breaking news
Indian Council of Agricultural Research
-
సేంద్రియ పశుపోషణపై దృష్టి
‘ఆర్గానిక్ ఆహారోత్పత్తులు అనగానే మనకు చప్పున గుర్తొచ్చేది ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు. కానీ, పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు కూడా ఆర్గానిక్ బుట్టలో ప్రధాన భాగాన్ని ఆక్రమిస్తుంది. ప్రకృతి/సేంద్రియ సేద్య పద్ధతుల్లో సాగు చేస్తున్న రైతులు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత ఎక్కువ మంది మన దేశంలో ఉన్నారు. వారు పండిస్తున్న సేంద్రియ ఆహారాన్ని దేశీయంగా వినియోగిస్తుండడంతోపాటు చాలా రకాల సేంద్రియ ఉత్పత్తులను అనేక దేశాలకు మన దేశం ఎగుమతి చేస్తోంది. అయితే, సేంద్రియ పాలు/ పాల ఉత్పత్తులు, సేంద్రియ పశు / కోడి మాంసం తదితర ఉత్పత్తుల ఎగుమతి మాత్రం చెప్పుకోదగిన స్థాయిలో లేదు.సేంద్రియ పశుపోషణ, సేంద్రియ కోళ్ల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి విధాన రూపుకల్పన కోసం కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఆర్గానిక్ లైవ్‌స్టాక్ ప్రొడక్షన్, సర్టిఫికేషన్ ప్రక్రియలకు సంబంధించి విధి విధానాలు, ప్రమాణాలను రూపొందించే కృషి ఊపందుకుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐసీఏఆర్ అనుబంధ సంస్థ జాతీయ మాంసం పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–ఎన్ ఎంఆర్ఐ) ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తోంది. ఔత్సాహిక రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులతో ఇటీవల ఒక సమాలోచన కార్య శాలను సైతం ఎన్ ఎంఆర్ఐ నిర్వహించింది. ఈ నేపథ్యంలో అసలు సేంద్రియ పద్ధతుల్లో పాడి పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం అంటే ఏమిటి? రసాయనాలు వాడకుండా పశుపోషణ ఎలా? వ్యాధుల నివారణ, చికిత్సకు రసాయనా లకు ప్రత్యామ్నాయం ఏమిటి? సేంద్రియ ధ్రువీకరణ పద్ధతులేమిటి? మన బలాబలాలు, సవాళ్లేమిటి? ఇటువంటి అంశాలపై విషయ నిపుణులు ‘సాక్షి సాగుబడి’తో ఏమన్నారంటే.. పంటలు/తోటలు లేదా జంతువులు / కోళ్లను రసాయనిక పురుగు మందులు, రసాయనిక ఎరువులు, హార్మోన్లు, అల్లోపతి మందులు వంటి సింథటిక్ ఉత్పాదకాలను ఉపయోగించకుండా పెంచటాన్ని సేంద్రియ వ్యవసాయంగా అంతర్జాతీయ సమాజం గుర్తిస్తోంది. ఈ విధంగా రసాయ నాలు, జన్యుమార్పిడి ఉత్పాదకాలు వాడకుండా సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పెంచే ఆహారోత్పత్తులకు దేశ విదేశీ మార్కెట్లలో గిరాకీ అంతకంతకూ పెరుగుతోంది. ధ్రువీకరణ ప్రమాణాలకు అనుగుణంగా పెంచిన ఆరోగ్యదాయక మైన సేంద్రియ ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లతో పాటు సేంద్రియ పాలు, మాంసం, కోడిగుడ్లు, విలువ ఆధారిత సేంద్రియ ఆహారోత్పత్తులకు అధిక సొమ్ము చెల్లించటానికి ధనిక, మధ్యతరగతి వినియోగ దారులు వెనుకాడటం లేదు. ఈ ట్రెండ్ ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలతో పాటు భారత్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ కనిపిస్తోంది. ప్రపంచ సేంద్రియ మార్కెట్ జోరుఆర్గానిక్ పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. సేంద్రియ పాల మార్కెట్ ఏటా 6% పెరుగుతోంది. 2020లో 2 వేల కోట్ల డాలర్లుగా ఉండగా, 2026 నాటికి 3,200 కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా. అదేవిధంగా సేంద్రియ మాంసం ఉత్పత్తుల మార్కెట్ 7% పెరుగుతోంది. 2020లో 1,500 కోట్ల డాలర్ల నుంచి 2025 ఆఖరు నాటికి 2 వేల కోట్లకు పెరుగుతుందని అంచనా. ఆర్గానిక్ ఎగ్ మార్కెట్ మరింత వేగంగా 12.5% పెరుగుతోంది. 2023లో 370 కోట్ల డాలర్ల వ్యాపారం జరగ్గా 2032 నాటికి ఇది 1,070 కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా. 20% పెరుగుతున్న దేశీయ మార్కెట్మన దేశంలో సేంద్రియ ఆహారోత్పత్తుల మార్కెట్ ఏటా 20% పెరుగుతోంది. కోవిడ్ తర్వాత సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. అనధికారిక పద్ధతుల్లో మార్కెటింగ్ ఊపందుకుంది. ఉత్పత్తిదారు నుంచి వినియోగదారులు నేరుగా కొంటున్నారు. ప్రభుత్వం ప్రకృతి/ సేంద్రియ పంటల సాగును చాలా ఏళ్లుగా విస్తృతంగా ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు సేంద్రియ పాడి పశువుల పెంపకం, సేంద్రియ గొర్రెలు/మేకల పెంపకం, సేంద్రియ కోడిగుడ్లు, కోడి మాంసం పెంపకంపై ఇప్పుడు దృష్టి సారించింది. ఎన్ పీఓపీ, పీజీఎస్ సర్టిఫికేషన్లు2023–24లో మన దేశంలో 44.75 లక్షల హెక్టార్లలో సేంద్రియ సాగు జరుగుతోంది. దీనితో పాటు 28.5 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం నుంచి సేంద్రియ ఉత్పత్తులు సేకరిస్తున్నారు. విదేశాలకు ఎగుమతి చేయడానికి వీలున్న నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్ పీఓపీ) సర్టిఫికేషన్ కలిగిన రైతులు 36 లక్షల టన్నుల సేంద్రియ దిగుబడులు పండించారు. దేశీయంగా అమ్ముకోవడానికి ఉద్దేశించిన పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం (పీజీఎస్) సర్టిఫికేషన్ ఉన్న రైతులు 6.20 లక్షల టన్నులు పండించారు. ఈ రెండు రకాల సర్టిఫికేషన్లు పంటలతో పాటు పాలు, మాంసం, గుడ్లు, తేనె, ఆక్వా ఉత్పత్తులకు కూడా ఇస్తారు. ఎగుమతులకు అవకాశాలు2023–24లో 2,61,029 టన్నుల (వీటి ఖరీదు రూ.4,008 కోట్లు) సేంద్రియ పత్తి, నూనెగింజలు, చెరకు, ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, ఔషధ మొక్కలను భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి చేశాం. అమెరికా, యూరోపియన్ యూనియన్, కెనడా, బ్రిటన్, శ్రీలంక, స్విట్జర్లాండ్, వియత్నాం, ఆస్ట్రేలియా తదితర దేశాలకు మనం సేంద్రియ ఉత్పత్తులు అమ్మాం. ఆయా దేశాల సేంద్రియ ప్రమాణాలకు తగిన రీతిలో సేంద్రియ పాలు, మాంసం, గుడ్లు మన రైతులు ఉత్పత్తి చేస్తే, వాటిని ఎగుమతి చేయటం కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సింగపూర్, మలేసియా, కెనడా దేశాల్లో సేంద్రియ మాంసం, గుడ్లు, పాలు, తేనెకు డిమాండ్ ఉంది. ఆ మార్కెట్ల ప్రత్యేక నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మన దేశంలో సేంద్రియ పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌కు మౌలిక సదుపాయాలు, ఏర్పాటు చేసే పటిష్టమైన సమగ్ర విధానంతో పాటు రైతుల కోసం ప్రత్యేక పథకాలను రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు. సేంద్రియ పశుపోషణలో ఎన్ ఎస్ఓపీ ప్రమాణాలు కీలకంసేంద్రియ పాలు, మాంసం, గుడ్లు ఉత్పత్తి చెయ్యాలనుకునే రైతులు, సంస్థలు నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్ ఎస్ఓపీ) ప్రమాణాలు పాటించాలి. అవి: సహజ బ్రీడింగ్ పద్ధతులను అనుసరించటం.. జంతువుల ఆరోగ్యం– సంక్షేమానికి రక్షణ చర్యలు తీసుకోవటం.. సేంద్రియంగా పండించిన దాణాను, పశుగ్రాసాలను మేపటం.. పశువులను ఒకేచోట కట్టేసి ఉంచకుండా సహజ ప్రవర్తనను వ్యక్తీకరించేలా స్వేచ్ఛనివ్వటంతో పాటు ఒత్తిడిని తగ్గించడం ముఖ్యం. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అల్లోపతి ఔషధాలు, యాంటీబయాటిక్స్, హార్మోన్లు, పెరుగుదలకు బూస్టర్లు, దాణా మిశ్రమాలు మొదలైన వాటి వాడకంపై నూటికి నూరు శాతం నిషేధం పాటించాలి. పెంచే పశువులు, జీవాల జాతుల ఎంపిక.. దాణా, ఆరోగ్య సంరక్షణ, పెంపకం, పేడ, మూత్రాల నిర్వహణ, సేంద్రియ పెంపక పద్ధతులకు మారే కాలం, షెడ్ల నిర్మాణంలో మెళకువలు, విశాలమైన స్థలం ఆవశ్యకత, ప్రతి పశువుకు గుర్తింపు చిహ్నం ఇవ్వటం, రవాణా పద్ధతులు, వధ–కోత అనంతర నిర్వహణలో నిర్దిష్ట పద్ధతులు పాటించాలి. అన్ని విషయాలపై రికార్డులు తయారు చేయటం ముఖ్యమైన విషయం. ఈ ప్రమాణాలు పాటిస్తూ సేంద్రియ పద్ధతులను అలవాటు చేసుకోవటంలో రైతులకు, విస్తరణ సిబ్బందికి అవగాహన కల్పించటం కోసం హయత్‌నగర్‌లోని ‘క్రీడా’ ప్రదర్శన క్షేత్రంలో సేంద్రియ గొర్రెల పెంపక యూనిట్‌ను ప్రారంభించాం. ఎన్పీఓపీ ధ్రువీకరణ ప్రమాణాలు పాటిస్తున్నాం. సేంద్రియ పశుపోషణ ద్వారా పాలు, మాంసం, సేంద్రియ కోళ్ల పెంపకంలో ఆసక్తి గల రైతులు, రైతు ఉత్పత్తి సంస్థలు(ఎఫ్పీఓలు), సహకార సంఘాలకు ప్రామాణిక శిక్షణ ఇస్తాం. – డాక్టర్ పి. బస్వారెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్– జాతీయ మాంసం పరిశోధనా సంస్థ (ఎన్ ఎంఆర్ఐ), చెంగిచర్ల, హైదరాబాద్ 040–29801672ఏ జాతులనైనా సేంద్రియంగా పెంచవచ్చువిదేశాల్లో పంటలు పండించే పొలాలు, పశువుల్ని పెంచే క్షేత్రాలు కలిసి ఉండవు. మన దేశంలో పంటలు సాగు చేసే రైతులకు పశువుల పెంపకం కూడా ఉంటుంది. ప్రకృతి/సేంద్రియ సేద్యంలో పంటలు పండించే రైతుల పొలాల్లోనే సేంద్రియంగా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకానికి ప్రోత్సహిస్తే సత్ఫలితాలు వస్తాయి. వారి సొంత పంట వ్యర్థాలను, సొంత ధాన్యాలను పశువులకు మేపటం ద్వారా నాణ్యతా ప్రమాణాలను సులువుగా ఆచరించవచ్చు. నేల–పశువు–పంట.. ఈ మూడింటి మధ్య సేంద్రియ అనుసంధానం చెయ్యాలి. ఈ విషయంలో మన దేశంలో చిన్న, సన్నకారు రైతులకు ఉన్న నైపుణ్యాలు వరంగా ఉపయోగపడతాయి. విదేశాలతో పోల్చితే రసాయనాలకు పెద్ద పీట వెయ్యని దేశం మనది. వ్యవసాయ రసాయనాలు వాడకం తక్కువగా ఉన్న కొండ/గిరిజన ప్రాంతాలపై తొలుత దృష్టిని కేంద్రీకరించి, ప్రోత్సహించాలి. దేశీ, నాటు పశువులను మాత్రమే సేంద్రియ పెంపకానికి వాడాలనేం లేదు. సంకరజాతి పశువులను నిస్సందేహంగా పెంచవచ్చు. – డాక్టర్ మహేశ్ చందర్, ప్రధాన శాస్త్రవేత్త, జాతీయ పశుపోషణ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–ఐవీఆర్ఐ), ఇజ్జత్‌నగర్, ఉత్తరప్రదేశ్పశు వ్యాధులకు సంప్రదాయ ఈవీఎం చికిత్స మేలుపశు వ్యాధుల నివారణలో, చికిత్సలో యాంటీబయాటిక్ ఔషధాలను అతిగా వాడుతూ వాటికి నిరోధకత పెంచుకోవటం ఇప్పుడు మానవాళి ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. సుసంపన్న సంప్రదాయ సిద్ధ, ఆయుర్వేద విజ్ఞానంతో కూడిన మూలికా వైద్య చికిత్స (ఎత్నో వెటర్నరీ మెడిసిన్ –ఈవీఎం)ల ద్వారా పశువ్యాధులను జయించవచ్చు. 24 ఏళ్లుగా ఈవీఎంలపై కృషి చేస్తున్నా. వీటి పనితీరు ఎంత ప్రభావశీలంగా ఉందో 9 రాష్ట్రాల్లో 25 ఎన్ డీడీబీ అనుబంధ పాడి సహకార సంఘాల్లోని రైతుల అనుభవాలే తేటతెల్లం చేస్తున్నాయి. పొదుగువాపు, గాలికుంటు వ్యాధి వంటి అనేక తీవ్ర జబ్బులను సైతం కొద్ది రోజుల్లో ఈవీఎం మందులతో తగ్గించవచ్చని రుజువైంది. 11.2 లక్షల కేసుల్లో 80.4% జబ్బులు తగ్గిపోయాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈవీఎంల ప్రభావశీలతను గుర్తించింది. ఈవీఎంకు ఎవిడెన్ ్స బేస్డ్ మెడిసిన్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తోంది. ఇవి తక్కువ ఖర్చుతో, కచ్చితంగా ఫలితాలనిచ్చే పర్యావరణ హితమైన, ఆరోగ్యదాయకమైన చికిత్సలని గుర్తించాలి.– ప్రొ. ఎన్ . పుణ్యమూర్తి, ఎన్ డీడీబీ కన్సల్టెంట్, టిఎఎన్ యువిఎఎస్ విశ్రాంత ఆచార్యులు, తంజావూరు, తమిళనాడుసమగ్ర విధానం ద్వారా రైతులకు మార్గదర్శనంప్రకృతి/సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆర్గానిక్ మాంసం, గుడ్లు, పాలు/పాల ఉత్పత్తుల పెంపకంపై కూడా దృష్టిని కేంద్రీకరించింది. సేంద్రియ మాంస ఉత్పత్తుల పెంపకం, మార్కెటింగ్ తదితర అంశాలపై రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులు, పారిశ్రామికవేత్తల ఆకాంక్షలతో పాటు మా అనుభవాలను జోడించి కేంద్రానికి నివేదిక పంపుతాం. సమగ్ర విధాన రూపకల్పనకు ఇది దోహదం చేస్తుంది. సేంద్రియ పశుపెంపకంపై పరిశోధనలకు, విస్తరణకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. అపెడాలో సేంద్రియ పశు పెంపకం ప్రోత్సాహానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చెయ్యాలి. అమూల్ వంటి నమ్మదగిన బ్రాండ్ ద్వారా విక్రయిస్తే సేంద్రియ పాలు, గుడ్లు, మాంసం అధిక ధర ఇచ్చి కొనటానికి దేశంలో ప్రజలు ఆసక్తితో ఉన్నారు. యూరప్, మధ్యప్రాచ్య దేశాలకు సేంద్రియ పాలు, మాంసం ఎగుమతి చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆసక్తి గల రైతులు మమ్మల్ని సంప్రదిస్తే మార్గదర్శనం చేస్తాం. – డా. ఎస్. బి. బర్బుదే, సంచాలకులు, ఐసీఏఆర్– జాతీయ మాంసం పరిశోధనా సంస్థ (ఎన్ ఎంఆర్ఐ), చెంగిచర్ల, హైదరాబాద్ – పంతంగి రాంబాబు -
తొలి ‘జన్యుసవరణ’ వరి!
వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న భూతాపాన్ని తట్టుకుంటూ 30% అధిక దిగుబడిని ఇవ్వగలిగిన రెండు సరికొత్త జన్యుసవరణ వరి రకాలను ప్రపంచంలోనే తొట్టతొలిగా భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) శాస్త్రవేత్తలు రూపొందించారు. క్రిస్పర్– కాస్9 అనే సరికొత్త జీనోమ్–ఎడిటింగ్(జిఇ) టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేసిన రెండు వరి వంగడాలను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఆవిష్కరించారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్)కి చెందిన పూసాలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్ఐ) పూసా రైస్ డిఎస్టి1 అనే రకం కరువును, చౌడును తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్ఆర్) పరిశోధకులు అభివృద్ధి చేసిన డిఆర్ఆర్ ధన్ 100 (కమల) అనే వరి అధిక దిగుబడినిస్తుంది. మన దేశంలో ఇప్పటి వరకు అధికారికంగా సాగులో ఉన్న జన్యుమార్పిడి పంట పత్తి ఒక్కటి మాత్రమే. జన్యుసవరణకు ఇదే ప్రారంభం. గతంలో సంక్లిష్టమైన ‘జన్యుమార్పిడి’లో భాగంగానే ‘జన్యుసవరణ’ను కూడా చూసేవారు. అయితే, 2022లో జన్యుసవరణను కఠినమైన నియంత్రణ ప్రక్రియ నుంచి మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ తర్వాత జన్యు సవరణ పరిశోధనలకు రూ. 500 కోట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలోనే జన్యుసవరణ తొలి వరి రకాలను ఇప్పుడు ఆవిష్కరించారు. ఈ రెండు వంగడాల పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలను ఈ సందర్భంగా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సత్కరించారు. పూసా డిఎస్టి రైస్ 1 పై కృషి చేసిన డాక్టర్ విశ్వనాథన్ సి, డాక్టర్ గోపాల్ కృష్ణన్ ఎస్, డాక్టర్ సంతోష్ కుమార్, డాక్టర్ శివానీ నగర్, డాక్టర్ అర్చన వాట్స్, డాక్టర్ సోహం రే, డాక్టర్ అశోక్ కుమార్ సింగ్, డాక్టర్ ప్రాంజల్ యాదవ్‌లను సత్కరించారు. డిఆర్ఆర్ రైస్ 100 (కమల) అభివృద్ధికి కృషి చేసిన ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్తలు డాక్టర్ సత్యేంద్ర కుమార్ మంగథియా, డాక్టర్ ఆర్.ఎం. సుందరం, డా. అబ్దుల్ ఫియాజ్, డా. సి.ఎన్. నీరజ, డా. ఎస్వీ సాయి ప్రసాద్‌లను సత్కరించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది మాట్లాడుతూ, ఈ సాంకేతికత దేశీయంగా అభివృద్ధి చేసినది కావటం వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ప్రయత్నాల ద్వారా రైతులకు త్వరగా అందించవచ్చని అన్నారు.10కి పైగా పంటలకు జన్యు సవరణఐసిఎఆర్ డైరెక్టర్ డాక్టర్ జనరల్ మంగి లాల్ జాట్ ప్రసంగిస్తూ ఈ రెండు వంగడాల ఆవిష్కరణ భారత వ్యవసాయంలో ఒక చారిత్రాత్మక సంఘటనగా అభివర్ణించారు. రాబోయే సంవత్సరాల్లో అనేక ఇతర పంటలకు సంబంధించి జన్యు సవరణ పంట రకాలను విడుదల చేస్తామని అన్నారు. ‘కొత్త వ్యవసాయ విధానాలు కొత్త పద్ధతులకు అనుగుణంగా ఉండాలి. మారిన వాతావరణ పరిస్థితుల్లో పాత పద్ధతులు పనిచేయవు’ అని ఆయన అన్నారు. దేశంలోని బహుళ జాతి సంస్థలు, విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం పప్పుధాన్యాలు, ఆవాలు, గోధుమ, పొగాకు, పత్తి, అరటి, టమోటా, నూనెగింజలు వంటి 10కి పైగా పంటలకు సంబంధించి జన్యు–సవరణపై పరిశోధనలు చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఆస్ట్రేలియాలోని ముర్డోక్ విశ్వవిద్యాలయంలోని ఇంటర్నేషనల్ చైర్ ఆఫ్ అగ్రికల్చర్ – ఫుడ్ సెక్యూరిటీ, సెంటర్ ఫర్ క్రాప్ అండ్ ఫుడ్ ఇన్నోవేషన్ డైరెక్టర్ రాజీవ్ వర్షిణి మాట్లాడుతూ, ఈ ఆవిష్కరణలు వ్యవసాయ జీవసాంకేతికతలో ఒక మైలురాయన్నారు. ప్రత్యేకంగా చిన్న–సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయని, ప్రపంచ పురోగతికి ప్రేరణనిస్తాయని అన్నారు. ఈ రెండు జన్యు సవరణ వంగడాలను వాణిజ్య స్థాయిలో విత్తనోత్పత్తి చేసి రైతులకు అందించడానికి మరో నాలుగైదు సంవత్సరాలు పట్టొచ్చు. కరువు, చౌడును అధిగమించి..ఎంటియు1010 వరి వంగడానికి జన్యు సవరణ చేసి ‘పూసా రైస్ డిఎస్టి 1’ వంగడాన్ని పూసాలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్ఐ) అభివృద్ధి చేసింది. ఒత్తిడి నిరోధకతను అణిచివేసే జన్యువును తొలగించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ వంగడాన్ని రూపొందించారు. పత్ర రంధ్రాల సాంద్రతను తగ్గించటం ద్వారా తక్కువ నీటితో పంట పండేలా మార్పు చేశారు. చౌడును తట్టుకొని ఎక్కువ పిలకలు వచ్చేలా చేయటం ద్వారా అధికంగా ధాన్యం దిగుబడి వచ్చేలా చేశారు. క్షేత్రస్థాయి పరీక్షల్లో ఎంటియు 1010 రకంతో పోలిస్తే కరువు, చౌడు వత్తిళ్లను తట్టుకొని గణనీయంగా అధిక దిగుబడిని చూపించాయని ఐఎఆర్ఐ తెలిపింది.సాంబ మసూరికి కొత్త రూపుదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొంది, విస్తారంగా సాగవుతున్న సాంబ మసూరి (బిపిటి–5204) వంగడానికి జన్యుసవరణ చేసి ‘డిఆర్ఆర్ ధన్ 100 (కమల)’ రకాన్ని అభివృద్ధి చేశారు. రాజేంద్రనగర్‌లోని 30% అధిక దిగుబడిని ఇస్తుంది. 20 రోజులు ముందే కోతకు వస్తుంది. ‘క్రిస్పర్’ను ఉపయోగించి సాంబ మసూరిలోని సైటోకినిన్ ఆక్సిడేస్ జన్యువుకు తగిన విధంగా సవరణ చేశారు. ఫలితంగా ధాన్యం దిగుబడిలో 19% పెరుగుదల, 20 రోజుల వరకు ముందస్తు పరిపక్వతతో పాటు తక్కువ ఎరువుల వినియోగం, కరువు పరిస్థితులలో మెరుగైన పనితీరు వంటి గుణాలతో ‘డిఆర్ఆర్ ధన్ 100 (కమల)’ రకం రూపుదాల్చింది.ఐసిఎఆర్ శాస్త్రవేత్తల అసాధారణ విజయాలువ్యవసాయ సవాళ్లను అధిగమించడానికి ఆధునిక పద్ధతులను అవలంభించాలని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు. ఆయన మాటల నుంచి ప్రేరణ పొందిన ఐసిఎఆర్ శాస్త్రవేత్తలు ఈ కొత్త రకాలను సృష్టించడం ద్వారా వ్యవసాయ రంగంలో అసాధారణ విజయాలు సాధించారు. వరిలో ఈ కొత్త పంటలు ధాన్యం ఉత్పత్తిని పెంచడమే కాకుండా పర్యావరణ పరంగా సానుకూల ఫలితాలను ఇస్తాయి. సాగు నీరు ఆదా అవుతుంది. కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. తద్వారా పర్యావరణంపై ఒత్తిడి తగ్గుతుంది. మొత్తంగా వరి సాగు విస్తీర్ణాన్ని 50 లక్షల హెక్టార్లు తగ్గించాలి. ధాన్యం ఉత్పత్తిని కోటి టన్నులు పెంచాలి. ఈ 50 లక్షల హెక్టార్ల భూముల్లో అదనంగా పప్పుధాన్యాలు, నూనెగింజలను సాగు చెయ్యాలి.– శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిజన్యుభద్రతా పరీక్షల గణాంకాలను కూడా ప్రకటించాలిఐసిఎఆర్ మొట్టమొదటి జన్యు సవరణ వరి రకాలను విడుదల చేసింది. అధిక దిగుబడినిస్తూ, కరువును తట్టుకోవటం కోసం సరికొత్త క్రిస్పర్–కాస్9 టెక్నాలజీని వినియోగించి ఈ రకాలను అభివృద్ధి చేశారు. వీటికి సంబంధించిన జన్యుభద్రతా పరీక్షల గణాంకాలను సైతం బహిరంగంగా ప్రకటిస్తే ఈ సరికొత్త వరి బియ్యం తినటంలో భద్రత గురించి కూడా ప్రజలు తెలుసుకుంటారు. – డాక్టర్ సుమన్ సహాయ్, స్వతంత్ర శాస్త్రవేత్త, జీన్క్యాంపెయిన్ వ్యవస్థాపకులు -
మేలు చేసే కొత్త వంగడాలు
సాక్షి, అమరావతి: ఆధునిక బయో టెక్నాలజీ ద్వారా ఆహార పంటల పోషక నాణ్యతను మెరుగుపర్చే బయో ఫోర్టీఫైడ్ పంటలకు ప్రాముఖ్యత, ప్రాబల్యం పెరుగుతోంది. మొక్కల పెరుగుదల సమయంలోనే పంటలలో పోషక స్థాయిలను పెంచడం లక్ష్యంగా శాస్త్రవేత్తలు కొత్త వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు. దేశంలోని అగ్రో ఎకలాజికల్ జోన్స్‌కు అవసరమైన బయో ఫోర్టీఫైడ్ పంట రకాలను ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేసారు.వ్యాధులు, తెగుళ్లను తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే ఈ రకాలు అన్నదాతల పాలిట వరంగా మారనున్నాయి. వీటిలో వ్యవసాయ పంటల్లో 69 రకాలు, ఉద్యాన పంటల్లో 40 రకాలు ఉన్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్)తోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ విశ్వ విద్యాలయాలు అభివృద్ధి చేసిన రకాలు ఉన్నాయి. వీటిలో 34 రకాల వంగడాలు తెలుగు రాష్ట్రాల్లో సాగుకు అనువైనవి ఉన్నాయి. ఈ వంగడాల్లో 3 ఆంధ్రప్రదేశ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినవి కాగా, 5 రకాలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవి.జన్యుపరమైన లోపాలకు దూరంగా.. నూతన వంగడాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న వంగడాలతో పోలిస్తే ఈ కొత్త రకాలలో జన్యు పరమైన లోపాలు లేవని నిర్ధారించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకోగలవు. ఎరువులకు మెరుగైన రీతిలో స్పందిస్తాయి. తెగుళ్లు, వ్యాధులను సమర్ధంగా ఎదుర్కొంటాయి. పంట నాణ్యతతో పాటు ముందుగానే పరిపక్వం చెందుతాయి. అధిక పోషక విలువలతో అధిక ఆహార ఉత్పత్తిని, ఉత్పాదకతను కలిగి ఉండాయి.ఫలితంగా వీటి సాగు ద్వారా పర్యావరణ పరిరక్షణతో కూడిన వ్యవసాయం చేసేందుకు దోహద పడతాయని, వ్యవసాయ యోగ్యం కాని భూములు సైతం సాగులోకి తెచ్చేందుకు ఊతమిస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ వంగడాలు పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులోకి రావాలంటే కనీసం మూడేళ్లు పడుతుందని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో విడుదలైన వంగడాల్లో 34 రకాలు తెలుగు రాష్ట్రాలలో సాగుకు అనువైనవి. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి విడుదలైన 8 రకాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన మరో 26 రకాలు ఉన్నాయి. -
నూతన వంగడాలను ఆవిష్కరించిన మోదీ
న్యూఢిల్లీ: కరువు కాటకాలను, నీటి ఎద్దడి పరిస్థితులను తట్టుకుంటూనే అధిక దిగుబడినిచ్చే నూతన వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం ఆవిష్కరించారు. వీటిలో 61 పంటలకు సంబంధించిన 109 రకాల విత్తనాలున్నాయి. వీటిలో 34 ఆహార, వాణిజ్య పంటల వంగడాలు కాగా 27 ఉద్యాన పంటలకు చెందినవి. పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, నూనె గింజలు, చెరకు, పత్తి, మొక్కజొన్న, పూలు, పండ్లు, కూరగాయలు, దినుసులు, ఔషధ గుణాల మొక్కల విత్తనాలు ఇలా పలురకాల నూతన వంగడాలను ఢిల్లీలోని పూసా క్యాంపస్‌లోని మూడు వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో ప్రధాని వీటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో మోదీ ముచ్చటించారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్) ఈ నూతన వంగడాలను అభివృద్ధిచేసింది. ఏటా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వ్యవసాయానికి అదనపు విలువ జోడింపు ప్రస్తుతం తక్షణ అవసరమని ప్రధాని వ్యాఖ్యానించారు. కొత్త వంగడాల విశిష్టతపై అక్కడి రైతులతో కలిసి చర్చించారు. తక్కువ నిర్వహణ వ్యయం కారణంగా నూతన వంగడాలతో తమకు మరింత లబ్ధి చేకూరనుందని అక్కడి రైతులు చెప్పారు. ‘‘ తృణధాన్యాల గొప్పదనం, వాటిలోని పోషకవిలువ గురించి తెలిశాక ప్రజలు వాటి వినియోగానికి మొగ్గుచూపుతున్నారు. సేంద్రియ వ్యవసాయం ఎంతో మేలు. ప్రకృతి వ్యవసాయం పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగింది. సేంద్రీయ ఆహారం కావాలని జనం అడిగి మరీ కొనుగోలుచేస్తున్నారు. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న నూతన వంగడాలపై దేశవ్యాప్తంగా కృషి విజ్ఞాన్ కేంద్రాలు రైతులకు అవగాహన పెంచాలి. కొత్త రకాలను సృష్టిస్తున్న శాస్త్రవేత్తలకు నా అభినందనలు’’ అని మోదీ అన్నారు. సహజసిద్ధ సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం పట్ల తమలో సానుకూలత పెరిగిందని, కృషి విజ్ఞాన్ కేంద్రాల పాత్ర ఇందులో కీలకమని రైతులు చెప్పారని ప్రభుత్వం తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ వంగడాల్లో పోషక విలువలు మెండుగా ఉంటాయని తర్వాత ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. -
ఆకుపచ్చ ధనం
పచ్చగా కళకళలాడటం అంటే ఏమిటో రేష్మా రంజన్‌కు తెలుసు. అందుకే తృప్తినివ్వని గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలి మరీ ఇంట్లో ఉండిపోయింది. ఇంట్లో ఏం చేసింది? తనకిష్టమైన మొక్కలు పెంచింది. మట్టి, నీరు, కుండీ, ఆకు, ఎరువు... ఇవి ఎలా ఉపయోగిస్తే ఇంటి మొక్కలు అందంగా అద్భుతంగా ఉంటాయో బాగా తెలుసుకుంది. వాటినే వీడియో పాఠాలు చేసింది. ‘ప్రకృతీస్ గార్డెన్’ పేరుతో వందలాది వీడియోలు చేసింది. పది లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఏర్పడ్డారు. రేష్మా దిశా నిర్దేశంలో ఇళ్లల్లో మొక్కలు పెంచుతున్నారు. వారు హ్యాపీగా ఉన్నారు. దీనివల్ల వచ్చే ఆదాయంతో రేష్మా పచ్చగా ఉంది. జార్ఘండ్‌లోని బొకారోలో రేష్మా రంజన్ ఇంటికి వెళితే చిన్న సైజు వనంలో అడుగు పెట్టినట్టు ఉంది. దాదాపు 2000 అందమైన, రకరకాల కుండీల్లో వందలాది రకాల మొక్కలు కనిపిస్తాయి. కొత్తిమీర, పొదీనాతో మొదలు ఆపిల్, అవకాడో వరకూ రేష్మా కుండీల్లో సృష్టించనిది అంటూ ఏదీ లేదు. ఒక కుండీలో ఉల్లిపాయలు పెరుగుతుంటాయి... మరో కుండీలో అనాసపళ్లు... ఇంకో కుండీలో చిలగడ దుంపలు, మరో కుండీలో నేతి బీరకాయలు... ఇక పూలైతే లెక్కే లేదు. వాటి మధ్య కూచుని వీడియోలు చేస్తుంటుంది రేష్మా. కేవలం తను పెంచి చూసిన మొక్కల గురించే ఆమె మాట్లాడుతుంది. ఆ అనుభవాల నుంచి వచ్చిన పాఠాలు కాబట్టే ఆమెకు పది లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ► బాల్యం ముఖ్యం బాల్యంలో ఏర్పరిచే మంచి ప్రభావాలు వారికి జీవితాంతం ఉంటాయి అనడానికి రేష్మ రంజన్ ఒక ఉదాహరణ. రేష్మాది బొకారో అయినా ఐదో క్లాస్ వరకూ బీహార్‌లోని పల్లెలో అమ్మమ్మ, తాతయ్య దగ్గర పెరిగింది. తాతయ్య ఇంట్లో విపరీతంగా చెట్లు. ‘దారిన పసిబిడ్డను వదిలి వెళ్లిపోతే చూసినవారు ఎలా కలత చెందుతారో ఎవరైనా ఏదైనా మొక్కను పారేసి ఉంటే మా తాత అంత కలత చెందేవాడు’ అంటుంది రేష్మా. అతడు ఎక్కడ ఏ మొక్క నిర్లక్ష్యంగా పడేసి ఉన్నా తెచ్చి ఇంట్లో దానికి ప్రాణం పోసేవాడు. రేష్మా మూడో క్లాసు పాసై నాలుక్కు వెళుతున్నప్పుడు మూడు మొక్కలు తెచ్చి వీటిని నువ్వే పెంచాలి అని చెప్పాడు తాతయ్య. ‘అయితే నేను మరీ అతిగా పెంచి ఎక్కువ నీళ్ళు, ఎక్కువ ఎరువు వేసేసి వాటిని చంపేశాను’ అని నవ్వుతుంది రేష్మా. ఆ గుణపాఠం నుంచి బాల్యంలోనే మొక్కలను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో నేర్చుకుంది. ‘అదే మొక్కల మీద నా ప్రేమకు అంకురం’ అంటుంది రేష్మా. ► ఉద్యోగంలో అసంతృప్తి ఇంటర్ తర్వాత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐ.సి.ఏ.ఆర్) నుంచి అగ్రికల్చర్ సైన్స్ డిగ్రీ చేసిన రేష్మా ఆ వెంటనే అగ్రికల్చర్ కోఆర్డినేటర్‌గా ప్రభుత్వ ఉద్యోగం పొందింది. ‘2015లో నాకు ఉద్యోగం వచ్చింది. నాకు ఇష్టమైన ఉద్యోగం అనుకున్నాను. నా పని రైతులకు వారి పంట పోషణలో సాయం చేయడం. కాని నా లాంటి చిన్న పిల్ల చెప్తే వినడం ఏమిటి అనుకునేవారో లేదా వారి సంప్రదాయ జ్ఞానం మీద విశ్వాసమో కాని నేను చెప్పే సూచనలు రైతులు వినేవారు కాదు. అంతేకాదు మట్టిని బట్టి, విత్తును బట్టి పంటలో మార్పు చేర్పులు చెప్తే లక్ష్యం చేసేవారు కాదు. ఆ అసంతృప్తి నాకు ఉండేది. మరోవైపు ఉద్యోగం వల్ల నేను స్వయంగా మొక్కలు పెంచలేకపోయేదాన్ని. అదే సమయంలో నా చదువును చూసి ఫ్రెండ్స్ ఫలానా మొక్కలు ఎవరు వేయాలి... ఫలానా తీగను ఎలా పెంచాలి... అని సలహా అడిగేవారు. ఈ అన్ని సమస్యలకు సమాధానంగా ఉద్యోగం మానేసి యూట్యూబ్ చానల్ మొదలెట్టాను’ అంటుంది రేష్మా. ► పదివేల మంది అనుకుంటే ‘నేను మొక్కలు, తీగలు, పూల చెట్లు, పండ్ల చెట్లు, కూరగాయలు, ఇండోర్ ప్లాంట్లు... వీటన్నింటిని ఎలా పెంచారో, కేర్ తీసుకోవాలో చెప్తే నాలాగే మొక్కలను ఇష్టపడే ఒక పదివేల మంది అయినా ఫాలో కాకపోతారా అనుకున్నాను. సహజ పద్ధతిలో గులాబీ పెంచడం ఎలా? అనేది నా మొదటి వీడియో. దానికి వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. పది వేల మంది అనుకుంటే రెండు మూడేళ్ల లోనే లక్ష మంది అయ్యారు. 2016 నుంచి నా పాఠాలు కొనసాగితే 2022 చివరకు పది లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ అయ్యారు. ప్రొడక్ట్ ప్రమోషన్స్ కోసం వచ్చే వారి వల్ల కాని, యూట్యూబ్–ఫేస్బుక్ పేజ్ వల్ల కాని నాకు నెలకు లక్ష నుంచి లక్షన్నర ఆదాయం వస్తోంది’ అంటుంది రేష్మా. ఒక పనిలో పూర్తిగా నైపుణ్యం ఉంటే ఆ పనిలో ఆనందం, ఆదాయం రెండూ పొందవచ్చు. మీకు బాగా మొక్కలు పెంచడం వస్తే రేష్మాలా యూట్యూబ్ చానల్ నడపొచ్చు. బాగా మొక్కలు పెంచాలని ఉంటే ఆమె చానల్ ఫాలో కావచ్చు. ‘అందరూ మొక్కలు పెంచితే ప్రపంచం పచ్చగా మారడానికి ఎక్కువ టైమ్ పట్టదు’ అని రేష్మా చెప్పే మాట అందరూ వినాలి. ► అందమైన ఇల్లు మొక్కలు ఎలా అంటే అలా పెంచడం కాదు. వాటిని అందమైన కుండీల్లో అందమైన అరల మీద పెడితే వచ్చే అందాన్ని కూడా రేష్మా చెబుతుంది. సహజంగా ఎరువుల్ని, క్రిమి సంహారకాలను ఎలా తయారు చేసుకోవాలో చూపుతుంది. సేంద్రియ విధానాలు కూడా చూపుతుంది. ఇండోర్ ప్లాంట్స్ ఎలా శుభ్రం చేయాలి అనే ఆమె వీడియో ఇండోర్ ప్లాంట్స్ ఉన్నవారంతా చూడతగ్గది. ‘వాల్ డెకరేషన్’గా గోడలకు కుండీలు బిగించి ఎలాంటి మొక్కలు పెంచాలో చూపుతుంది. ఇంకా ఆమె చెప్పే విషయాలు అనంతం. -
పురస్కారం..: పచ్చనాకు సాక్షిగా...
చేనులోని గోధుమను ఎప్పుడైనా పలకరించారా? అది తన గోడు వెళ్లబుచ్చుకోదు. మన గోడు ఏమిటో శ్రద్ధగా వింటుంది. మన ఆకలి తీరుస్తుంది... అందుకే గోధుమ అంటే నార్మన్ బోర్లాగ్‌కు అంత ఇష్టం. మన దేశం కరువు కోరల్లో చిక్కుకుపోయిన ఒకానొక సమయంలో ఆయన సృష్టించిన గోధుమ వంగడాలు అద్భుతాన్ని సృష్టించాయి. రైతు కంట్లో వెలుగులు నింపాయి. అందుకే ఆయన ఫోటో మన రైతుల ఇండ్లలో కనిపిస్తుంది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళుతున్న బోర్లాగ్ గ్లోబల్ రస్ట్ ఇనిషియేటివ్ (బీజీఆర్‌ఐ) అంతర్జాతీయ అవార్డ్‌కు ఎంపికైన డా.పర్వీన్, మెంటర్ విభాగంలో ఈ అవార్డ్‌కు ఎంపికైన తొలిభారతీయ శాస్త్రవేత్త... నార్మన్ బోర్లాగ్ అనే పేరు వినబడగానే అమెరికన్ పేరులా అనిపించదు. ఆత్మీయనేస్తంలా ధ్వనిస్తుంది. మెక్సికోలో ఇంటర్నేషనల్ మైజ్ అండ్ వీట్ ఇంప్రూవ్మెంట్ సెంటర్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్‌గా పనిచేసిన బోర్లాగ్ రోగనిరోధక శక్తితో కూడిన, అధిక దిగుబడి ఇచ్చే డ్వార్ఫ్(చిన్న) గోధుమ వంగడాలను సృష్టించి రైతునేస్తం అయ్యాడు. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. మన దేశం కరువు కోరల్లో చిక్కుకున్న విషాదకాలంలో ఆయన సృష్టించిన గోధుమ వంగడాలు మనకు ఎంతో ఉపయోగపడ్డాయి. కరువు కోరల నుంచి రక్షించాయి. గోధుమ ఉత్పత్తిలో మన రైతులు స్వయంసమృద్ధి సాధించేలా చేశాయి. అందుకే ఉత్తరభారతంలోని రైతుల ఇండ్లలో ఆయన ఫోటో కనిపిస్తుంది. బోర్లాగ్ కుమార్తె జీని బోర్లాగ్ తండ్రి కృషిని ముందుకు తీసుకెళుతోంది. గ్లోబల్ వీట్ కమ్యూనిటీని బలోపేతం చేయడంలో విశేషమైన కృషి చేస్తున్న జీని బోర్లాగ్ ‘సూపర్ ఉమెన్ ఆఫ్ వీట్’ గా పేరుగాంచింది. బోర్లాగ్ గ్లోబల్ రస్ట్ ఇన్షియేటివ్(బీజిఆర్‌ఐ) చైర్‌పర్సన్‌గా గోధుమ రంగానికి సంబంధించిన పరిశోధన ఫలితాలను రైతుల దగ్గరికి తీసుకెళుతుంది. 2010లో ఏర్పాటు చేసిన జీని బోర్లాగ్ లాబ్ వుమెన్ ఇన్ ట్రిటికమ్ మెంటర్ అవార్డ్‌ను గోధుమరంగంలో విశిష్ట కృషి చేసిన వారికి, కొత్తతరాన్ని ప్రోత్సహిస్తున్న వారికి ఇస్తున్నారు. ఈ సంవత్సరం ఈ ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ అవార్డ్‌కు గానూ పంజాబ్‌కు చెందిన శాస్త్రవేత్త డా.పర్వీన్ చూనెజ ఎంపికైంది. లుథియానాలోని స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పర్వీన్ యువ మహిళా శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించడంలో చేసిన కృషికి ఈ అవార్డ్ లభించింది. ఇప్పటివరకు 30 మంది మహిళా యువ శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించింది. వీరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖస్థానాలలో పనిచేస్తున్నారు. గతంలో మన దేశం నుంచి డా.మిథాలీ బన్సాల్, డా.సాను ఆరోరా ఎర్లీ కెరీర్ విభాగంలో ఈ అవార్డ్‌కు ఎంపియ్యారు. పర్వీన్ ఆధ్వర్యంలోనే ఈ ఇద్దరు పీహెచ్డీ చేయడం విశేషం. వివిధ దేశాల నుంచి ఎర్లీ కెరీర్ విన్నర్స్‌తో పాటు మెంటర్స్‌ను కూడా ఎంపిక చేస్తుంది బీజిఆర్‌ఐ. మెంటర్ విభాగంలో ఈ అవార్డ్ అందుకోనుంది పర్వీన్. మన దేశం నుంచి ఈ విభాగంలో ఎంపికైన తొలి భారతీయ సైంటిస్ట్‌గా ప్రత్యేకత సాధించింది పర్వీన్. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో జన్మించిన పర్వీన్ కెఎన్ జైన్ గర్ల్స్ హైయర్ సెకండరీ స్కూల్లో చదువుకుంది. చదువులో ఎప్పుడూ ముందుండేది. సందేహాలను తీర్చుకోవడంలో ఎప్పుడూ సంశయించేది కాదు. లుథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్విటీలో బీఎస్సీ చేసింది. 1992లో పీహెచ్డీ పూర్తి చేసింది. 1996లో డీఎస్టీ యంగ్ సైంటిస్ట్ అవార్డ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్, న్యూ దిల్లీ ‘ఔట్‌స్టాండింగ్ ఉమెన్ సైంటిస్ట్’ అవార్డ్‌తో సహా ఎన్నో అవార్డ్లు అందుకుంది. ఇంటర్నేషనల్ వీట్ కాంగ్రెస్ సభ్యురాలిగా ఉంది. ‘పర్వీన్లో మార్గదర్శక నైపుణ్యాలే కాదు, గొప్ప స్నేహలక్షణాలు ఉన్నాయి. ఆమె దగ్గర పనిచేయడం అంటే ఎన్నో కొత్తవిషయాలను తెలుసుకునే అవకాశమే కాదు, క్రమశిక్షణ కూడా అలవడుతుంది’ అంటున్నారు పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ సర్వ్‌జీత్ సింగ్. లుథియానాలోని స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పర్వీన్ యువ మహిళా శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించడంలో చేసిన కృషికి ఈ అవార్డ్ లభించింది. ఇప్పటివరకు 30 మంది మహిళా యువ శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించింది. వీరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖస్థానాలలో పనిచేస్తున్నారు. -
అగ్రి కోర్సులతో అందలం.. కొలువులకు కొదవేలేదు
ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్.. సంక్షిప్తంగా ఐసీఏఆర్! ఐకార్గా సుపరిచితం. ఇది జాతీయ స్థాయిలో అగ్రికల్చర్, అనుబంధ కోర్సుల బోధనలో.. ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్! ఈ సంస్థ పరిధిలోని యూనివర్సిటీలు, కళాశాలలు అందించే అగ్రికల్చర్ కోర్సులు పూర్తి చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఖాయం! వీటిల్లో చేరేందుకు మార్గం..ఐసీఏఆర్–ఏఐఈఈఏ!! నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రతి ఏటా నిర్వహించే.. ఐసీఏఆర్–ఏఐఈఈఏకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. ఐసీఏఆర్–ఏఐఈఈఏ–2021 వివరాలు, కోర్సులు, ప్రవేశ పరీక్ష విధానం, అర్హతలు, భవిష్యత్తు అవకాశాలపై ప్రత్యేక కథనం... అగ్రికల్చరల్ కోర్సులు. వీటికి ఎవర్ గ్రీన్ కోర్సు లుగా పేరు. ఎందుకంటే.. వ్యవసాయ ప్రధానమైన భారత్‌లో అగ్రి కోర్సులు పూర్తి చేసిన వారికి కొలువులకు కొదవలేదు. అందుకే జాతీయ స్థాయిలోని అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో యూజీ, పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే.. ఐసీఏఆర్–ఏఐఈఈఏ(ఐసీఏఆర్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్)కు ఎంతో పోటీ నెలకొంది. మరోవైపు రాష్ట్ర స్థాయిలో టీఎస్ ఎంసెట్(బైపీసీ)/ఏపీ ఈఏపీసెట్(బైపీసీ)లో ర్యాం కు సాధించి..అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో ప్రవేశం కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది! 74 అగ్రి యూనివర్సిటీలు ఐకార్ పరిధిలో మొత్తం 74 అగ్రికల్చర్ యూనివర్సి టీలు ఉన్నాయి. వీటిల్లో 63 స్టేట్ అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీస్ యూనివర్సిటీలు; 4 ఐకార్ డీమ్డ్ యూనివర్సిటీలు(ఐఏఆర్ఐ, ఐవీ ఆర్ఐ, ఎన్డీఆర్ఐ, సీఐఎఫ్ఈ); మూడు సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలు(సీఏయూ ఇంఫాల్, డాక్టర్ ఆర్పీసీయూ, పుసా, ఆర్ఎల్బీ సీఏయూ, ఝాన్సీ); 4 సెంట్రల్ యూనివర్సిటీలు (బీహెచ్ యూ, ఏఎంయూ, విశ్వభారతి, నాగాలాండ్ యూనివర్సిటీ) ఉన్నాయి. ఆల్ ఇండియా కోటా ఐసీఏఆర్–ఏఐఈఈఏ ద్వారా ఐసీఏఆర్ అనుబంధ ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీల్లో వ్యవసాయ విద్య కోర్సుల్లో ఆల్ ఇండియా కోటా ప్రవేశాలు లభిస్తాయి. అంటే.. ఈ ఎంట్రన్స్ టెస్ట్‌లో మంచి స్కోర్ సాధిస్తే.. విద్యార్థులు జాతీయ స్థాయిలోని అన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో ఆల్ ఇండియా కోటా సీట్లకు పోటీ పడొచ్చు. అదే విధంగా రాష్ట్ర స్థాయి వ్యవసాయ యూనివర్సిటీల్లో ప్రవేశం కోసం ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా ప్రవేశ విధానాలు అనుసరిస్తున్నాయి. మూడు స్థాయిల కోర్సులు ఐసీఏఆర్–ఏఐఈఈఏ ద్వారా వ్యవసాయ, అనుబంధ కోర్సుల్లో మూడు స్థాయిల్లో ఆల్ ఇండియా కోటా ప్రవేశాలు జరుగుతాయి. ఒక్కోస్థాయి కోర్సుకు నిర్దిష్ట శాతంతో ఆల్ ఇండియా కోటాను నిర్ణయించారు. ► ఐసీఏఆర్–ఏఐఈఈఏ(యూజీ):వ్యవసాయ, అను బంధ కోర్సుల్లో జాతీయ స్థాయిలోని వర్సి టీల్లో ఆల్ ఇండియా కోటా పేరుతో 15 శాతం సీట్లను ఐసీఏఆర్–ఏఐఈఈఏ (యూజీ) ఎంట్ర న్స్లో ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తున్నారు. ఈ విధానంలో సీట్లు పొందిన విద్యా ర్థులకు నేషనల్ టాలెంట్ స్కాలర్షిప్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అల్లైడ్ సైన్స్ సబ్జెక్ట్స్ పేరుతో నెలకు రూ.మూడు వేల ఉపకార వేతనం కూడా అందుతుంది. ► ఐసీఏఆర్–ఏఐఈఈఏ(పీజీ): ఈ ఎంట్రన్స్ ద్వా రా దేశంలోని అన్ని అగ్రికల్చర్ యూనివర్సి టీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వ్యవసాయ కోర్సుల్లో.. 25 శాతం సీట్లను భర్తీ చేస్తారు. ఈ ఎంట్రన్స్‌లో టాప్–600(మొదటి ఆరు వందల మంది) జాబితాలో నిలిచి.. ఐకార్ అనుబంధ అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన వారికి ఐసీఏఆర్–పీజీ స్కాలర్షిప్ పేరిట నెలకు రూ.12,460 చొప్పున రెండేళ్ల పాటు ఉపకార వేతనం లభిస్తుంది. ఆరు వందలకు పైగా ర్యాం కు సాధించిన విద్యార్థులకు నేషనల్ టాలెంట్ స్కాలర్షిప్(పీజీ) పేరిట నెలకు రూ.5వేలు చొప్పున రెండేళ్ల పాటు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తారు. ► ఐసీఏఆర్–ఏఐఈఈఏ(పీహెచ్డీ):ఐసీఏఆర్ అను బంధ సంస్థల్లో ఆల్ ఇండియా కోటాలో.. పీహెచ్డీ(డాక్టోరల్) ప్రోగ్రామ్‌లలో 25 శాతం సీట్ల భర్తీకి ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఎంట్రన్స్ ద్వారా ప్రవేశం ఖరారు చేసుకున్న వారికి జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ పేరుతో ఫెలోషిప్ అందిస్తారు. మొదటి రెండేళ్లు నెలకు రూ.31 వేలు చొప్పున జేఆర్ఎఫ్ను, మూడో ఏడాది ఎస్ఆర్ఎఫ్ పేరుతో నెలకు రూ.35 వేలను ఫెలోషిప్‌గా అందిస్తారు. దీనికి అదనంగా ప్రతి ఏటా రూ.పది వేలు చొప్పున కాంటింజెంట్ గ్రాంట్‌ను కూడా ఇస్తారు. మూడింటికీ.. వేర్వేరు పరీక్షలు ఐసీఏఆర్–ఏఐఈఈఏ విధానంలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పీహెచ్డీ ప్రోగ్రామ్‌లు మూడింటికీ వేర్వేరుగా ఎంట్రన్స్ టెస్టులు నిర్వహిస్తారు. బ్యాచిలర్ స్థాయి కోర్సులు ఐసీఏఆర్–ఏఐఈఈఏ యూజీ ద్వారా ప్రస్తుతం బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో 11 కోర్సుల్లో ప్రవేశం లభి స్తుంది. అవి.. బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్; బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్; బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్, బీఎస్సీ(ఆనర్స్) ఫారెస్ట్రీ; కమ్యూనిటీ సైన్స్; ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్; బీఎస్సీ(ఆనర్స్) సెరి కల్చర్; బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ. ► అర్హత: కోర్సులను అనుసరించి 10+2/ ఇంట ర్మీడియెట్ ఉత్తీర్ణత ఉండాలి. వయసు 31.08.2021 నాటికి 16ఏళ్లు నిండి ఉండాలి. ► పరీక్ష 150 ప్రశ్నలు–600 మార్కులకు నిర్వహి స్తారు. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ప్రతి సరైన సమాధానానికి 4మార్కులు లభిస్తాయి. ప్రతి పొరపాటు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. ► ఇంటర్మీడియెట్ స్థాయిలో చదివిన సబ్జెక్ట్‌ల ఆధారంగా ఈ మూడు విభాగాల సబ్జెక్ట్‌లు ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న వివరాల ఆధారంగా ఈ మూడు విభాగాల నుంచే ప్రశ్నలు అడుగుతారు. పీజీ కోర్సులు ఇవే ప్రస్తుతం పీజీ స్థాయిలో.. ప్లాంట్ బయోటెక్నాలజీ, ప్లాంట్ సైన్స్, ఫిజికల్ సైన్స్, యానిమల్ బయో టెక్నాలజీ, అగ్రి–బిజినెస్ మేనేజ్మెంట్, స్టాటిస్టికల్ సైన్స్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ/ఆగ్రో ఫారెస్ట్రీ అండ్ సివి కల్చర్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, వాటర్ సైన్స్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వెటర్నరీ సైన్స్, ఆగ్రోనమీ, ఫిషరీస్ సైన్స్, డెయిరీ సైన్స్, డెయిరీ టెక్నాలజీ, హోంసైన్స్, సోషల్ సైన్స్ తదితర విభాగాల్లో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ► అర్హత: 10+6 విధానంలో బీఎస్సీ అగ్రి కల్చర్/10+2+5 లేదా 10+2+5 1/2 విధానంలో(బీవీఎస్సీ అండ్ ఏహెచ్)/డిగ్రీ ప్రోగ్రామ్‌ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 50 శాతం మార్కులు సాధించి ఉంటే సరిపోతుంది. ► ఐసీఏఆర్–ఏఐఈఈఏ(పీజీ) పరీక్ష: ఐసీఏఆర్ పీజీ పరీక్ష మొత్తం 120 ప్రశ్నలకుగాను 480 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం 120 నిమిషాలు ఉంటుంది. పీహెచ్డీ పరీక్ష విధానం ► క్రాప్‌సైన్స్, హార్టికల్చర్, వెటర్నరీ అండ్ యాని మల్ సైన్స్–1, డెయిరీసైన్స్, డెయిరీ టెక్నాలజీ అండ్ ఫుడ్ టెక్నాలజీ, హోంసైన్స్, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్, అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్, అగ్రి కల్చరల్ ఎకానమీ అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఫిషరీ సైన్స్ సబ్జెక్ట్‌లలో మొత్తం 73 విభాగాల్లో పీహెచ్‌డీలో ప్రవేశం పొందొచ్చు. ► అర్హత: అభ్యర్థులు పీహెచ్‌డీలో ఎంపిక చేసుకు న్న విభాగానికి సంబంధించి పీజీ స్థాయిలో ఆ సబ్జెక్ట్ స్పెషలైజేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ► ఐసీఏఆర్–జేఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్(పీహెచ్డీ) పరీక్ష మొత్తం 120 ప్రశ్నలకుగాను 480 మార్కు లకు జరుగుతుంది. పరీక్ష సమయం 120 నిమిషాలు ఉంటుంది. సీట్ల కేటాయింపు మూడు స్థాయిల కోర్సులకు సంబంధించి అభ్యర్థులు ఆయా ఎంట్రన్స్‌ల్లో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి.. ఆన్లైన్లో సీట్ల కేటాయింపు చేస్తారు. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో 2,865 సీట్లు, పీజీ స్థాయిలో 3,219 సీట్లు, పీహెచ్డీ స్థాయిలో 1,377 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ► ఐసీఏఆర్–ఏఐఈఈఏ 2021 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ► ప్రముఖ ఇన్స్టిట్యూట్లలో.. యూజీ, పీజీ, పీహెచ్డీ స్థాయి అగ్రి కోర్సులు ► ఆల్ ఇండియా కోటాలో ఐసీఏఆర్ అనుబంధ యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లలో అడ్మిషన్స్ ఐసీఏఆర్–ఏఐఈఈఏ(యూజీ) ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021. ► దరఖాస్తుల సవరణ: ఆగస్ట్ 23–ఆగస్ట్ 26. ► పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 7, 8, 13. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://icar.nta.ac.in ఐసీఏఆర్–ఏఐఈఈఏ(పీజీ),(పీహెచ్డీ) ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021 ► దరఖాస్తుల సవరణ: ఆగస్ట్ 23–ఆగస్ట్ 26 ► పరీక్ష తేదీ: సెప్టెంబర్ 17,2021 తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, రంగారెడ్డి, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్. ► వివరాలకు వెబ్సైట్: https://icar.nta.ac.in ఐసీఏఆర్–ఏఐఈఈఏ.. ముఖ్యాంశాలు ► ఐసీఏఆర్ అనుబంధ ఇన్స్టిట్యూట్లలో ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీ. ► ప్రస్తుతం జాతీయ స్థాయిలో 74 యూనివర్సిటీలు, నాలుగు ఐసీఏఆర్ డీమ్డ్ యూనివర్సిటీలు, మూడు సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలు, నాలుగు సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాలు. ► ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా అగ్రి యూనివర్సిటీస్ల్లో అడ్మిషన్స్. ► కోర్సులు పూర్తి చేసుకున్నాక ప్రభుత్వ, ప్రైవేట్ విభాగాల్లో అవకాశాలు. ► కోర్సు చదివే సమయంలో స్కాలర్షిప్ సదుపాయం లభిస్తుంది. డిమాండ్ పెరుగుతోంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో నైపుణ్యం ఉన్న మానవ వనరులకు డిమాండ్ పెరుగుతోంది. వ్యవసాయ విద్యను అభ్యసించిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో వ్యవసాయ పంటల అమ్మకాలు, మార్కెటింగ్, రవాణా, సేవ లు, నిల్వ, గిడ్డంగులు మొదలైన వాటిల్లో ఉద్యో గాలు లభిస్తున్నాయి. వ్యవసాయశాఖలోనూ అవకాశాలు దక్కించుకోవచ్చు. అగ్రికల్చ ర్ ఫీల్డ్ ఆఫీసర్స్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వంటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా ప్లాంటేషన్స్, ఫెర్టిలైజర్ కంపెనీలు, అగ్రికల్చరల్ మెషినరీలు, అగ్రికల్చరల్ ప్రొడక్ట్, ఫుడ్ ప్రాసె సింగ్ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. వీటితోపాటు ఎఫ్‌సీఐ, నాబార్డ్‌తోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూరల్ బ్యాంకింగ్ విభాగా ల్లోనూ ఆఫీసర్లు, మేనేజర్లుగా కెరీర్స్ సొంతం చేసుకోవచ్చు. పీహెచ్డీ పూర్తి చేస్తే.. ఐసీఏఆర్, ఐఏఆర్ఐ వంటి అగ్రికల్చర్ రీసెర్చ్ కేంద్రా లతోపాటు, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలోని రీసెర్చ్ కేంద్రాల్లో సైంటిస్ట్ హోదాలో స్థిరపడొచ్చు. -
వ్యవసాయ శాస్త్రవేత్తగా రైతు బిడ్డ
కొణిజర్ల: సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆ యువతి ప్రతిష్టాత్మక సంస్థలో కొలువు సాధించింది. ఏఆర్ఎస్ పరీక్షలో దేశవ్యాప్తంగా నాలుగో ర్యాంకు సాధించి ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్‌లో శాస్త్రవేత్తగా ఎంపికైంది. కొణిజర్ల మండలం పల్లిపాడుకు చెందిన కంచేటి మృణాళిని ఈ ఘనత సాధించింది. జాతీయ స్థాయిలో అగ్రికల్చర్ రీసెర్చ్ సైంటిస్ట్ ఆగ్రోనమీ విభాగంలో ఎనిమిది పోస్టులకు అవకాశం ఉండగా, అందులో జనరల్ కేటగిరీలో నాలుగు పోస్టులు మాత్రమే ఉంటాయి. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువతీ యువకులు పోటీ పడుతుంటారు. ఈ పోస్టు ఎంపిక కోసం గ్రూప్స్ పరీక్ష మాదిరిగానే ప్రిలిమ్స్ , మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటాయి. ఈ పరీక్ష గతేడాది జూన్‌లో నిర్వహించగా ఈ ఏడాది మేలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి విడుదలయిన ఫలితాల్లో కంచేటి మృణాళిని ఆగ్రోనమీ విభాగంలో నాలుగో స్థానం సాధించి ప్రతిష్టాత్మకమైన కొలువు సాధించింది. మొదటి నుంచి అత్యుత్తమ ప్రతిభే... పల్లిపాడుకు చెందిన కంచేటి వెంకటేశ్వరరావు, శేషారత్నం దంపతుల కుమార్తె అయిన మృణాళిని బాల్యం నుంచే చురుకుగా ఉండేది. తల్లి దండ్రులు ఉన్న కొద్దిపాటి భూమి వ్యవసాయం చేస్తూ చూసిన ఆమెకు వ్యవసాయం ఆసక్తి కలిగి అగ్రికల్చర్ బీఎస్సీలో చేరింది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఏజీ బీఎస్సీ పూర్తి చేసి బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో ఎంఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసింది. ఎంఎస్సీ ఆగ్రోనమీ విభాగంలో 92 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అనంతరం కడపలోని బద్వేలు వ్యవసాయ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఏడాది కాలం పని చేసింది. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆగ్రోనమీలో పీహెచ్డీ చేసి విశ్వవిద్యాలయ స్థాయిలో అగ్రగామిగా నిలిచింది. అత్యంత ప్రతిష్మాత్మక మైన జాతీయ స్థాయి ఆగ్రోనమీ శాస్త్రవేత్తగా మృణాళిని ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెను గ్రామస్తులు అభినందించారు. -
వ్యవసాయ కోర్సుల్లో సామాజిక శాస్త్రం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్‌లో సైన్సు, డిగ్రీ, పీజీల్లో వ్యవసాయ విద్య, తర్వాత వ్యవసాయాధికారిగా ఉద్యోగం... అనంతరం క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండటం. ఇలా వ్యవసాయ ఉద్యోగంలో ప్రవేశించిన వారి జీవితం ప్రారంభం అవుతుంది. అయితే అనేకమంది ఉద్యోగాన్ని సామాజిక బాధ్యతగా భావించడం లేదని, రైతులకు అందుబాటులో ఉండటం లేదని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) గుర్తించింది. కొందరైతే తమకోసమే ఉద్యోగమన్న భావనలో నిర్లక్ష్యంగా ఉన్నారని ఆవేదన చెందుతోంది. దీన్ని సరిదిద్దేందుకు ఐకార్ నడుం బిగించింది. వ్యవసాయ, దాని అనుబంధ కోర్సుల్లోనూ సామాజిక శాస్త్రాన్ని ప్రధాన సబ్జెక్టుగా ప్రవేశపెట్టి వారిలో సామాజిక స్పృహ పెంపొందించాలని యోచిస్తోంది. దీనిపై మార్గదర్శకాలను తయారు చేసే పనిలో ఐకార్ ఉన్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ అధికారులు చెబుతున్నారు. దీన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేసే అవకాశముందన్నారు. వందలాది మంది అధికారులున్నా అంతే! పాఠశాల స్థాయిలో పదో తరగతి వరకు మాత్రమే విద్యార్థులు సాంఘిక శాస్త్రం చదువుతున్నారు. ఇక ఇంటర్ నుంచి సైన్సు, ఆర్ట్స్ కోర్సులను ఎంచుకుంటున్నారు. సైన్సు కోర్సులో చేరిన విద్యార్థులు పూర్తిగా సామాజిక శాస్త్రాలకు దూరం అవుతున్నారు. ఫలితంగా సామాజిక స్పృహ, బాధ్యత లేక వ్యవసాయాధికారులు ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తించడంలేదని ఐకార్ భావిస్తోంది. ఒకవైపు రైతు ఆత్మహత్యలు, మరోవైపు కరువుఛాయలు రైతును కుదేలు చేస్తున్నాయి. రైతు కోసం వేలాది మంది వ్యవసాయాధికారులున్నా రైతుకు పెద్దగా ప్రయోజనం కలగడంలేదని భావిస్తోంది. రాష్ట్రంలో వందలాది మంది వ్యవసాయ కోర్సులు చేస్తున్నారు. వారిలో చాలామంది ప్రభుత్వ వ్యవసాయ ఉద్యోగంలో చేరుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,200 ఏఈవో పోస్టులు, 450 ఏవో, 122 ఏడీఏ, 25 డీడీఏ, 15 జేడీఏ, రెండు అడిషనల్ డెరైక్టర్ పోస్టులున్నాయి. జిల్లాల్లోని ప్రయోగశాలల్లో దాదాపు 60 మంది ఉన్నారు. మరోవైపు ఉద్యానశాఖలో సుమారు 200 మంది పనిచేస్తున్నారు. వ్యవసాయ వర్సిటీలో 500 మందికిపైగా అధ్యాపకులు, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ఉన్నారు. వీరుగాక ఇతర వ్యవసాయ అనుబంధ విభాగాల్లో వందలాది మంది ఉన్నారు. కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థల్లో అనేకమంది పరిశోధనలు చేస్తున్నారు. ఇలా వేలాది మంది ఉన్నా రైతుకు కలిగే ప్రయోజనం ఎంతనేది ఐకార్‌ను వేధిస్తున్న ప్రశ్న. ఇంత యంత్రాంగం ఉన్నా రైతులు నూతన సాగు విధానాలను పాటించకుండా సంప్రదాయ వ్యవసాయంపైనే ఎందుకు ఆధారపడుతున్నారని అంటోంది. ఈ నేపథ్యంలో రైతుల పట్ల సున్నితంగా స్పందించాల్సిన అవసరాన్ని గుర్తించేందుకు వ్యవసాయ డిగ్రీ, పీజీ కోర్సుల్లో తప్పనిసరిగా సామాజికశాస్త్రాన్ని పరిచయం చేయాలని నిర్ణయించింది. -
4జీ టెక్నాలజీతో ఆరోగ్యమైన పంటలు
ఐకార్ డెరైక్టర్ జనరల్ ఎస్. అయ్యప్పన్ మాదాపూర్: 4జీ టెక్నాలజీతో ఆరోగ్యకరమైన పంటలు సాధ్యమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ అన్నారు. మాదాపూర్ హెచ్ఐసీసీలో ఆదివారం రాత్రి ప్రతిష్ట ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన 4జీ నానో టెక్నాలజీ వ్యవసాయ ఎరువులను మార్కెట్లోకి విడుదలజేశారు. ముఖ్యఅతిథిగా ఐకార్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అధిగమించి వ్యవసాయ రంగం నాలుగవతరం 4జీ నానో టెక్నాలజీని సాధించడం ప్రపంచ వ్యవసాయరంగానికి శుభసూచకమన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసె ర్చ్ ఐదున్నరేళ్ళ పాటు పరిశోధించి ప్రపంచవ్యాప్తంగా 170 పరిశోధనశాలలో పరీక్షించిన ఈ 4జీ నానో ఫార్ములాతో ప్రతి ష్టా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అగ్రికల్చర్ ఇన్పుట్స్ (ఎరువులు) రూపొందించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పవర్ ఆఫ్ టెక్నాలజీగా పేర్కొంటున్న నానో టెక్నాలజీని వ్యవసాయరంగం సాధించడం ప్రపంచ వ్యవసాయ రంగంలో కీలకమైన మలుపని అన్నారు. ప్రతిష్టా ఇండస్ట్రీస్ లిమిటెడ్ 4జీ నానో వ్యవసాయ ఎరువులను మార్కెట్లోకి విడుదల చేయడం టెక్నాలజీని ఆర్థికరంగానికి మరియు వ్యవసాయ రంగానికి అత్యంత అందుబాటులోకి తీసుకువెళ్ళడమే అవుతుందన్నారు. వ్యవసాయ దారులు ఎవరో అందించే ఆర్థిక ప్రోత్సాహకాలపై అంత మక్కువగా లేరని, వారికి అనువైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకెళితే వ్యవసాయదారులే ఆర్థిక శక్తులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిష్టా ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూపొందించిన 4జీ నానో వ్యవసాయ ఎరువులను ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ విలియం ధార్ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ ఎరువులను నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ మార్కెట్లోకి తీసుకువెళ్తుంది. ఈ సందర్భంగా ప్రతి ష్టా కంపెనీ లోగోను, పుస్తకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిష్టా ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ కేవీఎస్ఎస్ సాయిరాం, ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ విలియం ధార్, ఆంధ్రబ్యాంక్ డీజీఎం వెంకటేశ్వర్లు, మాజీ న్యాప్ నేషనల్ డెరైక్టర్ డాక్టర్ రామారావు, శాస్త్రవేతలు పాల్గొన్నారు. -
4జీ టెక్నాలజీతో ఆరోగ్యమైన పంటలు
మాదాపూర్: 4జీ టెక్నాలజీతో ఆరోగ్యకరమైన పంటలు సాధ్యమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ అన్నారు. మాదాపూర్ హెచ్ఐసీసీలో ఆదివారం రాత్రి ప్రతిష్ట ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన 4జీ నానో టెక్నాలజీ వ్యవసాయ ఎరువులను మార్కెట్లోకి విడుదలజేశారు. ముఖ్యఅతిథిగా ఐకార్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అధిగమించి వ్యవసాయ రంగం నాలుగవతరం 4జీ నానో టెక్నాలజీని సాధించడం ప్రపంచ వ్యవసాయరంగానికి శుభసూచకమన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసె ర్చ్ ఐదున్నరేళ్ళ పాటు పరిశోధించి ప్రపంచవ్యాప్తంగా 170 పరిశోధనశాలలో పరీక్షించిన ఈ 4జీ నానో ఫార్ములాతో ప్రతి ష్టా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అగ్రికల్చర్ ఇన్పుట్స్ (ఎరువులు) రూపొందించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో కొనడానికి స్వచ్ఛమెన బంగా రం దోరుకుతుంది కానీ పూర్తి ఆరోగ్యకరమైన బియ్యం, ఆహారం లభించడం ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ఇటువంటి తరుణంలో నానో న్యియెంట్స్ ల్యక్టొగ్లూకొనేట్స్ సమ్మిళతమైన పూర్తి స్థాయిఖని జాలు కలిగిన వ్యవసాయ పంటలను పెంచడానికి ఈ 4 జీ నానో అగ్రికల్చర్ టెక్నాలజీ ద్వారా సాధ్యమవుతుందని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం పవర్ ఆఫ్ టెకాన్లజీగా పేర్కొంటున్న నానో టెక్నాలజీని వ్యవసాయరంగం సాధించడం ప్రపం చ వ్యవసాయ రం గంలో కీలకమైన మలుపని అన్నారు. ప్రతిష్టా ఇండస్ట్రీస్ లిమిటెడ్ 4జీ నానో వ్యవసాయ ఎరువలను మార్కెట్లోకి విడుదల చేయడం టెక్నాలజీని ఆర్థికరంగానికి మరియు వ్యవసాయ రంగానికి అత్యంత అందుబాటులోకి తీసుకువెళ్ళడమే అవుతుందన్నారు. వ్యవసాయ దారులు ఎవరో అందించే ఆర్థిక ప్రోత్సాహకాలపై అంత మక్కువలేరని, వారికి అనువైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువెళితే వ్యవసాయదారులే ఆర్థిక శక్తులుగా ఎదుగుతారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిష్టా ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూపొందించిన 4జీ నానో వ్యవసాయ ఎరువలను ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ విలియం ధార్ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ ఎరువులను నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ మార్కెట్లోకి తీసుకువెళ్తుంది. ఈ సందర్భంగా ప్రతిష్టా కంపెనీ లోగోను, పుస్తకావిష్కరనను చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిష్టా ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ కేవీఎస్ఎస్ సాయిరాం, ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ విలియం ధార్, ఆం ధ్రబ్యాంక్ డీజీఎం వెంకటేశ్వర్లు, మాజీ న్యాప్ నేషనల్ డెరైక్టర్ డాక్టర్ రామారావు, శాస్త్రవేతలు లు పాల్గొన్నారు. -
డెయిరీ.. ఉజ్వల భవితకు దారి
గెస్ట్ కాలమ్ నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.. దేశంలో డెయిరీ ఉత్పత్తులు, డెయిరీ ప్రాసెసింగ్, నిర్వహణ సేవలు, పరిశోధనలతోపాటు సుశిక్షితులైన డెయిరీ నిపుణులను తీర్చిదిద్దుతున్న ప్రభుత్వ రంగ సంస్థ. అంతేకాకుండా డెయిరీ రంగంలో పరిశోధన, బోధన రంగాల్లో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్. ‘ప్రస్తుతం దేశంలో డెయిరీ రంగంలో నిపుణుల అవసరం ఎంతో ఉంది. విద్యార్థులు కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్ వంటి కోర్సులవైపే దృష్టి సారించకుండా.. డెయిరీ రంగంలో అడుగుపెడితే ఉజ్వల భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు. 2020 నాటికి వేల సంఖ్యలో మానవ వనరుల డిమాండ్ ఏర్పడనుంది. కాబట్టి ఔత్సాహిక విద్యార్థులు దీర్ఘకాలిక లక్ష్యంతో డెయిరీ రంగంలో కెరీర్ ప్లానింగ్ చేసుకుంటే అద్భుత ఫలితాలు సొంతమవుతాయి’ అంటున్న నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (కర్నాల్) డెరైక్టర్ ప్రొఫెసర్ ఎ.కె.శ్రీవాత్సవతో ఇంటర్వ్యూ.. డెయిరీ సైన్స్ కోర్సుల ప్రాముఖ్యత, ప్రయోజనాలు తెలపండి? గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో డెయిరీ రంగం శరవేగంగా పురోగమిస్తోంది. అదేవిధంగా పాల ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో విధానాల పరంగా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. మరోవైపు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మేనేజ్మెంట్, పేటెంటింగ్ వంటి విభాగాల్లోనూ నిపుణుల కొరత అధికంగా ఉంది. వీటికి అనుగుణంగా నిరంతరం ఆధునిక టెక్నాలజీపై అవగాహన కల్పిస్తూ శిక్షణనిచ్చే కోర్సులే.. డెయిరీ సైన్స్ కోర్సులు. మరో ఆరేళ్లలో దేశంలో డెయిరీ సైన్స్ నిపుణుల డిమాండ్ వేల సంఖ్యకు చేరుకోనుంది. కాబట్టి విద్యార్థులు బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచే దృష్టి సారిస్తే ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో డెయిరీ కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు? దేశవ్యాప్తంగా 18 ఇన్స్టిట్యూట్లలో డెయిరీ టెక్నాలజీలో బ్యాచిలర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ఏటా 500 నుంచి 600 మంది మాత్రమే అభ్యర్థులు బయటికొస్తున్నారు. డిమాండ్- సప్లయ్ కోణంలో ఈ సంఖ్య చాలా తక్కువ. మరింత మంది గ్రాడ్యుయేట్ల అవసరం ఉంది. పీజీ స్థాయిలో డెయిరీ టెక్నాలజీ, డెయిరీ మైక్రోబయాలజీ, డెయిరీ కెమిస్ట్రీ, డెయిరీ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి స్పెషలైజేషన్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంది. కాబట్టి ఫలానా స్పెషలైజేషన్‌కు డిమాండ్ అధికం అని చెప్పలేం. ఆర్ అండ్ డీ అవకాశాలు, ఆవశ్యకతపై మీ అభిప్రాయం? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ పరిధిలో.. ఏడు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు యానిమల్ సెన్సైస్, యానిమల్ హెల్త్, డెయిరీ ప్రొడక్షన్, డెయిరీ ప్రాసెసింగ్, జెనెటిక్ ఎవాల్యుయేషన్/కన్జర్వేషన్ తదితర అంశాల్లో పరిశోధన కోర్సులను అందిస్తున్నాయి. మాలిక్యులర్ జెనెటిక్స్, జీనోమిక్స్, న్యూట్రి-జీనోమిక్స్, ప్రొటియోమిక్స్, మెటబాలమిక్స్ అంశాలు పరిశోధనల పరంగా ఇప్పుడిప్పుడే ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్‌కు సంబంధించి హై-హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ట్రీట్మెంట్, పల్స్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ట్రీట్మెంట్, పల్స్డ్ లైట్ ట్రీట్మెంట్ అంశాలు ప్రధానమైనవి. కేవలం కోర్ అంశాలే కాకుండా.. సంబంధిత అంశాలైన ప్యాకేజింగ్ ఇన్నోవేషన్స్, నానో టెక్నాలజీ అండ్ బయోడీగ్రేడబుల్ ప్యాకేజింగ్ విభాగాల్లోనూ ఆర్ అండ్ డీ అవకాశాలు అనేకం. విదేశాల్లో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు? డెయిరీ సైన్స్ ఉత్తీర్ణులకు విదేశాల్లోనూ అనేక అవకాశాలున్నాయి. ఉపాధి, ఉద్యోగాలపరంగా కొన్నేళ్లుగా పీహెచ్డీ ఉత్తీర్ణులు మొదలు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణుల వరకు అనేకమందికి ఉద్యోగాలు లభించాయి. ముఖ్యంగా ఆఫ్రికా, మిడిల్-ఈస్ట్ దేశాల్లోని డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో అవకాశాలు మరింత అధికంగా ఉన్నాయి. ఎన్డీఆర్ఐ గణాంకాల ప్రకారం- గత పదేళ్లలో ఇక్కడ ఉత్తీర్ణులైన అభ్యర్థుల్లో 50 శాతం మంది విదేశాలకు వెళ్లారంటేనే విదేశీ అవకాశాలు ఏ స్థాయిలో ఉన్నాయో అవగతమవుతోంది. ముఖ్యమైన ఉపాధి వేదికలు? డెయిరీ సైన్స్ కోర్సుల ఉత్తీర్ణులకు డెయిరీ ప్లాంట్స్, కమర్షియల్ డెయిరీ ఫామ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పశు సంవర్థక శాఖ, బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్, స్వచ్ఛంద సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. వీటితోపాటు డాక్టోరల్ స్థాయీ అభ్యర్థులు ఎంఎన్సీ జీతాలకు దీటుగా యూనివర్సిటీ, పరిశోధన సంస్థలలో బోధనా రంగంలో ప్రవేశించవచ్చు. తద్వారా ఆకర్షణీయమైన జీతభత్యాలు అందుకోవచ్చు. స్వయం ఉపాధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దిశగా లభించే అవకాశాలు? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్/ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోణంలోనూ ఎన్నో మార్గాలు ఉన్నాయి. డెయిరీ ఫామ్ ఏర్పాటు మొదలు.. ఉత్పత్తుల మార్కెటింగ్ వరకు ఎన్నో రకాల స్వయం ఉపాధి మార్గాలు, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు వంటి అవకాశాలున్నాయి. సరైన ప్రాజెక్ట్ రిపోర్ట్, ప్రణాళికలుంటే.. ఐసీఏఆర్, ఎన్డీఆర్ఐ సహా ఈ కోర్సులను అందించే ఎన్నో ఇన్స్టిట్యూట్లు స్టార్ట్-అప్ ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. భవిష్యత్తు కెరీర్ అవకాశాలు ఎలా ఉండనున్నాయి? నేషనల్ అకాడెమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్-హైదరాబాద్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ మ్యాన్‌పవర్ రీసెర్చ్-న్యూఢిల్లీ సర్వే ప్రకారం.. అగ్రికల్చర్, యానిమల్ సెన్సైస్‌కు సంబంధించి 2020 నాటికి ప్రతి ఏటా 40వేల మంది గ్రాడ్యుయేట్లు, 10,500 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 2,800 మంది డాక్టోరల్ డిగ్రీ ఉత్తీర్ణుల అవసరం ఏర్పడనుంది. అగ్రికల్చర్, యానిమల్ సైన్స్‌కు అనుబంధ రంగంగా ఉన్న డెయిరీ సైన్స్‌లో 2020 నాటికి డెయిరీ సైన్స్, ప్రాసెసింగ్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ నుంచి డాక్టోరల్ డిగ్రీ ఉత్తీర్ణులకు ఏటా 35వేల మందికి అవకాశాలు లభించనున్నాయి. డెయిరీ రంగ అభివృద్ధి, మానవ వనరుల శిక్షణకు సంబంధించి ఎన్డీఆర్ఐ చేపడుతున్న చర్యలు? ఆసియాలోనే డెయిరీ ఎడ్యుకేషన్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటై డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందిన ఇన్స్టిట్యూట్.. నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ప్రస్తుతం ఈ ఇన్స్టిట్యూట్లో యూజీ, 12 విభాగాల్లో పీజీ, డాక్టోరల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇన్స్టిట్యూట్కు చెందిన సదరన్ రీజనల్ స్టేషన్-బెంగళూరు, ఈస్టర్న్ రీజనల్ స్టేషన్-కళ్యాణిలలో రీసెర్చ్, టీచింగ్ కోర్సులను అందిస్తున్నాం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నిర్వహించే జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా యూజీ, పీజీ కోర్సుల్లో.. ఎన్డీఆర్ఐ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా డాక్టోరల్ డిగ్రీ ప్రోగ్రామ్స్‌లో అడ్మిషన్లు కల్పిస్తాం. ఇక్కడ బోధన విధానం, కరిక్యలంలోనూ క్షేత్రస్థాయి నైపుణ్యాలు అందించేందుకు పెద్దపీట వేస్తున్నాం. ఈ క్రమంలోనే బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఏడాది వ్యవధి ఉండే ‘ఇన్-ప్లాంట్ ట్రైనింగ్’ పేరుతో విద్యార్థులను డెయిరీ పరిశ్రమలకు ప్రాక్టికల్ శిక్షణకు పంపుతున్నాం. ఫలితంగా ప్రాక్టికల్ నైపుణ్యాలతోపాటు అక్కడ బాగా రాణించిన విద్యార్థులకు ఆయా సంస్థల్లోనే ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఔత్సాహిక విద్యార్థులకు సలహా? దేశంలో డెయిరీ రంగం అభివృద్ధి సాధించాలంటే.. వేల మంది మానవ వనరుల అవసరం ఉంది. అందుకు తగ్గట్టు విద్యావకాశాలు కూడా పెంపొందాలి. విద్య, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు యువత సిద్ధమవ్వాలి. కెరీర్ అంటే.. ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్ మాత్రమే అనే అపోహ వీడాలి. డెయిరీ రంగంలో అవకాశాలను సొంతం చేసుకునే దిశగా విద్యార్థులు దృష్టి సారిస్తే ఉజ్వలమైన కెరీర్‌ను అందుకోవచ్చు. దీంతోపాటు సామాజిక ప్రగతికి కూడా దోహదం చేసినట్లవుతుంది. -
రైతు శాస్త్రవేత్తలకు పెద్దపీట!
‘సాగుబడి’తో ముఖాముఖిలో ఐసీఏఆర్ డెరైక్టర్ జనరల్ డా. అయ్యప్పన్ . మెరుగైన సాగు పద్ధతులను, మెలకువలను రైతాంగం దరికి చేర్చే క్రమంలో రైతు శాస్త్రవేత్తలకు పెద్దపీట వేస్తున్నామని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డా. అయ్యప్పన్ వెల్లడించారు. శాస్త్ర విజ్ఞానాన్ని, సంప్రదాయ విజ్ఞానంతో మేళవించి సాగును కొత్తపుంతలు తొక్కిస్తున్న రైతు శాస్త్రవేత్తలతో ఐసీఏఆర్ ప్రాంతీయ సమవేశాల్లో ప్రత్యేక సెషన్‌ను కూడా నిర్వహిస్తున్నామన్నారు. రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి ఎండిన మట్టినే ఎరువుగా వాడుతూ నాణ్యమైన, అధిక పంట దిగుబడులు సాధిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కుందనపల్లిలోని వెంకటరెడ్డి ద్రాక్ష తోటను డా. అయ్యప్పన్ ఇటీవల సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబుతో ముచ్చటించారు. ఇవీ ముఖ్యాంశాలు.. రసాయనిక ఎరువులు వాడకుండా ఎండిన మట్టినే ఎరువుగా వాడే వెంకటరెడ్డి వినూత్న సాగు విధానంపై మీ అభిప్రాయం ఏమిటి? ఎండిన మట్టినే ఎరువుగా వేస్తూ ఏళ్ల తరబడి పండిస్తున్న ద్రాక్ష తోట గురించి గతంలో విన్నాను. ఇవ్వాళ స్వయంగా చూడడం ఆనందంగా ఉంది.. అద్భుతం. అనేక రాష్ట్రాల్లో ద్రాక్ష తోటలను చూశా. కానీ, ఈ తోట చాలా ప్రత్యేకమైనది. మట్టిని ఎరువుగా వేసి ఏళ్ల తరబడి నాణ్యమైన, అధిక దిగుబడులు సాధిస్తూ ఉండడం గొప్ప విషయం. ఈ పొలం వ్యవసాయ పరిశోధన సంస్థగా మారిపోయింది. అగ్రికల్చర్ ఎమ్మెస్సీ, పీహెచ్డీ చదువుతున్న విద్యార్థులను 3,4 నెలల పాటు ఈ క్షేత్రానికి డిజర్టేషన్కు పంపిస్తాం. ఈ తోట నాకు భూలోకంలో వైకుంఠంలా కనిపిస్తోంది.. ఏ, సీ విటమిన్లతో కూడిన వరి, గోధుమలను కూడా వెంకటరెడ్డి గారు పండిస్తున్నారు. ‘గోల్డెన్ రైస్’ అవసరమే లేదని అంటున్నారు. ఈ సాగు పద్ధతిని రైతుల దగ్గరకు తీసుకెళ్లడానికి ఐసీఏఆర్ ఏమైనా చేయబోతోందా? శాస్త్ర విజ్ఞానం, సంప్రదాయ విజ్ఞానం మేళవింపుతో ఆవిష్కృతమైన ఈ టెక్నిక్ ఇక్కడి(రంగారెడ్డి జిల్లా) ఎర్ర నేలల్లో, ఈ వాతావరణంలో మంచి దిగుబడుల నిస్తున్నది. అయితే, ఇతర ప్రాంతాల్లో ఎలాంటి ఫలితాల నిస్తుందో తెలీదు. మా పరిశోధన కేంద్రాల్లో పరీక్షించి చూస్తాం. ఎక్కడెక్కడ మెరుగైన ఫలితాలు వస్తే.. అక్కడి రైతులకు ఈ ఇన్నోవేటివ్ నమూనాను ఆచరించమని సిఫారసు చేస్తాం. దేశవ్యాప్తంగా పలువురు రైతులు స్థానిక పరిస్థితులకు అనుగుణమైన వినూత్న సాగు పద్ధతులను, యంత్ర పరికరాలను ఆవిష్కరిస్తున్నారు కదా..? నిజమే. గత నాలుగేళ్లుగా ఐసీఏఆర్ అనుబంధ సంస్థలన్నిటిలోనూ రైతు శాస్త్రవేత్తల దినోత్సవం నిర్వహిస్తున్నాం. వారి విజయాలను రికార్డు చేస్తున్నాం. ప్రాంతీయ సమావేశాల్లో వీరితో ప్రత్యేకంగా ఒక సెషన్ నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది ప్రపంచ కుటుంబ వ్యవసాయ సంవత్సరం. హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ శతజయంతి సంవత్సరం కూడా. ‘మీకు తెలిసిన దాన్ని రైతుల దగ్గరకు తీసుకెళ్లండి’ అనేది ఆయన చివరి కోరిక. ఈ లక్ష్య సాధన క్రమంలో రైతు శాస్త్రవేత్తలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. వాతావరణ మార్పులపై తాజా నివేదికల నేపథ్యంలో వ్యవసాయ ఉద్గారాలను తగ్గించే చర్యలేమైనా తీసుకుంటున్నారా? పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతుల వల్ల ఉద్గారాలు తగ్గుతున్న విషయం గురించి ఎవరూ గుర్తించడం లేదు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ దారులకు పర్యావరణ అనుకూల పద్ధతులు పాటిస్తున్న పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నట్లుగానే ఆర్థిక ప్రయోజ నాలు చేకూర్చాలని మేం అడుగుతున్నాం..కరువుసీమ అనంతపురంలో జిగురు గోరుచిక్కుడు, కీన్వా తదితర పంటలను సాగు చేయిస్తున్నారు కదా.. ఫలితాలు ఎలా ఉన్నాయి? జిగురు గోరుచిక్కుడు సాగు చేసిన రైతులకు మంచి ధర వచ్చింది. కీన్వాను ఎగుమతి చేయాల్సి ఉంటుంది. అలాగే, టెఫ్ అనే పంటనూ ప్రయత్నించవచ్చు. అయితే, ఇక్కడున్న సమస్యేమిటంటే.. ఒక పంట బాగుంది అన్నామంటే.. రైతులందరూ అదే పంట వైపు వెళ్తుంటారు. అదే ఇబ్బంది.. ప్రాసెసింగ్ యూనిట్లను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తే సమస్య ఉండదేమో? అవును..