breaking news
India-UK talks
-
విస్కీ ధరలు తగ్గింపు..?
భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై ఇరు ప్రాంతాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ డీల్ కుదరడంతో స్పిరిట్లపై దిగుమతి సుంకాలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రీమియం అంతర్జాతీయ మద్యం బ్రాండ్లను భారతీయ వినియోగదారులకు మరింత చౌకగా అందించే వీలుందని భావిస్తున్నారు. ఒక్కో బాటిల్‌పై సరాసరిగా రూ.300 వరకు ధరల తగ్గింపు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.ఈ ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దీర్ఘకాలంలో ఇరుదేశాల వాణిజ్యాన్ని 35 బిలియన్ డాలర్లకు పెంచుతుంది. ఈ డీల్ కోసం మూడేళ్లకు పైగా సాగుతున్న చర్చల ఫలితంగా మే నెలలో ఎఫ్‌టీఏను ఖరారు చేయగా, ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ పర్యటన సందర్భంగా వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, యూకే ప్రధాని జోనాథన్ రేనాల్డ్స్ ఒప్పందంపై తాజాగా సంతకాలు చేశారు. రెండు ప్రభుత్వాల మధ్య లండన్‌లో కుదిరిన ఎఫ్‌టీఏ ప్రకారం యూకే విస్కీ, జిన్లపై సుంకాన్ని భారత్ 150 శాతం నుంచి 75 శాతానికి తగ్గించనుంది. ఈ ఒప్పందం కుదిరిన పదేళ్లలో మరో 40 శాతం సుంకాలు తగ్గించేలా నియమాలున్నాయి.విస్కీ ధరలపై నిపుణుల అంచనాలుభారతదేశంలో ప్రీమియం ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్‌డబ్ల్యూఏఐ) ఈ వాణిజ్య ఒప్పందాన్ని ఆల్కహాలిక్ బేవరేజ్ రంగానికి చారిత్రాత్మక క్షణంగా అభివర్ణించింది. ఈ ఒప్పందం వల్ల ప్రీమియం అంతర్జాతీయ స్పిరిట్స్ మరింత అందుబాటులోకి వస్తాయని, ఈ డీల్ భారతీయ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఐఎస్‌డబ్ల్యూఏఐ సీఈఓ సంజిత్ పాధి తెలిపారు. ఇది హాస్పిటాలిటీ, టూరిజం, రిటైల్ వంటి అనుబంధ రంగాల్లో వృద్ధికి ఊతమిస్తుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇండియన్స్‌ను వద్దంటే యూఎస్‌కే నష్టంపెద్దగా మార్పు ఉండదు..దిగుమతి చేసుకున్న స్కాచ్ (విస్కీ) వినియోగదారుల ధరల్లో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదని మద్యం పరిశ్రమ నిపుణుడు వినోద్ గిరి తెలిపారు. మద్యంపై పన్నులు చాలా వరకు రాష్ట్రాల్లోనే ఉన్నాయని, కస్టమ్స్ సుంకం తగ్గింపు జరిగినా దిగుమతి చేసుకునే స్కాచ్ విస్కీల వినియోగదారుల ధరలపై ప్రభావం ఒక్కో బాటిల్‌పై సరాసరి రూ.100-300 మధ్య ఉంటుందని తెలిపారు. -
బ్రిటన్–భారత్ పరిశ్రమల టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
లండన్: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) సాకారం అయ్యే దిశగా పరిశ్రమల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించుకునే ఉద్దేశంతో భారత్, బ్రిటన్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటీష్ ఇండస్ట్రీ (సీబీఐ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) కలిసి ఈ జాయింట్ కమిషన్‌ను ఏర్పాటు చేశాయి. ఇరు దేశాలకూ ప్రయోజనం చేకూర్చే విధంగా ఎఫ్‌టీఏను తీర్చిదిద్దేందుకు అవసరమైన అంశాలపై చర్చించేందుకు ఇది వేదికగా ఉంటుందని సీబీఐ ప్రెసిడెంట్ లాార్డ్ కరణ్ బిలిమోరియా తెలిపారు. కోవిడ్, ఉక్రెయిన్ సంక్షోభ ప్రభావాల నుంచి ఇరు దేశాలు కోలుకునే క్రమంలో వాణిజ్యం, పర్యావరణం, ఆరోగ్య రంగం మొదలైన విభాగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎఫ్‌టీఏ సాకారమైతే 2035 నాటికి బ్రిటన్–భారత్ మధ్య వాణిజ్యం 28 బిలియన్ పౌండ్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం ఇది 23 బిలియన్ పౌండ్ల స్థాయిలో ఉంది. -
మాల్యాకు త్వరలోనే చెక్ పడనుందట!
న్యూఢిల్లీ: భారీ రుణ ఎగవేతదారుడు, పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా చాలా తొందరగా చెక్ చెప్పేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు యూకే, భారత్ అధికారుల మధ్య చర్చలు చాలా ఫలితంగా సాగినట్టు తెలుస్తోంది. బ్యాంకులకు వేలకోట్ల రుణాలను ఎగవేసి లండన్‌కు పారిపోయిన మాల్యాను దేశానికి రప్పించడం ముందుగానే ఊహించిన దాని కంటే జరుగనున్నట్టు తెలుస్తోంది. ఇరుదేశాల అధికారుల మధ్య జరిగిన చర్చలు పాజిటివ్‌గా ముగిసినట్టు తెలుస్తోంది. పరస్పర న్యాయ సహాయంతో ఇరు దేశాల అధికారుల మధ్య ఒక సమావేశం తరువాత ఆయన్ను భారత్‌కు రప్పించే అంశంలో బ్రిటన్ అధికారుల నుంచి సానుకూల స్పందన వచ్చిందని అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. మాల్యా కేసుపై నేరుగా వ్యాఖ్యానించడానికి ప్రభుత్వం ఇష్టపడకపోయినప్పటికీ, రెండు వైపులా వివరణాత్మక మరియు ఫలవంతమైన చర్చలు జరిగినట్టు అధికారిక ప్రతినిధి చెప్పారు. రెండు రోజుల సుదీర్ఘ సమాశాల్లో మాల్యాపై పెండింగ్ లో వివిధ కేసులను చర్చించినట్టు తెలిపారు. రెండు వైపులా న్యాయ సహకారం బలోపేతానికి పెండింగ్‌లో ఉన్న అభ్యర్థనల పరిష్కారాన్ని వేగవంతం కోసం కట్టుబడి ఉన్నట్టు పునరుద్ఘాటించారు