ఉంటున్నారు. సంఖ్లా, ఆయన కుమార్తె, అల్లుడు డెరైక్టర్లుగా పనామాలో లోటస్ హొరైజన్ పేరిట సంస్థ ఉంది. తన అల్లుడు వ్యాపారవేత్త అని చెబుతున్న సంఖ్లా... సదరు సంస్థలో తాను కేవలం గౌరవ డెరైక్టరును మాత్రమేనని పేర్కొన్నారు. అవసరమైతే తన పేరును తొలగించమని వారిని కోరతానన్నారు. వినోద్ రామచంద్ర జాదవ్ పుణెకి చెందిన సవా హెల్త్‌కేర్ సంస్థకు చైర్మన్. 2010-15 మధ్య బీవీఐ కేంద్రంగా ఏర్పాటైన పలు సంస్థల్లో డెరైక్టరుగానో లేదా షేర్హోల్డరుగానో ఆయన పేరు కనిపిస్తోంది. తన డెరైక్టర్షిప్లు, ఆదాయాలన్నీ ప్రతీ ఏటా నియంత్రణ సంస్థలకు తెలియజేస్తున్నట్లు జాదవ్ చెప్పారు. గౌతమ్, కరణ్ థాపర్ 1999లో థాపర్ గ్రూప్ విభజన అనంతరం... క్రాంప్టన్ గ్రీవ్స్ సంస్థ బ్రిజ్ మోహన్ థాపర్ కుమారులైన గౌతమ్, కరణ్ థాపర్ల చేతికి వచ్చింది. 2005లో చార్ల్‌వుడ్ ఫౌండేషన్‌ను గౌతమ్, నికోమ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌ను కరణ్ ప్రారంభించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే చార్ల్వుడ్ను గౌతమ్ ఏర్పాటు చేయలేదని, ఆయన భార్య స్టెఫానీ దీని లబ్ధిదారుల్లో ఒకరని గౌతమ్ తరఫు వర్గాలు తెలిపాయి. అశోక్ మల్హోత్రా ఈయన కోల్‌కతాకు చెందిన వ్యాపారవేత్త. 2008లో బీవీఐలో ఏర్పాటైన ఈఅండ్‌పీ ఆన్‌లుకర్స్ సంస్థ డెరైక్టరు, వాటాదారు. సందీప్ రస్తోగీ అనే మరో డెరైక్టరు పేరిట ఉన్న అయిదు షేర్లు మల్హోత్రకు బదిలీ అయ్యాయి. అనంతరం 2010లో దీని కార్యకలాపాలు ఆగిపోయాయి. రస్తోగీ తన మిత్రుడేనని, అయితే షేర్ల లావాదేవీల గురించి పెద్దగా గుర్తు లేదని మల్హోత్ర వివరించారు. రంజీవ్ దహుజా, కపిల్ సైన్ గోయల్ ఈఇద్దరు బెర్కిలీ ఆటోమొబైల్స్‌ను నిర్వహిస్తున్నారు. ఎంఎఫ్ రికార్డుల ప్రకారం 2012లో వీరు బీవీఐలో బియాల్స్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్‌ను చెరి 5,000 షేర్లతో ప్రారంభంచారు. 2013లో ఇది మూతపడింది. లాభాల గురించి తమకు ఎవరో తప్పు సలహాలివ్వడంతో దాన్ని ప్రారంభించామని, కానీ ఎప్పుడూ ఆపరేట్ చేయనే లేదని గోయల్ తెలిపారు. వివేక్ జైన్ మధ్యప్రదేశ్‌లో వ్యవసాయ పరికరాల స్టోర్ నిర్వహిస్తున్నారు. బీవీఐలో 2010లో ఏర్పాటైన సక్వినామ్ గ్లోబల్‌లో డెరైక్టరుగాను, హాంకాంగ్‌లో రిజిస్టరయిన రేడియంట్ వరల్డ్ హోల్డింగ్స్‌లో వాటాదారుగాను ఆయన పేరు ఉంది. అయితే సదరు సంస్థల గురించే తనకు తెలియదని జైన్ తెలిపారు. వాటిలో వాటాదారుగా ఉన్న నహర్ సోదరులు తనకు బంధువులేనని, వారితో కొన్నాళ్ల క్రితం దాకా మంచి వ్యాపార సంబంధాలు ఉండేవని పేర్కొన్నారు. వారు ఇటువంటి కార్యకలాపాలు చేస్తారని తాను ఊహించలేదన్నారు. అంతా చట్టబద్ధమే అమితాబ్ బచ్చన్ ముంబై: పనామా పేపర్స్ వ్యవహారంలో తన పేరు బయటకు రావటంపై బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ నోరు విప్పారు. తన సంపాదనకు అనుగుణంగా పన్నులు చెల్లించానని, విదేశాలకు పంపించిన ప్రతి రూపాయీ చట్టబద్ధంగానే పంపానని స్పష్టంచేశారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొన్న కథనంలో కూడా ఎక్కడా తాను అక్రమాలకు పాల్పడ్డట్టుగానీ, నల్లధనం కలిగి ఉన్నట్టుగానీ లేదని తెలియజేశారు. నాలుగు విదేశీ షిప్పింగ్ కంపెనీలకు తాను డెరైక్టర్‌గా ఉన్నట్లు వచ్చిన వార్తలను మాత్రం ఖండించారు. ‘‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పేర్కొన్న ఆ నాలుగు కంపెనీల్లో ఏ ఒక్కటీ నాకు తెలియదు. వీటిలో వేటికీ నేను డెరైక్టర్‌ను కాను. నా పేరును తప్పుగా వాడి ఉంటారు’ అని అమితాబ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చట్టబద్ధతపై విచారణ: రఘురాం రాజన్ ముంబై: విదేశాల్లో ఖాతాలుండేందుకు నిజమైన కారణాలుండాలని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. పనామా పేపర్స్ లీకేజీ ఘటనలో వెల్లడైన దాదాపు 500 మంది భారతీయ సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తల అకౌంట్ల చట్టబద్ధతను వివిధ ఏజెన్సీల ద్వారా దర్యాప్తు చేస్తామని తెలిపారు. ‘ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా విదేశాలకు డబ్బులు పంపే అవకాశం ఉంది. అయితే... ఇందులో చట్టబద్ధంగా పంపిన వాళ్లెందరు? చట్ట విరుద్ధంగా పంపిన వాళ్లెందరు? అనేది చూడాలి’ అని రఘురాం రాజన్ చెప్పారు. ప్రస్తుత చట్టాల ప్రకారం ఏడాదికి 2.5 లక్షల డాలర్లను విదేశాలకు పంపే వీలుంటుంది. కాగా, ఈ ఘటనలో రెండు, మూడు విషయాలు మిళితమై ఉన్నాయని.. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ హెచ్చార్ ఖాన్ తెలిపారు. ఫెమా కింద కొన్ని నిబంధలనలు వర్తిస్తాయని.. ఇవన్నీ విచారణలోనే తేలుతాయన్నారు. అయితే.. పనామా పేపర్స్ వివాదాన్ని తామే విచారిస్తామని నల్లధనంపై ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెల్లడించింది.